స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాలపాటు వాయిదా
16 Mar 2020, Sunday @ 04:56AM
ఈనాడు, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాలపాటు వాయిదా వేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. తక్షణమే నిలిపివేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
Mar 16 2020 @ 04:56AM
కలెక్టర్ హరికిరణ్
కడప (కలెక్టరేట్), మార్చి 15: కరోనా వైరస్ ప్రభావం వల్ల ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ హరికిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికలు తక్షణమే నిలిపివేయాలని జడ్పీ, మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎ న్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు, ఇతర అధికా రులకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.
ఎస్‌ఈసీ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియ రద్దు కాదని, ఏకగ్రీవంగా ఎన్నికైనవారు కొనసాగుతారని, ఆరు వారాల తరువాత సమీక్ష అనంతరం వాయిదా పడిన ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని ఈసీ తెలిపారన్నారు. అన్ని మున్సిపాల్టీలు, కడప కార్పొరేషన్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు దాఖలైన నామినేషన్లను, బ్యాలెట్ పేపర్లు, ట్రెజరీలో జమ చేస్తామని తెలిపారు. అంతేకాక సోమవారం జరగాల్సిన ఎన్నికల శిక్షణ కార్యక్రమాలను వాయిదా వేశామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున స్పందన కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు.

No comments:
Post a Comment