ఉపసంఘం, సిట్ ఏర్పాటు.. ప్రతీకారానికే!
ఆ రెండు జీవోలను రద్దు చేయండి
వాటికి శాస్త్రీయత లేదు
సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం
విధాన నిర్ణయాలను సమీక్షించే అధికారం ప్రస్తుత సర్కారుకు లేదు
హైకోర్టులో వర్ల రామయ్య పిటిషన్
అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను.. దాని సిఫారసు మేరకు సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృం దం(సిట్)ను ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీపై ప్రతీకారం తీర్చుకునేందుకే రాష్ట్రప్రభుత్వం కేబినెట్ సబ్‌కమిటీని, సిట్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఎలాంటి శాస్త్రీయత లేని ఆ జీవోలు నిరాధారమైనవి, అస్పష్టమైనవని పేర్కొన్నారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్న ఆ జీవోలను రద్దు చేయాలని అభ్యర్థించారు. ‘రాష్ట్ర విభజన జరిగాక 2014 జూన్ 2 నుంచి చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఐదేళ్ల తర్వాత గతేడాది వైసీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రధాన విధానాలు, ప్రాజెక్టులు, పథకాలు, ఏర్పాటు చేసిన సంస్థలు, ఇతర కీలకమైన పరిపాలనా నిర్ణయాలపై సమీక్షించేందుకు గతేడాది జూన్ 26న మం త్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ జీవో 1411ను జారీ చేసింది. ఆ ఉపసంఘం ఇచ్చిన సిఫారసు మేరకు గత ఫిబ్రవరి 21న రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేస్తూ జీవో 344ను జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలు చట్టవిరుద్ధం, రాజ్యాంగవిరుద్ధం. టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రతీకారం తీర్చుకునేందుకే ఈ ఆదేశాలు జారీ చేశారు’ అని వర్ల పేర్కొన్నారు.
ప్రభుత్వం నిరంతరం కొనసాగుతుంది..
‘ఐదేళ్లకోసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన పార్టీ రాష్ట్రాన్ని పాలిస్తుంది. రాజకీయ పార్టీల విధానాలు వేర్వేరు కాలాల్లో వివిధ రకాలుగా, ప్రయోగాత్మకంగా ఉంటాయి. ఓటర్ల ద్వారా ఎన్నికైన ప్రభుత్వానికి ఎన్నికల మేనిఫెస్టో మేరకు నిర్ణయాలు తీసుకునే హక్కు, కాలానుగుణంగా అవసరం మేరకు తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటాయి. అయితే గత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను కొత్త ప్రభుత్వం సమీక్షించజాలదు. అదేవిధంగా పునఃపరిశీలించనూలేదు. ప్రభుత్వం అనేది నిరంతరం కొనసాగుతుంది. చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం, వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభు త్వం అనడంలో అర్థం లేదు. ప్రభుత్వ కార్యనిర్వాహక ఉత్తర్వులు మునుముందు జరుగబోయే వాటి గురించి ఉంటాయి తప్ప.. అంతకు ముందున్న వాటి గురించి కాదు. అందువల్ల ప్రస్తుత ప్రభుత్వానికి గత ఏడాది మే 30కి ముందు తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై సమీక్షించే అధికారం లేదు. గత ప్రభుత్వ నిర్ణయాలపై పునఃసమీక్షించేందుకు ప్రస్తుత ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు అధికార పరిధిని అతిక్రమించడంతో పాటు రాజ్యాంగవిరుద్ధమైనవి. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించడానికి, పరిశీలించడానికి, రద్దు చేయడానికి వీలులేదు. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు గానీ, సిట్ ఏర్పాటుకు గానీ తగిన కారణాలే లేవు. ఆ జీవోలు సహజ న్యాయసూత్రాలకు, రాజ్యాంగానికి విరుద్ధమైనవి. అందువల్ల వాటిని నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వడంతో పాటు వాటిని రద్దు చేయండి’ అని పిటిషన్‌లో వర్ల పేర్కొన్నారు. సాధారణ పరిపాలన శాఖ (కేబినెట్) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు.
52వ రోజుకు చేరిన నందిగామ దీక్షలు
నందిగామ, మార్చి 6 : రాజధాని తరలింపును నిరసిస్తూ నందిగామ జేఏసీ చేపట్టిన ఆందోళన 52వ రోజుకు చేరుకుంది. ఈ శిబిరాన్ని శుక్రవారం మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ కుట్రపూరితంగా రాజధాని మార్పునకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రజా పోరాటాలు, న్యాయస్థానాల ద్వారా రాజధాని తరలింపును అడ్డుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జేఏసీ నాయకులు నీరుకొండ నరసింహారావు, వైఎస్ బాబు, చలమల శ్రీనివాసరావు, బండారు హనుమంతరావు, కోగంటి బాబు, అమ్మినేని జ్వాలాప్రసాద్, వడ్డెల్లి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment