మోదీ చెప్పిన మార్పు డ్రెస్సుల్లోనే కనిపిస్తోంది: చంద్రబాబు
01-05-2019 15:08:55
అమరావతి: ప్రధాని మోదీపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీ ఫ్రస్ట్రేషన్ పతాక స్థాయికి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బాలాకోట్‌ను పదేపదే ప్రస్తావిస్తున్నారని ఆరోపించారు. ఈనెల 23న ఫలితం ఎలా ఉండబోతోందో ఇప్పుడే అర్థమైనట్టుందని ఎద్దేవాచేశారు. అందుకే విపక్షాల ఉనికిని కూడా సహించలేకపోతున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలను చూసి మోదీ ఓర్వలేకపోతున్నారన్నారు. గంటకో డ్రెస్ మార్చి ఆర్భాటంగా మోదీ రాజకీయాలు చేస్తున్నారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. బ్రేక్‌ఫాస్ట్‌కో డ్రెస్సు, లంచ్‌కి మరో డ్రస్సు, మధ్యాహ్నం ఇంకో డ్రెస్సు వేస్తున్నారన్నారు. మోదీ చెప్పిన మార్పు డ్రెస్సులు మార్చడంలోనే కనబడుతోందని సెటైర్లు వేశారు. విపక్షాల ప్రధాని అభ్యర్థి ఎవరని మోదీ అడుగుతున్నారని.. మా విధానంపై క్లారిటీ ఉందని సూచించారు. ఎన్నికలు ముగియగానే వ్యూహం ఖరారు చేస్తామన్నారు. దాగుడు మూతలు ఆడే పార్టీ బీజేపీనేనని వ్యాఖ్యానించారు.
తుపాను విషయంలో కోడ్ మినహాయింపు ఇవ్వాలని పలు రాష్ట్రాల సీఎంలు ఈసీకి లేఖలు రాశారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రులను అడుక్కునే స్థాయికి దిగజార్చారని ఫైరయ్యారు. ప్రధానికో రూలు... సీఎంలకు ఒక రూలా?, ముఖ్యమంత్రులు తుపాన్లు వచ్చినా సమీక్ష చేయొద్దా?, ప్రధాని ఏదైనా మాట్లాడొచ్చా?.. రాజకీయాలు చేయొచ్చా?, ప్రధానికి ఏ కోడ్ అడ్డురాదా..?, ప్రజల కోసం పోరాడే మాకు మాత్రం కోడ్ ఉంటుందా? అని ప్రశ్నించారు.

No comments:
Post a Comment