Thursday, March 12, 2020

నత్వానీకి వైసీపీ రాజ్యసభ సీటుపై చంద్రబాబు ఫైర్

నత్వానీకి వైసీపీ రాజ్యసభ సీటుపై చంద్రబాబు ఫైర్

అమరావతి: పరిమళ్ నత్వానీకి వైసీపీ తరపున రాజ్యసభ సీటు ఇవ్వడంపై తెలుగుదేశం పార్టీ అధనేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మృతి వెనుక కుట్ర ఉందని జగన్ అన్నారని గుర్తు చేసిన ఆయన రిలయన్స్ పాత్ర ఉందంటూ ఆ సంస్థ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు చేసిన దాడుల్ని గుర్తు చేశారు. ఈరోజేమో నత్వానీకి పార్టీ టికెట్లు ఇచ్చి చట్టసభల్లోకి పంపుతున్నారని, పార్టీ టికెట్లు అలా ఎలా ఇస్తారని నిలదీవారు. నిజంగానే వైయస్ మరణం వెనుక రిలయన్స్ పాత్ర లేకపోతే నాడు చేసిన వ్యాఖ్యలకు జగన్ క్షమాపన చెప్పాలని చంద్రబాబు అన్నారు.

దీనికి ముందు తనకు రాజ్యసభ టికెట్ ఇవ్వడం పట్ల ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు పరిమళ్‌ నత్వానీ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని నత్వానీ ట్వీట్ చేశారు.

No comments:

Post a Comment