140 బీసీ కులాలకు నష్టం: అచ్చెన్న
టీడీపీకి అండనే అణగదొక్కే కుట్రలు: అచ్చెన్న
గవర్నర్‌ని కలిసిన టీడీపీ బీసీ నేతలు
విజయవాడ, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గించడం వల్ల 140 వెనుకబడిన తరగతులకు అన్యాయం జరుగుతోంది. జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 16 వేల పదవులను బీసీలు కోల్పోవాల్సి వస్తోంది. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా బీసీలను అణగదొక్కే కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. బీసీలు టీడీపీకి అండగా ఉంటున్నారన్న అక్కసుతోనే జగన్ ఈ విధంగా చేస్తున్నారు’’ అని టీడీపీ శాసన సభాపక్ష ఉపనేత కె.అచ్చెన్నాయుడు వివరించారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై తెలుగుదేశం పార్టీ బీసీ నేతల బృందం విజయవాడ రాజ్‌భవన్‌లో గవర్నరు హరిచందన్‌ను బుధవారం కలిసింది. అచ్చెన్నాయుడుతోపాటు అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తదితరులు గవర్నర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం రాజ్‌భవన్ వెలుపల అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. బీసీలకు 1987వ సంవత్సరం నుంచి 34 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్లు 24 శాతానికి పరిమితమయ్యాయని తెలిపారు. బీసీలకు నాడు తండ్రి, నేడు కొడుకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. బీసీలకు 24 శాతం రిజర్వేషన్లపై ఆర్టినెన్స్ ముందుగా గవర్నరు వద్దకు వస్తుంది కాబట్టి దాన్ని తిరస్కరించాలని కోరారు.

No comments:
Post a Comment