విశాఖ ఎపిసోడ్‌లో వైసీపీకి మైనస్ మార్కులు.. బెడిసికొట్టిన ప్లాన్
విశాఖ ఎయిర్‌పోర్టులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును వైసీపీ నేతలు అడ్డుకుని వారం గడిచినా ఇంకా దానిపై చర్చ సాగుతూనే ఉంది. ఈ ఎపిసోడ్‌పై ఒక్కొక్కరిది ఒక్కో వాదన. ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఈ మొత్తం సంఘటన వల్ల వైసీపీ లాభపడిందా? నష్టపోయిందా? తెలుగుదేశం పార్టీకి ఎంత మైలేజ్ వచ్చింది? పోలీసుల పాత్రపై ఎలాంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి? ఆసక్తికర కథనం మీకోసం!
వారు తలిచింది ఒకటైతే జరిగింది మరొకటి. విశాఖలో చంద్రబాబు ఎపిసోడ్‌లో వైసీపీ పరిస్థితి ఇలాగే తయారైంది. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ కార్యకర్తలు టీడీపీ అధినేతను అడ్డుకోవడం, గంటల తరబడి ఆయన కారులోనే నిరీక్షించడం, వాతావరణం ఉద్రిక్తంగా మారడం, పోలీసుల నోటీసుతో చంద్రబాబు హైదరాబాద్‌కి తిరిగి రావడం వంటి ఘటనలు తెలుగునాట సంచలనం రేపాయి. ఈ ఘటన జరిగి వారం కావస్తున్నా.. ఆ వేడి ఇంకా చల్లారలేదు. ఈ మొత్తం వ్యవహారంలో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఎవరు లాభపడ్డారన్న చర్చ జోరుగా సాగుతోంది. చంద్రబాబుని విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో అడ్డుకుని ఆయనకి తగిన శాస్తి చేశామని వైసీపీ నేతలు భావిస్తున్నప్పటికీ.. ఈ వ్యవహారం బూమరాంగ్ అయి వారికే డ్యామేజ్ జరిగిందన్నది విశ్లేషకుల అభిప్రాయం. నిజానికి.. టీడీపీ అధినేత చంద్రబాబును అడ్డుకోవడం వెనుక పెద్ద ప్రణాళికే రచించారు. ఆయన చేపట్టిన ప్రజాచైతన్య యాత్ర ఇక్కడ కొనసాగితే.. అధికార వైసీపీ నేతల ఆగడాలు బయటికి వెల్లడవుతాయి. ముఖ్యంగా విజయనగరంలో ప్రజాచైతన్య యాత్రకు వెళ్లేముందు విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో ల్యాండ్ పూలింగ్ వల్ల నిరాశ్రయులైన రైతులను పరామర్శించాలని బాబు నిర్ణయించుకున్నారు. అదే విధంగా, పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్‌రాజు కుటుంబీకులు చదును చేస్తున్న చెరువును పరిశీలించాలని కూడా డిసైడ్ అయ్యారు. ఈ సంగతి గ్రహించిన విశాఖ వైసీపీ నేతలు ఒక వ్యూహం ప్రకారమే తమ పార్టీ క్యాడర్‌ని ఎయిర్‌పోర్ట్ వద్ద మొహరించి చంద్రబాబును అడ్డుకున్నారు.
విశాఖను పాలనా రాజధానిగా అంగీకరించమని చెబుతున్న చంద్రబాబును ఇక్కడ అడ్డుకోవడం ద్వారా తాము పైచేయి సాధించామనీ, గతంలో ఏ ఎయిర్‌పోర్ట్‌లో అయితే జగన్‌ని అడ్డుకుని వెనక్కి పంపించారో.. బాబును కూడా అక్కడే నిరోధించి వెనక్కి పంపించామనీ వైసీపీ నేతలు లోలోపల సంబర పడుతున్నారు. ఒకవేళ విశాఖలో చంద్రబాబు యాత్ర సాఫీగా సాగి టూర్ మొత్తం సక్సెస్ అయితే.. ఈ ప్రాంత ప్రజలు రాజధానిని బలంగా కోరుకోవడం లేదన్న సంకేతాలు బయటికి వెళతాయనీ.. అందుకే ఆయనను వ్యూహాత్మకంగా అడ్డుకున్నామనీ వైసీపీ పెద్దలు లెక్కలు వేస్తున్నారట. ఈ ఎపిసోడ్ వల్ల ఉత్తరాంధ్రులు రాజధాని కోసం పట్టుదలతో ఉన్నారన్న ప్రచారం గట్టిగా చేయగలుగుతామనీ, విశాఖతోపాటు మొత్తం ఉత్తరాంధ్రలోనే తమకి ఆదరణ పెరుగుతుందనీ వైసీపీ వ్యూహకర్తలు భావించారట.
లోకల్‌గా బాబు పర్యటిస్తే.. ల్యాండ్ పూలింగ్‌లో బాధితుల గోడు చర్చనీయాంశం అవుతుందనీ, పెందుర్తి ఎమ్మెల్యే బాగోతాలు కూడా బహిర్గతమై తమ ప్రభుత్వం ఇరకాటంలో పడుతుందనీ వైసీపీ నేతలు భావించారట. అందుకే బాబు యాత్రకి బ్రేక్ వేయాలని ముందే ఫిక్సయ్యారట. కానీ ప్రజలేం తక్కువవాళ్లు కాదు కదా? జరిగిన ఘటనలో దాగిన మర్మం ఏంటో వారు గ్రహించేశారు. వైసీపీ నేతల ఆరాచకాన్ని ప్రత్యక్షంగా చూశారు. విశాఖని రాజధాని చేస్తే రేపటినాడు రాయలసీమ గ్యాంగులు సాగరతీర సంస్కృతిని నాశనం చేస్తారన్న అభిప్రాయం వారిలో మరింత బలపడింది. రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ ఈ మేరకు మూల్యం చెల్లించుకుంటుందని కొందరు పరిశీలకులు చెబుతున్నారు కూడా! ఇలా అన్ని కోణాల నుంచి విశ్లేషిస్తే విశాఖ ఎపిసోడ్ వల్ల వైసీపీ కంటే తెలుగుదేశం పార్టీయే లాభపడిందన్న వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై టీడీపీ ముఖ్య నేతలు కూడా అంతర్మథనం జరుపుతున్నారు. విశాఖ నగర పరిధిలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉండి కూడా వైసీపీ నేతలు, కార్యకర్తల ఆగడాలను ఎందుకు అడ్డుకోలేకపోయామని వారు అంతర్గతంగా చర్చిస్తున్నారు.
విశాఖ ఎపిసోడ్‌లో పోలీసుల తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి స్పష్టమైన కారణాలున్నాయి. తొలుత చంద్రబాబు పర్యటనకు పోలీసులు అనుమతించినప్పటికీ.. కొన్ని షరతులు పెట్టారు. పరిమిత సంఖ్యలోనే నేతలను అనుమతిస్తామని చెప్పారు. ఇదే క్రమంలో బాబు పర్యటనను పురస్కరించుకుని నిరసనలు తెలియజేస్తామని వైసీపీ నేతలు పోలీసులకు తెలియజేశారు. అదే జరిగితే నిరసనకారులను అరెస్టుచేస్తామని పోలీసులు చెప్పారు. దీంతో తెలుగుదేశం నేతలు సైలెంట్ అయ్యారు. చంద్రబాబు వచ్చే ముందు వరకూ వైసీపీ క్యాడర్‌ని అడ్డుకున్న పోలీసులు.. ఆయన వచ్చాక మాత్రం వారిని ఎయిర్‌పోర్ట్‌లోకి వదిలేశారు. దీంతో జరిగిన రభస, బాబూ టూర్ క్యాన్సిల్ కావడం, తెలుగుదేశం నేతలు కోర్టు గడప తొక్కడం, ప్రభుత్వం డిఫెన్స్‌లో పడటం వంటి ఘటనలన్నీ అందరికీ తెలిసినవే!
విశాఖ ఘటన తర్వాత వైసీపీ పెద్దలు నష్టనివారణ చర్యల కోసం ప్రయత్నించారు. బాబు పర్యటనను అడ్డుకున్నది తాము కాదనీ, విశాఖ ప్రజలు, ప్రజాసంఘాల నేతలని బుకాయించారు. కానీ కోర్టు సీరియస్ అయ్యి, పోలీసులు కేసులు నమోదు చేయడం మొదలయ్యాక.. వారి స్వరం బలహీనమైపోయింది. విశాఖలోని అధికారపక్ష నేతలతోపాటు.. కార్యకర్తల్లోనూ భయం తాండవిస్తోంది. ఇదిలా ఉంటే.. త్వరలోనే విశాఖలో చంద్రబాబు పర్యటిస్తారని తెలుగు తమ్ముళ్లు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతల్లో, క్యాడర్‌లో ఆనందం వెల్లివిరుస్తోంది. చూద్దాం ఈ రాజకీయ క్రీడలో అంతిమంగా ఎవరిది పైచేయి అవుతుందో..!

No comments:
Post a Comment