Thursday, February 6, 2020

సచివాలయం, అసెంబ్లీ వేర్వేరు చోట్లా?

సచివాలయం, అసెంబ్లీ వేర్వేరు చోట్లా?
07-02-2020 03:22:58

అలాంటి రాజధాని ఏదీ లేదు
ఒక ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్‌ను.. తర్వాతి ప్రభుత్వం రద్దు చేస్తామంటే ఎలా?
పోలవరం నిర్మాణంపై దృష్టి పెట్టండి
హోదా కాదు.. రాయితీలు అడగండి: ఉండవల్లి
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): సచివాలయం, అసెంబ్లీ వేర్వేరు చోట్ల ఉన్న రాజధాని ఏదీ లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. రాజధాని గొడవలు తెచ్చుకుని సీఎం జగన్‌, సీఏఏ గొడవలతో ప్రధాని మోదీ ఇబ్బందుల్లో పడ్డారని చెప్పారు. గతంలోనే జగన్‌ అమరావతిని వ్యతిరేకించి ఉంటే బాగుండేదన్నారు. ‘ఇవాళ రాజధాని ఎక్కడుంటే ఏమిటి? పాలన ఎక్కడి నుంచైనా చేయవచ్చు. ముందు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై దృష్టి పెట్టండి. సీఎం చెప్పినట్లు 2021కి అది పూర్తయ్యే పరిస్థితి లేదు. అది పూర్తయితే అన్ని ప్రాంతాలూ సస్యశ్యామలమవుతాయి. ప్రజలెవరూ ఉద్యమాలు ఊసే ఎత్తరు’ అని అభిప్రాయపడ్డారు. గురువారం రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానుల సంగతి తనకు తెలియదన్నారు.

‘నేను అమరావతిని మొదటే వ్యతిరేకించాను. పెట్టుబడి అంతా హైదరాబాద్‌లో పెట్టి ఒకసారి దెబ్బతిన్నాం. అదే విధంగా అమరావతిని చేయవద్దని చంద్రబాబుకు కూడా చెప్పాను. అక్కడ త్యాగం కాదు. రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ జరిగింది. అయినా ఒక ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్‌ను.. తర్వాత వచ్చిన ప్రభుత్వం రద్దు చేస్తామంటే ఎలా? ఇక ఎవరైనా పనులు చేస్తారా? జగన్‌ పదేళ్లలో విశాఖను హైదరాబాద్‌లా చేస్తానని ప్రకటించారు. చంద్రబాబు చేసిన తప్పు మళ్లీ చేయొద్దు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం. వసతి, సౌకర్యాలు ఎక్కడుంటే అక్కడకే పెట్టుబడులు వస్తాయి. అడుక్కునే వాడి దగ్గరకు వెళ్లి ముష్టెత్తుకుంటే ఉపయోగం ఏముంటుంది’ అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా మాట మానేసి ప్యాకేజీ, రాయితీలు అడగాలని జగన్‌కు సలహా ఇచ్చారు. ఇంటింటికీ పెన్షన్‌ అనేది పెద్ద బూతుగా పేర్కొన్నారు. ‘ఇచ్చిన సంక్షేమ పథకాలను తీసేస్తే బీభత్సమైపోతుంది.

నీవు ఏసీలో తిరగడం లేదా? మీ అమ్మ ఏసీలో ఉండడం లేదా అని ఓ ముసలమ్మ జగన్‌ను ప్రశ్నించడం వాట్సా్‌పలో చూశాను. అనేక మంది అర్హులు ఇబ్బంది పడుతున్నారు. 1989లో కాంగ్రె్‌సకు 53.63 శాతం ఓట్లు వచ్చాయి. కానీ సీఎం చెన్నారెడ్డి రేషన్‌ కార్డులకు ఎంత మంది అర్హులు కారో సర్వే చేయాలన్నారు. సర్వే చేశారో లేదో తెలియదు. కానీ ప్రజల్లో అలజడి వచ్చింది. కార్డులు తీసివేశారో లేదో గాని.. ప్రజలు మాత్రం కాంగ్రె్‌సను అధికారం నుంచి తీసివేశారు’ అని తెలిపారు.

No comments:

Post a Comment