ఏపీలో ఎన్నికల వాయిదా: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Mar 18, 2020, 15:45 IST
Supreme Court Orders TO SEC Over Postponement Of Andhra Pradesh Local Body Polls - Sakshi
ఎన్నికల కోడ్‌ను వెంటనే ఎత్తివేయండి
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగనివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. తదుపరి స్థానిక ఎన్నికల తేదీలు ఖరారు చేసేటప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్నికలను వాయిదా వేస్తూ నోటిఫికేషన్ జారీ చేసినందున.. ఎన్నికల నిర్వహణపై ఇప్పుడు జోక్యం చేసుకోలేమని.. అయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తక్షణమే ఎత్తివేయాలని ఆదేశించింది. అదే విధంగా ఇదివరకే ప్రారంభించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎన్నికల సంఘం అడ్డుకోరాదని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో సీజేఐ జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ నిర్ణయంలో రాజకీయ కోణాలు ఉన్నాయంటూ ప్రభుత్వ తరఫున అడిషనల్ సొలిటర్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.(‘సుప్రీంకోర్టు ఆదేశాలు టీడీపీకి చెంపపెట్టు’)
అదే విధంగా.. ఒకవైపున ఎన్నికల ప్రక్రియను నిరంతరాయంగా వాయిదా వేస్తూ.. మరోవైపు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కొనసాగిస్తారంటూ తన వాదనలు వినిపించారు. ‘‘ఒకే సమయంలో ఈ రెండూ ఎలా చేయగలుగుతారు?.. ప్రభుత్వం, పాలన స్తంభించపోవాలా?... ఇందులో రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను, తీసుకుంటున్న చర్యలను ఎన్నికల కమిషనర్ తెలుసుకోలేదు.. రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించి కొనసాగిస్తోంది.. వీటిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజకీయ దురుద్దేశంతో అడ్డుకుంటున్నారు.. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేస్తే.. అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కెవియట్ పిటిషన్ దాఖలు చేశారు... ఎన్నికల కమిషనర్ ఒక పొలిటికల్ లైన్ ప్రకారం వెళ్లారని అర్థమవుతోంది.. ఎన్నికలను వాయిదా వేయడానికి అనుసరించాల్సిన పద్ధతిలో వెళ్లలేదు.. ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమైన సమయంలో ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల కమిషనర్ నిర్ణయం తీసుకోవడం సరికాదు’’ అని పేర్కొన్నారు. (ఉనికి కోల్పోతామనే చంద్రబాబు కుట్రలు..)
ఈ క్రమంలో ... తమ నిర్ణయంలో ఎలాంటి రాజకీయం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇందుకు స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే.. తప్పకుండా రాజకీయాలు ఉండకూడదు.. కానీ పరిస్థితి ఇంతవరకు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక.. కోడ్ ఉంటుందని, ప్రవర్తనా నియమావళి ప్రకారం నడుచుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది మరోసారి వాదనలు వినిపించారు. దీంతో... ‘‘ఒకవైపు ఎన్నికలను వాయిదా వేస్తామంటున్నారు.. ఇంకోవైపున ఎన్నికల ప్రవర్తనా నియమావళి కొనసాగిస్తామంటున్నారు. రెండు విధాలుగా ఎలా చేస్తారు’’ అంటూ జస్టిస్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్తంభించిపోవాలని కోరుకుంటున్నారా’’ అని ప్రశ్నించారు. (ఏ నివేదికల ఆధారంగా ఎన్నికలు నిలిపివేశారు! )
ఏ నివేదికల ఆధారంగా ఎన్నికలు నిలిపివేశారు!
Mar 17, 2020, 05:46 IST
Center Govt on State Election Commissioner decision over Local Body Elections - Sakshi
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయంపై కేంద్రం ఆరా
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను అర్ధాంతరంగా నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం కావడంతో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ‘అసలు ఏమి జరిగింది’ అని ఆరా తీయడం మొదలు పెట్టింది. సోమవారం పలువర్గాల నుంచి వివరాల సేకరణ మొదలుపెట్టింది. ఏ నివేదికల ఆధారంగా ఎన్నికల కమిషనర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలుసుకోవడంపై కేంద్ర ఇంటలిజెన్స్ అధికారులు దృష్టిపెట్టారని తెలిసింది. ఎన్నికల నిలిపివేత వంటి కీలక నిర్ణయానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌పై ఎన్నికల కమిషనర్ విలేకరుల సమావేశంలో సంతకం చేశారని తెలిసి ఆశ్చర్యపోయారని సమాచారం.
ఎన్నికలను నిలిపివేస్తున్నట్టు నిర్ణయం తీసుకొని, గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశాక విలేకరుల సమావేశంలో వివరాలను ప్రకటించారా.. లేక ముందు విలేకరుల సమావేశంలో ప్రకటించి, ఆ తర్వాత గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారా అన్న సమాచారం తెలుసుకున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయంపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్‌తో భేటీ కావడం, ఆ తర్వాత పరిణామాలపై కేంద్ర ఇంటలిజెన్స్ అధికారులు ఆరా తీశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సోమవారం ఉదయమే గవర్నర్‌తో భేటీ అంశాలనూ పరిశీలనకు తీసుకున్నట్టు తెలిసింది.
రాజకీయ కోణం బట్టబయలైంది: అంబటి
Mar 18, 2020, 18:24 IST
Ambati Rambabu Slams On Chandrababu Over State Election Commission - Sakshi
సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయడంలో ఎలక్షన్ కమిషన్ తన పరిధిని దాటి వ్యవహరించిందని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పు చెప్పిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా సాకుతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారని, దీంతో ఈసీ నిర్ణయంపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందన్నారు. ఎన్నికల వాయిదా రాజకీయ కోణంలో జరిగినట్లు బట్టబయలయిందన్నారు. ఎన్నికలు వాయిదా వేస్తూ ఎన్నికల కోడ్ ఎలా కొనసాగిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇది అతిక్రమణ, తప్పు అని ఈసీకి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ ఎత్తి వేయాలని, సంక్షేమ పథకాల కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం మంచి పరిణామమని అంబటి రాంబాబు అన్నారు. (అందుకే టీడీపీని వీడాను: శమంతకమణి)
ఎన్నికలు నిర్వహించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని, సుప్రీంకోర్టు స్పష్టంగా తన తీర్పులో చెప్పిందని అంబటి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతోనే చారిత్రాత్మక తీర్పు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కుట్ర పూరితంగా ఎన్నికల కమిషన్ వ్యవహరించిందని అంబటి మండిపడ్డారు. ప్రభుత్వాన్ని కొన్ని రోజుల పాటు స్తంభింప చేయాలనే కుట్ర చేశారని ఆయన ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు ప్రశ్నలపై ఈసీ సమాధానం చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు. సాధ్యమైనంత తొందరగా ఎన్నికల నిర్వహణకు ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా ఆలోచన చేయాలని ఆయన సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వెనక చంద్రబాబు ఉన్నారని అంబటి మండిపడ్డారు.(‘సుప్రీంకోర్టు ఆదేశాలు టీడీపీకి చెంపపెట్టు’)
కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ముగ్గురు సభ్యులు ఉంటారని, అదేవిధంగా ఎస్‌ఈసీలో కూడా ముగ్గురు సభ్యులు ఉండేలా సంస్కరణలు తేవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు మొదటి నుంచి పెట్టాలని అడుగుతున్న చంద్రబాబు, అసెంబ్లీ ఎన్నికలు కూడా పెట్టమని అడుగుతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గొంతెమ్మ కోరికలు ఎన్నైనా కోరుతారని, బాబు అడిగేవన్ని జరగవని అంబటి అన్నారు. చట్టం, నిబంధనల ప్రకారం ఎన్నికలు జరుగుతాయని అంబటి రాంబాబు తెలిపారు.

No comments:
Post a Comment