వంశీ బాటలో మద్దాలి !
జగన్‌ను కలిసిన తెదేపా ఎమ్మెల్యే
పార్టీ అంగీకరించకపోతే ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని అడుగుతా: గిరి
ప్రజల దృష్టి మరల్చడానికే ఫిరాయింపులకు సీఎం ప్రోత్సాహం: తెదేపా
వంశీ బాటలో మద్దాలి !
ఈనాడు, అమరావతి: తెదేపాకు చెందిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధరరావు... గన్నవరం ఎమ్మెల్యే వంశీ బాటనే పట్టనున్నారా? సోమవారం ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన తర్వాత మద్దాలి చేసిన వ్యాఖ్యలు చూస్తే అలానే అనిపిస్తుంది. ‘‘ఏ పార్టీలోనో చేరాలని కాదు, నా నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాలనే సీఎంను కలిసేందుకు వచ్చా. వాళ్లు, పార్టీ (తెదేపాను ఉద్దేశించి) అంగీకరించకపోతే నేను కూడా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలాగే అసెంబ్లీలో ప్రత్యేక సభ్యుడిగా గుర్తించమని స్పీకర్‌ను అడుగుతా’’ అని మద్దాలి చెప్పారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో ఆయన భేటీ అయ్యారు. తర్వాత అక్కడే విలేకరులతో మాట్లాడారు. గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో పనుల గురించి అడిగితే, వెంటనే రూ.25 కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారని మద్దాలి తెలిపారు. రాజధానిపై ఆయన స్పందిస్తూ ‘‘నేను రాజధానిపై మాట్లాడేంత పెద్దవాడిని కాదు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. నేను తెదేపా, చంద్రబాబుపై విమర్శలు చేయడం లేదు. ఆత్మ పరిశీలన చేసుకోవాలని మాత్రమే అంటున్నా. రాజధానిపై జనవరిలో కమిటీ నివేదిక వచ్చాక నాకు విషయం చెబుతానని ముఖ్యమంత్రి తెలిపారు. రైతులు అపోహపడనవసరం లేదు. రైతులందరితో మాట్లాడాకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నా. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం విషయంలో చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ప్రదర్శించారు. ఇదంతా ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా.’ అని మద్దాలి వ్యాఖ్యానించారు.
ప్రజల దృష్టి మరల్చడానికే: తెదేపా
ఈనాడు డిజిటల్, అమరావతి: ముఖ్యమంత్రి జగన్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఇసుక కొరతపై తెదేపా ఆందోళన చేసినప్పుడు ఎమ్మెల్యే వంశీని ప్రలోభపెట్టారని, రాజధాని ఆందోళనల నేపథ్యంలో ఇప్పుడు మద్దాలి గిరిని లొంగదీసుకున్నారని విమర్శించారు. సోమవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు.‘‘బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ)ను ఎప్పుడు నియమించారు? ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి బీసీజీ సంస్థ డైరెక్టర్ భట్టాచార్యతో ఉన్న స్నేహమే ఆ సంస్థకు బాధ్యతలు అప్పగించడానికి కారణమా?’’ అని ధ్వజమెత్తారు.

No comments:
Post a Comment