‘రాజధానులపై ముందుగానే కేంద్రంతో మాట్లాడారు’
05-02-2020 17:56:00
విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై సీపీఐ జాతీయ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ముందుగానే కేంద్రంతో మాట్లాడి మూడు రాజధానులు పెడుతున్నారని ఆరోపించారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన నారాయణ.. రాజధానుల విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందన్నారు. చంద్రబాబుపై కోపంతో సీఎం జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖ జిల్లాలో ఎసైన్డ్ భూములను లాక్కుంటున్నారని అన్నారు. విశాఖ భూముల కుంభకోణంలో వైసీపీ, టీడీపీ నేతలు ఉన్నారని ఆరోపించారు. రెండు వేల ఎకరాల భూమి ల్యాండ్ మాఫియా చేతుల్లో ఉందని, దానికి సంబంధించిన వివరాలు ఇస్తామని, జగన్ ఆ భూములను తీసుకుంటారా? అని నారాయణ సవాల్ విసిరారు. అమరావతి భూములను సెజ్‌లకు అప్పగించి లక్ష కోట్ల దోపిడీకి కుట్ర చేశారని ఆరోపించారు. జగన్ తెలివితేటలను ద్వంసం కోసం వినియోగిస్తున్నారని, ఆయన పిచ్చి తుగ్లక్‌ను మించిపోయారంటూ ఘాటైన వ్యాఖ్యలతో నారాయణ విరుచుకుపడ్డారు. మూడు రాజధానుల నినాదంతో ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని నారాయణ డిమాండ్ చేశారు.

No comments:
Post a Comment