Sunday, March 10, 2024

‘సిద్ధం’ చివరి సభలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

 CM Jagan: ‘సిద్ధం’ చివరి సభలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 10 , 2024 | 06:13 PM


తాను ఒంటిరిగానే రాబోయే ఎన్నికలకు వెళ్తున్నానని.. తనను ఓడించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పొత్తులతో సిద్ధమయ్యారని సీఎం, వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan) అన్నారు. చంద్రబాబు జేబులో ఉన్న మరో జాతీయ పార్టీ తన మీద దాడి చేయడానికి రెడీగా ఉందని అన్నారు. ప్రజల చేతులో చిత్తుగా ఓడిపోయిన పార్టీలు, ఓడిపోయిన వ్యక్తులు పొత్తులో ఉన్నారని చెప్పారు.


CM Jagan:  ‘సిద్ధం’ చివరి సభలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు


బాపట్ల: తాను ఒంటిరిగానే రాబోయే ఎన్నికలకు వెళ్తున్నానని.. తనను ఓడించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పొత్తులతో సిద్ధమయ్యారని సీఎం, వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan) అన్నారు. చంద్రబాబు జేబులో ఉన్న మరో జాతీయ పార్టీ తన మీద దాడి చేయడానికి రెడీగా ఉందని అన్నారు. ప్రజల చేతులో చిత్తుగా ఓడిపోయిన పార్టీలు, ఓడిపోయిన వ్యక్తులు పొత్తులో ఉన్నారని చెప్పారు. అరడజను పార్టీలతో పొత్తుతో, ఎత్తులతో, జిత్తులతో రాజకీయం నడుపుతున్నారని మండిపడ్డారు. జగన్ అనే ఒక్కడు చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడని అన్నారు. చంద్రబాబు ముగ్గురుతో కలిసి పొత్తు అంటున్నాడన్నారు. ఆదివారం నాడు మేదరమెట్ల వద్ద ‘సిద్ధం’ చివరి బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. పేదలను గెలిపించాలని తాను పోరాడుతున్నానని తెలిపారు. ధర్మం, అధర్మంలా మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతుందని అన్నారు. తనకు స్టార్ క్యాంపైనర్లు లేరని స్పష్టం చేశారు. నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంత మంది పేదింటి స్టార్ క్యాంపైనర్లు తనకు ఉన్నారని చెప్పారు. నాలుగు రోజుల్లోనే రాబోయే ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు.



ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పిన చంద్రబాబు


లంచాలు, వివక్ష లేని పాలనతో మన ఫ్యాన్‌కి కరెంట్ వస్తుందన్నారు. మ్యానిఫెస్టోలోని 99 శాతం హామీలను అమలు చేశామని చెప్పారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క స్కీము కూడా లేదని ధ్వజమెత్తారు. 2014లో ఇచ్చిన హామీలు టీడీపీ కూటమి అమలు చేయలేదని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు మాట తప్పారని చెప్పారు. మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు పొత్తుల డ్రామాతో అందరి ముందుకు వస్తున్నాడని అన్నారు. చంద్రబాబు పొత్తులతో ప్రజలకు ఏమైనా ప్రయోజనం కలిగిందా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందించిందని తెలిపారు. రూ. 2.65 లక్షల కోట్లు నేరుగా ప్రజలకు అందించామని అన్నారు. డీబీటీ, నాన్ టీబీటీ ద్వారా రూ. 3.75 లక్షల కోట్లు 58 నెలల కాలంలో ప్రజలకు అందించామని వివరించారు. సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక ఏపీ శ్రీలంక అవుతుందని ప్రచారం చేశారన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న 8 సంక్షేమ పథకాలకు రూ. 75 వేల కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. చంద్రబాబు చెబుతున్న పథకాలకు మరో రూ. 87,312 కోట్లు కావాలని వివరించారు. ఎన్నికల్లో వలంటీర్ల పాత్ర కీలకమని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వలంటీర్లు వివరించాలని సీఎం జగన్ పేర్కొన్నారు