Thursday, February 6, 2020

సచివాలయం, అసెంబ్లీ వేర్వేరు చోట్లా?

సచివాలయం, అసెంబ్లీ వేర్వేరు చోట్లా?
07-02-2020 03:22:58

అలాంటి రాజధాని ఏదీ లేదు
ఒక ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్‌ను.. తర్వాతి ప్రభుత్వం రద్దు చేస్తామంటే ఎలా?
పోలవరం నిర్మాణంపై దృష్టి పెట్టండి
హోదా కాదు.. రాయితీలు అడగండి: ఉండవల్లి
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): సచివాలయం, అసెంబ్లీ వేర్వేరు చోట్ల ఉన్న రాజధాని ఏదీ లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. రాజధాని గొడవలు తెచ్చుకుని సీఎం జగన్‌, సీఏఏ గొడవలతో ప్రధాని మోదీ ఇబ్బందుల్లో పడ్డారని చెప్పారు. గతంలోనే జగన్‌ అమరావతిని వ్యతిరేకించి ఉంటే బాగుండేదన్నారు. ‘ఇవాళ రాజధాని ఎక్కడుంటే ఏమిటి? పాలన ఎక్కడి నుంచైనా చేయవచ్చు. ముందు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై దృష్టి పెట్టండి. సీఎం చెప్పినట్లు 2021కి అది పూర్తయ్యే పరిస్థితి లేదు. అది పూర్తయితే అన్ని ప్రాంతాలూ సస్యశ్యామలమవుతాయి. ప్రజలెవరూ ఉద్యమాలు ఊసే ఎత్తరు’ అని అభిప్రాయపడ్డారు. గురువారం రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానుల సంగతి తనకు తెలియదన్నారు.

‘నేను అమరావతిని మొదటే వ్యతిరేకించాను. పెట్టుబడి అంతా హైదరాబాద్‌లో పెట్టి ఒకసారి దెబ్బతిన్నాం. అదే విధంగా అమరావతిని చేయవద్దని చంద్రబాబుకు కూడా చెప్పాను. అక్కడ త్యాగం కాదు. రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ జరిగింది. అయినా ఒక ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్‌ను.. తర్వాత వచ్చిన ప్రభుత్వం రద్దు చేస్తామంటే ఎలా? ఇక ఎవరైనా పనులు చేస్తారా? జగన్‌ పదేళ్లలో విశాఖను హైదరాబాద్‌లా చేస్తానని ప్రకటించారు. చంద్రబాబు చేసిన తప్పు మళ్లీ చేయొద్దు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం. వసతి, సౌకర్యాలు ఎక్కడుంటే అక్కడకే పెట్టుబడులు వస్తాయి. అడుక్కునే వాడి దగ్గరకు వెళ్లి ముష్టెత్తుకుంటే ఉపయోగం ఏముంటుంది’ అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా మాట మానేసి ప్యాకేజీ, రాయితీలు అడగాలని జగన్‌కు సలహా ఇచ్చారు. ఇంటింటికీ పెన్షన్‌ అనేది పెద్ద బూతుగా పేర్కొన్నారు. ‘ఇచ్చిన సంక్షేమ పథకాలను తీసేస్తే బీభత్సమైపోతుంది.

నీవు ఏసీలో తిరగడం లేదా? మీ అమ్మ ఏసీలో ఉండడం లేదా అని ఓ ముసలమ్మ జగన్‌ను ప్రశ్నించడం వాట్సా్‌పలో చూశాను. అనేక మంది అర్హులు ఇబ్బంది పడుతున్నారు. 1989లో కాంగ్రె్‌సకు 53.63 శాతం ఓట్లు వచ్చాయి. కానీ సీఎం చెన్నారెడ్డి రేషన్‌ కార్డులకు ఎంత మంది అర్హులు కారో సర్వే చేయాలన్నారు. సర్వే చేశారో లేదో తెలియదు. కానీ ప్రజల్లో అలజడి వచ్చింది. కార్డులు తీసివేశారో లేదో గాని.. ప్రజలు మాత్రం కాంగ్రె్‌సను అధికారం నుంచి తీసివేశారు’ అని తెలిపారు.

Wednesday, February 5, 2020

అమరావతికి నిధుల్లేవ్!

అమరావతికి నిధుల్లేవ్!
06-02-2020 03:40:11

విశాఖకైతే అన్ని అర్హతలూ ఉన్నాయి
పది వేల కోట్లు ఖర్చుపెడితే చాలు..
పదేళ్లలో హైదరాబాద్‌తో పోటీపడొచ్చు: సీఎం
అక్కడ నికరంగా ఉంది 5,200 ఎకరాలే
ఐదేళ్లలో బాబు ఖర్చుపెట్టింది 5,677 కోట్లే
మాపై 2,300 కోట్లు భారం వేసిపోయారు
కనీస వసతులకు 1.06 లక్షల కోట్లు కావాలి
అక్కడెంత ఖర్చుపెట్టినా సముద్రంలో నీటిబొట్టే
అమరావతి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేవని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడ ఐదేళ్లు ఉన్నా పరిస్థితి మారదని.. అలాంటప్పుడు ఏం చేయాలని నిలదీశారు. బుధవారం విజయవాడలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరావతి, మూడు రాజధానులు, తన ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ‘లక్ష కోట్లు పెట్టుబడి పెడితే 20 ఏళ్ల తర్వాత తడిసి మోపెడై రూ.3లక్షల కోట్లవుతాయి.

అమరావతిలో ల్యాండ్‌బ్యాంకింగ్‌ చాలా ఉందని చంద్రబాబు చెబుతున్నారు. ఎస్జీటీ నిబంధనల ప్రకారం పరిధి మినహాయిస్తే, నికరంగా ఉన్న భూమి 5,200 ఎకరాలు మాత్రమే. ఈ భూమి ద్వారా లక్ష కోట్లు రావాలంటే.. అదే 20ఏళ్ల తర్వాత 3-4లక్షల కోట్లు కావాలంటే ఎకరం దాదాపు రూ.90కోట్లకు అమ్మాలి. ఇది సాధ్యమేనా’ అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఒక తండ్రిగా తనవంతుగా శాయశక్తులా న్యాయం చేస్తున్నానన్నారు. అమరావతి రాజధాని కోసం 53వేల ఎకరాలు ల్యాండ్‌ పూలింగ్‌లో సేకరించారని, అక్కడ కనీస మౌలిక సదుపాయాలూ లేవన్నారు. రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్‌, నీరు వంటి కనీస సదుపాయాలు కల్పించాలంటే.. గత ప్రభుత్వ నివేదికల ప్రకారం ఎకరాకూ రూ.2 కోట్లు ఖర్చవుతాయని.. 53వేల ఎకరాలకు రూ.1.09 లక్షల కోట్లు ఖర్చవుతాయని తెలిపారు. గత ప్రభుత్వం గడచిన ఐదేళ్లలో రూ.5,677 కోట్లు మాత్రమే వ్యయం చేసిందని.. ఇంకా తమ ప్రభుత్వంపై సుమారు రూ.2,300 కోట్లు భారం వేసి చంద్రబాబు వెళ్లిపోయారన్నారు.

చేసిన పనులకు కూడా 10.32శాతం వడ్డీతో అప్పుతెచ్చారని.. కేంద్రం 1,500కోట్లు ఇచ్చిందని.. అందుకే ఇక్కడ పెట్టుబడి కోసం తప్పనిసరిగా రుణాలకు వెళ్లాల్సిందేనని జగన్‌ చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఏ ముఖ్యమంత్రి అయినా ఏం చేస్తారని ప్రశ్నించారు. మూడు రాజధానులపై నిర్ణయం తీసుకోకుంటే వచ్చే తరాలకు అన్యాయం, నష్టం జరుగుతాయన్నారు. ‘అమరావతి.. విజయవాడకు గానీ, గుంటూరుకు గానీ దగ్గరగా లేదు. అక్కడకు కనీసం డబుల్‌రోడ్‌ లేదు. అంతా సింగిల్‌ రోడ్డే. అయినా ఆయన(చంద్రబాబు)కు ఆ ప్రాంతం పై ఎందుకంత ఆసక్తిఅంటే.. అందరికీ తెలుసు. ఆయనకు, ఆయన అనుయాయులకు అక్కడ ఎన్నో భూములున్నాయి’ అని ఆరోపించారు. అమరావతిలో కనీస సదుపాయాల కోసం ఇంకా 1.06 లక్షల కోట్లు కావాలని.. కానీ ఆరు వేల రూపాయల కోట్లకు మించి ఖర్చు చేసే పరిస్థితి లేదని జగన్‌ స్పష్టం చేశారు. కాబట్టి ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని కోరారు. ఆ వ్యయమంతా సముద్రంలో నీటి బొట్టు మాదిరిగా ఉంటుందన్నారు.

విశాఖపై పదో వంతు పెడితే..
విశాఖ రాష్ట్రంలో నంబర్‌ వన్‌ నగరమని.. అక్కడ రోడ్లు, నీరు, విద్యుత్‌ సహా అన్ని సదుపాయాలూ ఉన్నాయని జగన్‌ చెప్పారు. అమరావతిలో ఖర్చు చేయాల్సిన రూ.లక్ష కోట్లలో కనీసం పదో వంతు అంటే పది వేల కోట్లు విశాఖలో ఖర్చు చేస్తే.. పదేళ్లలో హైదరాబాద్‌తో పోటీ పడవచ్చన్నారు. ఉద్యోగాల కోసం పిల్లలు ఎక్కడకూ వెళ్లాల్సిన అవసరం రాదని చెప్పారు. అమరావతి లెజిస్లేటివ్‌ రాజధానిగా ఉంటుందని.. ఏడాదిలో 60 నుంచి 70రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయన్నారు. అమరావతి క్రమంగా అభివృద్ధి చెందుతుందని జగన్‌ చెప్పారు.

ఇకపై డిగ్రీ నాలుగేళ్లు..
తమ విద్యావిధానంపైనా జగన్‌ మాట్లాడారు. ఇంటర్‌ తర్వాత చేరుతున్న వారికి గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో చాలా దారుణంగా ఉందని చెప్పారు. ఇకపై డిగ్రీ నాలుగేళ్లు.. ఇంజనీరింగ్‌ విద్య ఐదేళ్లు ఉంటుందని.. చివరి ఏడాది ఇంటర్న్‌షిప్‌ ఉంటుందన్నారు. విద్యారంగంలో నాడూ నేడూ, మధ్యాహ్నం భోజన పథకం, అమ్మఒడి, విద్యా దీవెన పథకాలను అమలు చేస్తున్నామన్నారు. కొత్త పాఠ్య ప్రణాళికలను అమలు చేస్తామని చెప్పారు. ‘నాణ్యమైన విద్య పిల్లలకు మనమిచ్చే ఒక ఆస్తి. దానివల్ల దారిద్య్రం పోతుంది. పేద కుటుంబాలు కూడా ఎంతో వృద్ధిలోకి వస్తాయి’ అని తెలిపారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో సెల్‌ఫోన్లు, ఐప్యాడ్లు, కంప్యూటర్లు వచ్చాయని.. వాటన్నిటిలో ఆంగ్ల భాషనే వాడుతున్నామని అన్నారు. కాబట్టి ఇంగ్లిష్‌ ఒక లగ్జరీ కాదు.. అవసరం. మంచి ఉద్యోగం కావాలంటే ఇంగ్లి్‌షలో ప్రావీణ్యం తప్పనిసరి. ఒక కుటుంబానికి తండ్రి పెద్దయితే.. రాష్ట్రానికి సీఎం తండ్రిలాంటివాడు. ఒక తండ్రిగా నేను నా పిల్లలను ఆంగ్ల మాధ్యమం స్కూలుకే పంపిస్తాను. పేద కుటుంబాల పిల్లలు ఇంగ్లిష్‌ మీడియంలో ఎందుకు చదువుకోకూడదు’ అని ప్రశ్నించారు.

‘రాజధానులపై ముందుగానే కేంద్రంతో మాట్లాడారు’

‘రాజధానులపై ముందుగానే కేంద్రంతో మాట్లాడారు’
05-02-2020 17:56:00

విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై సీపీఐ జాతీయ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ముందుగానే కేంద్రంతో మాట్లాడి మూడు రాజధానులు పెడుతున్నారని ఆరోపించారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన నారాయణ.. రాజధానుల విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందన్నారు. చంద్రబాబుపై కోపంతో సీఎం జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖ జిల్లాలో ఎసైన్డ్ భూములను లాక్కుంటున్నారని అన్నారు. విశాఖ భూముల కుంభకోణంలో వైసీపీ, టీడీపీ నేతలు ఉన్నారని ఆరోపించారు. రెండు వేల ఎకరాల భూమి ల్యాండ్ మాఫియా చేతుల్లో ఉందని, దానికి సంబంధించిన వివరాలు ఇస్తామని, జగన్ ఆ భూములను తీసుకుంటారా? అని నారాయణ సవాల్ విసిరారు. అమరావతి భూములను సెజ్‌లకు అప్పగించి లక్ష కోట్ల దోపిడీకి కుట్ర చేశారని ఆరోపించారు. జగన్ తెలివితేటలను ద్వంసం కోసం వినియోగిస్తున్నారని, ఆయన పిచ్చి తుగ్లక్‌ను మించిపోయారంటూ ఘాటైన వ్యాఖ్యలతో నారాయణ విరుచుకుపడ్డారు. మూడు రాజధానుల నినాదంతో ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని నారాయణ డిమాండ్ చేశారు.

Jagan Reddy Justifies 3-Capital Plan For Andhra, Says Amaravati Wasn't Viable

Jagan Reddy Justifies 3-Capital Plan For Andhra, Says Amaravati Wasn't Viable
The Andhra Pradesh Chief Minister said it would have cost Rs 1.09 lakh crore just for laying basic infrastructure in Amaravati, while the state's spending power was just Rs 6,000 crore.
Andhra PradeshWritten by Uma SudhirUpdated: February 05, 2020 07:14 pm IST
by TaboolaSponsored LinksSponsored
Heart-melting story of a mother’s sacrifice and love. (Impactguru.com)
You Can Laugh at Money Worries - If You Follow This Guy's Simple Plan (HailerSweets Tech)

Jagan Mohan Reddy tried to explain the situation to Amaravati farmers on Tuesday.




Hyderabad: Andhra Pradesh Chief Minister Jagan Mohan Reddy today cited monetary concerns as the reason for scrapping the previous Telugu Desam Party government's proposal to establish a futuristic capital in Amaravati, replacing it instead with a plan to establish a tri-capital mechanism in the state.
The new tri-capital plan, which the centre says it has no objection to, involves setting up executive, legislative and judicial capitals at Vishakhapatnam, Amaravati and Kurnool respectively.

"We needed Rs 1.09 lakh crore, of which only Rs 6,000 crore had been spent, to proceed with the earlier plan. As much as Rs 1.03 lakh crore more would have been required just to lay basic infrastructure such as roads, drainage, water supply and power lines in Amaravati. However, I could only afford to spend a maximum of Rs 6,000 crore more, which would have been like a drop in the ocean. It wouldn't even have been visible," said Jagan Mohan Reddy.

According to the Chief Minister, establishing the executive capital at Vishakhapatnam makes more monetary sense because it already has most of the basic infrastructure in place. "If I invest even 10 per cent of that in Vizag, it can compete with Hyderabad, Bengaluru and Chennai in 10 years, if not five," he said.

At an interaction with a farmer delegation from the region on Tuesday, Jagan Mohan Reddy had explained how Amaravati was located at a relatively long distance of around 30 km from both Vijayawada and Guntur. He also told them that as the region happens to be "virgin land" lacking in infrastructure or even a two-laned road, developing it would have been difficult under the circumstances. 

Farmers in Amaravati region have been agitating ever since the Jagan Mohan Reddy government scrapped the previous proposal last month. "Amaravati is not being shifted, as is being propagated. It remains the legislative capital of the state, and the assembly will function from here. Legislators will come and stay here in the 60-odd days the house is in session," Jagan Mohan Reddy reassured them, adding that nobody would lose out under his watch. 

The Chief Minister pointed out that even if one goes by the previous government's estimate, the cost of setting up basic infrastructure such as roads, drains and water connections would have cost over Rs 2 crore for each of the 52,000 acres acquired in Amaravati. "The amount spent by the previous government was just Rs 5,677 crore. That is the capacity of any government. The centre has given Rs 1,500 crore and we cannot expect more. At that rate, how many years would it have taken to collect the Rs 1.09 lakh crore required to establish basic infrastructure in the region?" he asked.

As the state's executive capital, Visakhapatnam will house the Secretariat and the Chief Minister's Office under the new proposal. Kurnool, which was the state capital from 1953 to 1956, will accommodate the higher judiciary.

Incidentally, the Union government had clarified in parliament on Tuesday that it is within the rights of a state to decide on its capital - even if it's three of them. This had come in response to a request for central intervention by Telugu Desam Party MP Jaydev Galla.

Sivaramakrishnan Committee submitted report to Union Home Ministry on AP Capital

Sivaramakrishnan Committee submitted report to Union Home Ministry on AP Capital
Sivaramakrishnan committee constituted by the Union Government to suggest the place to build the capital city of Andhra Pradesh...

KIRAN RAPAKA
AUG 29, 2014 11:49 IST
facebook IconTwitter IconWhatsapp Icon

Sivaramakrishnan committee constituted by the Union Government to suggest the place to build the capital city of Andhra Pradesh submitted its report on 27 August 2014 to the Home Minister Rajnath Singh in New Delhi.

The committee gave options about the capital and positive and negative points of the places. But the committee did not Zero in on any particular place for the capital. It only mentioned the availability of lands and other factors.

Interestingly, the committee objected Vijayawada to be the capital, in the context of the AP government transferring certain departments to Vijayawada, declaring it as the future capital.



Highlights of the Report
• Opined the capital could be between Marturu and Vinukonda.
• It also proposed Musunuru, Mangalagiri, Macherla, Gollapally, Vinukonda, Marturu, Donakonda, Pulichintala as suitable for Capital regions.
• Referred three zones set up for the capital.
• Opposed the building of Super City or Smart City.
• Said that capital between Vijayawada-Guntur is incorrect because it would bring up economic and environmental problems.
• It also opined that farmers and laborers are more Krishna and Guntur districts and would make it difficult for land acquisition and would benefit only realtors and the traffic in Vijayawada-Guntur-Mangalagiri- tenali cities is likely to be higher.
• Road connectivity should be increased on the banks of river Krishna.
• It suggested, to divide, Andhra Pradesh into four parts.They should be Uttara Andhra (Northern Andhra), Madhya Andhra (Central Andhra), Coastha Andhra(Coastal Andhra) and Rayalaseema.
• As per committee, Uttara Andhra comprises Srikakulam, Vizianagaram, Visakhapatnam and East Godavari, Madhya Andhra comprises West Godavari, Krishna and Guntur districts, Coastha Andhra comprises Nellore and Prakasam districts and Rayalaseema comprises YSR Kadapa, Kurnool, Anantapur and Chittoor districts.
• Vishakhapatnam should be set up as a high-tech zone and 109 office should be set up in its zone.
• High Court should be set up in Visakhapatnam and a High Court Bench should be in either Anantapur or Kurnool.
• Kalahasthi Zone to be set up as the Railway Zone. Guntur-Chennai Central Railway corridor to be set up.
• Assembly, secretariat, the chief minister's office should be set up in the capital city.
• It urged to do justice to Kurnool, as it was a capital in the past for the state of Andhra.
• Mangalagiri area has less reserved forest.

About Sivaramakrishnan Committee
• Union government has set up five-member committee under the chairmanship of former Home Secretary K. Sivaramakrishnan to suggest the place to build the capital city of Andhra Pradesh.
• The other members of the committee are Rathin Roy, Aromar Revi, Jagan Shah and K.T. Ravindran.
• The committee will travel around the state of Andhra Pradesh and suggest a suitable place to be the new capital of Andhra Pradesh by 31 August 2014.

Tuesday, February 4, 2020

రాజధానిలో కేంద్రం భాగస్వామే!

రాజధానిలో కేంద్రం భాగస్వామే!
05-02-2020 03:52:30

అమరావతిలో ప్రతి అడుగూ పర్యవేక్షణ
కమిటీ వేసి..నిధులిచ్చింది మోదీ సర్కారే
అసెంబ్లీ ఏకగ్రీవతీర్మానానికి కేంద్రం ఓకే
రాజధాని కోసం 1500 కోట్లు సాయం
బెజవాడ-గుంటూరు డ్రైనేజీకి వెయ్యికోట్లు
తానూ భాగస్వామి కాబట్టే ఇంతటి కదలిక
రాష్ట్రంలోని పలువురు నిపుణుల స్పష్టీకరణ

అమరావతి, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): సాధారణంగా రాష్ట్రాల రాజధానుల నిర్ణయం విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉండదనేది నిర్వివాదాంశం. అయితే, ఒక రాష్ట్ర రాజధాని ఎంపిక నుంచి నిధుల కేటాయింపు వరకు కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉంటే? కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చి అభివృద్ది చేస్తే? పలు కేంద్ర సంస్థలు డబ్బులు చెల్లించి భూములు తీసుకుంటే?.. కచ్చితంగా అప్పుడు ఆ రాజధాని విషయంలో కేంద్రం కూడా భాగస్వామే అవుతుంది. రాజఽధాని అమరావతి విషయంలోనూ జరిగింది ఇదే! అమరావతిని రాజధాని ప్రాంతంగా ఏర్పాటుచేయాలని అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని కేంద్రం ఆమోదించింది. ఆ ఆమోదం తర్వాతే అమరావతికి నిధులు విడుదల చేసింది. అంతేకాదు...అవసరాన్ని బట్టి అటవీ భూములను కూడా రాజధాని కోసం డీనోటిఫై చేసేందుకు అంగీకరించింది. పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు భూ కేటాయింపుకోసం డబ్బు కూడా చెల్లించాయి. అందుకే అమరావతి రాజధానిలో కేంద్రం కూడా భాగస్వామే అని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.
చట్టం అదే చెప్పింది..
రాష్ట్ర విభజన అనంతరం, రాజధాని ఎక్కడుండాలన్నది నిర్ణయించేందుకు శివరామకృష్ణన్‌ కమిటీని కేంద్రం నియమించింది. తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి వదిలిపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి, విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించింది. దీనికి అప్పటి సభలో ప్రాతినిథ్య పార్టీలైన టీడీపీ, వైసీపీ, బీజేపీ మద్దతిచ్చాయి. ఆనాడు తీర్మానం కూడా ఏకగ్రీవమే. ఏ ఒక్క పార్టీ, ఒక్క ఎమ్మెల్యే కూడా వ్యతిరేకత తెలపలేదు. అదే తీర్మానాన్ని నాడు కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. దాన్ని కేంద్రం ఆమోదించి...అమరావతిని రాజధానిగా గుర్తించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనలను అమలుచేసింది. ఈ చట్టంలోని సెక్షన్‌ 94(3)ప్రకారం రాజధానిలో అవసరమైన సదుపాయాలు...అంటే రాజ్‌భవన్‌, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టులాంటి వాటి ఏర్పాటుకు, నిర్మాణానికి నిధులివ్వాలి. దీని ప్రకారమే రాజధానికి రూ.1500కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. సచివాలయం, శాసనసభ, శాసనమండలి, హైకోర్టు భవనాల నిర్మాణం జరిగింది. విజయవాడ, గుంటూరుల్లోను అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటుకు వెయ్యికోట్ల రూపాయలను కేంద్రప్రభుత్వం ఇచ్చింది. దీన్ని కూడా రాజధానికి ఇచ్చిన లెక్కల్లోనే కేంద్రం చూపించింది. పునర్విభజన చట్టం సెక్షన్‌ 94(4)ప్రకారం..రాజధాని నిర్మాణం కోసం అవససరమైతే అటవీ భూములను డీనోటిఫై చేసేందుకు కూడా కేంద్రం సహకరించింది. ఎయిమ్స్‌ నిర్మాణం కోసం, ఇతర చోట్ల ఇలాంటి మినహాయింపు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను కేంద్రం సానుకూలంగానే పరిశీలించింది.
కేపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ మినహాయింపు
రాజధాని రైతులకు కేపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ మినహాయుంపు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. కేపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ అంటే లాభాల మీద వేసే పన్ను. ఒక వ్యక్తికి ఉన్న ఆస్తులు...ఇళ్లు, అపార్ట్‌మెంట్‌, షేర్లు, పొలాలు, స్థలాలు...ఇవన్నీ మూలధన స్థిరాస్థులు. ఇలాంటివాటిని కొనుగోలు చేసిన విలువ కంటే ఎక్కువకు అమ్మినప్పుడు వచ్చే లాభంపై పన్ను వేస్తారు. ఈ పన్ను ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అమరావతిలో రైతుల పొలాలు విక్రయించినప్పుడు కూడా ఈ క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ కట్టాలి. అయితే ఇక్కడంతా రైతులు ఉన్నందున రాజధాని పరిధిలోని 29గ్రామాల వరకు ఈ పన్నుకు మినహాయింపు ఇవ్వాలని నాటి రాష్ట్ర ప్రభుత్వం అడిగింది. చివరకు కేంద్రం అంగీకరించి ఈ పన్ను మినహాయింపు ఇచ్చింది. తనకు వచ్చే ఆదాయాన్ని వదులుకుంది.
కేంద్ర సంస్థలకు భూమి
కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాజధానిలో భూమిని తీసుకున్నాయి. ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇవ్వలేదు. కేటాయించిన భూములపై సుమారు రూ.175కోట్ల ధర వసూలుచేసింది. భారత సైన్యం, రైల్‌ టెల్‌ కార్పొరేషన్‌, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ సెంటర్‌ తదితర సంస్థలు భూమిని తీసుకున్నాయి. రాజధాని కాబట్టే ఇక్కడ తమ కార్యాలయాలు పెట్టేందుకు ముందుకొచ్చాయి. డబ్బులు చెల్లించి భూమిని తీసుకున్నాయి. రాజధానిలో భూములు తీసుకోవడం, వాటికి డబ్బు చెల్లించడం ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం రాజధానిలో భాగస్వామేనని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, జేఏసీ నేతలు చెబుతున్నారు.