అమరావతి: రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల వరకూ నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందని, అంత పకడ్బందీగా చట్టాలు, ఒప్పందాలున్నాయని... తెదేపా, భాజపా, ఆంధ్రా మేధావుల ఫోరం, భారతీయ కిసాన్ సంఘ్ నేతలు, న్యాయవాదులు పేర్కొన్నారు. ఏపీ రాజధాని అమరావతేనని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపి, రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఇక్కడి నుంచి తరలించడం మూర్ఖత్వం అవుతుందని విమర్శించారు. ‘మూడు రాజధానుల’కు నిరసనగా సోమవారం అమరావతి రైతులు తుళ్లూరు, మందడంలో చేపట్టిన మహాధర్నా, వెలగపూడిలో రిలే నిరాహారదీక్షకు... వివిధ పార్టీలు, సంఘాల నేతలు హాజరై సంఘీభావం తెలిపారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
వ్యతిరేకిస్తే ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు
మొండివాడు రాజు కన్నా బలవంతుడని అంటారు. అదే మొండివాడు సీఎం అయితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకించే వారిని రాయలసీమ, ఉత్తరాంధ్ర ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అన్ని ప్రాంతాలను సమగా అభివృద్ధి చేయాలి. అంతేగానీ కర్నూలులో హైకోర్టు పెడితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా? దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో హైకోర్టు రాజధానిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్నాయని కొందరు మాట్లాడుతున్నారు. 6 రాష్ట్రాల్లో అసలు హైకోర్టులే లేవనే విషయాన్ని వారు తెలుసుకోవాలి. రాజధాని కోసం ఇప్పటికే 6 కమిటీలు చేశారు. ఇంకెన్ని కమిటీలు వేస్తారు?
- చలసాని శ్రీనివాస్,ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు
తుగ్లక్ పాలన ప్రత్యక్షంగా చూస్తున్నాం
తుగ్లక్ పాలన గురించి చరిత్రలో చదువుకున్నాం. జగన్ పాలనతో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. సీఎం మారగానే రాజధానిని మార్చడం తొలిసారి వింటున్నాం. జగన్ సీఎం పదవికి అనర్హుడు.
- తంగిరాల సౌమ్య, మాజీ ఎమ్మెల్యే
మతిలేని పని
రాజధాని నిర్మాణానికి రూ.లక్ష కోట్లు అవుతుందో లేదో గానీ.. అమరావతి నుంచి తరలిస్తే మాత్రం రూ.5 లక్షల కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. పరిపాలన వికేంద్రీకరణ మతిలేని పని. అభివృద్ధి వికేంద్రీకరణ అందరికీ అంగీకారమే. న్యాయస్థానం మార్పుపై న్యాయవాదుల్ని అడిగారా?
- చలసాని అజయ్, న్యాయవాదుల ఐకాస నేత
విశాఖలో భూములు కొనేందుకే ఆగారా?
ప్రమాణస్వీకారం రోజే రాజధాని మారుస్తామని సీఎం జగన్ ఎందుకు చెప్పలేదు? విశాఖలో భూములు కొనడానికే ఈ 7 నెలలు ఆగారా? అమరావతి ప్రజలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తుంటే స్థానిక ప్రజాప్రతినిధులు ఏమయ్యారు? మంత్రి బొత్స ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. రాజధాని తరలించవచ్చని ప్రధాని మోదీ ఆయన చెవిలో చెప్పారా?
- మాలతివాణి, భారతీయ జనతా మహిళా మోర్చా జాతీయ కార్యదర్శి
వ్యక్తిగత ప్రయోజనాల కోసమే
ఉత్తరప్రదేశ్‌లో 72 జిల్లాలు ఉన్నా లఖ్‌నవూ ఒక్కటే రాజధాని. అలాంటిది 13 జిల్లాలు ఉన్న రాష్ట్రంలో మూడు రాజధానులు పెట్టడమనేది అవివేకం. వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల కోసమే మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు. రైతుల త్యాగాలను గుర్తించకపోగా వారిని పెయిడ్ ఆర్టిస్టులు అంటారా?
- గద్దె అనూరాధ, కృష్ణా జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్
ఇన్‌సైడర్ ట్రేడింగ్ కోసమే తరలింపు
ఇన్‌సైడర్ ట్రేడింగ్ కోసమే రాజధాని తరలిస్తున్నారా? అని భారతీయ కిసాన్ సంఘ్ నేతలు కుమారస్వామి, పి.శివాజీ ప్రశ్నించారు. 151 శాసనసభ స్థానాలు వచ్చాయని జగన్ కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తిస్తున్నారని తెదేపా నేత జేడీ రాజశేఖర్ అన్నారు. హైకోర్టును తరలించడానికి వీళ్లేమీ సుప్రీంకోర్టు కాదని శ్రామిక వికాస సంఘటన్ జాతీయ ఉపాధ్యక్షుడు యజ్ఞనారాయణ పేర్కొన్నారు.

No comments:
Post a Comment