ఏపీలో రక్షణ లేదని ఎస్ఈసీ రమేశ్ కుమార్ లేఖ..?
అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. తనకు రక్షణ కల్పించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లుగా ఒక లేఖ వెలువడింది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రక్షణ కల్పించాలని ఆయన కోరినట్లు అందులో ఉంది. కటుంబ సభ్యులతో పాటు తనపైనా దాడి జరిగే అవకాశం ఉందని రమేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆ లేఖలో ఉంది. తనకు, తన కుటుంబానికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తాను హైదరాబాద్‌లో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరినట్లు, ఆయన సంతకంతో విడుదలైన లేఖలో ఉంది. ఎన్నికల్లో గెలిచినప్పటికీ మద్యం, డబ్బు, దొరికితే మూడేళ్ల జైలు, అనర్హత వేటు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం క్రూరమైన ఆర్డినెన్స్ తెచ్చిందని రమేశ్ కుమార్ పేర్కొన్నట్లు లేఖ సారాంశం. కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లు విధులు నిర్వహించలేకపోయారని, తన భద్రతతో పాటు ఎన్నికల నిర్వహణకు కూడా కేంద్ర బలగాలు అవసరమని ఆయన కోరినట్లు ఐదు పేజీల ఈ లేఖలో ఉంది.
ఏపీలో ఎన్నికల కోడ్ ఎత్తివేత
అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ను నిలిపివేస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పుతో కోడ్‌ను ఎత్తివేశారు. కరోనా ప్రభావంతో రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాల పాటు నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ప్రకటించారు. అప్పటివరకూ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.
అయితే ఎన్నికల కమిషనర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పుబట్టింది. ఎన్నికలు నిలిపివేస్తే 14వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోతాయని ఆందోళ వ్యక్తం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. ఏపీ ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. అయితే ఎన్నికల కోడ్‌ను ఎత్తివేయాలని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఎన్నికల కోడ్‌ను ఎత్తివేసింది.

No comments:
Post a Comment