ఇంత ఘోరమా!
5/25/2019 4:06:07 PM
ప్రజలను అంతగా కష్టపెట్టామా?
చంద్రబాబు ఆవేదన
టీడీపీలో తీవ్ర అంతర్మథనం
ఓటమికి కారణాలపై విశ్లేషణ
జనసేన పోటీ దెబ్బతీసింది
ఆర్థిక వనరుల కొరతతో నష్టం
స్థానిక నేతలపై వ్యతిరేకత
(అమరావతి - ఆంధ్రజ్యోతి): ‘గెలుపు తథ్యం అనుకున్నాం. ఓడిపోయినా... మెజారిటీ మార్కుకు పది పదిహేను సీట్ల వెనుక ఆగిపోవచ్చని భావించాం. కానీ... ఇంత ఘోరమైన పరాజయమా!’ అంటూ టీడీపీ ముఖ్య నేతలు వాపోతున్నారు. శుక్రవారం పలువురు విజేతలు, పరాజితులు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలిసి తమ ఆవేదన పంచుకున్నారు. ఓటమి కంటే, ఓడిన తీరుపై చంద్రబాబు కూడా విస్మయం, బాధ వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘‘మనకు పాతికసీట్లే వచ్చాయి. విపక్షం 151 స్థానాలు తెచ్చుకుంది. మనం నిజంగా... అంత ఘోరమైన తప్పిదాలు చేశామా? ప్రజలను కష్టపెట్టామా?’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చిన రాజప్ప, గద్దె రామ్మోహన్, మద్దాలి గిరి, మాజీలు పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా మహేశ్వరరావు, తెనాలి శ్రావణ్ కుమార్, జీవీ ఆంజనేయులు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తదితరులు చంద్రబాబును కలిశారు. ‘ఐదేళ్లపాటు మీరు ఎంత చాకిరీ చేశారో తలుచుకొంటే బాధ కలుగుతోంది’ అని కొందరు నేతలు అన్నారు. మనం పడిన కష్టం ప్రజలకు తెలుసునని... ఈ ఫలితాపై అధ్యయనం చేయాలని, ఏవి ఎలాంటి ప్రభావం చూపాయో తెలుసుకోవాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.
ఎక్కడ తప్పు జరిగింది!
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంపై టీడీపీ నేతల్లో అంతర్మథనం జరుగుతోంది. ఎక్కడ దెబ్బ తిన్నాం... ఎందుకిలా జరిగిందన్నదానిపై విశ్లేషణలు జరుపుతున్నారు. పోయిన ఎన్నికల్లో పార్టీకి అత్యధికంగా సీట్లు ఇచ్చిన కోస్తా ప్రాంతానికి సంబంధించి రెండు అంశాలు బాగా ప్రభావం చూపాయని వారిలో కొందరు చెబుతున్నారు. ‘‘జనసేన విడిగా పోటీచేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని అనుకొన్నాం. కానీ, అది జరగలేదు. టీడీపీకి పవన్ సన్నిహితుడనే ప్రచారం జరగడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్‌కే వెళ్లిపోయింది. టీడీపీకి రావాల్సిన ఓట్లు భారీగా జనసేనకు పడ్డాయి. ఉదాహరణకు విశాఖ ఎంపీ సీటు టీడీపీ ఖాయంగా గెలుచుకోవాల్సి ఉంది. జనసేన పోటీతో చాలా స్వల్ప తేడాతో పోగొట్టుకోవాల్సి వచ్చింది. కనీసం పాతిక ముప్ఫై అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటువంటి నష్టం జరిగింది’’ అని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆర్థిక వనరుల రీత్యా కూడా ఈసారి టీడీపీ కొంత దెబ్బ తిందని మరి కొందరు నేతలు చెబుతున్నారు. ‘‘పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్నడూ లేని గడ్డుపరిస్థితి ఈసారి ఎదురైంది. మాకు ఎన్నికల విరాళాలు రాకుండా బీజేపీ సహకారంతో వైసీపీ అడ్డుకోగలిగింది. మోదీ, కేసీఆర్ దన్నుతో వైసీపీ భారీగా ఖర్చు చేసింది. 25- 30 సీట్లలో వైసీపీతో మేం ఆర్థిక వనరుల విషయంలో పోటీ పడలేకపోయాం. ఇది కూడా ఫలితం ప్రభావం చూపింది’’ అని ఒక నాయకుడు విశ్లేషించారు.
‘స్థానిక’ వ్యతిరేకతతో పెద్దదెబ్బ
టీడీపీ ఘోర పరాజయానికి కొన్నిచోట్ల స్థానిక అంశా లు కారణమయ్యాయని పార్టీ వర్గాల కథనం. ‘‘జన్మభూమి కమిటీల పేరుతో కొందరు చేసిన పెత్తనం పార్టీని ప్రజలకు దూరం చేసింది. పథకాలు, రుణాలు, ఇతరత్రా సా యం అందడానికి వీరు కమీషన్లు తీసుకోవడంతో ఆ చెడ్డ పేరే మిగిలిపోయింది. ఆదాయ సముపార్జనకు కొందరు ఎమ్మెల్యేలు, వారి అనుచరుల పనులు, వ్యవహరించిన తీ రు కూడా విమర్శలపాలైంది. ప్రభుత్వంపై సదభిప్రాయం ఉన్నా... కొందరిపై వ్యతిరేకత ప్రబలడం నష్టం చేసింది. అధికారంలో ఉన్నప్పుడు సమస్యలు ఉంటూనే ఉంటాయి. కానీ, టీడీపీలో కొంత అదుపు ఉంటుందని ప్రజలు అనుకొనేవారు. ఈసారి ఆ అదుపు తప్పింది. ఆ ప్రభావం ఎన్నికల్లో చూపింది’’ అని ఒక సీనియర్ నేత చెప్పారు.

No comments:
Post a Comment