Thursday, March 5, 2020

రాష్ట్ర రాజధానిని మార్చడం కుదరదు

రాష్ట్ర రాజధానిని మార్చడం కుదరదు
నిర్ణయాధికారం ఉందని రాజధానిని మార్చేస్తారా?

అమరావతి రైతులకు అన్యాయం జరగనివ్వం

రాజధానికి భూములివ్వడమే వారి తప్పా?.. రాజ్యాంగం, కోర్టులే కాపాడతాయి

జగన్‌ సర్కారుకు వైరస్‌ సోకింది: సుజనా... అమరావతిపై 2పుస్తకాల ఆవిష్కరణ

న్యూఢిల్లీ, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్ర రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే. అలాగని ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మార్చడం కుదరదంటే కుదరదు’ అని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి స్పష్టం చేశారు. రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదేనని కేంద్రం చెప్పిందంటే దానర్థం ఇప్పటికే స్థాపించిన అమరావతిని మార్చుకోవచ్చని కాదన్నారు.



అమరావతి కోసం రైతులు చేస్తున్న న్యాయపోరాటంపై సూర్యనారాయణ మాస్టారు ‘‘అమరావతి ఆక్రందన‘ శీర్షికతో రచించిన తెలుగు పుస్తకాన్ని, ‘స్టాప్‌ ది అన్‌డూయింగ్‌ ఆఫ్‌ అమరావతి‘ అనే శీర్షికతో రచించిన పుస్తకాన్ని సుజనా తన అధికార నివాసంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ‘ప్రజలు అత్యధిక మెజారిటీతో అధికారమిచ్చారని రాజధానిని తమ రాజకీయ స్వార్థం కోసం మార్చేస్తారా? అలాగైతే బ్రిటి్‌షవారిపై పోరాడి సాధించుకున్న భారతదేశాన్ని.. ఇప్పుడు తమకు అత్యధిక మెజారిటీ ఉందని కేంద్రం బ్రిటి్‌షవారికి మళ్లీ అప్పగించేస్తుందా’ అని ప్రశ్నించారు.



జగన్‌ ప్రభుత్వానికి వైరస్‌ సోకిందని.. అందుకే అక్కడ వింతపాలన సాగుతోందని ఎద్దేవాచేశారు. ‘అభివృద్ధిని పూర్తిగా పక్కనపెట్టి కక్ష సాధింపులతోనే గడుపుతోంది. 9నెలల్లో తట్ట మట్టి తీయలేదు. ఒక్క ఇటుక పెట్టలేదు. ఒక్క పరిశ్రమా రాలేదు. సమీక్షతో పెట్టుబడిదారులంతా వెయ్యి కిలోమీటర్ల వేగంతో పరుగు పెడుతున్నారు. ఏపీ అంటేనే పెట్టుబడులు రావడంలేదు’ అని నిప్పులు చెరిగారు.



భూముల దుర్వినియోగం..

‘రైతులు అమరావతి కోసం ఇచ్చిన భూములను దుర్వినియోగం చేసే హక్కు ప్రభుత్వానికి లేదని సుజనా స్పష్టంచేశారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం జరగదని సుజనా బదులిచ్చారు. ‘రాజ్యాంగం ఉంది. కోర్టులు ఉన్నాయి. వారికి కచ్చితంగా న్యాయమే జరుగుతుంది. కేంద్రం తగిన సమయంలో తగిన విధంగా స్పందిస్తుంది’ అని చెప్పారు.



ఎల్లయ్యో పుల్లయ్యో చెబితే స్పందించం

అమరావతికి బీజేపీ కట్టుబడి ఉన్నదని ఆ పార్టీ రాష్ట్రశాఖ తీర్మానించిందని, మరోపక్క బీజేపీ జాతీయ స్థాయి నేతలు కొందరు అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారని.. బీజేపీ, కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిపట్ల రైతుల్లో అనుమానాలు చెలరేగుతున్నాయని ప్రస్తావించగా.. కొందరు నేతల వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దనవసరంలేద ని సుజనా అన్నారు. ఏ ఎల్లయ్యో, పుల్లయ్యో చెప్పేవాటికి స్పందించనక్కర్లేదని చెప్పారు. అమరావతి విషయంలో బీజేపీ తొలి నుంచీ ఒకే వైఖరితో ఉందని.. కచ్చితంగా కాపాడుకుని తీరతామని స్పష్టం చేశారు.



ప్రాంతాల మధ్య చిచ్చు..

వైసీపీని 151 సీట్ల అత్యధిక మెజారిటీతో ప్రజలు గెలిపిస్తే.. రాష్ర్ట్ర ప్రయోజనాలు, ప్రజల బాగోగులు, అభివృద్ధిని పక్కనపెట్టి మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు రేపడం ఎంతవరకు సమంజసమని సుజనా ప్రశ్నించారు. ‘అమరావతి రాజధానిని కొనసాగించాలంటూ ప్రజాస్వామ్య బద్ధంగా ఆందోళన చేస్తున్న మహిళలను సైతం బూటుకాళ్లతో పోలీసులు తన్ని, దాడులు చేస్తున్నారు. భయభ్రాంతులను చేస్తున్నారు. రాజధాని కోసం రైతులు వేల ఎకరాల భూమిని ఇవ్వడమే తప్పా? 3నెలల్లో 52 మంది రైతులు చనిపోయినా సీఎం పట్టించుకోరా? వెనుకబడిన, కరవుపీడిత ప్రాంతంగా ఉన్న రాయలసీమ, వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధిపై దృష్టిపెట్టకుండా పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో రాజకీయ కక్ష సాధించే దిశగా పాలిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.

‘వారి సూచన మేరకే అమరావతిపై నా ప్రకటన’
Mar 05, 2020, 21:06 IST
GVL Narsimha Rao Clearly Says Capital Is State Issue - Sakshi
సాక్షి, న్యూఢిల్లీ : రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోదేనని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. కేంద్ర నాయకత్వం సూచన మేరకే అమరావతిపై తను ప్రకటన చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తివేంద్ర సింగ్‌ రావత్‌ సైతం వేసవి రాజధాని ప్రకటించారని గుర్తుచేశారు. గురువారం ఢిల్లీలో జీవీఎల్‌ మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్‌ సీఎం ప్రకటనతో రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోదేనని మరోసారి తేలిపోయిందన్నారు. సీఆర్‌డీఏ చట్టం ద్వారా రైతుల భూముల సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను మభ్యపెట్టవద్దని హితవు పలికారు. తమ రాష్ట్ర పార్టీ కోరిన అన్ని పనులను కేంద్ర ప్రభుత్వం చేయదని చెప్పారు.


పీపీఏల రద్దు అంశంలో కూడా కేంద్రం నేరుగా జోక్యం చేసుకోలేదని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ఒప్పందాలు చేసుకునే వ్యవస్థ ఉండాలని మాత్రమే గోయల్‌ సూచించారని తెలిపారు. ఒక చానల్‌ తనపై తప్పుడు వార్తలు నడుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు  మళ్లీ కట్టుకథలు అల్లితే సమాచార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అమరావతిపై జాతీయ నాయకత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తను మాట్లాడుతున్నట్టు చెప్పారు.

No comments:

Post a Comment