Thursday, November 21, 2019

రాజధాని మా ప్రాధాన్యం కాదు! ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

రాజధాని మా ప్రాధాన్యం కాదు!
22-11-2019 03:44:29

నగరాలు నిర్మించే స్థోమత లేదు
లండన్‌ కడతామని వాళ్లు అంటే దానికి మేము కట్టుబడక్కర్లేదు
నవరత్నాలకే సర్కారు ప్రాధాన్యం.. ఫైబర్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ పెద్ద స్కాం
పవర్‌ ఒప్పందాలు రద్దవలేదు.. పీపీఏపై కేంద్ర, రాష్ట్ర కోణాలు వేర్వేరు
ఉపాధి హామీ పథకాన్ని ఆపలేదు.. ఆర్థిక మంత్రి బుగ్గన స్పష్టీకరణ
హైదరాబాద్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి రాజధాని నిర్మాణం తమ ప్రాధాన్యం కాదని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పరోక్షంగా స్పష్టం చేశారు. ‘‘లక్షల కోట్లు ఖర్చుపెట్టి నగరాలు నిర్మించే స్థోమత మా ప్రభుత్వానికి లేదు. రాష్ట్ర రాజధానిని లండన్‌లా రూపొందిస్తామని ఒక ప్రభుత్వం అంటే, ఆ తర్వాతి ప్రభుత్వం, దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. అమరావతిలో తాత్కాలిక ప్రభుత్వ భవనాలకు అడుగుకి 10వేల చొప్పున టీడీపీ ప్రభుత్వం వెచ్చించింది. వాటినేమైనా స్వర్గంలో కట్టా రా?’’ అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పనతో పా టు మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా నవరత్నాల అమ లే తమ ప్రాధామ్యాలని స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌ లేక్‌వ్యూ అతిథిగృహంలో బుగ్గన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాజధానిపై తప్పుడు ప్రకటనలు చేశారని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి ఆరోపించారు. ‘‘హైదరాబాద్‌ను 400 ఏళ్ల కిందట కులీకుతుబ్‌షా మొదలు పెడితే, ఇప్పుడీ స్థితికి వచ్చింది. చెన్నై, ముంబై, న్యూయార్క్‌ వంటి నగరాలు అభివృద్ధి చెందడానికి ఎన్నేళ్లు పట్టింది? అలాంటిది హైదరాబాద్‌ తానే కట్టినట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. అలాగైతే, కులీకుతుబ్‌షాతో పాటు ఆయన తర్వాతి పాలకులు ఏం చేశారు?’’ అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి సింగపూర్‌ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అవగాహన ఒప్పందం లేదని బుగ్గన అన్నారు.

వారు చెప్పే ఆదాయమేది?
జగన్‌ ప్రభుత్వానికి సంపద ఎలా సృష్టించాలో తెలియదంటూ చంద్రబాబు చేసిన ఆరోపణను బుగ్గన ఖండించారు. ‘‘2014-15లో రాష్ట్రానికి సొంత పన్ను ఆదాయం 42,618కోట్లు, 2015-16లో 39,907కోట్లు, 2016-17లో 44,181కోట్లు ఆదాయం వచ్చింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత 2017-18లో అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీకి కూడా పన్ను ఆదాయం పెరిగింది. ఆ ఆర్థిక సంవత్సరంలో 49,486కోట్ల ఆదా యం వచ్చింది. 2018-19లో 58,031కోట్లు ఆదాయం వచ్చింది. ఆర్థిక మందగమనంతో అన్ని రాష్ట్రాల్లోలాగే ఏపీలో కూడా ఈసారి ఆదాయం మందగించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆదాయ పెరుగుదల నిజమైతే రూ.97 వేల కోట్ల మేర ఉన్న అప్పుని రూ.2.40 లక్షల కోట్లకు ఎందుకు తీసుకెళ్లారు? టీడీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయేనాటికి రూ.40వేల కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి’’ అన్నారు.

ఆగమేఘాలపై ఒప్పందాలా?
ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌(ఓఎ్‌ఫసీ) ఓ పెద్దస్కాం అని ఒక ప్రశ్నకు సమాధానంగా బుగ్గన అన్నారు. ‘‘ఓఎ్‌ఫసీ డిజైన్‌లో లోపాలున్నాయి. అందుకే నిలిపివేశాం. పవన విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి 2017లో ఆగమేఘాలపై 41 కంపెనీలతో ఎందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు? అది కూడా 25 ఏళ్లపాటు ఎందుకు కొనసాగిస్తారు? యూనిట్‌కు రూ.2.50కు వచ్చే విద్యుత్తును రూ.4.80కి ఎందుకు ఒప్పందం చేసుకున్నారు? మా ప్రభుత్వంతో ఆయా సంస్థలు సంప్రదింపులు జరుపుతున్నాయి. ప్రభుత్వానికి భారం తగ్గేలా ఒక రేటు ఖరారవుతుంది. పీపీఏలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ క్కోణాలు వేరువేరుగా ఉంటాయి’’ అని తెలిపారు.

మాదీ తెలంగాణ దారే..
‘‘తెలంగాణ ప్రభుత్వం లాగే తాము కూడా ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా ఇసుక విక్రయాలు కొనసాగిస్తున్నాం. రాష్ట్రంలో మద్యం దుకాణాలను 20శాతానికి తగ్గించినా రెండు రకాల పన్నులు వేయడం వల్ల ఆదాయం తగ్గలేదు. 2018-19 అక్టోబరులో రూ. 13వేల కోట్ల ఆదాయం రాగా, ఈసారి కూడా ఇంతే ఆదాయం వచ్చింది’’ అని వివరించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకాన్ని ప్రభుత్వం నిలిపివేయలేదని బుగ్గన స్పష్టం చేశారు. ఆ పథకంలో నీరు-చెట్టు విభాగంలో మాత్రమే విచారణ జరిపిస్తున్నట్లు తెలిపారు. వివిధ పథకాల్లో అక్రమాలు జరిగాయని, వీటిపై విచారణ ఫలితం 2020 మార్చిలో కనబడుతుందని ఆర్థిక మంత్రి అన్నారు.


రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పులపాలు చేశారు: బుగ్గన
Nov 21, 2019, 19:14 IST
Buggana Rajendranath Lashes Out at Chandrababu baseless allegations - Sakshi
సాక్షి, హైదరాబాద్‌ : ‘చంద్రబాబు నాయుడు తరచు నోరు జారుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో అనేకసార్లు టెండర్లు మార్చింది టీడీపీ ప్రభుత్వమే. కమీషన్ల కోసమే ఎక్కువ అంచనాలతో చంద్రబాబు పనులు అప్పగించారు. నాడు ఎక్కువ ధరకు కోట్‌ చేసిన సంస్థలే ఇప్పుడు తక్కువకు పనులు చేస్తున్నాయి. ఆనాడు చంద్రబాబు ప్రశంసించిన సంస్థలకే పనులు అప్పగించాం. రివర్స్‌ టెండరింగ్‌తో డబ్బు ఆదా చేస్తే తప్పా చంద్రబాబు’ అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని లేక్‌ వ్యూ అతిథి గృహంలో  గురువారం ఆయన మీడియా సమావేశంలో  పోలవరంపై ప్రతిపక్షం విమర్శలకు కౌంటర్‌ ఇచ్చారు. చంద్రబాబు ఏమాత్రం మారలేదని, ఆయన బోధలు మారలేదంటూ.. సినిమా పాటను వినిపించారు. ప్రజాధనం ఆదా అవుతుంటే సంతోషించాల్సింది పోయి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు.

మంత్రి మాట్లాడుతూ... ‘చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. నీరు-చెట్టు పథకం పేరుతో గత ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడింది. ఆయన మాట్లాడితే హైదరాబాద్‌ నేనే కట్టానని అంటున్నారు. హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీ ఎన్నో ఏళ్ల నుంచి అభివృద్ధి చెందిన నగరాలు. చంద్రబాబు నోటి నుంచి ఎప్పుడూ సింగపూర్‌ ప్రస్తావనే. నేనే గొప్పవాడినని చెప్పుకునేది ఒక్క చంద్రబాబు మాత్రమే. ఇసుక మీద కూడా టీడీపీ నేతలు ఇప్పటికీ రాద్ధాంతం చేస్తున్నారు. ఇసుక దోపిడీని అడ్డుకున్న తహశీల్దార్‌పై దాడి చేసింది అప్పటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కాదా?.





చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారు. ఎక్కడికి వెళ్లినా బకాయిలే ఉన్నాయి. సూదికి, దూదికి బిల్లులు పెండింగే. ఆశావర్కర్లు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకుండా చంద్రబాబు దిగిపోయారు. రాష్ట్రానికి వచ్చే సంపద అంతా కూడా రెవెన్యూ రూపంలోనే ఉంది. 2014-15 ఓన్‌ ట్యాక్స్‌ రూ.42,618 కోట్లు, ఆ తరువాత ఏడాది 39 వేల కోట్లు, 2016లో 44 వేల కోట్లు, జీఎస్టీ వచ్చిన తరువాత 2017లో 49 వేల కోట్లు పెరిగింది.  చంద్రబాబు  దిగిపోయే సమయంలో రూ.43 వేల పెండింగ్‌ బిల్లులు పెట్టారు. సివిల్‌ సప్లైయింగ్‌లో రూ.20 వేల కోట్లు అప్పులు చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మద్యపాన నిషేదం దిశగా అడుగులు వేస్తుంటే.. లిక్కర్‌ ధరల పెంపుపై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. 4380 మద్యం దుకాణాలను మూడువేలకు తగ్గించాం. పర్మిట్‌ రూమ్‌లను ఎత్తేశాం. దాదాపు 16 శాతం మద్యం అమ్మకాలు తగ్గాయి. చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు.1990 ముందర ఇంగ్లీష్‌ కాలేజీలు లేవా? స్కూల్‌ ఎడ్యుకేషన్‌ను ఇంగ్లీష్‌ మీడియం చేయడంతో ప్రతిపక్ష నాయకులకు కడుపు మండుతోంది. వారి పిల్లలు, మనవళ్లు ఎక్కడ చదివారు. చంద్రబాబు తానే ఇంగ్లీష్‌ నేర్పించానని చెప్పుకోవడం సిగ్గుచేటు. ముందు లోకేష్‌, దేవినేని ఉమా, చింతమనేని ప్రభాకర్‌, బుద్ద వెంకన్నలకు ఇంగ్లీష్‌ నేర్పించండి.

రంగులు వేసేది నేర్పించింది మీరు కాదా చంద్రబాబు. గత ఐదేళ్లలో బడికి, గుడికి పచ్చ రంగు వేసింది మీరేగా?. రూ.10 వేలు ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసినా ఓట్లు వేయకుండా రూ. 1000 ఇచ్చిన వారికి ఓట్లు వేశారని చంద్రబాబు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. ఎకానమిస్టు, విజనరీ అంటూ చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గు చేటు . నీరు- చెట్టు పేరుతో వేల కోట్ల కొల్లగొట్టారు. ఈ పనులపై విచారణ కొనసాగుతుంది.’ అని స్పష్టం చేశారు.

Sunday, November 10, 2019

ఆంగ్లం ఆరు వరకే మీడియం ఉత్తర్వులో మార్పు

ఆంగ్లం ఆరు వరకే మీడియం ఉత్తర్వులో మార్పు

ఆరు వరకే ఆంగ్లం!
10-11-2019 03:22:36

‘మీడియం’ ఉత్తర్వులో మార్పు.. తొలిదశలో 1 నుంచి 6 వరకు
అమలుకు సీఎం ఆదేశాలు
తర్వాతి దశలపై లేని స్పష్టత
పెదవి విరుస్తున్న భాషావేత్తలు
వెనుకడుగుగా భావించబోం
మరో గందరగోళ నిర్ణయమే
టీచర్లకు శిక్షణ, ఖర్చు నుంచి
వెసులుబాటుకే క్లాసుల కుదింపు
తెలుగు సంఘాల స్పష్టీకరణ
అమరావతి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఆంగ్ల మాధ్యమంలో బోధనపై రాష్ట్రప్రభుత్వం తన నిర్ణయంలో మార్పు చేసింది. ఉత్తర్వుల్లో ఎనిమిదోతరగతి వరకు అని నిర్దేశించగా, ప్రస్తుతానికి ఆరో తరగతి వరకు వాటిని పరిమితం చేయాలని నిర్ణయించింది. మొదటి దశలో భాగంగా 1 నుంచి 6వ తరగతి వరకూ ఇంగ్లిష్‌ మీడియంలో బోధించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శనివారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. ఆ తర్వాత దశల గురించి ఆయన స్పష్టత ఇవ్వలేదు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధనను తప్పనిసరి చేస్తూ ఈ నెల 5న ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వం తన నిర్ణయాన్ని పాక్షికంగా సడలించింది. అయితే, ఇది మరో గందరగోళ నిర్ణయం తప్ప మరేమీ కాదని భాషాభిమానులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుకు తలెత్తిన ముప్పు తాజా సవరణతో కొంతైనా తొలగినట్టు కాదని, ఈ నిర్ణయాన్ని సర్కారు మెట్టు దిగడంలా భావించడంలేదని తెగేసి చెబుతున్నారు.

భాషోద్యమం తెచ్చిన ఒత్తిడిగా కూడా చూడటం లేదన్నారు. 7, 8 క్లాసులకే ప్రస్తుతానికి ఇంగ్లిష్‌ మీడియం అమలుచేసి, 1-6తరగతి వరకు తరువాత ఆలోచిస్తామని ఉంటే.. భాషోద్యమం కొంత ఫలితం సాధించినట్టు భావించడానికి వీలుండేదని వివరించారు. ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడానికి ముందుగా టీచర్లకు భారీఎత్తున చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లు, శిక్షణలో కొంత వెసులుబాటు పొందేందుకే ఇంగ్లిష్‌ మీడియం అమలుచేసే క్లాసులను తొలిదశలో తగ్గించిందని వివరించారు. దీనివల్ల తర్ఫీదు పొందే టీచర్లసంఖ్య, దానివల్ల ఖర్చు కూడా తగ్గుతాయని గుర్తుచేస్తున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతివరకు పిల్లలకు మాతృభాషలోనే బోధన చేయాలనేది మౌలిక సిద్ధాంతమని, ఆ మేరకు ప్రభుత్వంలో ఇంతవరకు పునరాలోచనే కనిపించడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాగా, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్‌ ల్యాబ్‌లను ‘నాడు-నేడు’ లో భాగంగా ఏర్పాటు చేయాలని ఇదే భేటీలో సీఎం ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎ్‌సఈ, ఐసీఎస్‌ఈ విధానాలను పాటించాలని సూచించారు.

బేషజానికి పోవద్దు: పీడీఎఫ్‌
నిర్బంధ ఆంగ్ల మాధ్యమాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, రెండు మాధ్యమాలనూ కొనసాగించాలి’ అని ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (పీడీఎఫ్‌)... ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ విషయంలో బేషజానికి పోరాదని, చేసిన తప్పును సరిదిద్దుకోవాలని సూచించింది. ప్రాథమిక విద్య (1- 5 తరగతులు) వరకు మాతృభాషలో బోఽధన జరగాలని అందరూ కోరుతుంటే.. అందుకు విరుద్ధంగా 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం ఎంతవరకు సమంజసమని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, కేఎస్‌ లక్ష్మణరావు, వై.శ్రీనివాసులు రెడ్డి ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ‘‘మంచి విద్యను బోధించడమంటే మాధ్యమాన్ని మార్చి చేతులు దులుపుకోవడం కాదు.

ఢిల్లీ, కేరళలో మాదిరిగా పాఠశాలల్ని, బోధన విధానాల్ని అత్యాధునికంగా తీర్చిదిద్దాలి. వివక్షను రూపుమాపడం అంటే అందరు పిల్లలూ ఒకచోట చదువుకునే కామన్‌ స్కూలు విధానం తెచ్చేలా రాజకీయ ప్రధాన అజెండాలోకి విద్యా రంగాన్ని తీసుకుని రావాలి. సగానికి సగం ప్రాథమిక పాఠశాలల్ని దాదాపు ఎస్సీ, ఎస్టీ కాలనీల స్కూళ్లను ఏకోపాధ్యాయ పాఠశాలుగా మార్చి ‘ఆంగ్లాన్ని తప్పనిసరి చేశాం.. ఇంకేం కావాలి’ అనడం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వం ఈ ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించుకోవాలి. రెండు మాధ్యమాలను కొనసాగించాలి. ఈ రెండు డిమాండ్లు నెరవేరే వరకు పోరాడతాం’’ అని స్పష్టం చేశారు.

Saturday, November 9, 2019

All AP Govt MPP and ZP Schools Converted as English Medium (Class 1 to 8)

All AP Govt MPP and ZP Schools Converted as English Medium (Class 1 to 8)
06/11/2019 

All AP Govt MPP and ZP Schools Converted as English Medium (Class 1 to 8)

AP Govt
In the reference 1st read above, Government have issued orders for introducing English Medium with CBSE Syllabus in a Parallel Section from VI class in 6500 identified High Schools in the Government Sector (Govt/ZP/Municipal) in the State that are also proposed for strengthening under the Success Project.

2. In the reference 2nd read above, Government have issued orders for replacing CBSE syllabus with State Syllabus in all 6500 Success Schools from the academic year 2010-11.

3. In the reference 3rd read above, Government have delegated powers to the Commissioner of School Education, A.P. to open parallel English Medium sections in the existing high schools for classes VI to X. 4. In the reference 4th read above, Government have accorded permission to the Commissioner of School Education for opening of English Medium Parallel sections in Primary Schools from the Academic Year 2018-19.

5. The Commissioner of School Education has submitted a proposal for converting all Government, MPP Schools and Zilla Parishad schools and all classes into English Medium from Grades I to VIII from academic year 2020-21 and for Grades IX & X from academic year 2021-22.

6. After careful examination of the matter, Government hereby accord permission to the Commissioner of School Education to convert all Government, MPP Schools and Zilla Parishad schools and all classes into English Medium from classes I to VIII from the academic year 2020-21 and for classes IX & X from academic year 2021-22 in superseding the earlier orders issued in the matter.

However, the Commissioner of School Education shall take appropriate and adequate efforts to implement Telugu/Urdu as compulsory subject depending on the current medium of instruction in all the Schools compulsorily in line with the Government orders in the matter.

7. The Commissioner of School Education shall ensure the following steps for successful implementation of English medium schools:-

Required teachers should be deployed in the School as per the staffing pattern prescribed by the Government from time to time and as per pupil teacher ratio for single medium.
SCERT shall take necessary action for designing and development of Teacher Hand Books, Training of Teachers in English medium teaching skills and knowledge, Compendium of best classroom practices and other pedagogical material for supporting the teachers to be skilled in English Medium teaching.
Director SCERT in coordination with Commissioner of School Education shall take comprehensive action for online assessment of the current English proficiency levels of the Teachers, design appropriate training programs for enchasing the English Medium teaching skills for the teachers.
Intensive and extensive trainings must be ensured during the current academic year and during the Summer of 2020 for equipping the Teachers to teach in English Medium from academic Year 2020-21 for classes I to VIII. Number of trainings shall be given to the Teachers until improving their English Medium Teaching skills in specific subjects and in general.
Action shall be taken for reviving the English Language Teaching Centers & District English Centers (DECs) and re-locating them in District Institutes for Education & Training (DIETs).
Director, Text Book Press, should take action to obtain correct indents and ensure supply of English Medium Text Books to the Schools as per student enrolment for classes I to VIII well before the starting of the academic year.
Keeping in view of the conversion of all schools and classes from I to VIII into English Medium, requirement of Teachers can be arrived at and proposals should be submitted to Government by the Commissioner School Education.
In future, Teacher recruitments, qualified candidates with the best proficiency in English Medium teaching should be recruited.
8. The Commissioner of School Education, the State Project Director, SSA, the Director, SCERT, and the Director, AP Text Book Press shall take further necessary action accordingly.


AP government to introduce English medium for state schools
Our Bureau  Vijayawada | Updated on November 05, 2019  Published on November 05, 2019

Representative image   -  The Hindu

The Andhra Pradesh Government is set to introduce English medium in government schools right for first to eighth standard starting from the next academic year.

Education Minister A. Suresh told the media at Amaravati on Tuesday that earlier in the day Chief Minister Y.S Jaganmohan Reddy had conducted a review on "Naadu-nedu" (Then and now) programme which will introduced from November 14- Children's Day.

He said under the programme, to be launched by the Chief Minister in Prakasam district , the basic amenities in schools will be improved and in the first phase it would be taken up in 15,000 schools. This phase would be completed by March 2020, and in the next phase remaining schools will be taken up, the total number being around 40,000 .

He said it was decided to introduce instruction in English medium in all government schools . But Telugu will not be neglected and be made a compulsory subject. From the next academic year, instruction in English will begin . In subsequent years, it will be extended to cover the ninth and tenth standards as well. Teachers will be trained to teach in English and new teachers to be recruited would be tested for their proficiency in English.

Suresh said the idea was to make students competent to fare better in competitive exams and also to prepare them for sectors such as software and IT.

It may be noted that the previous Telugu Desam Government also toyed with the idea of introducing English medium right from the primary level and even a GO was issued, but it could not be implemented, as there was resistance from different quarters including associations of teachers.  



English medium to be implemented in all Andhra govt schools
The government's decision has evoked criticism from a section of academicians and teachers.
IANS
 Thursday, November 07, 2019 - 09:44

The Andhra Pradesh government's decision to introduce English as the medium of instruction in all government schools has triggered a controversy with a section of academicians and teachers opposing the move.

The Y S Jagan Mohan Reddy-led government in Andhra Pradesh has announced converting all government, Mandal Praja Parishad (MPP) and Zilla Parishad (ZP) schools into English medium schools.

According to an order issued by the School Education Department, English will be the medium of instruction from first to eighth standard from the academic year 2020-21. For class IX and X, English will be the medium of instruction from 2021-22.

However, Telugu or Urdu will be a compulsory subject in all the schools. The government's decision has evoked criticism from a section of academicians and teachers.

Katti Narasimha Reddy, a member of the Andhra Pradesh Legislative Council, found fault with the move, saying that it went against the recommendation of the Kasturi Rangan Committee that teaching should be in mother tongue, at least in primary classes.

The legislator from teachers' constituency said that converting all government schools into English medium schools was also deviation from the proposed national education policy.

The YSRCP government has came under criticism for introducing English as the medium of instruction without doing the necessary ground work.

Teachers of government-run Telugu and Urdu medium schools opposed the move, saying they lacked the necessary skills to teach in English.

"As the new academic year starts in June, we have just eight months in hand which is not sufficient to prepare ourselves for the new task," said a teacher in Vijayawada.

Meanwhile, the United Teachers' Federation (UTF) condemned the government order and demanded that Telugu medium schools should continue.

UTF state President Sheikh Saabji said that scrapping Telugu as the medium of instruction in all government schools is not a proper decision.

"How can the government remove Telugu as the medium of instruction in a Telugu speaking state and replace it with English," asked UTF General Secretary Babu Reddy.

The teachers' body feared that introduction of English as the medium of instruction will hit the education of students, especially those coming from the weaker sections of the society, and increase the dropout rate.

However, the commissioner of school education will take appropriate and adequate efforts to implement Telugu or Urdu as a compulsory subject depending on the current medium of instruction in all the schools compulsorily in line with the government orders.