డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిన టీడీపీ అభ్యర్థి!
5/25/2019 5:12:13 PM
- డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిన మాజీ మంత్రి ‘కిడారి’
- పోలైన ఓట్లు 1,57,575
- వచ్చినవి..19,929
అనంతగిరి/అరకులోయ, మే 24: మావోయిస్టుల చేతిలో తండ్రిని కోల్పోయిన కిడారి శ్రావణ్‌కుమార్‌కు అండగా నిలిచి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏకంగా మంత్రి పదవిని అప్పగించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీనియర్లను కాదని ఆయనకే ఈ ఎన్నికల్లో అరకులోయ ఎమ్మెల్యే టిక్కెట్‌ను ఇచ్చారు. అయితే అధినేత నమ్మకాన్ని వమ్ము చేయడంలో మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్ విఫలమయ్యారు. కనీసం డిపాజిట్ నిలుపుకోలేకపోయారు. తన తండ్రి అరకులోయ మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య తర్వాత అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన శ్రావణ్‌కుమార్ ఏకంగా రాష్ట్ర గిరిజన, సంక్షేమశాఖతో ప్రాథమిక వైద్య, కుటుంబ సంక్షేమశాఖలకు మంత్రిగా అవకాశం పొందారు. గిరిజన తెగకు చెందినవారెవ్వరూ ఇప్పటివరకు చట్టసభలకు ఎన్నిక కాకుండా కేబినెట్‌లో స్థానం పొందలేదు. ఆరు నెలల పాటు మంత్రి పదవిలో ఉన్న శ్రావణ్‌కుమార్... ఆ వ్యవధిలో చట్టసభలకు ఎన్నికవ్వక పోవడంతో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే అప్పటికే ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తాను సునాయాసంగా గెలిచి మళ్లీ ఎమ్మెల్యేగా... కుదిరితే మంత్రిగా ఉంటానని భావించారు.
అయితే గురువారం వెలువడిన ఫలితాలు ఆయనకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఇక్కడ గెలుపు సంగతి పక్కన పెడితే కనీసం ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేక మూడో స్థానానికి పరిమితమయ్యారు. డిపాజిట్(ధరావతు)ను సైతం శ్రావణ్ నిలుపుకోలేకపోయారు. అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలైన ఓట్లలో 1/6 శాతం ఓట్లు పొందిన వారికే డిపాజిట్ దక్కుతుంది. ఆ లెక్కన ఇక్కడ 1,57,575 ఓట్లు పోలవ్వగా... డిపాజిట్ దక్కాలంటే కనీసం 26,263 ఓట్లు రావాలి. కానీ మాజీ మంత్రి శ్రావణ్‌కుమార్‌కు కేవలం 19,929 ఓట్లు మాత్రమే దక్కడంతో డిపాజిట్ కోల్పోవాల్సి వచ్చింది. రాష్ట్రంలో టీడీపీకి ఘోర పరాభవం ఎదురైనప్పటికీ మొత్తం 175 స్థానాల్లో కేవలం శ్రావణ్‌కుమార్ ఒక్కరే డిపాజిట్ కోల్పోవడం గమనార్హం.! కాగా అరకులోయ అసెంబ్లీ నియోజక వర్గంలో రెండో స్థానంలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి సియ్యారి దొన్నుదొర 27,660 ఓట్లతో డిపాజిట్‌ను దక్కించుకోగా... బరిలో ఉన్న మిగిలిన 11 మందికి డిపాజిట్ దక్కలేదు.

No comments:
Post a Comment