హడలెత్తిస్తున్న ఫణి
01-05-2019 15:57:55
హైదరాబాద్: ఫణి తుఫాన్ శరవేగంగా దూసుకువస్తోంది. విశాఖ, ఉత్తరాంధ్రను వణికించిన హుద్‌హుద్ వేగంతో ఫణి హడలెత్తిస్తోంది. పెను తుఫాన్‌గా ఫణి రూపాంతరం చెందింది. చైన్నైకి నైరుతి దిశలో కేంద్రీకృతమైన ఫణి ఉత్తరాంధ్ర మీదుగా ఒడిశా, పశ్చిమబెంగాల్ వైపు దూసుకెళ్లనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒడిశాలోని పూరికి దక్షిణ దిశగా 680 కిలో మీటర్ల దూరంలో విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. శుక్రవారం మధ్యాహ్న సమయంలో గంటకు 175 నుంచి 200 కిలోమీటర్ల వేగంగా ప్రచండ గాలులు, అతి భారీ వర్షాలతో ఫణి విరుచుకుపడుతోంది. ఫణి తుఫాను ప్రభావంతో ఈదురు గాలుల ఉధృతి పెరిగింది. గురు, శుక్ర వారాల్లో ఫణి విరుచుకుపడనుందని వాతావరణ అధికారులు తెలిపారు.
ఫణి పెను తుఫానుగా మారింది. తన పడగనీడను అంతకంతకూ విస్తరిస్తూ, ప్రచండంగా దూసుకొస్తోంది. ఉత్తరాంధ్ర వైపుగా వడివడిగా కదులుతూ, ‘తితలీ’ భీతావహ దృశ్యాలను తలపిస్తోంది. ఈ భయాలను కొట్టివేయలేమంటూ ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు మంగళవారం సాయంత్రం భారత వాతావరణ శాఖ.. తుఫాను దిశకు సూచనగా ఎల్లో మెసేజ్‌ను జారీ చేసింది.

No comments:
Post a Comment