YES బ్యాంక్ స్కామ్‌తో చంద్రబాబుకు లింకులు ?
Mar 10, 2020 08:21 AMYES బ్యాంక్ స్కామ్‌తో చంద్రబాబుకు లింకులు ?
YES బ్యాంక్ స్కామ్‌తో చంద్రబాబుకు లింకులు ఉన్నాయా? అంటే అవుననే అంటున్నారు వైసీపీ మంత్రులు. ఎస్ బ్యాంక్ స్కామ్ తో మాజీ సీఎం చంద్రబాబుకు లింకులు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు ఏపీ మంత్రి పేర్నినాని. చంద్రబాబు తన హవాలా కోసం ఎస్ బ్యాంకును ఉపయోగించుకున్నారని, అవినీతి సొమ్మును దేశం దాటించేందుకు వినియోగించుకున్నారని ఆరోపించారు. ఎస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్‌తో చంద్రబాబుకు ఉన్న లింకులపై కేంద్రం పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని కోరారు మంత్రి పేర్ని నాని.
వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో... దేశవ్యాప్తంగా పర్యాటక రంగంలో ఏపీని ప్రమోట్ చేయడానికి... YES బ్యాంక్ భాగస్వామ్యంతో "టూరిజం మిషన్ డాక్యుమెంట్" అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2015 సెప్టెంబర్‌లో అప్పటి సీఎం చంద్రబాబు టూరిజం మిషన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. పర్యాటక గమ్యస్థానంగా ఏపీని దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయడంతో పాటు... ఏపీ టూరిజంను అంతర్జాతీయ బ్రాండ్ స్థాయికి తీసుకెళ్లడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీని కోసం YES బ్యాంక్‌కు కన్సల్టెన్సీ ఫీజు కింద ప్రభుత్వం భారీగానే డబ్బు చెల్లించింది.
ఆ తర్వాత 2017 మార్చిలో ఢిల్లీలో జరిగిన ''YES బ్యాంక్ అండ్ ది ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్" కార్యక్రమానికి... ఏపీ, అధికారిక స్టేట్ పార్ట్‌నర్‌గా వ్యహరించింది. ఈ కార్యక్రమం ద్వారా 2029 నాటికి ఏపీని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇది ఏమైందో తెలీదు. తన హయాంలో రెండుసార్లు YES బ్యాంక్‌తో లింకులు పెట్టుకున్న చంద్రబాబు... అవినీతి సొమ్మును దేశం దాటించేందుకు అదే బ్యాంక్‌ను ఉపయోగించుకున్నారని వైసీపీ మంత్రులు ఆరోపిస్తున్నారు. అందుకే YES బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణాకపూర్‌తో చంద్రబాబుకు ఉన్న లింకులపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎస్-బ్యాంకు కుంభకోణంతో చంద్రబాబుకు సంబంధమా?March 10 , 2020 | UPDATED 03:30 IST
ఎస్-బ్యాంకు కుంభకోణంతో చంద్రబాబుకు సంబంధమా?
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఎస్-బ్యాంకు కుంభకోణంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సంబంధం ఉందని అంటున్నారు ఏపీ మంత్రి పేర్ని నాని. ఇప్పటికే అరెస్టు అయిన ఎస్-బ్యాంకు వ్యవస్థాపకుడు రాణాకూ చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలున్నాయని మంత్రి ఆరోపించడం గమనార్హం. చంద్రబాబు నాయుడు, రాణా అతి సన్నిహితులు అని వీరిద్దరూ తరచూ కలుస్తూ ఉండేవారని మంత్రి అంటున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో... తరచూ వీరి సమావేశం జరిగేదని మంత్రి ఆరోపించారు. ఏపీలో తను సంపాదించిన అవినీతి సొమ్మును రాణా ద్వారా చంద్రబాబు నాయుడు విదేశాలకు తరలించారని మంత్రి ఆరోపించారు.
నెలకోసారి రాణా వచ్చి చంద్రబాబుతో సమావేశం అయ్యే వారని కూడా మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం. అంతే కాదు..ఎస్-బ్యాంకు కుంభకోణంలో చంద్రబాబునాయుడుకు నోటీసులు వస్తాయని మంత్రి నాని వ్యాఖ్యానించారు. అందుకే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో కూర్చుని న్యాయనిపుణులతో చర్చలు జరుపుతూ ఉన్నారని నాని అంటున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఎస్- బ్యాంకును ఉద్ధరించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయని మంత్రి గుర్తు చేశారు.
తిరుమల శ్రీవారికి సంబంధించిన 1,300 కోట్ల రూపాయల మొత్తాన్ని ఎస్-బ్యాంకులో డిపాజిట్ చేయించడం వెనుక చంద్రబాబు నాయుడి ఒత్తిడి ఉందని అన్నారు. అయితే వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ అయ్యాకా ఆ నిధులను ఎస్-బ్యాంకు నుంచి విడుదల చేయించిన సంగతిని మంత్రి ప్రస్తావించారు. కమిషన్లకు ఆశపడి, రాణా కపూర్ తో చంద్రబాబుకు ఉన్న సంబంధాల మేరకే.. అప్పట్లో టీటీడీ నిధులను కూడా ఎస్-బ్యాంకుకు తరలించారని మంత్రి అంటున్నారు!

No comments:
Post a Comment