ఇంత దుర్మార్గమా?
ఎన్నికల్లో పోటీకి సర్టిఫికెట్లే ఇవ్వరా?
ఎస్ఈసీ ఎందుకు జోక్యం చేసుకోదు?
నామినేషన్లు వేసే పరిస్థితి లేకపోతే
ఎన్నికలు వాయిదా వేయండి: బాబు
సర్టిఫికెట్ల నిరాకరణ వీడియో ప్రదర్శన
ఎక్కడ అక్రమం జరిగినా వీడియో తీసి
7995014524కు పంపాలని సూచన
అమరావతి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా ఉండేందుకు వారికి అవసరమైన సర్టిఫికెట్లు జారీ కాకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తన వ్యాఖ్యలకు మద్దతుగా కొన్ని వీడియోలను కూడా ప్రదర్శించారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలంలో పర్వీన్ తాజ్ అనే టీడీపీ నేత ఒక గ్రామానికి చెందిన కార్యదర్శికి ఫోన్ చేసినప్పుడు జరిగిన సంభాషణ కూడా ఇందులో ఉంది. చిత్తూరు జిల్లా కావేటివారిపల్లిలో ఇంటి పన్ను కట్టించుకోవడానికి ఎండీవో నిరాకరించారని, గుంటూరు జిల్లాలో గ్రామ కార్యదర్శులు అందుబాటులో లేకుండా పోయారని చంద్రబాబు చెప్పారు. ‘పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే ఎన్నికల సంఘం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? వారు చెప్పినా ప్రభుత్వం వినడం లేదా? ప్రభుత్వం బరి తెగించిందా? ఈ సర్టిఫికెట్లు లేక ఒక్క వ్యక్తి నామినేషన్ వేయలేకపోయినా దానికి ఎన్నికల సంఘమే బాధ్యత వహించాలి. స్వేచ్ఛాయుత వాతావరణంలో అంద రూ నామినేషన్లు వేసేలా చూడ డం ఎస్ఈసీ బాధ్యత. అలా చేయలేని వాతావరణం ఉంటే ఎన్నికలు వాయిదా వేయండి’ అని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని ఒక గ్రామంలో టీడీపీ అభ్యర్థి ఇంటికి తెల్లవారుజామున పోలీసులు వచ్చి బయట ఎక్కడో మద్యం బాటిళ్లు దొరికాయని చెప్పి ఆ ఇంట్లో టీడీపీ నేతపై కేసు పెట్టారని దుయ్యబట్టారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవడానికి బార్ కోడింగ్ ఉంటే ఆ పని చేయకుండా టీడీపీ నేతపై కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బాదూరులో నామినేషన్ వేయడానికి వస్తున్న టీడీపీ నేతలపై దాడి చేసి కొట్టారని, గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లిలో కూడా నామినేషన్‌కు వస్తున్న టీడీపీ వారిపై దాడి జరిగిందని తెలిపారు. మాచర్ల నియోజకవర్గంలో రాత్రి సమయంలో టీడీపీ నేత ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేసి.. టీడీపీ వారిపైనే ఎదురు కేసు పెడితే సీఐ భక్తవత్సలరెడ్డి వెంటనే 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారని ఆక్షేపించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు డబ్బు, మద్యం పంచబోరని చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ నేతలకు దమ్ముంటే ఈ 15 రోజులూ మద్యం షాపులను పూర్తిగా మూసివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజలు తిరుగుబాటు చేయాలి..
అధికార పార్టీ దౌర్జన్యాలపై ప్రజలు తిరుగుబాటు చేయాలని చంద్రబాబు పిలుపిచ్చారు. ఒకరిపై దాడిచేస్తే వంద సీట్లలో ఓడించాలని.. అప్పుడే భయం వస్తుందన్నారు. ‘ప్రజలు వారికి భయపడినా.. ప్రలోభాలకు లొంగినా రాష్ట్రం నాశనమవుతుంది. అమరావతి రైతులపై 2,200 కేసులు పెట్టారు. పేదల అస్సైన్మెంట్ భూములను లాక్కుంటున్నారు. ఇంతగా కాపలా కాయాల్సిన అవసరం నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ రాలేదు. టీడీపీ నాయకులంతా ప్రజా క్షేత్రంలో ఉండాలి. బెదిరింపులను ప్రతిఘటించాలి. ప్రతి చోటా పోటీ చేయాలి. ఎవరికైనా భయం ఉంటే ముందే చెప్పి తప్పుకోండి. వేరొకరిని సిద్ధం చేసుకుంటాం’ అని చెప్పారు. ఏ అక్రమం జరిగినా వీడియో తీసి 79950 14524కు పంపాలని, కనీసం సమాచారమిచ్చినా చాలని తెలిపారు.
తొలగించకపోతే నేనే వెళ్తా..
ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన రంగులు, ప్రభుత్వ ప్రచార హోర్డింగులను తక్షణం తొలగించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వీటిని తొలగించకపోతే తానే స్వయంగా క్షేత్ర స్థాయికి వెళ్లి యంత్రాంగం వైఫల్యాన్ని ఎత్తి చూపుతానని ప్రకటించారు. ఎన్నికల సంఘం వైఖరి కూడా మాకు అనుమానాలు కలిగిస్తోంది. నిన్న ఎస్ఈసీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్నికల కమిషనర్ పక్కన ప్రభుత్వ అధికారి విజయకుమార్ కూర్చున్నారు. ఆయనకు అక్కడేం పని’ అని ఆయన ప్రశ్నించారు.

No comments:
Post a Comment