బీజేపీకి తాను దూరంగా లేనని.. కలిసే ఉన్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్
ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. ప్రధాని మోదీ, అమిత్ షాతో భేటీ ?
ఢిల్లీ బయల్దేరిన జనసేనాని పవన్ కళ్యాణ్
Updated: Nov 15, 2019, 12:05 PM IST
కామెంట్ చేయండి |
ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. ప్రధాని మోదీ, అమిత్ షాతో భేటీ ?
File photo
విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ఢిల్లీలోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకే ఆయన వెళ్లినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ.. పవన్ మాత్రం అక్కడ కేంద్రంలోని పెద్దలను కలిసి ఏపీలోని పరిస్థితులను వివరించి, ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకే వెళ్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఏపీలో ఇసుక కొరత సమస్య, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం మాధ్యమంలో భోదన వంటి అంశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన పవన్ కల్యాణ్... అవసరమైతే ప్రజా సమస్యల పరిష్కారం కోసం వెళ్లి కేంద్రంలోని పెద్దలు ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలను కలుస్తానని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
పవన్ గతంలో చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటనలోనే కేంద్రంలోని పలువురు పెద్దలతో ఆయన భేటీ అయ్యే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. పవన్ వెంట పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉండటం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్లయింది.
పవన్ కళ్యాణ్ మోదీ
బీజేపీతో దోస్తీ... క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్
వైసీపీకి అమిత్ షా అంటే భయమన్న పవన్ కళ్యాణ్... తనకు మాత్రం షా అంటే గౌరవమని అన్నారు.
బీజేపీతో దోస్తీ... క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్తిరుపతి సమావేశంలో పవన్ కళ్యాణ్
NEWS18 TELUGU
LAST UPDATED: DECEMBER 4, 2019, 2:47 PM IST
SHARE THIS:
బీజేపీకి తాను దూరంగా లేనని.. కలిసే ఉన్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ వాళ్లు నాకు రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలన్నారు. తాను బీజేపీ, టీడీపీతో కలిసి మళ్లీ పోటీ చేసి ఉంటే వైసీపీ ఎక్కడ ఉండేదన్న పవన్ కళ్యాణ్... అదే జరిగి ఉంటే... వైసీపీ అధికారంలోకి వచ్చేదా ? అని ప్రశ్నించారు. ఎంతమందితో వైసీపీ వాళ్లు తన దగ్గరికి వచ్చారో గుర్తు లేదా అని వ్యాఖ్యానించారు. వైసీపీకి అమిత్ షా అంటే భయమన్న పవన్ కళ్యాణ్... తనకు మాత్రం షా అంటే గౌరవమని అన్నారు. అందుకే వైసీపీ వాళ్లకు విమర్శలు చేయడం తప్ప.. ఇంకేం తెలియదని పవన్ కళ్యాణ్ విమర్శించారు.
తానెప్పుడూ బీజేపీకి దూరంగా లేనని తెలిపారు. హోదా విషయంలో సిద్ధాంతపరంగా విబేధించినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. దక్షిణాదిలో దేశానికి రెండో రాజధాని ఉండాలని అంబేద్కర్ అన్నారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. గత ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించడంతోనే ప్రభుత్వం సమయం వృధా చేస్తోందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. మాజీ సీఎం ఇల్లు కూల్చివేతపై ఉన్న శ్రద్ధ సమస్యలపై లేదని ఆయన వ్యాఖ్యానించారు. కియా పరిశ్రమ సీఈవోను వైసీపీ నేతలు బెదిరించారని.. ఇక రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయని అన్నారు. తెలుగ సత్వర న్యాయం లభించింది. ఈ సందర్భంగా దిశ ఆత్మకు శాంతి కలగాలని,ఈ విషాదం నుంచి ఆమె తల్లిదండ్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
No comments:
Post a Comment