అమరావతిపై తీర్మానం చేసినా.. కేంద్రం వినాలని లేదు
మా రాష్ట్ర పార్టీ కోరినవన్నీ చేయాలని లేదు
రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోదే!: జీవీఎల్
న్యూఢిల్లీ, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): అమరావతిని రాజధానిగా కొనసాగించాలని బీజేపీ రాష్ట్ర శాఖ తీర్మానించింది నిజమేనని, అయితే కేంద్రం దానిని వినాలని లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. పీపీఏ రద్దుపై రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టినప్పటికీ, కేంద్రం రాష్ట్రంపై చర్యలు తీసుకోగలిగిందా అని ప్రశ్నించారు. సహచర బీజేపీ ఎంపీ సుజనాచౌదరి విలేకరుల సమావేశంలో మాట్లాడిన 2-3 గంటలకే గురువారం రాత్రి జీవీఎల్ హడావుడిగా మీడియాతో మాట్లాడారు. తమ రాష్ట్ర పార్టీ కోరిన అన్ని అంశాలనూ కేంద్ర ప్రభుత్వం అమలుచేయాలని లేదని చెప్పారు. పార్టీపరంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలను బర్తరఫ్ చేయాలని కోరుతుంటామని.. కానీ కేంద్రం అలా చేయదని తెలిపారు. రాష్ట్ర రాజధాని ఏర్పాటు అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదేనని పునరుద్ఘాటించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి సైతం వేసవి రాజధానిని ప్రకటించడం దీనికి నిదర్శనమన్నారు.
అమరావతి గురించి గానీ, రాజకీయాల గురించి గానీ బీజేపీ అధిష్ఠానం అనుమతితోనే తాను ప్రతి విషయం మాట్లాడతానని స్పష్టీకరించారు. రాజధాని విషయంలో పార్టీ నాయకులు, కేంద్ర ప్రభుత్వంతో చర్చించాకే చెబుతుంటానన్నారు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో స్పష్టంగా చెప్పిందని, నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని పేర్కొందని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చి కేంద్రం తప్పుడు నిర్ణయాలు తీసుకోదన్నారు. ఎవరైనా కేంద్రం చేతిలో అధికారం ఉందని అమరావతి విషయంలో తప్పుడు హామీలు ఇచ్చినా, వ్యాఖ్యలు చేసినా.. అవన్నీ వారి వ్యక్తిగత అభిప్రాయాలుగానే పరిగణించాలని స్పష్టంచేశారు.
ఇటీవల విజయవాడలో నగర ప్రముఖులు, మేధావులతో ఆ ప్రాంత సమస్యలపై సమావేశం జరిగిందని, కొందరు జేఏసీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారని, వారు రాజధానిపై ఉన్న అనిశ్చిత పరిస్థితిని ప్రస్తావించారని తె లిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మన పార్లమెంటరీ వ్యవస్థలో పరిమితులు ఉంటాయని వారికి చెప్పానన్నారు. రాజధాని ఏర్పాటు విషయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని కేంద్రం పార్లమెంటులో టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పష్టమైన సమాధానమిచ్చిందని తెలిపానని చెప్పారు. సీఆర్‌డీఏతో చేసుకున్న ఒప్పందం మేరకు రైతులు భూములు ఇచ్చారు గనుక కచ్చితంగా వారికి న్యాయం జరుగుతుందని చెప్పానన్నారు. ఆ ప్రాంతంలో అభివృద్ధికి ప్రభుత్వం ఏయే నిర్ణయాలు తీసుకుంటుందో, ఏయే మౌలిక సదుపాయాలు కల్పించనుందో వివరంగా చెప్పానని తెలిపారు.
నాపై ఫేక్‌న్యూస్..
తనను కించపరిచే విధంగా ఒక చానల్ ఫేక్‌న్యూస్ నడుపుతోందని జీవీఎల్ ఆరోపించారు. ఆ చానల్ పేరు చెప్పనని.. మరోసారి ఇలాంటి అవాస్తవ వార్తలు ప్రచారం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మళ్లీ తనపై కట్టుకథలు అల్లితే సమాచార ప్రసారశాఖకు ఫిర్యాదు చేస్తానని సదరు చానల్‌ను హెచ్చరించారు.

No comments:
Post a Comment