Sunday, May 26, 2019

ఎక్కడా అవినీతి లేకుండా చేస్తాం: వైఎస్‌ జగన్‌

ఎక్కడా అవినీతి లేకుండా చేస్తాం: వైఎస్‌ జగన్‌
May 26, 2019, 14:32 IST
 YS Jagan Mohan Reddy PressMeet At Delhi - Sakshi
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్రం నుంచి సహాయ సహకారాలు అవసరం అని ప్రధానమంత్రి నరేంద్రమోదీని అభ్యర్థించినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రధానితో భేటీ అనంతరం ఆదివారం ఆయన న్యూఢిల్లీలో ఏపీ భవన్‌లో ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రధానికి వివరించామని, రాష్ట్రానికి అన్నిరకాల సాయం అవసరమని ప్రధానిని కోరినట్లు చెప్పారు. ఈ విషయంలో ప్రధాని కూడా సానుకూలంగా స్పందించారని జగన్‌ పేర్కొన్నారు. విభజన సందర్భంగా రాష్ట్రానికి అందాల్సిన సాయం ఆలస్యం అయిందని, వీటితో పాటు రాష్ట్రంలోని అన్ని పరిస్థితుల్ని ప్రధానికి వివరించామన్నారు.

బాబు పాలనలో రూ.2లక్షల 57 వేలకోట్ల అప్పులు
రాష్ట్రం విడిపోయేనాటికి 97వేల కోట్ల అప్పులు ఉన్నాయని, చంద్రబాబు నాయుడు అయిదేళ్ల పాలనలో 2 లక్షల 57వేల కోట్లకు పైగా అప్పులు పెరిగాయని జగన్‌ తెలిపారు. అప్పులపై ఏటా రూ.20వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుందన్నారు. రాష్ట్రం ఓవర్‌ డ్రాఫ్ట్‌పై బతకాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు.

హోదా గురించి అడుగుతూ ఉంటా
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, హోదా ఇచ్చేవరకూ ప్రధానిని తాము అడుగుతూనే ఉంటామని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు చాలావరకూ అమలు చేయాల్సి ఉందన్నారు. ఒకవేళ బీజేపీకి 250 సీట్లు మాత్రమే వచ్చి ఉంటే...హోదాపై సంతకం పెట్టించుకుని మద్దతు ఇచ్చి ఉండేవాళ్లమన్నారు. అందుకే ప్రధానిని కలిసినప్పుడల్లా హోదా గురించి గుర్తు చేస్తూనే ఉంటామన్నారు.


దశలవారీగా మద్యపాన నిషేధం
రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని తెలిపారు. ఇప్పటికే మద్యపాన నిషేధంపై స్పష్టంగా చెప్పామని అన్నారు. మద్యపాన నిషేధంపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని, కేవలం ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌లో మాత్రమే మద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాకే 2024 ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లి ఓటు అడుగుతామన్నారు.



మేనిఫెస్టో పవిత్ర గ్రంధం
ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంలా భావిస్తామని, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను అమలయ్యేలా చూస్తామని జగన్‌ మరోసారి స్పష్టం చేశారు. విశ్వసనీయతకు ప్రజలు పట్టంగట్టారని, దాన్ని సన్నగిల్లకుండా పాలన కొనసాగిస్తామన్నారు. ప్రజలకు చెప్పినవన్నీ అమలు చేస్తామన్నారు.

కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశాను. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి మెలిసి ఉండాలన్నదే నా ఆకాంక్ష. రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాల కోసం భేటీ జరిగింది. ఏపీకి ప్రత్యేక హోదాకు కేసీఆర్‌ మద్దతు నిలుస్తామన్నారని తెలిపారు.



వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తాం
ఇవాళ్ట నుంచి ఆరు నెలల్లోగా ప్రభుత్వంలో నిర్మాణాత్మక మార్పులు చేస్తాం. మంత్రివర్గం ఏర్పడిన తర్వాత శాఖలవారీగా సమీక్ష నిర్వహించి శ్వేతపత్రం విడుదల చేస్తాం. రాష్ట్రంలో అవినీతి అన్నది ఎక్కడా లేకుండా, పారదర్శక పాలన అందిస్తాం. మొత్తం వ్యవస్థలన్నీ ప్రక్షాళన చేస్తాం. అవినీతి జరిగిందని తెలిస్తే కాంట్రాక్ట్‌లు రద్దు చేస్తామన‍్నారు. ఇక యుద్ధ ప్రాతిపదికన పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాల్సి ఉందని, ఇందుకోసం తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

రాజధాని భూముల్లో అతి పెద్ద కుంభకోణం
అయిదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కుంభకోణాలు అందరికీ తెలుసు. ఫలానా చోట రాజధాని వస్తుందని చంద్రబాబుకు ముందే తెలుసు. ప్రకటనకు ముందు రాజధాని వేరేచోట వస్తుందని ప్రచారం చేసి ప్రస్తుత రాజధాని ప్రాంతంలో  బినామీలతో చంద్రబాబు తక్కువ ధరకు భూములు కొనిపించారు. ఆ తర్వాత రాజధానిని ప్రకటించారు. హెరిటేజ్‌ కంపెనీ సైతం 14 ఎకరాలు భూమి కొనుగోలు చేసింది. ల్యాండ్‌ పూలింగ్‌లో బినామీలను వదిలేసి రైతుల భూములు తీసుకున్నారు. రాజధాని భూముల్లో అతిపెద్ద కుంభకోణం జరిగింది. నచ్చినవారికి తక్కువ ధరకు భూములు అమ్మేశారు. ఇక్కడ ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డాడరు. ఇదంతా మామూలు స్కామ్‌ కాదు. సంచలనాత్మకమైన కుంభకోణం. వ్యక్తిగతంగా చంద్రబాబుకు తాను వ్యతిరేకం కాదని చెప్పారు.



వారం, పదిరోజుల్లో మంత్రివర్గ విస్తరణ
మరో వారం, పదిరోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. ఈ నెల 30న తాను మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్‌ తెలిపారు. డే వన్‌ నుంచి ఏం చేయబోతామనేది ప్రమాణస్వీకారం రోజు తెలియచేస్తామని అన్నారు.

యుద్ధప్రాతిపదికన పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి
పోలవరం ప్రాజెక్ట్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుత టెండర్లు రద్దు చేసి రివర్స్‌ టెండరింగ్‌ చేసి గతంలో అవకతవకలు జరిగి ఉంటే వాటిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటే అలాగే చేస్తాం. సత్వరమే పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయవాల్సిన అవసరం ఉందన్నారు.

కాంగ్రెస్‌, టీడీపీ కుమ్మక్కై నాపై కేసులు
నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎప్పుడూ కూడా సచివాలయంలోకి అడుగుపెట్టలేదు. అప్పట్లో ఏ మంత్రికిగాని, అధికారులకు ఫోన్‌ చేయలేదు. ఆ సమయంలో నేను హైదరాబాద్‌లోనే లేను. బెంగళూరులో ఉన్నాను. అమ్మానాన్నలను చూసేందుకు మాత్రమే హైదరాబాద్‌ వచ్చేవాడిని. నాన్న బతికి ఉన్నప్పుడు నాపై కేసులు లేవు. నాన్న చనిపోయాక కాంగ్రెస్‌ను వ్యతిరేకించాకే నాపై టీడీపీ ప్రోద‍్భలంతో కేసులు పెట్టారని అన్నారు.

డిపాజిట్‌ కూడా దక్కించుకోలేకపోయిన టీడీపీ అభ్యర్థి!

డిపాజిట్‌ కూడా దక్కించుకోలేకపోయిన టీడీపీ అభ్యర్థి!
5/25/2019 5:12:13 PM
- డిపాజిట్‌ కూడా దక్కించుకోలేకపోయిన మాజీ మంత్రి ‘కిడారి’
- పోలైన ఓట్లు 1,57,575
- వచ్చినవి..19,929
అనంతగిరి/అరకులోయ, మే 24: మావోయిస్టుల చేతిలో తండ్రిని కోల్పోయిన కిడారి శ్రావణ్‌కుమార్‌కు అండగా నిలిచి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏకంగా మంత్రి పదవిని అప్పగించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీనియర్లను కాదని ఆయనకే ఈ ఎన్నికల్లో అరకులోయ ఎమ్మెల్యే టిక్కెట్‌ను ఇచ్చారు. అయితే అధినేత నమ్మకాన్ని వమ్ము చేయడంలో మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ విఫలమయ్యారు. కనీసం డిపాజిట్‌ నిలుపుకోలేకపోయారు. తన తండ్రి అరకులోయ మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య తర్వాత అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన శ్రావణ్‌కుమార్‌ ఏకంగా రాష్ట్ర గిరిజన, సంక్షేమశాఖతో ప్రాథమిక వైద్య, కుటుంబ సంక్షేమశాఖలకు మంత్రిగా అవకాశం పొందారు. గిరిజన తెగకు చెందినవారెవ్వరూ ఇప్పటివరకు చట్టసభలకు ఎన్నిక కాకుండా కేబినెట్‌లో స్థానం పొందలేదు. ఆరు నెలల పాటు మంత్రి పదవిలో ఉన్న శ్రావణ్‌కుమార్‌... ఆ వ్యవధిలో చట్టసభలకు ఎన్నికవ్వక పోవడంతో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే అప్పటికే ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తాను సునాయాసంగా గెలిచి మళ్లీ ఎమ్మెల్యేగా... కుదిరితే మంత్రిగా ఉంటానని భావించారు.

అయితే గురువారం వెలువడిన ఫలితాలు ఆయనకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఇక్కడ గెలుపు సంగతి పక్కన పెడితే కనీసం ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేక మూడో స్థానానికి పరిమితమయ్యారు. డిపాజిట్‌(ధరావతు)ను సైతం శ్రావణ్‌ నిలుపుకోలేకపోయారు. అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలైన ఓట్లలో 1/6 శాతం ఓట్లు పొందిన వారికే డిపాజిట్‌ దక్కుతుంది. ఆ లెక్కన ఇక్కడ 1,57,575 ఓట్లు పోలవ్వగా... డిపాజిట్‌ దక్కాలంటే కనీసం 26,263 ఓట్లు రావాలి. కానీ మాజీ మంత్రి శ్రావణ్‌కుమార్‌కు కేవలం 19,929 ఓట్లు మాత్రమే దక్కడంతో డిపాజిట్‌ కోల్పోవాల్సి వచ్చింది. రాష్ట్రంలో టీడీపీకి ఘోర పరాభవం ఎదురైనప్పటికీ మొత్తం 175 స్థానాల్లో కేవలం శ్రావణ్‌కుమార్‌ ఒక్కరే డిపాజిట్‌ కోల్పోవడం గమనార్హం.! కాగా అరకులోయ అసెంబ్లీ నియోజక వర్గంలో రెండో స్థానంలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి సియ్యారి దొన్నుదొర 27,660 ఓట్లతో డిపాజిట్‌ను దక్కించుకోగా... బరిలో ఉన్న మిగిలిన 11 మందికి డిపాజిట్‌ దక్కలేదు.

Saturday, May 25, 2019

K Vijayarama Rao Ditches TDP for TRS

Now, K Vijayarama Rao Ditches TDP for TRS
The steadfast loyalist, who was inducted into Naidu’s cabinet in 1999, delivers a body blow to party just ahead of GHMC polls
     
Published: 12th December 2015 03:36 AM  |   Last Updated: 12th December 2015 03:36 AM   |  A+A A-
By Express News Service
HYDERABAD:  Even as the Telugu Desam is readying itself for the ensuing polls to the Greater Hyderabad Municipal Corporation (GHMC), the ruling TRS in Telangana on Friday administered another body blow to the yellow party.

Former minister and ex director of the CBI, K Vijayarama Rao, whose induction into the then N Chandrababu Naidu’s Cabinet in 1999 is considered by many as the genesis for ‘Telangana movement’, is learnt to have made up his mind to cross over to the ruling TRS from the TDP. 

However, efforts made by Express to contact Rao to know his version did not yield results.

Though Rao has been out of the limelight and has not been taking part in TDP activities ever since the state’s bifurcation, since he had earlier represented Khairathabad Assembly constituency in the city, his possible defection to the pink party might further hit the morale of the TDP cadre in Hyderabad city.

Moreover, Vijayarama Rao’s possible defection to the TRS might remain an ‘unforgettable’ thing for the TDP leadership.

The reason is that Vijayarama Rao was inducted into the TDP in 1999 by the then chief minister of united AP and TDP boss Chandrababu Naidu as part of his efforts to woo ‘intellectuals’ into the party.

At that time, Naidu had given a call to intellectuals and neutrals, who have no political affiliations, to join the yellow party en masse. Rao was one such ‘neutral’ who joined the TDP at that time. Later, Rao had won the 1999 Assembly election from Khairathabad by defeating Congress strongman P Janardhan Reddy. After that, Rao was taken into Naidu’s cabinet.

Interestingly, Vijayarama Rao’s induction into the Naidu cabinet at that time  reportedly gave a shock to K.Chandrasekhar Rao who was transport minister in Naidu’s government till  October 10, 1999, the day Naidu was sworn in as CM of united AP for the second time.

Thus, KCR, who was a transport minister in  Naidu’s first TDP government between 1995 and 1999, could not find a berth in the cabinet during Naidu’s second stint as CM.

Even though KCR had won Siddipet Assembly seat by a huge margin in 1999, he was dropped in favour of Vijayarama Rao who belongs to the same Velama caste to which KCR belongs. The rest is history.

ఇంత ఘోరమా! - చంద్రబాబు

ఇంత ఘోరమా!
5/25/2019 4:06:07 PM
ప్రజలను అంతగా కష్టపెట్టామా?
చంద్రబాబు ఆవేదన
టీడీపీలో తీవ్ర అంతర్మథనం
ఓటమికి కారణాలపై విశ్లేషణ
జనసేన పోటీ దెబ్బతీసింది
ఆర్థిక వనరుల కొరతతో నష్టం
స్థానిక నేతలపై వ్యతిరేకత
(అమరావతి - ఆంధ్రజ్యోతి): ‘గెలుపు తథ్యం అనుకున్నాం. ఓడిపోయినా... మెజారిటీ మార్కుకు పది పదిహేను సీట్ల వెనుక ఆగిపోవచ్చని భావించాం. కానీ... ఇంత ఘోరమైన పరాజయమా!’ అంటూ టీడీపీ ముఖ్య నేతలు వాపోతున్నారు. శుక్రవారం పలువురు విజేతలు, పరాజితులు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలిసి తమ ఆవేదన పంచుకున్నారు. ఓటమి కంటే, ఓడిన తీరుపై చంద్రబాబు కూడా విస్మయం, బాధ వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘‘మనకు పాతికసీట్లే వచ్చాయి. విపక్షం 151 స్థానాలు తెచ్చుకుంది. మనం నిజంగా... అంత ఘోరమైన తప్పిదాలు చేశామా? ప్రజలను కష్టపెట్టామా?’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్‌, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చిన రాజప్ప, గద్దె రామ్మోహన్‌, మద్దాలి గిరి, మాజీలు పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా మహేశ్వరరావు, తెనాలి శ్రావణ్‌ కుమార్‌, జీవీ ఆంజనేయులు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తదితరులు చంద్రబాబును కలిశారు. ‘ఐదేళ్లపాటు మీరు ఎంత చాకిరీ చేశారో తలుచుకొంటే బాధ కలుగుతోంది’ అని కొందరు నేతలు అన్నారు. మనం పడిన కష్టం ప్రజలకు తెలుసునని... ఈ ఫలితాపై అధ్యయనం చేయాలని, ఏవి ఎలాంటి ప్రభావం చూపాయో తెలుసుకోవాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.

ఎక్కడ తప్పు జరిగింది!
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంపై టీడీపీ నేతల్లో అంతర్మథనం జరుగుతోంది. ఎక్కడ దెబ్బ తిన్నాం... ఎందుకిలా జరిగిందన్నదానిపై విశ్లేషణలు జరుపుతున్నారు. పోయిన ఎన్నికల్లో పార్టీకి అత్యధికంగా సీట్లు ఇచ్చిన కోస్తా ప్రాంతానికి సంబంధించి రెండు అంశాలు బాగా ప్రభావం చూపాయని వారిలో కొందరు చెబుతున్నారు. ‘‘జనసేన విడిగా పోటీచేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని అనుకొన్నాం. కానీ, అది జరగలేదు. టీడీపీకి పవన్‌ సన్నిహితుడనే ప్రచారం జరగడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్‌కే వెళ్లిపోయింది. టీడీపీకి రావాల్సిన ఓట్లు భారీగా జనసేనకు పడ్డాయి. ఉదాహరణకు విశాఖ ఎంపీ సీటు టీడీపీ ఖాయంగా గెలుచుకోవాల్సి ఉంది. జనసేన పోటీతో చాలా స్వల్ప తేడాతో పోగొట్టుకోవాల్సి వచ్చింది. కనీసం పాతిక ముప్ఫై అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటువంటి నష్టం జరిగింది’’ అని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆర్థిక వనరుల రీత్యా కూడా ఈసారి టీడీపీ కొంత దెబ్బ తిందని మరి కొందరు నేతలు చెబుతున్నారు. ‘‘పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్నడూ లేని గడ్డుపరిస్థితి ఈసారి ఎదురైంది. మాకు ఎన్నికల విరాళాలు రాకుండా బీజేపీ సహకారంతో వైసీపీ అడ్డుకోగలిగింది. మోదీ, కేసీఆర్‌ దన్నుతో వైసీపీ భారీగా ఖర్చు చేసింది. 25- 30 సీట్లలో వైసీపీతో మేం ఆర్థిక వనరుల విషయంలో పోటీ పడలేకపోయాం. ఇది కూడా ఫలితం ప్రభావం చూపింది’’ అని ఒక నాయకుడు విశ్లేషించారు.

‘స్థానిక’ వ్యతిరేకతతో పెద్దదెబ్బ
టీడీపీ ఘోర పరాజయానికి కొన్నిచోట్ల స్థానిక అంశా లు కారణమయ్యాయని పార్టీ వర్గాల కథనం. ‘‘జన్మభూమి కమిటీల పేరుతో కొందరు చేసిన పెత్తనం పార్టీని ప్రజలకు దూరం చేసింది. పథకాలు, రుణాలు, ఇతరత్రా సా యం అందడానికి వీరు కమీషన్లు తీసుకోవడంతో ఆ చెడ్డ పేరే మిగిలిపోయింది. ఆదాయ సముపార్జనకు కొందరు ఎమ్మెల్యేలు, వారి అనుచరుల పనులు, వ్యవహరించిన తీ రు కూడా విమర్శలపాలైంది. ప్రభుత్వంపై సదభిప్రాయం ఉన్నా... కొందరిపై వ్యతిరేకత ప్రబలడం నష్టం చేసింది. అధికారంలో ఉన్నప్పుడు సమస్యలు ఉంటూనే ఉంటాయి. కానీ, టీడీపీలో కొంత అదుపు ఉంటుందని ప్రజలు అనుకొనేవారు. ఈసారి ఆ అదుపు తప్పింది. ఆ ప్రభావం ఎన్నికల్లో చూపింది’’ అని ఒక సీనియర్‌ నేత చెప్పారు.

Tuesday, May 7, 2019

ముఖ్యమంత్రే బాస్‌! - AP CS

ముఖ్యమంత్రే బాస్‌! - AP CS 
08-05-2019 02:30:02


ఆయన నిర్ణయమే ఫైనల్‌
అధికారులు కలవడానికి కోడ్‌ అడ్డంకి కానేకాదు
పిలిస్తే ఏ సమీక్షకైనా వెళతాను
ఇప్పటిదాకా ఒకే రివ్యూకు పిలిచారు
ఆర్థిక సంఘం భేటీవల్ల వెళ్లలేదు
పాలన సజావుగా సాగుతోంది
ఐఏఎస్‌లతో పని బాధ్యత సీఎందే
ఆయనకులేని ఆపేక్ష నాకెలా ఉంటుంది?
‘సింహపురి’పై తొందరపాటు వద్దన్నా!
నివేదిక రాగానే చర్యలు సరికాదు
సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం వెల్లడి
అమరావతి, మే 7 (ఆంధ్రజ్యోతి): ఐఏఎస్‌ అధికారులను రక్షించడం, పోషించడం, వారు పనిచేసేలా అనుకూల వాతావరణం కల్పించాలనే ఆపేక్ష సీఎంకే ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం పేర్కొన్నారు. సీఎం ఏ సమీక్ష సమావేశానికి పిలిచినా తప్పకుండా హాజరవుతానన్నారు. ఇప్పటి వరకు సీఎం తనను ఒక భేటీకి పిలిచారని, ఆ సమయంలో 15వ ఆర్థిక సంఘం సభ్యుని సమావేశంలో ఉన్నందున హాజరుకాలేకపోయానని తెలిపారు. ఆ తర్వాత జరిగిన ఏ రివ్యూలకూ తనను పిలవలేదని చెప్పారు. మంగళవారం ఎల్వీ సుబ్రమణ్యం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఐఏఎస్‌లతో పని చేయించుకోవాల్సిన బాధ్యత సీఎందేనని... ఆయనకు లేని ఆపేక్ష తనకెలా ఉంటుందని ప్రశ్నించారు. ఇప్పుడు మీపై సీఎంకు ఆపేక్ష ఉన్నట్లు కనిపించడం లేదు కదా అని ప్రశ్నించగా... ‘కొన్నిసార్లు బయటికి కనిపించకపోవచ్చు. తండ్రి ఎప్పుడూ ప్రేమను బయటకి చూపరు’ అని ఎల్వీ సమాధానమిచ్చారు.


పరిపాలనా వ్యవహారాలకు ముఖ్యమంత్రే అధిపతి అని, ఏ విషయంలోనైనా ఆయన నిర్ణయమే ఫైనల్‌ అని స్పష్టంచేశారు. అధికారులెవరైనా సీఎంని, మంత్రులను కలిసి వారి శాఖల వివరాలు తెలియపరచడానికి కోడ్‌ అడ్డంకి కాదని తెలిపారు. తుఫాను సమయంలో ఆర్టీజీఎస్‌ సీఈవో అహ్మద్‌ బాబు, విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్‌ వరప్రసాద్‌ సీఎంను కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితులు వివరించారని, దీనిపై సీఎం కొన్ని విలువైన సూచనలు చేశారని తెలిపారు. ఆ సూచనలు సమంజసంగా ఉండడంతో ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చానన్నారు. ప్రస్తుతం పరిపాలన సజావుగానే సాగుతోందన్నారు. సీఎం పక్కన సీఎస్‌ కూర్చుంటేనే పరిపాలన సజావుగా సాగుతుందనుకోవడం సమంజసం కాదన్నారు.

లోపం సరిదిద్దుదామనుకున్నా!
సింహపురి ఆస్పత్రి వివాదంపై తన వైఖరిని సీఎస్‌ సమర్థించుకున్నారు. ‘అపరిపక్వ’ నిర్ణయంలోని లోపాలను సరిదిద్దడమే తన ఉద్దేశమని తెలిపారు. ‘నివేదికల ఆధారంగా చర్యలు ప్రారంభిస్తే.. అవతలి వాళ్లు ఆ చర్యలను హైకోర్టులో సవాలు చేయవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం ఫెయిర్‌గా, పరిపూర్ణమైన పరిజ్ఞానంతో పనిచేస్తున్నట్టు ఉండాలి. ప్రభుత్వంలో పరిపక్వత లేదు అనే సంకేతాలు వెళితే అందరూ నవ్వుకుంటారు’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో పరిపక్వతలో లోపం ఉంటే పైనున్న అధికారులు సరిదిద్దాలని... అలాకాకుండా కనిపించిన వారందరి లైసెన్సులు రద్దు చేస్తామని, సస్పెండ్‌ చేస్తాం, డిస్మిస్‌ చేస్తామని అంటే ఎలా అని ప్రశ్నించారు. ‘ఒక డాక్టర్‌ను, ఒక స్పెషలిస్టును, హాస్పిటల్‌ను ఆస్థాయికి తీసుకురావడం ఎంత కష్టమో నాకు వ్యక్తిగతంగా తెలుసు’ అని అన్నారు.

‘సింహపురి ఘటనలో నాకు అర్థమైందేమిటంటే.. అవయవ దానంపై ప్రభుత్వ మార్గదర్శకాలేమిటో అక్కడ విచారణ జరిపిన డీఎంహెచ్‌వోకు తెలియదు. కలెక్టర్‌ ఇచ్చిన నివేదికను కొంచెం చెక్‌ చేయించి.. అనుభవం ఉన్న డీఎంఈ, ఎన్టీఆర్‌ యూనివర్సిటీ వీసీ, జీవన్‌దాన్‌ట్ర్‌స్ట కన్వీనర్‌లాంటి వాళ్లతో విచారణ చేయించమని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్యకు సూచించాను. కలెక్టర్‌ ఇచ్చిన నివేదికనే ప్రామాణికంగా తీసుకోకూడదని చెప్పాను. అవయవ మార్పిడి చేస్తున్న స్పెషలిస్టులను అనవసరంగా టార్గెట్‌ చేస్తున్నామనే సంకేతాలు వెళితే.. డాక్టర్లు చేతులు ముడుచుకుని కూర్చుంటారు. పేషెంట్లు ఇబ్బంది పడతారు. వైద్యఆరోగ్య శాఖలో మూడేళ్లు నేను పనిచేశాను! జీవన్‌దాన్‌ ట్రస్ట్‌ నేను చేసిన యాక్టివిటీనే’ అని సీఎస్‌ వివరించారు. ఒకవేళ సింహపురి ఆస్పత్రి మాయమాటలు చెప్పి మోసం చేస్తే.. కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ‘అక్కడ జరిగిన ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో పర్సంటేజీలు నాకేమీ రావట్లేదు కదా! సింహపురి ఘటనలో తుది నిర్ణయం పూనం మాలకొండయ్యదే. ప్రభుత్వాస్పత్రుల పనితీరు బాగుంటే ఆమెకి మెడల్‌ వస్తుంది. చీఫ్‌సెక్రటరీకి రాదు కదా!’ అని అన్నారు

Thursday, May 2, 2019

గెలుపు మనదే: చంద్రబాబు

40 ఏళ్ల అనుభవంతో చెబుతున్నా.. గెలుపు మనదే: చంద్రబాబు
02-05-2019 11:47:18

అమరావతి: 40 ఏళ్ల అనుభవంతో చెబుతున్నానని.. గెలుపు తమదేనని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నేడు ఆయన టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, నూటికి వెయ్యి శాతం టీడీపీ గెలవబోతోందని.. మెజార్టీనే చూసుకోవాలన్నారు. తన దగ్గర చాలా సర్వే రిపోర్టులున్నాయన్నారు.

బూత్‌ల వారీగా ఎగ్జిట్‌ పోల్స్‌ తన వద్ద ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. టీఆర్‌ఎస్‌ టోన్‌ మారిందని.. దేశ వ్యాప్తంగా బీజేపీ బలహీనపడిందన్నారు. ప్రభుత్వం, పథకాలపై ప్రజల్లో సానుభూతి ఎక్కువగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ మైండ్‌గేమ్‌ను తిప్పికొట్టాలన్నారు. కౌంటింగ్‌లో అందరూ జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు సూచించారు.

Wednesday, May 1, 2019

ఫొని తుపాన్‌పై సీఎస్‌ సమీక్ష

ఫొని తుపాన్‌పై సీఎస్‌ సమీక్ష
May 01, 2019, 15:46 IST
 LV Subramanyam Review Meeting On Cyclone Fani - Sakshi
సాక్షి, అమరావతి: ఫొని తుపాన్‌పై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధవారం సమీక్ష చేపట్టారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కలెక్టర్లు, ఆర్టీజీఎస్‌ అధికారులతో రివ్యూ నిర్వహించారు. తుపాన్‌ ప్రభావం దృష్ట్యా ఉత్తర కోస్తా మండలాల అధికారులను సీఎస్‌ అప్రమత్తం చేశారు. మడూ జిల్లాలకు మగ్గురు ఐఏఎస్‌ అధికారులను, అలాగే ప్రతి మండలానికి ఓ జిల్లా స్థాయి ప్రత్యేక అధికారిని నియమించారు. ఫొని ప్రభావిత ప్రాంతాల్లోని అధికారులు ముందుగానే సామాగ్రి సిద్దం చేయాలన్నారు. జనరేటర్లు, ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. విద్యుత్‌ సరఫరాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని తెలిపారు.

మరోవైపు అతి తీవ్ర తుపానుగా మారిన ఫొని తీరం వైపు దూసుకొస్తోంది. గంటకు 200 కి.మీ వేగంతో శుక్రవారం గోపాల్‌పూర్‌-చాంద్‌బలి (ఒడిశా) దగ్గర తుపాన్‌ తీరం దాటే అవకాశం వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది


హడలెత్తిస్తున్న ఫణి

హడలెత్తిస్తున్న ఫణి
01-05-2019 15:57:55


హైదరాబాద్: ఫణి తుఫాన్ శరవేగంగా దూసుకువస్తోంది. విశాఖ, ఉత్తరాంధ్రను వణికించిన హుద్‌హుద్ వేగంతో ఫణి హడలెత్తిస్తోంది. పెను తుఫాన్‌గా ఫణి రూపాంతరం చెందింది. చైన్నైకి నైరుతి దిశలో కేంద్రీకృతమైన ఫణి ఉత్తరాంధ్ర మీదుగా ఒడిశా, పశ్చిమబెంగాల్ వైపు దూసుకెళ్లనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒడిశాలోని పూరికి దక్షిణ దిశగా 680 కిలో మీటర్ల దూరంలో విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. శుక్రవారం మధ్యాహ్న సమయంలో గంటకు 175 నుంచి 200 కిలోమీటర్ల వేగంగా ప్రచండ గాలులు, అతి భారీ వర్షాలతో ఫణి విరుచుకుపడుతోంది. ఫణి తుఫాను ప్రభావంతో ఈదురు గాలుల ఉధృతి పెరిగింది. గురు, శుక్ర వారాల్లో ఫణి విరుచుకుపడనుందని వాతావరణ అధికారులు తెలిపారు.

ఫణి పెను తుఫానుగా మారింది. తన పడగనీడను అంతకంతకూ విస్తరిస్తూ, ప్రచండంగా దూసుకొస్తోంది. ఉత్తరాంధ్ర వైపుగా వడివడిగా కదులుతూ, ‘తితలీ’ భీతావహ దృశ్యాలను తలపిస్తోంది. ఈ భయాలను కొట్టివేయలేమంటూ ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు మంగళవారం సాయంత్రం భారత వాతావరణ శాఖ.. తుఫాను దిశకు సూచనగా ఎల్లో మెసేజ్‌ను జారీ చేసింది.



మోదీ చెప్పిన మార్పు డ్రెస్సుల్లోనే కనిపిస్తోంది: చంద్రబాబు

మోదీ చెప్పిన మార్పు డ్రెస్సుల్లోనే కనిపిస్తోంది: చంద్రబాబు
01-05-2019 15:08:55


అమరావతి: ప్రధాని మోదీపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీ ఫ్రస్ట్రేషన్‌ పతాక స్థాయికి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బాలాకోట్‌ను పదేపదే ప్రస్తావిస్తున్నారని ఆరోపించారు. ఈనెల 23న ఫలితం ఎలా ఉండబోతోందో ఇప్పుడే అర్థమైనట్టుందని ఎద్దేవాచేశారు. అందుకే విపక్షాల ఉనికిని కూడా సహించలేకపోతున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలను చూసి మోదీ ఓర్వలేకపోతున్నారన్నారు. గంటకో డ్రెస్‌ మార్చి ఆర్భాటంగా మోదీ రాజకీయాలు చేస్తున్నారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. బ్రేక్‌ఫాస్ట్‌కో డ్రెస్సు, లంచ్‌కి మరో డ్రస్సు, మధ్యాహ్నం ఇంకో డ్రెస్సు వేస్తున్నారన్నారు. మోదీ చెప్పిన మార్పు డ్రెస్సులు మార్చడంలోనే కనబడుతోందని సెటైర్లు వేశారు. విపక్షాల ప్రధాని అభ్యర్థి ఎవరని మోదీ అడుగుతున్నారని.. మా విధానంపై క్లారిటీ ఉందని సూచించారు. ఎన్నికలు ముగియగానే వ్యూహం ఖరారు చేస్తామన్నారు. దాగుడు మూతలు ఆడే పార్టీ బీజేపీనేనని వ్యాఖ్యానించారు.

తుపాను విషయంలో కోడ్‌ మినహాయింపు ఇవ్వాలని పలు రాష్ట్రాల సీఎంలు ఈసీకి లేఖలు రాశారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రులను అడుక్కునే స్థాయికి దిగజార్చారని ఫైరయ్యారు. ప్రధానికో రూలు... సీఎంలకు ఒక రూలా?, ముఖ్యమంత్రులు తుపాన్లు వచ్చినా సమీక్ష చేయొద్దా?, ప్రధాని ఏదైనా మాట్లాడొచ్చా?.. రాజకీయాలు చేయొచ్చా?, ప్రధానికి ఏ కోడ్‌ అడ్డురాదా..?, ప్రజల కోసం పోరాడే మాకు మాత్రం కోడ్‌ ఉంటుందా? అని ప్రశ్నించారు.