ప్రజలంతా తప్పు చేశానంటే సారీకి సిద్ధం
06-12-2019 03:38:36
దుష్ప్రచారంతో అమరావతిని చంపేస్తున్నారు
ప్రసిద్ధ రాజధానిని కోరుకోవడం తప్పా?
నష్టం నాకు కాదు.. భావితరాలకే
రాజధాని అంటే ఆదాయం, ఉద్యోగాలు
విభజనతో ఒకసారి నష్టపోయాం
రాజధానిని పాడుచేసుకుని నష్టపోవద్దు
అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు అమరావతి నుంచే పనిచేస్తున్నాయి
వర్సిటీలు, దాదాపు పూర్తయిన టవర్లు, పేదల ఫ్లాట్లు గ్రాఫిక్సేనంటారా?
రౌండ్ టేబుల్ భేటీలో బాబు ప్రశ్న
అమరావతి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మనకొక ప్రపంచస్ధాయి ప్రసిద్ధ రాజధాని ఉండాలనుకోవడం తప్పా.. అని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతి నిర్మాణంలో తాను తప్పు చేశానని ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలు అభిప్రాయపడితే క్షమాపణ చెప్పడానికి సిద్ధమని ప్రకటించారు. చరిత్ర పొడవునా ఒక మంచి రాజధాని నగరం లేని దురదృష్టం ఆంధ్రులను వెన్నాడాల్సిందేనా అని వాపోయారు. గురువారం విజయవాడలోని ‘ఎ’ కన్వెన్షన్ హాలులో ప్రజా రాజధాని అమరావతిపై టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మనకొక ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించుకోలేమా? హైదరాబాద్‌లో సాధ్యమైంది అమరావతిలో ఎందుకు కాదు’ అని ప్రశ్నించారు. అక్కడ తన త ర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు వైఎస్ సహా ఎవ రూ హైదరాబాద్‌ను చెడగొట్టలేదని.. ఆ ప్రణాళికల ను కొనసాగించారని తెలిపారు. కానీ ఇక్కడ విరుద్ధంగా జరుగుతోందన్నారు. రకరకాల దుష్ప్రచారాల తో అమరావతిని చంపేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ‘దానిని చంపేస్తే నాకొచ్చిన నష్టమేమీ లేదు. భావితరాలు, తెలుగు జాతి నష్టపోతాయి. ఒక పెద్ద రాజధాని ఉంటే ప్రభుత్వానికి ఆదాయం, సంపద, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, పేదరిక నిర్మూలన జరుగుతాయి. ఇప్పుడు తెలంగాణకి వస్తున్న ఆదాయంలో 60 శాతం హైదరాబాద్ నుంచే వస్తోంది. మహారాష్ట్రకు 57 శాతం ముంబై నుంచి వస్తోంది. నా కులం వారో.. నా బంధువులో ఉన్నారని హైదరాబాద్ కోసం శ్రమించానా? మొత్తం తెలుగు జాతి కోసం శ్రమించాను’ అని తెలిపారు.
స్వచ్ఛందంగా 34 వేల ఎకరాలిచ్చారు..
‘భౌగోళికంగా రాష్ట్రానికి మధ్యలో ఉందని అమరావతిని రాజధానిగా ఎంచుకున్నాం. రైతులకు ఒక్క పిలుపు ఇస్తే 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చా రు. ఇంత కంటే మంచి నమూనా లేదని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ దీనిని అధ్యయన అంశంగా స్వీకరించింది. సింగపూర్‌లో అవినీతి మచ్చుకైనా కనిపించదు. నాపై కుదిరిన నమ్మకంతో అడిగిన వెంటనే మన రాజధానికి ప్రణాళిక తయారు చేసి ఇవ్వడానికి సింగపూర్ అంగీకరించింది. మన వద్ద స్టార్టప్ ఏరియాలో రూ.50 వేల కోట్ల పెట్టుబడులు పెట్టి రెండున్నర లక్షల ఉ ద్యోగాలు సృష్టించాలని అనుకున్నారు. ఈ ప్రభుత్వం వాళ్లను వెళ్లగొట్టింది. నాపై కోపం ఉంటే ఉండవ చ్చు. కానీ రాజధానిపైనా.. ఇక్కడకు రావాలనుకున్న సంస్థలపైనా కోపమెందుకు?. రాష్ట్ర ప్రజలు, యువత, మేధావులు ఆలోచించా లి. రాజకీయంగా మాతో విభేదించేవారు ఉండవ చ్చు. కానీ మీ దారిలో మీరు రాజధాని కోసం పోరాడండి. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఆలోచించాలి.. విభజనతో ఒకసారి నష్టపో యాం. రాజధానిని పాడుచేసుకుని మరోసారి నష్ట పోవద్దు’
ప్రభుత్వ నిధులు అక్కర్లేదు..
‘ఏ పనికీ రోడ్డు తవ్వే అవసరమే ఉండదు. కరెం టు తీగల కోసం చెట్ల కొమ్మలు కొట్టే పని ఉండదు. చివరకు గ్యాస్, ఏసీ కూడా పైపులతో ఇంటింటికీ అందేలా ప్రణాళిక రూపొందించాం. హైదరాబాద్ స హా దేశంలో ఏ నగరంలో ఇన్ని వసతులు లేవు. ఇ ప్పటికి ఖర్చు చేసింది కాక అమరావతిలో పూర్తి స్థాయి వసతుల నిర్మాణానికి ఇంకా రూ.లక్ష కోట్లు కావాలి. దీనికి ప్రభుత్వ నిధులు ఖర్చు చేయాల్సిన అవసరమే లేదు. ప్రభుత్వం చేతిలో 8 వేల ఎకరాల భూమి ఉంది. దానిని కొద్ది కొద్దిగా అమ్ముకుంటూ ఆ నిధులతోనే ఈ పనులన్నీ పూర్తి చేసే అవకాశం ఉండేది. ప్రపంచ బ్యాంకు నిధులివ్వడానికి ముందుకొచ్చింది. జగన్ ప్రభుత్వానికి ఆసక్తి లేదని వెనక్కి వెళ్లిపోయింది. ఏపీలో జగన్ మాదిరిగా పాత ప్రభుత్వ పథకాలన్నీ నిలిపివేయొద్దని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు సూచిస్తూ జాతీయ పత్రికలు సంపాదకీయాలు రాస్తున్నాయి. జగన్ ప్రభుత్వ నిర్ణయాలతో దేశ ప్రతిష్ఠ దెబ్బతిని ఈ దేశంలోకి వచ్చే పెట్టుబడులు తగ్గుతున్నాయని కేంద్రమే బాధపడే పరిస్థితి వచ్చింది’
అన్నిటినీ పోగొట్టారు..
‘రాష్ట్రంలో అమరావతి ఒక్కదానినే అభివృద్ధి చే యాలని మా ప్రభుత్వం అనుకోలేదు. పలు నగరాలను అభివృద్ధిచేసి వికేంద్రీకరణ జరపాలనుకున్నాం’ అని చంద్రబాబు చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఈ సమావేశంలో చేసిన వ్యాఖ్యకు సమాధానమిచ్చారు. ‘ప్రముఖ కంపెనీ అదానీని ఒప్పించి విశాఖలో రూ.70 వేల కోట్లతో డేటా సెం టర్ పెట్టడానికి తీసుకొచ్చాం. అది వస్తే విశాఖ స్వరూపమే మారిపోయేది. దానిని పోగొట్టారు. విశాఖలో ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్ పెట్టడానికి లులూ గ్రూప్‌ను తెచ్చాం. వాళ్లనూ పోగొట్టారు. మేం రాక ముందు తిరుపతిలో సెల్‌ఫోన్ల తయారీ లేదు.
ఇప్పు డు దేశంలో తయారయ్యే సెల్‌ఫోన్లలో 20-30 శా తం అక్కడే తయారవుతున్నాయి. ఏభై శాతానికి పెంచ డానికి రిలయన్స్ కంపెనీని తెచ్చాం. అదీ పోయింది. ప్రకాశం జిల్లాలో రూ.25 వేల కోట్లతో పే పర్ పరిశ్రమ తెచ్చాం. వాళ్లూ వెళ్లిపోయారు. ఎంతో పోటీ ఎదుర్కొని అనంతపురం జిల్లాకు కియా కార్ల ఫ్యాక్టరీ తెచ్చాం. దానికంత సబ్సిడీ ఎందుకని మా ట్లాడారు. మనం ఇవ్వకపోతే దానిని ఎగరేసుకుపోవడానికి అప్పట్లో మహారాష్ట్ర సిద్ధంగా ఉంది. కర్నూలుకు ఎయిర్ పోర్టు, సోలార్ పరిశ్రమలు, యూనివర్సిటీలు తెచ్చాం. అన్ని ప్రాంతాల సమతుల అభివృద్ధికి కట్టుబడే పనిచేశాం’ అని వివరించారు. అమరావతి నిర్మాణానికి రూపొందించిన ప్రణాళికలతో ఆకర్షితుడైన ప్రధాని మోదీ స్వయం గా ఫోన్ చేసి కజక్‌స్థాన్ దేశ రాజధాని అస్తానా (నూర్-సుల్తాన్)ను చూసి రావాలని కోరారని.. మ నం చేయగలమన్న నమ్మకం వల్లే ఇలాంటి సలహా ఇచ్చారన్నారు. ఇక్కడ ఆస్పత్రులు లేనందువల్ల హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల్లోని ఆస్పత్రులకు ఆరోగ్య శ్రీ పథకాన్ని విస్తరిస్తున్నట్లు జగన్ చెప్పారని.. రాజధానిని అభివృద్ధి చేసుకోకపోతే మన ఆస్పత్రులు ఏనాటికీ ఎదగలేవన్న సత్యాన్ని విస్మరిస్తున్నారనివ్యాఖ్యానించారు.

No comments:
Post a Comment