Monday, December 30, 2019

ఆ సొమ్ముతో రాజధానిఅభివృద్ధి అసాధ్యం : బొత్స


ఆ సొమ్ముతో రాజధానిఅభివృద్ధి అసాధ్యం:బొత్స
విజయనగరం: అభివృద్ధి, సంక్షేమమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామని వివరించారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం వద్ద ఉన్న వనరులకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో పదవులు, నిధులు ఉన్నా అభివృద్ధి ఆలోచన వారికి లేదని, గత పాలకులకు దోచుకోవడమే తప్ప మరో లక్ష్యం లేదని విమర్శించారు. అందుకే వారిని ప్రజలు ఇంటికి పంపించారని ఎద్దేవాచేశారు. ఉగాది నాటికి విజయనగరంలో ఇళ్లు లేని పేదలకు ఇల్లు ఇచ్చే బాధ్యత వైకాపా ప్రభుత్వానిదని బొత్స అన్నారు.

రాజధాని అంశంపై నిపుణుల కమిటీల సలహాలతో ముందుకెళుతున్నామని బొత్స అన్నారు. కానీ చంద్రబాబు, అశోక్‌ గజపతి రాజు వంటి వారు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. వారు అభివృద్ధి చేయలేకపోగా విమర్శలకు దిగడం సరికాదన్నారు. రాజధాని ఎక్కడ ఉన్నా తమకు ఇబ్బంది లేదు గానీ, రాష్ట్ర పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలన్నారు. లక్షా తొమ్మిది వేల కోట్ల రూపాయలతో రాజధాని అభివృద్ధి సాధ్యం కాదన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడి ఉన్నాయన్నారు. వాటిని అభివృద్ధి చేయాలన్నది సీఎం జగన్‌ లక్ష్యమని బొత్స వివరించారు. విమర్శలు చేసే ముందు తెదేపా ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు.

జగన్‌ను కలిసిన తెదేపా ఎమ్మెల్యే మద్దాలి !

వంశీ బాటలో మద్దాలి !
జగన్‌ను కలిసిన తెదేపా ఎమ్మెల్యే
పార్టీ అంగీకరించకపోతే ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని అడుగుతా: గిరి
ప్రజల దృష్టి మరల్చడానికే ఫిరాయింపులకు సీఎం ప్రోత్సాహం: తెదేపా

వంశీ బాటలో మద్దాలి !

ఈనాడు, అమరావతి: తెదేపాకు చెందిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధరరావు... గన్నవరం ఎమ్మెల్యే వంశీ బాటనే పట్టనున్నారా? సోమవారం ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన తర్వాత మద్దాలి చేసిన వ్యాఖ్యలు చూస్తే అలానే అనిపిస్తుంది. ‘‘ఏ పార్టీలోనో చేరాలని కాదు, నా నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాలనే సీఎంను కలిసేందుకు వచ్చా. వాళ్లు, పార్టీ (తెదేపాను ఉద్దేశించి) అంగీకరించకపోతే నేను కూడా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలాగే అసెంబ్లీలో ప్రత్యేక సభ్యుడిగా గుర్తించమని స్పీకర్‌ను అడుగుతా’’ అని మద్దాలి చెప్పారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో ఆయన భేటీ అయ్యారు. తర్వాత అక్కడే విలేకరులతో మాట్లాడారు.  గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో పనుల గురించి అడిగితే, వెంటనే రూ.25 కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారని మద్దాలి తెలిపారు. రాజధానిపై ఆయన స్పందిస్తూ ‘‘నేను రాజధానిపై మాట్లాడేంత పెద్దవాడిని కాదు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. నేను తెదేపా, చంద్రబాబుపై విమర్శలు చేయడం లేదు. ఆత్మ పరిశీలన చేసుకోవాలని మాత్రమే అంటున్నా. రాజధానిపై జనవరిలో కమిటీ నివేదిక వచ్చాక నాకు విషయం చెబుతానని ముఖ్యమంత్రి తెలిపారు. రైతులు అపోహపడనవసరం లేదు. రైతులందరితో మాట్లాడాకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నా. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం విషయంలో చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ప్రదర్శించారు. ఇదంతా ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా.’ అని మద్దాలి వ్యాఖ్యానించారు.

ప్రజల దృష్టి మరల్చడానికే: తెదేపా

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఇసుక కొరతపై తెదేపా ఆందోళన చేసినప్పుడు ఎమ్మెల్యే వంశీని ప్రలోభపెట్టారని, రాజధాని ఆందోళనల నేపథ్యంలో ఇప్పుడు మద్దాలి గిరిని లొంగదీసుకున్నారని విమర్శించారు. సోమవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు.‘‘బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ)ను ఎప్పుడు నియమించారు? ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌ రెడ్డికి బీసీజీ సంస్థ డైరెక్టర్‌ భట్టాచార్యతో ఉన్న స్నేహమే ఆ సంస్థకు బాధ్యతలు అప్పగించడానికి కారణమా?’’ అని ధ్వజమెత్తారు.

రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల నష్టపరిహారం

అమరావతి: రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల వరకూ నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందని, అంత పకడ్బందీగా చట్టాలు, ఒప్పందాలున్నాయని... తెదేపా, భాజపా, ఆంధ్రా మేధావుల ఫోరం, భారతీయ కిసాన్‌ సంఘ్‌ నేతలు, న్యాయవాదులు పేర్కొన్నారు. ఏపీ రాజధాని అమరావతేనని కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపి, రాష్ట్రపతి గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన తర్వాత ఇక్కడి నుంచి తరలించడం మూర్ఖత్వం అవుతుందని విమర్శించారు. ‘మూడు రాజధానుల’కు నిరసనగా సోమవారం అమరావతి రైతులు తుళ్లూరు, మందడంలో చేపట్టిన మహాధర్నా, వెలగపూడిలో రిలే నిరాహారదీక్షకు... వివిధ పార్టీలు, సంఘాల నేతలు హాజరై సంఘీభావం తెలిపారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

వ్యతిరేకిస్తే ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు
మొండివాడు రాజు కన్నా బలవంతుడని అంటారు. అదే మొండివాడు సీఎం అయితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకించే వారిని రాయలసీమ, ఉత్తరాంధ్ర ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అన్ని ప్రాంతాలను సమగా అభివృద్ధి చేయాలి. అంతేగానీ కర్నూలులో హైకోర్టు పెడితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా? దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో హైకోర్టు రాజధానిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్నాయని కొందరు మాట్లాడుతున్నారు. 6 రాష్ట్రాల్లో అసలు హైకోర్టులే లేవనే విషయాన్ని వారు తెలుసుకోవాలి. రాజధాని కోసం ఇప్పటికే 6 కమిటీలు చేశారు. ఇంకెన్ని కమిటీలు వేస్తారు?

- చలసాని శ్రీనివాస్‌,ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు

తుగ్లక్‌ పాలన ప్రత్యక్షంగా చూస్తున్నాం
తుగ్లక్‌ పాలన గురించి చరిత్రలో చదువుకున్నాం. జగన్‌ పాలనతో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. సీఎం మారగానే రాజధానిని మార్చడం తొలిసారి వింటున్నాం. జగన్‌ సీఎం పదవికి అనర్హుడు.

- తంగిరాల సౌమ్య, మాజీ ఎమ్మెల్యే

మతిలేని పని
రాజధాని నిర్మాణానికి రూ.లక్ష కోట్లు అవుతుందో లేదో గానీ.. అమరావతి నుంచి తరలిస్తే మాత్రం రూ.5 లక్షల కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. పరిపాలన వికేంద్రీకరణ మతిలేని పని. అభివృద్ధి వికేంద్రీకరణ అందరికీ అంగీకారమే. న్యాయస్థానం మార్పుపై న్యాయవాదుల్ని అడిగారా?

- చలసాని అజయ్‌, న్యాయవాదుల ఐకాస నేత

విశాఖలో భూములు కొనేందుకే ఆగారా?
ప్రమాణస్వీకారం రోజే రాజధాని మారుస్తామని సీఎం జగన్‌ ఎందుకు చెప్పలేదు? విశాఖలో భూములు కొనడానికే ఈ 7 నెలలు ఆగారా? అమరావతి ప్రజలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తుంటే స్థానిక ప్రజాప్రతినిధులు ఏమయ్యారు? మంత్రి బొత్స ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. రాజధాని తరలించవచ్చని ప్రధాని మోదీ ఆయన చెవిలో చెప్పారా?

- మాలతివాణి, భారతీయ జనతా మహిళా మోర్చా జాతీయ కార్యదర్శి

వ్యక్తిగత ప్రయోజనాల కోసమే
ఉత్తరప్రదేశ్‌లో 72 జిల్లాలు ఉన్నా లఖ్‌నవూ ఒక్కటే రాజధాని. అలాంటిది 13 జిల్లాలు ఉన్న రాష్ట్రంలో మూడు రాజధానులు పెట్టడమనేది అవివేకం. వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల కోసమే మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు. రైతుల త్యాగాలను గుర్తించకపోగా వారిని పెయిడ్‌ ఆర్టిస్టులు అంటారా?

- గద్దె అనూరాధ, కృష్ణా జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్మన్‌

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కోసమే తరలింపు

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కోసమే రాజధాని తరలిస్తున్నారా? అని భారతీయ కిసాన్‌ సంఘ్‌ నేతలు కుమారస్వామి, పి.శివాజీ ప్రశ్నించారు. 151 శాసనసభ స్థానాలు వచ్చాయని జగన్‌ కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తిస్తున్నారని తెదేపా నేత జేడీ రాజశేఖర్‌ అన్నారు. హైకోర్టును తరలించడానికి వీళ్లేమీ సుప్రీంకోర్టు కాదని శ్రామిక వికాస సంఘటన్‌ జాతీయ ఉపాధ్యక్షుడు యజ్ఞనారాయణ పేర్కొన్నారు.

Sunday, December 29, 2019

దైర్యముంటే రాజధాని మొత్తం విశాఖ తరలించాలి - BV Raghavulu

దైర్యముంటే రాజధాని మొత్తం విశాఖ తరలించాలి 
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు సవాల్‌

దైర్యముంటే రాజధాని మొత్తం విశాఖ తరలించాలి



విశాఖ: పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా దక్షిణాఫ్రికా తరహాలో మూడు రాజధానులు అనడం సరికాదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. విశాఖను పరిపాలన రాజధానిగా మార్చేస్తే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి జరుగుతుందనే వాదనను ఆయన తోసిపుచ్చారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాఘవులు మాట్లాడారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే పూర్తిస్థాయి రాజధానిని విశాఖ తరలించాలని సవాల్‌ విసిరారు. రాజధానిగా అమరావతి ఉండాలనే విషయంపై అన్ని రాజకీయపక్షాలు ఒకే మాటపై ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో ప్రాంతాల మధ్య వైషమ్యాలు తీసుకురావడం సరికాదన్నారు. జనాభా లెక్కల గురించి తెలియని వాళ్లు అమరావతి విషయంలో సామాజిక వర్గాల ప్రస్తావన తీసుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ విశాఖ పర్యటనలో ఈ ప్రాంతం గురించి ఏదైనా ప్రకటన చేస్తారని ఆశించామని.. కానీ అలా జరగలేదన్నారు.

Saturday, December 7, 2019

‘చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీపీని వీడబోతున్నారు’

‘చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీపీని వీడబోతున్నారు’
07-12-2019 20:15:44

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ముఖ్యనేతలు, రాజ్యసభ ఎంపీలు ఇతర పార్టీల్లోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. ఎప్పుడు ఏ నేత  సొంత పార్టీకి గుడ్ బై చెప్పి.. ఏ పార్టీలోకి వెళ్తారో తెలియని పరిస్థితి.!  ఇవాళ టీడీపీకి చెందిన కీలక నేత బీద మస్తాన్ రావు ఆ పార్టీకి టాటా చెప్పేసి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. బీదమస్తాన్ రావు పార్టీలో చేరిక అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీపీని వీడబోతున్నారని మంత్రి ఉన్నట్టుండి బాంబ్ పేల్చారు!.

మేం ఓకే చెబితే చాలా మంది టీడీపీ నేతలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. నెల్లూరు జిల్లా నుంచి త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. అంతటితో ఆగని మంత్రి త్వరలో టీడీపీ భూస్థాపితం కానుందని జోస్యం చెప్పారు. అయితే అనిల్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇంతకీ పార్టీ మారబోతున్నదెవరు..? అనిల్‌కు నిజంగానే సమాచారం ఉందా..? ఎవరైనా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీకి టచ్‌లో ఉన్నారా..? అనే దానిపై మాత్రం మంత్రి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Friday, December 6, 2019

బీజేపీకి తాను దూరంగా లేనని.. కలిసే ఉన్నానని పవన్‌ కల్యాణ్‌


బీజేపీకి తాను దూరంగా లేనని.. కలిసే ఉన్నానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. ప్రధాని మోదీ, అమిత్ షాతో భేటీ ?
ఢిల్లీ బయల్దేరిన జనసేనాని పవన్ కళ్యాణ్

Updated: Nov 15, 2019, 12:05 PM IST
కామెంట్ చేయండి | 
ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. ప్రధాని మోదీ, అమిత్ షాతో భేటీ ?
File photo
విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ఢిల్లీలోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకే ఆయన వెళ్లినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ.. పవన్ మాత్రం అక్కడ కేంద్రంలోని పెద్దలను కలిసి ఏపీలోని పరిస్థితులను వివరించి, ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకే వెళ్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఏపీలో ఇసుక కొరత సమస్య, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం మాధ్యమంలో భోదన వంటి అంశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన పవన్ కల్యాణ్... అవసరమైతే ప్రజా సమస్యల పరిష్కారం కోసం వెళ్లి కేంద్రంలోని పెద్దలు ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలను కలుస్తానని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

పవన్ గతంలో చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటనలోనే  కేంద్రంలోని పలువురు పెద్దలతో ఆయన భేటీ అయ్యే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. పవన్ వెంట పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉండటం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్లయింది.


పవన్ కళ్యాణ్  మోదీ

బీజేపీతో దోస్తీ... క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్
వైసీపీకి అమిత్ షా అంటే భయమన్న పవన్ కళ్యాణ్... తనకు మాత్రం షా అంటే గౌరవమని అన్నారు.


బీజేపీతో దోస్తీ... క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్తిరుపతి సమావేశంలో పవన్ కళ్యాణ్
NEWS18 TELUGU
LAST UPDATED: DECEMBER 4, 2019, 2:47 PM IST
SHARE THIS:

బీజేపీకి తాను దూరంగా లేనని.. కలిసే ఉన్నానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. వైసీపీ వాళ్లు నాకు రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలన్నారు. తాను బీజేపీ, టీడీపీతో కలిసి మళ్లీ పోటీ చేసి ఉంటే వైసీపీ ఎక్కడ ఉండేదన్న పవన్ కళ్యాణ్... అదే జరిగి ఉంటే... వైసీపీ అధికారంలోకి వచ్చేదా ? అని ప్రశ్నించారు. ఎంతమందితో వైసీపీ వాళ్లు తన దగ్గరికి వచ్చారో గుర్తు లేదా అని వ్యాఖ్యానించారు. వైసీపీకి అమిత్ షా అంటే భయమన్న పవన్ కళ్యాణ్... తనకు మాత్రం షా అంటే గౌరవమని అన్నారు. అందుకే వైసీపీ వాళ్లకు విమర్శలు చేయడం తప్ప.. ఇంకేం తెలియదని పవన్ కళ్యాణ్ విమర్శించారు.

తానెప్పుడూ బీజేపీకి దూరంగా లేనని తెలిపారు. హోదా విషయంలో సిద్ధాంతపరంగా విబేధించినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. దక్షిణాదిలో దేశానికి రెండో రాజధాని ఉండాలని అంబేద్కర్ అన్నారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. గత ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించడంతోనే ప్రభుత్వం సమయం వృధా చేస్తోందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. మాజీ సీఎం ఇల్లు కూల్చివేతపై ఉన్న శ్రద్ధ సమస్యలపై లేదని ఆయన వ్యాఖ్యానించారు. కియా పరిశ్రమ సీఈవోను వైసీపీ నేతలు బెదిరించారని.. ఇక రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయని అన్నారు. తెలుగ సత్వర న్యాయం లభించింది. ఈ సందర్భంగా దిశ ఆత్మకు శాంతి కలగాలని,ఈ విషాదం నుంచి ఆమె తల్లిదండ్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.





ప్రజలంతా తప్పు చేశానంటే సారీకి సిద్ధం - Chandrababu

ప్రజలంతా తప్పు చేశానంటే సారీకి సిద్ధం
06-12-2019 03:38:36

దుష్ప్రచారంతో అమరావతిని చంపేస్తున్నారు
ప్రసిద్ధ రాజధానిని కోరుకోవడం తప్పా?
నష్టం నాకు కాదు.. భావితరాలకే
రాజధాని అంటే ఆదాయం, ఉద్యోగాలు
విభజనతో ఒకసారి నష్టపోయాం
రాజధానిని పాడుచేసుకుని నష్టపోవద్దు
అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు అమరావతి నుంచే పనిచేస్తున్నాయి
వర్సిటీలు, దాదాపు పూర్తయిన టవర్లు, పేదల ఫ్లాట్లు గ్రాఫిక్సేనంటారా?
రౌండ్‌ టేబుల్‌ భేటీలో బాబు ప్రశ్న
అమరావతి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మనకొక ప్రపంచస్ధాయి ప్రసిద్ధ రాజధాని ఉండాలనుకోవడం తప్పా.. అని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతి నిర్మాణంలో తాను తప్పు చేశానని ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలు అభిప్రాయపడితే క్షమాపణ చెప్పడానికి సిద్ధమని ప్రకటించారు. చరిత్ర పొడవునా ఒక మంచి రాజధాని నగరం లేని దురదృష్టం ఆంధ్రులను వెన్నాడాల్సిందేనా అని వాపోయారు. గురువారం విజయవాడలోని ‘ఎ’ కన్వెన్షన్‌ హాలులో ప్రజా రాజధాని అమరావతిపై టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మనకొక ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించుకోలేమా? హైదరాబాద్‌లో సాధ్యమైంది అమరావతిలో ఎందుకు కాదు’ అని ప్రశ్నించారు. అక్కడ తన త ర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు వైఎస్‌ సహా ఎవ రూ హైదరాబాద్‌ను చెడగొట్టలేదని.. ఆ ప్రణాళికల ను కొనసాగించారని తెలిపారు. కానీ ఇక్కడ విరుద్ధంగా జరుగుతోందన్నారు. రకరకాల దుష్ప్రచారాల తో అమరావతిని చంపేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ‘దానిని చంపేస్తే నాకొచ్చిన నష్టమేమీ లేదు. భావితరాలు, తెలుగు జాతి నష్టపోతాయి. ఒక పెద్ద రాజధాని ఉంటే ప్రభుత్వానికి ఆదాయం, సంపద, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, పేదరిక నిర్మూలన జరుగుతాయి. ఇప్పుడు తెలంగాణకి వస్తున్న ఆదాయంలో 60 శాతం హైదరాబాద్‌ నుంచే వస్తోంది. మహారాష్ట్రకు 57 శాతం ముంబై నుంచి వస్తోంది. నా కులం వారో.. నా బంధువులో ఉన్నారని హైదరాబాద్‌ కోసం శ్రమించానా? మొత్తం తెలుగు జాతి కోసం శ్రమించాను’ అని తెలిపారు.

స్వచ్ఛందంగా 34 వేల ఎకరాలిచ్చారు..
‘భౌగోళికంగా రాష్ట్రానికి మధ్యలో ఉందని అమరావతిని రాజధానిగా ఎంచుకున్నాం. రైతులకు ఒక్క పిలుపు ఇస్తే 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చా రు. ఇంత కంటే మంచి నమూనా లేదని లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ దీనిని అధ్యయన అంశంగా స్వీకరించింది. సింగపూర్‌లో అవినీతి మచ్చుకైనా కనిపించదు. నాపై కుదిరిన నమ్మకంతో అడిగిన వెంటనే మన రాజధానికి ప్రణాళిక తయారు చేసి ఇవ్వడానికి సింగపూర్‌ అంగీకరించింది. మన వద్ద స్టార్టప్‌ ఏరియాలో రూ.50 వేల కోట్ల పెట్టుబడులు పెట్టి రెండున్నర లక్షల ఉ ద్యోగాలు సృష్టించాలని అనుకున్నారు. ఈ ప్రభుత్వం వాళ్లను వెళ్లగొట్టింది. నాపై కోపం ఉంటే ఉండవ చ్చు. కానీ రాజధానిపైనా.. ఇక్కడకు రావాలనుకున్న సంస్థలపైనా కోపమెందుకు?. రాష్ట్ర ప్రజలు, యువత, మేధావులు ఆలోచించా లి. రాజకీయంగా మాతో విభేదించేవారు ఉండవ చ్చు. కానీ మీ దారిలో మీరు రాజధాని కోసం పోరాడండి. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఆలోచించాలి.. విభజనతో ఒకసారి నష్టపో యాం. రాజధానిని పాడుచేసుకుని మరోసారి నష్ట పోవద్దు’

ప్రభుత్వ నిధులు అక్కర్లేదు..
‘ఏ పనికీ రోడ్డు తవ్వే అవసరమే ఉండదు. కరెం టు తీగల కోసం చెట్ల కొమ్మలు కొట్టే పని ఉండదు. చివరకు గ్యాస్‌, ఏసీ కూడా పైపులతో ఇంటింటికీ అందేలా ప్రణాళిక రూపొందించాం. హైదరాబాద్‌ స హా దేశంలో ఏ నగరంలో ఇన్ని వసతులు లేవు. ఇ ప్పటికి ఖర్చు చేసింది కాక అమరావతిలో పూర్తి స్థాయి వసతుల నిర్మాణానికి ఇంకా రూ.లక్ష కోట్లు కావాలి. దీనికి ప్రభుత్వ నిధులు ఖర్చు చేయాల్సిన అవసరమే లేదు. ప్రభుత్వం చేతిలో 8 వేల ఎకరాల భూమి ఉంది. దానిని కొద్ది కొద్దిగా అమ్ముకుంటూ ఆ నిధులతోనే ఈ పనులన్నీ పూర్తి చేసే అవకాశం ఉండేది. ప్రపంచ బ్యాంకు నిధులివ్వడానికి ముందుకొచ్చింది. జగన్‌ ప్రభుత్వానికి ఆసక్తి లేదని వెనక్కి వెళ్లిపోయింది. ఏపీలో జగన్‌ మాదిరిగా పాత ప్రభుత్వ పథకాలన్నీ నిలిపివేయొద్దని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు సూచిస్తూ జాతీయ పత్రికలు సంపాదకీయాలు రాస్తున్నాయి. జగన్‌ ప్రభుత్వ నిర్ణయాలతో దేశ ప్రతిష్ఠ దెబ్బతిని ఈ దేశంలోకి వచ్చే పెట్టుబడులు తగ్గుతున్నాయని కేంద్రమే బాధపడే పరిస్థితి వచ్చింది’

అన్నిటినీ పోగొట్టారు..
‘రాష్ట్రంలో అమరావతి ఒక్కదానినే అభివృద్ధి చే యాలని మా ప్రభుత్వం అనుకోలేదు. పలు నగరాలను అభివృద్ధిచేసి వికేంద్రీకరణ జరపాలనుకున్నాం’ అని చంద్రబాబు చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఈ సమావేశంలో చేసిన వ్యాఖ్యకు సమాధానమిచ్చారు. ‘ప్రముఖ కంపెనీ అదానీని ఒప్పించి విశాఖలో రూ.70 వేల కోట్లతో డేటా సెం టర్‌ పెట్టడానికి తీసుకొచ్చాం. అది వస్తే విశాఖ స్వరూపమే మారిపోయేది. దానిని పోగొట్టారు. విశాఖలో ఒక పెద్ద కన్వెన్షన్‌ సెంటర్‌ పెట్టడానికి లులూ గ్రూప్‌ను తెచ్చాం. వాళ్లనూ పోగొట్టారు. మేం రాక ముందు తిరుపతిలో సెల్‌ఫోన్ల తయారీ లేదు.

ఇప్పు డు దేశంలో తయారయ్యే సెల్‌ఫోన్లలో 20-30 శా తం అక్కడే తయారవుతున్నాయి. ఏభై శాతానికి పెంచ డానికి రిలయన్స్‌ కంపెనీని తెచ్చాం. అదీ పోయింది. ప్రకాశం జిల్లాలో రూ.25 వేల కోట్లతో పే పర్‌ పరిశ్రమ తెచ్చాం. వాళ్లూ వెళ్లిపోయారు. ఎంతో పోటీ ఎదుర్కొని అనంతపురం జిల్లాకు కియా కార్ల ఫ్యాక్టరీ తెచ్చాం. దానికంత సబ్సిడీ ఎందుకని మా ట్లాడారు. మనం ఇవ్వకపోతే దానిని ఎగరేసుకుపోవడానికి అప్పట్లో మహారాష్ట్ర సిద్ధంగా ఉంది. కర్నూలుకు ఎయిర్‌ పోర్టు, సోలార్‌ పరిశ్రమలు, యూనివర్సిటీలు తెచ్చాం. అన్ని ప్రాంతాల సమతుల అభివృద్ధికి కట్టుబడే పనిచేశాం’ అని వివరించారు. అమరావతి నిర్మాణానికి రూపొందించిన ప్రణాళికలతో ఆకర్షితుడైన ప్రధాని మోదీ స్వయం గా ఫోన్‌ చేసి కజక్‌స్థాన్‌ దేశ రాజధాని అస్తానా (నూర్‌-సుల్తాన్‌)ను చూసి రావాలని కోరారని.. మ నం చేయగలమన్న నమ్మకం వల్లే ఇలాంటి సలహా ఇచ్చారన్నారు. ఇక్కడ ఆస్పత్రులు లేనందువల్ల హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైల్లోని ఆస్పత్రులకు ఆరోగ్య శ్రీ పథకాన్ని విస్తరిస్తున్నట్లు జగన్‌ చెప్పారని.. రాజధానిని అభివృద్ధి చేసుకోకపోతే మన ఆస్పత్రులు ఏనాటికీ ఎదగలేవన్న సత్యాన్ని విస్మరిస్తున్నారనివ్యాఖ్యానించారు.