ఎన్నార్సీకి టీడీపీ వ్యతిరేకం: చంద్రబాబు
31-12-2019 04:44:19
అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ప్రజల్లో అభద్రతా భావం కలిగించిన ఎన్‌పీఆర్, ఎన్సార్సీలకు టీడీపీ వ్యతిరేకమని చంద్రబాబు ప్రకటించారు. సోమవారం ఎన్టీఆర్ భవన్‌లో 13 జిల్లాల మైనారిటీ నేతలతో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ లౌకిక విలువలకు కట్టుబడి ఉన్న పార్టీ అన్నారు. కేంద్రం కొత్తగా తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముస్లింలకు తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ‘లోక్‌సభలో బిల్లుకు మద్దతు ఇవ్వాలని తమ పార్టీకి చెందిన 22 మంది ఎంపీలకు జగన్ విప్ జారీ చేయించారు. మద్దతుగా ఓటు వేయించారు. రాష్ట్రంలో ఆఘమేఘాల మీద గెజిట్‌తోపాటు జీవో కూడా జారీ చేసి ఇప్పుడు ఎన్నార్సీకి వ్యతిరేకమని ప్రకటనలు చేస్తూ మైనారిటీలను మోసం చేస్తున్నారు’ అన్నారు. మైనారిటీల పట్ల చిత్తశుద్ధి టీడీపీకే ఉందని మైనారిటీ నేత హిదాయత్ పేర్కొన్నారు.

No comments:
Post a Comment