కేంద్రమే కాపాడాలి!
నాపై దూషణలు, బెదిరింపులు, హెచ్చరికలు
నా కుటుంబ సభ్యుల భద్రతకూ ముప్పు
స్వయంగా సీఎం తీవ్ర విమర్శలు చేశారు
అదే దారిలో స్పీకర్, మంత్రులు, నేతలు
భౌతిక దాడులకూ దిగే ప్రమాదముంది
ఫ్యాక్షన్ నేపథ్యం, కక్ష సాధింపు ధోరణి..
వారికి అందుబాటులో అన్ని వనరులు
ప్రభుత్వ పెద్దల్లోనే నాపై అసహనం
నా భద్రతకు తీవ్రస్థాయిలో ప్రమాదం
హైదరాబాద్‌లోనే ఉండాలనుకుంటున్నా!
ఎన్నికల తొలి దశలోనే భారీగా హింస
క్రూరమైన ఆర్డినెన్స్‌తో విపక్షాలకు కట్టడి
వారే మద్యంపెట్టి, పోలీసులతో కేసులు
వాస్తవాలను వక్రీకరించిన ఎస్పీలు, కలెక్టర్లు
అసాధారణ స్థాయిలో ఏకగ్రీవాలు
పంచాయతీలో మరింత హింసకు చాన్స్!
అంతలోనే... కరోనాపై కేంద్రం అప్రమత్తం
అందువల్లే, స్థానిక ఎన్నికలు వాయిదా
నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు సిద్ధం
కేంద్ర హోం శాఖకు ఎస్‌ఈసీ రమేశ్ లేఖ
తక్షణం స్పందించిన కేంద్రం
చర్యలకు డీజీపీకి ఆదేశాలు
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా తర్వాత ముఖ్యమంత్రి నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేల వరకు నన్ను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. నాతోపాటు, నా కుటుంబ సభ్యుల భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొంది. దయచేసి, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించండి
ADVERTISEMENT
POWERED BY PLAYSTREAM
-కేంద్ర హోం కార్యదర్శికి రమేశ్ కుమార్ లేఖ
అమరావతి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల వాయిదాపై ప్రకటన చేసినప్పటి నుంచి తనకు నిరంతరాయంగా బెదిరింపులు, హెచ్చరికలు వస్తున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఈ పరిణామాలను తన కుటుంబం తట్టుకోలేక పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఐదు పేజీల లేఖ రాశారు. ‘‘స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం ప్రకటించిన తర్వాత... స్వయంగా ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో నాకు అనేక దురుద్దేశాలను ఆపాదిస్తూ తీవ్రమైన పదజాలంతో, అన్యాయమైన విమర్శలు చేశారు. స్పీకర్‌తోపాటు కేబినెట్ మంత్రులు కూడా సీఎం దారిలోనే పరుషమైన పదజాలంతో నన్ను దూషిస్తున్నారు. ఎమ్మెల్యేలు, కింది స్థాయి పార్టీ నాయకులు కూడా దారుణంగా మాట్లాడుతున్నారు. వారి సొంత ఆకాంక్షలకు అనుగుణంగా తిరిగి ఎన్నికలు జరిపించేలా, నా స్థైర్యం దెబ్బతీసేలా ప్రయత్నాలు చేస్తున్నారు’’ అని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈ లేఖలో పేర్కొన్నారు. ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను హైదరాబాద్‌లో నివసించడమే క్షేమమనిపిస్తోంది. నేనంటే గిట్టని వారికి ఉన్న విస్తృత పలుకుబడి దృష్ట్యా హైదరాబాద్‌లో కూడా పూర్తి సురక్షితంగా ఉంటానని చెప్పలేను’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్నికల ప్రక్రియ సాగుతున్నంత కాలం రాష్ట్ర పోలీసు భద్రతతో తన కార్యాలయంలోనే ఉన్నానని... పూర్తి భద్రత లేకుండా బయటకు వెళ్లేందుకు సాహసించలేకపోయానని చెప్పారు. ‘‘ఎన్నికలు వాయిదా పడటంతో నాకు, నా కుటుంబానికి భద్రత కరువైంది. నాకు ఉన్న ముప్పు దృష్ట్యా... రాష్ట్ర ప్రభుత్వ బలగాలు కల్పించే భద్రత సరిపోదని పాలన, భద్రతా వ్యవహారాల్లో అనుభవం ఉన్న తోటి అధికారులు, శ్రేయోభిలాషులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పెద్దల అసహనాన్ని చూస్తే... నాపైనా, నా కుటుంబ సభ్యులపైనా భౌతిక దాడులు జరిగే అవకాశాలున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఫ్యాక్షన్‌తో కూడిన నేపథ్యం, కక్ష సాధింపు ధోరణలను దృష్టిలో ఉంచుకుని... హైదరాబాద్‌లో నివసించడమే క్షేమమనే బాధాకరమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది’’ అని రమేశ్ కుమార్ తన లేఖలో వివరించారు. తనపట్ల అసహనంతో ఉన్న వారికి ఉన్న అధికారం, వనరులు, నేర ముఠాలు, గతంలో వారి కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకుని... తనకు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రిత్వశాఖ కేంద్ర పోలీసు బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మిగిలిన ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు వీలుగా తాను కోరిన మేరకు తక్షణమే భద్రత కల్పించాలని కోరారు. అప్పుడే తాను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విధులను పూర్తి చట్టబద్దంగా నిర్వర్తించగలనని లేఖలో పేర్కొన్నారు.
ఆదిలోనే ‘హింస’పాదు...
రాష్ట్రానికి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు రాబట్టుకునేందుకు ఈ నెలాఖరు లోపు ఎన్నికలు నిర్వహించాలని భావించి ఈ నెల 7న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించామని రమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో పలుదఫాలుగా చర్చించిన తర్వాతే షెడ్యూలు ఖరారు చేశామన్నారు. ‘‘ఎన్నికల్లో ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా తగిన స్థాయిలో భద్రతా సిబ్బందిని మోహరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఈసీకి స్పష్టమైన హామీ ఇచ్చింది. కానీ... ఎన్నికల ప్రక్రియ తొలి అంకంలోనే అనూహ్యమైన స్థాయిలో హింసాత్మక ఘటనలు, పోలీసు సిబ్బంది ప్రత్యక్ష సహకారంతో అధికార పార్టీ బెదిరింపులు విపరీతంగా కొనసాగాయి. ఈ విషయంలో విపక్ష పార్టీలన్నీ మూకుమ్మడిగా ఆరోపణలు చేశాయి. దాదాపు 35 చోట్ల నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. 23 చోట్ల బలవంతంగా నామినేషన్లను ఉపసంహరింపచేశారు. తెలుగుదేశం, బీజేపీ-జనసేన, ఇతర విపక్షాల అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని 55 హింసాత్మక దాడులు జరిగాయి.
శాంతియుతంగా-పద్ధతిగా ఎన్నికలు నిర్వహించాలన్న సూత్రాన్ని పూర్తిగా ఉల్లంఘించారు. అంతేకాకుండా... అనూహ్యమైన స్థాయిలో ఏకగ్రీవ ఎన్నికలు జరిగాయి’’ అని రమేశ్ కుమార్ వివరించారు. ఎంపీటీసీ సభ్యులకు సంబంధించి 2014లో కేవలం 2 శాతం ఏకగ్రీవాలు కాగా... ఈసారి ఏకంగా 24 శాతం ఏకగ్రీవమయ్యాయని చెప్పారు. అలాగే... 2014లో 1096 జడ్పీటీసీ స్థానాల్లో ఒకే ఒక్క జడ్పీటీసీ ఏకగ్రీవం కాగా... ఈసారి 652 స్థానాలకుగాను 126 స్థానాలు ఏకగ్రీవమయ్యాయని చెప్పారు. ఇక... ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో ఎంపీటీసీలు 439 (79 శాతం), జడ్పీటీసీలు 38 (76 శాతం) ఏకగ్రీవమయ్యాయని వివరించారు. ‘‘ఒక్క ఓటు పడకుండానే కడప జిల్లా పరిషత్‌ను వైసీపీ కైవసం చేసుకుంది. శాంతియుత ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఇచ్చిన హామీ అపహాస్యం పాలైంది. స్థానిక ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించకపోతే మంత్రులు పదవులు కోల్పోవాల్సి వస్తుందని, ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్లివ్వబోమని స్వయానా ముఖ్యమంత్రి హెచ్చరించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేల ఒత్తిడితో పార్టీ కేడర్ భారీ హింసకు పాల్పడినట్లు పత్రికలు, ఎలకా్ట్రనిక్ మీడియాలో కథనాలు వచ్చాయి’’ అని రమేశ్ కుమార్ చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిపై కమిషన్‌కు ఫిర్యాదులు వెల్లువలా వచ్చాయన్నారు. ‘‘పరిస్థితిని చక్కదిద్దేందుకు అందుబాటులో ఉన్న కొద్దిమంది సీనియర్ ఐఏఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించాం. వారి ద్వారా వచ్చిన సమాచారాన్ని పరిశీలించాం. ఇక... పరిస్థితిని చక్కదిద్దాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు పదేపదే చేసిన సూచనలు బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలను పూర్తిగా వక్రీకరించి, మసిపూసి మారేడు కాయ చేసేలా రోజువారీ నివేదికలు పంపించారు’’ అని రమేశ్ కుమార్ తీవ్రస్థాయిలో స్పందించారు.
వాయిదా నిర్ణయం ఎందుకంటే...
ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ప్రచారానికి వెళ్లాలంటేనే భయపడుతున్నాయని... అనూహ్య, అసాధారణ స్థాయిలో జరిగిన హింసాత్మక ఘటనలతో ప్రజలూ భయం గుప్పిట చిక్కుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతం అత్యల్పంగా నమోదయ్యే అవకాశముందని చెప్పారు. దీంతోపాటు... కరోనా వైరస్ నేపథ్యంలో ఎగువ, విద్యావంత వర్గానికి చెందిన వారు పోలింగ్ బూత్‌కు వచ్చే ఆలోచనలో కూడా లేరని చెప్పారు. ‘‘గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పరిస్థితులు ఇంకా తీవ్రంగా ఉండే అవకాశముంది. పార్టీ రహితంగా జరిగే ఈ ఎన్నికలను 70 శాతం ఏకగ్రీవం చేయాలనే వ్యూహంతో అధికార పార్టీ ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కమిషన్ ప్రయత్నించింది. అదే సమయంలో... కేంద్ర ప్రభుత్వం కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించింది. జనాల సమూహాలతో జరిగే ఎన్నికల వల్ల కరోనా మరింత వ్యాప్తి చెందే ప్రమాదముందని భావించాం.
పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలో ఇప్పటికే ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఆ రాష్ట్రాల్లో ఉన్న ఏపీ ప్రజలు... పోలింగ్ రోజున ఇక్కడికి వస్తారు. బ్యాలెట్‌తో ఓట్లు వేస్తున్నందున కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. కేంద్ర వైద్యశాఖ అధికారులతో సంప్రదించిన తర్వాతే... ఆరు వారాల పాటు ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని రమేశ్ కుమార్ వివరించారు. ఆ మరుసటిరోజునే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిసా రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారన్నారు. తమ నిర్ణయాన్ని దేశమంతా హర్షించినా... అధికార పార్టీ మాత్రం విమర్శలు చేయడం ప్రారంభించిందన్నారు. చివరికి, సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారన్నారు. ‘‘కమిషన్ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. కోడ్ అమలును మాత్రం వాయిదా వేసి ప్రభుత్వానికి ఊరట కలిగించింది’’ అని తెలిపారు. హింసకు తావివ్వకుండా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషనదేనని... మొదటి అంకంలో జరిగిన హింసాత్మక సంఘటనలు పునరావృతమైతే ఎన్నికలు ప్రశాంతంగా ఉండవని పేర్కొన్నారు.
చర్యలకు ఆదేశించినా...
వివిధ వర్గాల నుంచి అందిన ఫిర్యాదులు, తమ స్వీయ పరిశీలనతో తెలుసుకున్న సమాచారం ఆధారంగా... గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, గుంటూరు రూరల్ ఎస్పీ, తిరుపతి అర్బన్ ఎస్పీలను, శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలను, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను బదిలీ చేయాలని... మాచర్ల సీఐను సస్పెండ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించామని రమేశ్ కుమార్ తెలిపారు. కానీ... సుప్రీంకోర్టుకు వెళ్లామన్న సాకుతో తమ ఆదేశాలను ఇప్పటికీ అమలు చేయలేదని తెలిపారు. ‘‘తదుపరి దశల్లోనైనా అధికారులు సక్రమంగా వ్యవహరిస్తారనే ఉద్దేశంతోనే... తప్పు చేసిన వారిపై చర్యలకు ఆదేశించాం. కానీ... వాటిని అమలు చేయలేదు. ఈ దశలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా మొత్తం ఎన్నికల ప్రక్రియ బలహీనపడుతుంది. విపక్షాల నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. బెదిరించి, ఒత్తిడి తెచ్చి, బలవంతంగానైనా నన్ను తన దారిలోకి తెచ్చుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది. అలా తలొగ్గేందుకు నేను సిద్ధంగా లేను’’ అని రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ‘‘జిల్లా కలెక్టర్‌గాను, తి చిన్న వయసులోనే టీటీడీ ఈవోగా, ట్యాక్స్ కమిషనర్‌గా, హౌసింగ్, సహకార, అగ్రికల్చరల్, ఆర్థికశాఖల ముఖ్యకార్యదర్శిగా సమర్థంగా పని చేసిన ట్రాక్ రికార్డు నాకు ఉంది. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి గవర్నర్ ఈఎ్‌సఎల్ నరసింహన్‌కు ముఖ్యకార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఏడేళ్ల పాటు పనిచేశాను. రిటైర్ అయిన తర్వాత అప్పటి గవర్నర్ సిఫారసులతో రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమితుడినయ్యాను’’ అని వివరించారు. అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో తన, తన కుటుంబ సభ్యుల భద్రతపై తీవ్ర ఆందోళన కలుగుతోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సత్వరం స్పందించి తగిన భద్రత కల్పించాలని కోరారు.
క్రూర చట్టాన్ని అస్త్రంగా...
ఎన్నికల్లో మద్యం, డబ్బును పంచినట్లు రుజువైతే... గెలిచిన తర్వాత కూడా అనర్హత వేటు వేస్తామని... జరినామాతోపాటు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒక క్రూరమైన ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిందని రమేశ్ కుమార్ కేంద్ర హోంశాఖ దృష్టికి తెచ్చారు. ‘‘కేవలం తమను లక్ష్యంగా చేసుకుని ఈ ఆర్డినెన్స్ ప్రయోగిస్తారని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ ఆర్డినెన్స్‌ను దుర్వినియోగం చేయకూడదని ఎస్‌ఈసీ స్పష్టంగా ఆదేశించింది. అయినప్పటికీ... అధికార పార్టీకి చెందిన ప్రతిపక్ష నేతలు, అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని మద్యం తెచ్చిపెట్టడం... పోలీసులు ఆ నేతలను అరెస్టు చేయడం వంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి’’ అని తెలిపారు.
కేంద్ర హోంశాఖ సత్వర స్పందన
ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంపిన లేఖపై కేంద్ర హోంశాఖ సత్వరం స్పందించినట్లు తెలిసింది. దీనిపై తక్షణం స్పందించాలని, అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు కల్పించిన భద్రతను రెట్టింపు చేయాలని డీజీపీని కేంద్రం ఆదేశించినట్లు ఢిల్లీలోని బీజేపీ వర్గాలు తెలిపాయి.

No comments:
Post a Comment