Saturday, December 7, 2019

‘చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీపీని వీడబోతున్నారు’

‘చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీపీని వీడబోతున్నారు’
07-12-2019 20:15:44

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ముఖ్యనేతలు, రాజ్యసభ ఎంపీలు ఇతర పార్టీల్లోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. ఎప్పుడు ఏ నేత  సొంత పార్టీకి గుడ్ బై చెప్పి.. ఏ పార్టీలోకి వెళ్తారో తెలియని పరిస్థితి.!  ఇవాళ టీడీపీకి చెందిన కీలక నేత బీద మస్తాన్ రావు ఆ పార్టీకి టాటా చెప్పేసి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. బీదమస్తాన్ రావు పార్టీలో చేరిక అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీపీని వీడబోతున్నారని మంత్రి ఉన్నట్టుండి బాంబ్ పేల్చారు!.

మేం ఓకే చెబితే చాలా మంది టీడీపీ నేతలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. నెల్లూరు జిల్లా నుంచి త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. అంతటితో ఆగని మంత్రి త్వరలో టీడీపీ భూస్థాపితం కానుందని జోస్యం చెప్పారు. అయితే అనిల్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇంతకీ పార్టీ మారబోతున్నదెవరు..? అనిల్‌కు నిజంగానే సమాచారం ఉందా..? ఎవరైనా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీకి టచ్‌లో ఉన్నారా..? అనే దానిపై మాత్రం మంత్రి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

No comments:

Post a Comment