Sunday, December 29, 2019

దైర్యముంటే రాజధాని మొత్తం విశాఖ తరలించాలి - BV Raghavulu

దైర్యముంటే రాజధాని మొత్తం విశాఖ తరలించాలి 
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు సవాల్‌

దైర్యముంటే రాజధాని మొత్తం విశాఖ తరలించాలి



విశాఖ: పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా దక్షిణాఫ్రికా తరహాలో మూడు రాజధానులు అనడం సరికాదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. విశాఖను పరిపాలన రాజధానిగా మార్చేస్తే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి జరుగుతుందనే వాదనను ఆయన తోసిపుచ్చారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాఘవులు మాట్లాడారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే పూర్తిస్థాయి రాజధానిని విశాఖ తరలించాలని సవాల్‌ విసిరారు. రాజధానిగా అమరావతి ఉండాలనే విషయంపై అన్ని రాజకీయపక్షాలు ఒకే మాటపై ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో ప్రాంతాల మధ్య వైషమ్యాలు తీసుకురావడం సరికాదన్నారు. జనాభా లెక్కల గురించి తెలియని వాళ్లు అమరావతి విషయంలో సామాజిక వర్గాల ప్రస్తావన తీసుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ విశాఖ పర్యటనలో ఈ ప్రాంతం గురించి ఏదైనా ప్రకటన చేస్తారని ఆశించామని.. కానీ అలా జరగలేదన్నారు.

No comments:

Post a Comment