రాజ్యసభకు నత్వానీ ఖాయం!
మిగతా 3 స్థానాలకు పోటాపోటీ
రేసులో వైవీ, అయోధ్య, మస్తాన్‌రావు
మంత్రులు బోస్, మోపిదేవిల్లో ఒకరికే?
ద్వైవార్షిక పోరుకు నోటిఫికేషన్ జారీ
ఎన్నిక అనివార్యమైతే 26న పోలింగ్
అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ వ్యవహారాలు) పరిమళ్ ధీరజ్‌లాల్ నత్వానీ ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఎన్నికలు జరిగే నాలుగు స్థానాల్లో వైసీపీకి మూడు మాత్రమే దక్కుతాయని అధికార పక్షంలో జోరుగా చర్చ జరుగుతోంది. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఇటీవల కలసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా నత్వానీకి రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. పార్టీలోని వారికే రాజ్యసభను ఇవ్వాలని భావిస్తున్నామని సీఎం చెప్పినా.. నత్వానీకి సీటు ఖాయమేనని వైసీపీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు.. రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఎం.ఎ.ఖాన్, టి.సుబ్బరామిరెడ్డి, తోట సీతారామలక్ష్మి, కె.కేశవరావు పదవీ విరణ చేయనుండడంతో.. ఆ ఖాళీల భర్తీ కోసం అసెంబ్లీ కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి బాలకృష్ణమాచార్యులు శుక్రవారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. శుక్రవారం నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకూ దాఖలు చేయవచ్చు. 16న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఉపసంహరణకు ఆఖరు తేదీ ఈ నెల 18. ఎన్నికలు అనివార్యమైతే 26న వెలగపూడిలోని అసెంబ్లీ ప్రాంగణంలోని కమిటీ హాల్‌లో పోలింగ్ జరుగుతుంది. కాగా, రాష్ట్రం నుంచి ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్థానాలకూ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇక, నరసరావుపేట లోక్‌సభ టికెట్‌ను ఆశించి.. చివరిలో రేసు నుంచి వైదొలగిన ‘రాంకీ’ అయోధ్యరామిరెడ్డి, ఒంగోలు పార్లమెంటు టికెట్ దక్కని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ టికెట్ ఖాయమని పార్టీ వర్గాలు ఇప్పటి వరకూ చెబుతూ వచ్చాయి. అయితే ఇటీవల శాసనమండలిని రద్దు చేయాలని అసెంబ్లీ తీర్మానం చేయడంతో.. మండలి సభ్యులైన ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణారావు పదవులు కోల్పోయే పరిస్థితి వచ్చింది. బలహీన వర్గాలకు చెందిన ఈ ఇద్దరికీ రాజ్యసభలో అవకాశమివ్వాల్సిన అవసరం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చే సమయంలో నెల్లూరు నేత బీద మస్తాన్‌రావుకు రాజ్యసభ సీటు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారని అంటున్నారు. నత్వానీ, వైవీ సుబ్బారెడ్డి, మస్తాన్‌రావులకు రాజ్యసభలో స్థానం కల్పిస్తే.. మిగిలేది ఒక సీటే. దానిని బోస్‌కు ఇవ్వాలా.. మోపిదేవికి ఇవ్వాలా అనేది ప్రస్తుతం చిక్కుముడిగా మారినట్లు తెలిసింది. ఇదే సమయంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కూడా రేసులో ఉన్నారని సమాచారం.

No comments:
Post a Comment