రాజధాని మా ప్రాధాన్యం కాదు!
22-11-2019 03:44:29
నగరాలు నిర్మించే స్థోమత లేదు
లండన్ కడతామని వాళ్లు అంటే దానికి మేము కట్టుబడక్కర్లేదు
నవరత్నాలకే సర్కారు ప్రాధాన్యం.. ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్ పెద్ద స్కాం
పవర్ ఒప్పందాలు రద్దవలేదు.. పీపీఏపై కేంద్ర, రాష్ట్ర కోణాలు వేర్వేరు
ఉపాధి హామీ పథకాన్ని ఆపలేదు.. ఆర్థిక మంత్రి బుగ్గన స్పష్టీకరణ
హైదరాబాద్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి రాజధాని నిర్మాణం తమ ప్రాధాన్యం కాదని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పరోక్షంగా స్పష్టం చేశారు. ‘‘లక్షల కోట్లు ఖర్చుపెట్టి నగరాలు నిర్మించే స్థోమత మా ప్రభుత్వానికి లేదు. రాష్ట్ర రాజధానిని లండన్‌లా రూపొందిస్తామని ఒక ప్రభుత్వం అంటే, ఆ తర్వాతి ప్రభుత్వం, దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. అమరావతిలో తాత్కాలిక ప్రభుత్వ భవనాలకు అడుగుకి 10వేల చొప్పున టీడీపీ ప్రభుత్వం వెచ్చించింది. వాటినేమైనా స్వర్గంలో కట్టా రా?’’ అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పనతో పా టు మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా నవరత్నాల అమ లే తమ ప్రాధామ్యాలని స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్ లేక్‌వ్యూ అతిథిగృహంలో బుగ్గన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాజధానిపై తప్పుడు ప్రకటనలు చేశారని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి ఆరోపించారు. ‘‘హైదరాబాద్‌ను 400 ఏళ్ల కిందట కులీకుతుబ్‌షా మొదలు పెడితే, ఇప్పుడీ స్థితికి వచ్చింది. చెన్నై, ముంబై, న్యూయార్క్ వంటి నగరాలు అభివృద్ధి చెందడానికి ఎన్నేళ్లు పట్టింది? అలాంటిది హైదరాబాద్ తానే కట్టినట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. అలాగైతే, కులీకుతుబ్‌షాతో పాటు ఆయన తర్వాతి పాలకులు ఏం చేశారు?’’ అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి సింగపూర్ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అవగాహన ఒప్పందం లేదని బుగ్గన అన్నారు.
వారు చెప్పే ఆదాయమేది?
జగన్ ప్రభుత్వానికి సంపద ఎలా సృష్టించాలో తెలియదంటూ చంద్రబాబు చేసిన ఆరోపణను బుగ్గన ఖండించారు. ‘‘2014-15లో రాష్ట్రానికి సొంత పన్ను ఆదాయం 42,618కోట్లు, 2015-16లో 39,907కోట్లు, 2016-17లో 44,181కోట్లు ఆదాయం వచ్చింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత 2017-18లో అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీకి కూడా పన్ను ఆదాయం పెరిగింది. ఆ ఆర్థిక సంవత్సరంలో 49,486కోట్ల ఆదా యం వచ్చింది. 2018-19లో 58,031కోట్లు ఆదాయం వచ్చింది. ఆర్థిక మందగమనంతో అన్ని రాష్ట్రాల్లోలాగే ఏపీలో కూడా ఈసారి ఆదాయం మందగించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆదాయ పెరుగుదల నిజమైతే రూ.97 వేల కోట్ల మేర ఉన్న అప్పుని రూ.2.40 లక్షల కోట్లకు ఎందుకు తీసుకెళ్లారు? టీడీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయేనాటికి రూ.40వేల కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి’’ అన్నారు.
ఆగమేఘాలపై ఒప్పందాలా?
ఆప్టిక్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్(ఓఎ్‌ఫసీ) ఓ పెద్దస్కాం అని ఒక ప్రశ్నకు సమాధానంగా బుగ్గన అన్నారు. ‘‘ఓఎ్‌ఫసీ డిజైన్‌లో లోపాలున్నాయి. అందుకే నిలిపివేశాం. పవన విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి 2017లో ఆగమేఘాలపై 41 కంపెనీలతో ఎందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు? అది కూడా 25 ఏళ్లపాటు ఎందుకు కొనసాగిస్తారు? యూనిట్‌కు రూ.2.50కు వచ్చే విద్యుత్తును రూ.4.80కి ఎందుకు ఒప్పందం చేసుకున్నారు? మా ప్రభుత్వంతో ఆయా సంస్థలు సంప్రదింపులు జరుపుతున్నాయి. ప్రభుత్వానికి భారం తగ్గేలా ఒక రేటు ఖరారవుతుంది. పీపీఏలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ క్కోణాలు వేరువేరుగా ఉంటాయి’’ అని తెలిపారు.
మాదీ తెలంగాణ దారే..
‘‘తెలంగాణ ప్రభుత్వం లాగే తాము కూడా ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా ఇసుక విక్రయాలు కొనసాగిస్తున్నాం. రాష్ట్రంలో మద్యం దుకాణాలను 20శాతానికి తగ్గించినా రెండు రకాల పన్నులు వేయడం వల్ల ఆదాయం తగ్గలేదు. 2018-19 అక్టోబరులో రూ. 13వేల కోట్ల ఆదాయం రాగా, ఈసారి కూడా ఇంతే ఆదాయం వచ్చింది’’ అని వివరించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకాన్ని ప్రభుత్వం నిలిపివేయలేదని బుగ్గన స్పష్టం చేశారు. ఆ పథకంలో నీరు-చెట్టు విభాగంలో మాత్రమే విచారణ జరిపిస్తున్నట్లు తెలిపారు. వివిధ పథకాల్లో అక్రమాలు జరిగాయని, వీటిపై విచారణ ఫలితం 2020 మార్చిలో కనబడుతుందని ఆర్థిక మంత్రి అన్నారు.
రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పులపాలు చేశారు: బుగ్గన
Nov 21, 2019, 19:14 IST
Buggana Rajendranath Lashes Out at Chandrababu baseless allegations - Sakshi
సాక్షి, హైదరాబాద్ : ‘చంద్రబాబు నాయుడు తరచు నోరు జారుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అనేకసార్లు టెండర్లు మార్చింది టీడీపీ ప్రభుత్వమే. కమీషన్ల కోసమే ఎక్కువ అంచనాలతో చంద్రబాబు పనులు అప్పగించారు. నాడు ఎక్కువ ధరకు కోట్ చేసిన సంస్థలే ఇప్పుడు తక్కువకు పనులు చేస్తున్నాయి. ఆనాడు చంద్రబాబు ప్రశంసించిన సంస్థలకే పనులు అప్పగించాం. రివర్స్ టెండరింగ్‌తో డబ్బు ఆదా చేస్తే తప్పా చంద్రబాబు’ అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని లేక్ వ్యూ అతిథి గృహంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో పోలవరంపై ప్రతిపక్షం విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఏమాత్రం మారలేదని, ఆయన బోధలు మారలేదంటూ.. సినిమా పాటను వినిపించారు. ప్రజాధనం ఆదా అవుతుంటే సంతోషించాల్సింది పోయి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు.
మంత్రి మాట్లాడుతూ... ‘చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. నీరు-చెట్టు పథకం పేరుతో గత ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడింది. ఆయన మాట్లాడితే హైదరాబాద్ నేనే కట్టానని అంటున్నారు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ ఎన్నో ఏళ్ల నుంచి అభివృద్ధి చెందిన నగరాలు. చంద్రబాబు నోటి నుంచి ఎప్పుడూ సింగపూర్ ప్రస్తావనే. నేనే గొప్పవాడినని చెప్పుకునేది ఒక్క చంద్రబాబు మాత్రమే. ఇసుక మీద కూడా టీడీపీ నేతలు ఇప్పటికీ రాద్ధాంతం చేస్తున్నారు. ఇసుక దోపిడీని అడ్డుకున్న తహశీల్దార్‌పై దాడి చేసింది అప్పటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కాదా?.
చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారు. ఎక్కడికి వెళ్లినా బకాయిలే ఉన్నాయి. సూదికి, దూదికి బిల్లులు పెండింగే. ఆశావర్కర్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకుండా చంద్రబాబు దిగిపోయారు. రాష్ట్రానికి వచ్చే సంపద అంతా కూడా రెవెన్యూ రూపంలోనే ఉంది. 2014-15 ఓన్ ట్యాక్స్ రూ.42,618 కోట్లు, ఆ తరువాత ఏడాది 39 వేల కోట్లు, 2016లో 44 వేల కోట్లు, జీఎస్టీ వచ్చిన తరువాత 2017లో 49 వేల కోట్లు పెరిగింది. చంద్రబాబు దిగిపోయే సమయంలో రూ.43 వేల పెండింగ్ బిల్లులు పెట్టారు. సివిల్ సప్లైయింగ్‌లో రూ.20 వేల కోట్లు అప్పులు చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మద్యపాన నిషేదం దిశగా అడుగులు వేస్తుంటే.. లిక్కర్ ధరల పెంపుపై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. 4380 మద్యం దుకాణాలను మూడువేలకు తగ్గించాం. పర్మిట్ రూమ్‌లను ఎత్తేశాం. దాదాపు 16 శాతం మద్యం అమ్మకాలు తగ్గాయి. చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు.1990 ముందర ఇంగ్లీష్ కాలేజీలు లేవా? స్కూల్ ఎడ్యుకేషన్‌ను ఇంగ్లీష్ మీడియం చేయడంతో ప్రతిపక్ష నాయకులకు కడుపు మండుతోంది. వారి పిల్లలు, మనవళ్లు ఎక్కడ చదివారు. చంద్రబాబు తానే ఇంగ్లీష్ నేర్పించానని చెప్పుకోవడం సిగ్గుచేటు. ముందు లోకేష్, దేవినేని ఉమా, చింతమనేని ప్రభాకర్, బుద్ద వెంకన్నలకు ఇంగ్లీష్ నేర్పించండి.
రంగులు వేసేది నేర్పించింది మీరు కాదా చంద్రబాబు. గత ఐదేళ్లలో బడికి, గుడికి పచ్చ రంగు వేసింది మీరేగా?. రూ.10 వేలు ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌ఫర్ చేసినా ఓట్లు వేయకుండా రూ. 1000 ఇచ్చిన వారికి ఓట్లు వేశారని చంద్రబాబు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. ఎకానమిస్టు, విజనరీ అంటూ చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గు చేటు . నీరు- చెట్టు పేరుతో వేల కోట్ల కొల్లగొట్టారు. ఈ పనులపై విచారణ కొనసాగుతుంది.’ అని స్పష్టం చేశారు.

No comments:
Post a Comment