Monday, December 30, 2019

14వ రోజు కొనసాగుతున్న రైతుల దీక్షలు


14వ రోజు కొనసాగుతున్న రైతుల దీక్షలు
అమరావతి: రాజధానిగా అమరాతినే కొనసాగించాలనే ప్రధాన డిమాండ్‌తో రైతులు చేపట్టిన నిరసన దీక్షలు మంగళవారానికి 14వ రోజుకు చేరాయి. రాజధాని అమరావతి గ్రామాల్లో రైతులు, మహిళలు, న్యాయవాదులు, విద్యార్థులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు నిరసన దీక్షలకు మద్దతు తెలిపారు. మూడు రాజధానుల ప్రతిపాదనను, జీఎన్‌రావు కమిటీ నివేదికను రద్దు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. రైతుల దీక్షలకు మద్దతు తెలియజేసేందుకు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అమరావతిలో పర్యటించనున్నారు.

మందడంలో మహాధర్నాకు అనుమతి నిరాకరణ
 మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రైతులు మందడంలో మహాధర్నా సిద్ధమయ్యారు. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి సచివాలయానికి వస్తున్న నేపథ్యంలో రైతుల దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

రోడ్డుపై ఎవరూ రాకపోకలు సాగించకుండ బారికేడ్లు ఏర్పాటు చేశారు. సచివాలయానికి వెళ్లె మార్గంలో తనిఖీలు చేసి గుర్తింపు కార్డులు ఉన్నవారినే పోలీసులు అనుమతిస్తున్నారు. సీఎం జగన్ కాన్వాయ్ వచ్చే మార్గంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. వెలగపూడిలో రైతుల రిలే నిరహార దీక్ష మంగళవారం ఉదయం ప్రారంభమైంది. రైతులు జాతీయ జెండాలతో వచ్చి దీక్షలో పాల్గొన్నారు.

జైలు నుంచి విడుదలైన రాజధాని రైతులు
జైలు నుంచి విడుదలైన రాజధాని రైతులు
గుంటూరు: రాజధాని ఆందోళనల్లో భాగంగా మీడియా ప్రతినిధులపై దాడి చేశారనే ఆరోపణలపై అరెస్టయిన ఆరుగురు రైతులు జైలు నుంచి విడుదలయ్యారు. ఆదివారం ఉదయం నాగరాజు, నరేశ్‌, సురేంద్ర, శ్రీనివాసరావు, నరసింహస్వామి, భుక్యా లోక్‌నాయక్‌లను పోలీసులు అరెస్ట్‌ చేసి తెనాలి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. ఈ ఉదయం ఆరుగురు రైతులు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం రూ.10వేల పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేసింది. తెదేపా నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, శ్రావణ్‌కుమార్‌, రామకృష్ణ తదితరులు జైలు నుంచి విడుదలైన రైతులకు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాజధాని కోసం పోరాడుతున్న తమను అన్యాయంగా అరెస్ట్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అండగా నిలిచిన ఐకాస నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. మీడియా ముసుగులో కొందరు తమను కించపరిచారని.. అందుకే ఇలాంటి ఘటన జరిగిందన్నారు. మీడియాకు తాము వ్యతిరేకం కాదన్నారు. అమరావతి కోసం పోరాటం ఆగదని.. ప్రాణాలు అర్పించైనా రాజధానిని సాధిస్తామని స్పష్టం చేశారు.

రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదు
Dec 31, 2019, 03:26 IST
Central Govt does not interfere on capital says GVL Narasimha Rao - Sakshi
బీజేపీ అధికార ప్రతినిధిగా అధికారికంగా చెబుతున్నా

రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ స్పష్టీకరణ

ఇతరులేం మాట్లాడినా అది వారి వ్యక్తిగతమే

కేంద్రం జోక్యం చేసుకోవాలంటే కూడా నిబంధనలు అంగీకరించవు

అమరావతిలోనే రాజధాని పెట్టండని నాడు కేంద్రం చెప్పలేదు.. నేడు తరలించొద్దనీ చెప్పదు

రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు. నేను ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి.. కేంద్ర ప్రభుత్వ ఆలోచన మేరకే చెబుతున్నా. జాతీయ అధికార ప్రతినిధిగా ఐదేళ్లలో నేను చెప్పిందేదీ మా పార్టీ కాదనలేదు.   – జీవీఎల్‌ నరసింహారావు


సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉండదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు స్పష్టం చేశారు. ఇది పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా అధికారికంగా చెప్పే మాట అని పేర్కొన్నారు. ఇతర ఎంపీలు, నేతల ప్రకటనలు వారి వ్యక్తిగతం అని స్పష్టీకరించారు. దక్షిణాదిలో ఉండే ఐదు రాష్ట్రాలలో తానొక్కడినే పార్టీ అధికార ప్రతినిధినని, తాను చెప్పే విషయాలే అధికారికం అని అన్నారు. విజయవాడలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఇది (రాజధాని తరలింపు అంశం) కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదు. కేంద్రం జోక్యం చేసుకొని ఏదో చేయాలనే ఆలోచన ఉంటే.. అది మన వ్యవస్థకు లోబడి చేయడానికి విరుద్ధమైనది.  దీనికే కట్టుబడి ఉన్నాం. 

నేను  అధికారికంగా ఈ విషయం చెబుతున్నా. మీరు బాండ్‌ రాసివ్వమంటే ఆ అవసరం మాకు లేదు’ అని జీవీఎల్‌ అన్నారు. తమ పార్టీలో పార్లమెంట్‌లో సభ్యులు కాని వారు చాలా మంది ఈ విషయంలో ఏం మాట్లాడినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమేనన్నారు. రాజధాని తరలింపు గురించి రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం దృష్టికి తీసుకొస్తే అప్పుడు ఏదైనా సూచన చేయొచ్చేమో గానీ, కేంద్రం తనంతట తాను జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు. 

రాజధాని అమరావతిలోనే పెట్టండని నాడు కేంద్రం చెప్పిందా?
పార్టీలో నేతలు ఒకే మాటపై లేరన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. టీడీపీలోనూ ఈ అంశంపై ఒక మాట మీద లేరు కదా అని ఆయన ప్రశ్నించారు. గంటా శ్రీనివాసరావు మరో రకంగా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. అన్నదమ్ములు (చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లు) ఒక మాట మీద లేరన్నారు. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఒక స్పష్టమైన ప్రతిపాదనను వెల్లడించలేదని చెప్పారు. ‘వ్యవస్థలో తనకున్న అధికారాలకు లోబడే కేంద్రం పని చేస్తుంది. రాజధాని అమరావతిలోనే పెట్టండని అప్పుడు కేంద్రం చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి మార్చండని, మార్చ వద్దని చెప్పదు.

ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఎక్కడా చెప్పలేదు. రాజధాని తరలింపు జరిగితే రైతులకు న్యాయం జరగాలని ఒక పార్టీ నేతగా, వ్యక్తిగా చెబుతున్నానన్నారు. రైతులకు న్యాయం చేసే అంశం, రాజధాని తరలించకుండా కేంద్రం జోక్యం చేసుకునే అంశం.. రెండూ వేర్వేరు అని చెప్పారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, ఎన్‌పీఆర్‌ ప్రక్రియలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.   

No comments:

Post a Comment