ముఖ్యమంత్రే బాస్! - AP CS
08-05-2019 02:30:02
ఆయన నిర్ణయమే ఫైనల్
అధికారులు కలవడానికి కోడ్ అడ్డంకి కానేకాదు
పిలిస్తే ఏ సమీక్షకైనా వెళతాను
ఇప్పటిదాకా ఒకే రివ్యూకు పిలిచారు
ఆర్థిక సంఘం భేటీవల్ల వెళ్లలేదు
పాలన సజావుగా సాగుతోంది
ఐఏఎస్‌లతో పని బాధ్యత సీఎందే
ఆయనకులేని ఆపేక్ష నాకెలా ఉంటుంది?
‘సింహపురి’పై తొందరపాటు వద్దన్నా!
నివేదిక రాగానే చర్యలు సరికాదు
సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం వెల్లడి
అమరావతి, మే 7 (ఆంధ్రజ్యోతి): ఐఏఎస్ అధికారులను రక్షించడం, పోషించడం, వారు పనిచేసేలా అనుకూల వాతావరణం కల్పించాలనే ఆపేక్ష సీఎంకే ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం పేర్కొన్నారు. సీఎం ఏ సమీక్ష సమావేశానికి పిలిచినా తప్పకుండా హాజరవుతానన్నారు. ఇప్పటి వరకు సీఎం తనను ఒక భేటీకి పిలిచారని, ఆ సమయంలో 15వ ఆర్థిక సంఘం సభ్యుని సమావేశంలో ఉన్నందున హాజరుకాలేకపోయానని తెలిపారు. ఆ తర్వాత జరిగిన ఏ రివ్యూలకూ తనను పిలవలేదని చెప్పారు. మంగళవారం ఎల్వీ సుబ్రమణ్యం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఐఏఎస్‌లతో పని చేయించుకోవాల్సిన బాధ్యత సీఎందేనని... ఆయనకు లేని ఆపేక్ష తనకెలా ఉంటుందని ప్రశ్నించారు. ఇప్పుడు మీపై సీఎంకు ఆపేక్ష ఉన్నట్లు కనిపించడం లేదు కదా అని ప్రశ్నించగా... ‘కొన్నిసార్లు బయటికి కనిపించకపోవచ్చు. తండ్రి ఎప్పుడూ ప్రేమను బయటకి చూపరు’ అని ఎల్వీ సమాధానమిచ్చారు.
పరిపాలనా వ్యవహారాలకు ముఖ్యమంత్రే అధిపతి అని, ఏ విషయంలోనైనా ఆయన నిర్ణయమే ఫైనల్ అని స్పష్టంచేశారు. అధికారులెవరైనా సీఎంని, మంత్రులను కలిసి వారి శాఖల వివరాలు తెలియపరచడానికి కోడ్ అడ్డంకి కాదని తెలిపారు. తుఫాను సమయంలో ఆర్టీజీఎస్ సీఈవో అహ్మద్ బాబు, విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ వరప్రసాద్ సీఎంను కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితులు వివరించారని, దీనిపై సీఎం కొన్ని విలువైన సూచనలు చేశారని తెలిపారు. ఆ సూచనలు సమంజసంగా ఉండడంతో ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చానన్నారు. ప్రస్తుతం పరిపాలన సజావుగానే సాగుతోందన్నారు. సీఎం పక్కన సీఎస్ కూర్చుంటేనే పరిపాలన సజావుగా సాగుతుందనుకోవడం సమంజసం కాదన్నారు.
లోపం సరిదిద్దుదామనుకున్నా!
సింహపురి ఆస్పత్రి వివాదంపై తన వైఖరిని సీఎస్ సమర్థించుకున్నారు. ‘అపరిపక్వ’ నిర్ణయంలోని లోపాలను సరిదిద్దడమే తన ఉద్దేశమని తెలిపారు. ‘నివేదికల ఆధారంగా చర్యలు ప్రారంభిస్తే.. అవతలి వాళ్లు ఆ చర్యలను హైకోర్టులో సవాలు చేయవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం ఫెయిర్‌గా, పరిపూర్ణమైన పరిజ్ఞానంతో పనిచేస్తున్నట్టు ఉండాలి. ప్రభుత్వంలో పరిపక్వత లేదు అనే సంకేతాలు వెళితే అందరూ నవ్వుకుంటారు’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో పరిపక్వతలో లోపం ఉంటే పైనున్న అధికారులు సరిదిద్దాలని... అలాకాకుండా కనిపించిన వారందరి లైసెన్సులు రద్దు చేస్తామని, సస్పెండ్ చేస్తాం, డిస్మిస్ చేస్తామని అంటే ఎలా అని ప్రశ్నించారు. ‘ఒక డాక్టర్‌ను, ఒక స్పెషలిస్టును, హాస్పిటల్‌ను ఆస్థాయికి తీసుకురావడం ఎంత కష్టమో నాకు వ్యక్తిగతంగా తెలుసు’ అని అన్నారు.
‘సింహపురి ఘటనలో నాకు అర్థమైందేమిటంటే.. అవయవ దానంపై ప్రభుత్వ మార్గదర్శకాలేమిటో అక్కడ విచారణ జరిపిన డీఎంహెచ్‌వోకు తెలియదు. కలెక్టర్ ఇచ్చిన నివేదికను కొంచెం చెక్ చేయించి.. అనుభవం ఉన్న డీఎంఈ, ఎన్టీఆర్ యూనివర్సిటీ వీసీ, జీవన్‌దాన్‌ట్ర్‌స్ట కన్వీనర్‌లాంటి వాళ్లతో విచారణ చేయించమని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్యకు సూచించాను. కలెక్టర్ ఇచ్చిన నివేదికనే ప్రామాణికంగా తీసుకోకూడదని చెప్పాను. అవయవ మార్పిడి చేస్తున్న స్పెషలిస్టులను అనవసరంగా టార్గెట్ చేస్తున్నామనే సంకేతాలు వెళితే.. డాక్టర్లు చేతులు ముడుచుకుని కూర్చుంటారు. పేషెంట్లు ఇబ్బంది పడతారు. వైద్యఆరోగ్య శాఖలో మూడేళ్లు నేను పనిచేశాను! జీవన్‌దాన్ ట్రస్ట్ నేను చేసిన యాక్టివిటీనే’ అని సీఎస్ వివరించారు. ఒకవేళ సింహపురి ఆస్పత్రి మాయమాటలు చెప్పి మోసం చేస్తే.. కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ‘అక్కడ జరిగిన ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో పర్సంటేజీలు నాకేమీ రావట్లేదు కదా! సింహపురి ఘటనలో తుది నిర్ణయం పూనం మాలకొండయ్యదే. ప్రభుత్వాస్పత్రుల పనితీరు బాగుంటే ఆమెకి మెడల్ వస్తుంది. చీఫ్‌సెక్రటరీకి రాదు కదా!’ అని అన్నారు

No comments:
Post a Comment