Sunday, December 4, 2022

Maharashtra and Karnataka : బెల్గావి మహా వివాదం

 Maharashtra and Karnataka : మహా వివాదం

ABN , First Publish Date - 2022-12-05T04:21:07+05:30 IST


ఏటా డిసెంబరులో దేశం మొత్తానికీ చలికాలం వస్తే.. మహారాష్ట్ర, కర్ణాటక నడుమ మాత్రం సరిహద్దు తగాదాల సెగ రేగుతుంది! మాటలు తూటాల్లా పేలుతుంటాయి! పౌరుషాలు, ఆత్మగౌరవాల కత్తులు పరస్పరం దూసుకుంటాయి! ఆ వాగ్వాదాలు.. భౌతిక నిరసనలకు దారితీస్తుంటాయ్‌!! బస్సులు తగలబెట్టడం..


Maharashtra and Karnataka : మహా వివాదం


బెళగావి సహా 4 జిల్లాల్లోని 865 గ్రామాలు/పట్టణాలపై


కర్ణాటక, మహారాష్ట్ర మధ్య రగులుతున్న సరిహద్దు గొడవ


చల్లారకుండా చేసి చలికాచుకుంటున్న రాజకీయ నేతలు


2004లో సుప్రీం కోర్టును ఆశ్రయించిన మహారాష్ట్ర సర్కారు


18 ఏళ్ల తర్వాత.. దానిపై వచ్చేవారం జరగనున్న విచారణ


ఒకవైపు మరాఠా పౌరుషం.. మరోవైపు కన్నడ ఆత్మగౌరవం! రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న బెళగావి సహా నాలుగు జిల్లాల్లోని 865 పట్టణాలు/గ్రామాలు తమవంటే తమవని తగువు! కర్ణాటక, మహారాష్ట్ర నడుమ దశాబ్దాలుగా రగులుతున్న ఈ సరిహద్దు వివాదాన్ని చల్లారకుండా చేసి చలికాచుకుంటున్నది మాత్రం రాజకీయ నేతలే!! కర్ణాటక రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి మొదలై సుదీర్ఘంగా కొనసాగుతున్న ఈ వివాదంపై వచ్చేవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది!


(బెంగళూరు-ఆంధ్రజ్యోతి)


ఏటా డిసెంబరులో దేశం మొత్తానికీ చలికాలం వస్తే.. మహారాష్ట్ర, కర్ణాటక నడుమ మాత్రం సరిహద్దు తగాదాల సెగ రేగుతుంది! మాటలు తూటాల్లా పేలుతుంటాయి! పౌరుషాలు, ఆత్మగౌరవాల కత్తులు పరస్పరం దూసుకుంటాయి! ఆ వాగ్వాదాలు.. భౌతిక నిరసనలకు దారితీస్తుంటాయ్‌!! బస్సులు తగలబెట్టడం.. ఒకరి జాతి ప్రతీకలను మరొకరు అవమానించడం.. ఇదిలాగ కొన్నిరోజులపాటు సాగి క్రమంగా పరిస్థితి సద్దుమణుగుతుంది. మళ్లీ డిసెంబరులో మామూలే. ఈ సెగలో రాజకీయ పార్టీలు చలికాచుకుంటుంటాయి. ఇంతకీ ఏటా డిసెంబరు నెలలో సరిహద్దు వివాదం ఎందుకు రేగుతుందంటే.. మహారాష్ట్ర ప్రభుత్వం తమ శాసనసభ శీతాకాల సమావేశాలను బెళగావి జిల్లాలోని సువర్ణ విధాన సౌధలో నిర్వహించడమే అందుకు కారణం. బెల్గావితోపాటు ఒకప్పుడు బొంబాయి రాష్ట్రంలో భాగమైన బీజాపూర్‌, ధార్వాడ్‌, ఉత్తర కెనరా జిల్లాలను.. 1956లో భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన మైసూరులో కలపడమే ఈ వివాదానికి మూలం. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చే సమయానికే బెళగావి జిల్లా నాటి బొంబాయి ప్రెసిడెన్సీలో ఉండేది. స్వాతంత్య్రం వచ్చాక దాన్ని బొంబాయి రాష్ట్రంలో భాగంగా గుర్తించారు. 1948లో.. బెళగావి సిటీ కౌన్సిల్‌ ఆ జిల్లాను ప్రతిపాదిత ‘సంయుక్త మహారాష్ట్ర’లో విలీనం చేయాలని తీర్మానం చేసింది. ఇదే డిమాండ్‌తో 1948లోనే ‘మహారాష్ట్ర ఏకీకరణ్‌ సమితి (ఎంఈఎస్‌)’ కూడా ఏర్పాటైంది. అయితే.. 1953లో ఏర్పాటు చేసిన ఫజల్‌ అలీ కమిషన్‌.. ఆ నాలుగు జిల్లాలపై మైసూరు రాష్ట్రానిదే పూర్తి అధికారం అని నివేదిక సమర్పించింది. ఈమేరకు 1956లో బొంబాయి రాష్ట్రం నుంచి ఆ నాలుగు జిల్లాలతోపాటు.. ఆంధ్ర రాష్ట్రంనుంచి బళ్లారి, మద్రాసు రాష్ట్రం నుంచి దక్షిణ కెనరా.. హైదరాబాద్‌ రాష్ట్రం నుంచి కొప్పల్‌, రాయ్‌చూర్‌, కలబుర్గి, బీదర్‌ జిల్లాలను, కూర్గు స్టేట్‌ను ఒక జిల్లాగాను చేసి.. మైసూరు రాష్ట్రంలో కలిపారు. వీటిలో.. బొంబాయి రాష్ట్రం నుంచి కలిపిన నాలుగు జిల్లాలపైనే ప్రస్తుత వివాదం సా...గుతూ వస్తోంది. ఆ నాలుగు జిల్లాల్లోని మొత్తం 865 పట్టణాలు/గ్రామాలు తమకే చెందుతాయని మహారాష్ట్ర వాదిస్తోంది. ఫజల్‌ అలీ కమిషన్‌ నివేదికను మహారాష్ట్ర అంగీకరించట్లేదు. గతంలో పలుమార్లు ఇదే అంశంపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 1966లో సుప్రీం కోర్టు సూచన మేరకు జస్టిస్‌ మెహర్‌చంద్‌ మహాజన్‌ సారథ్యంలో కమిషన్‌ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌ సమర్పించిన నివేదిక కూడా కర్ణాటకకు అనుకూలంగా వచ్చింది. అనంతరం 2004లో మహారాష్ట్ర దీన్ని సవాల్‌ చేస్తూ మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 18 ఏళ్ల తర్వాత.. దానిపై తుది విచారణ వచ్చే వారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల్లో, ప్రత్యేకించి సరిహద్దులో మరింత తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్తత నెలకొన్నాయి.


ఆరనివ్వని రాజకీయాలు..


కర్ణాటకలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది బీజేపీ. మహారాష్ట్రలోనూ చీలిక శివసేనతో కలిసి అధికారంలో ఉన్నది బీజేపీనే. ఇలా రెండు రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారంలో ఉంటే సమస్య తీవ్రం కాకుండా సంయమనం పాటించడం కద్దు. ఈ వివాదం మొదలైన తొలినాళ్లలో రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ ప్రయోజనాలను ఆశించి కాంగ్రెస్‌ పార్టీ అదే రీతిలో వ్యవహరించేది. కానీ, మహారాష్ట్ర ఏకీకరణ్‌ సమితి మాత్రం అప్పట్నుంచీ ఈ వివాదం చల్లారకుండా చూస్తూ వస్తోంది. 1957లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నుంచి.. 2018 దాకా ఆ జిల్లాలో ఒకటి, అంతకు మించి సీట్లను సాధిస్తూ వస్తూనే ఉంది. డిసెంబరులో శీతాకాల సమావేశాలను బెళగావిలో నిర్వహిస్తున్నప్పుడు.. దానికి పోటీగా ‘మరాఠీ మహావేలవ’ను నిర్వహిస్తోంది. అలాగే.. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలంటే కన్నడ పరీక్షలో ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి చేస్తూ 1986లో నాటి కర్ణాటక సీఎం రామకృష్ణ హెగ్డే తీసుకున్న నిర్ణయం ఈ వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. కాలక్రమంలో ఇరు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలూ తమ ప్రయోజనాల కోసం ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తూ అగ్నికి ఆజ్యం పోసినట్టు వ్యవహరిస్తున్నారు. ఇటీవలికాలంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు, వివిధ పార్టీల నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఆ కోవలోనివే. కర్ణాటకలోని సరిహద్దు పట్టణాలు, గ్రామాల్లో పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఇద్దరు మంత్రులను పంపాలని మహారాష్ట్ర సర్కారు నిర్ణయించడం.. వారు వస్తే అడ్డుకుంటామని కర్ణాటక రక్షణ వేదిక, కన్నడ సంఘాల సమాఖ్య తదితర సంఘాలు ప్రకటించడం.. కర్ణాటకకు వచ్చి ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తే సహించేది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై చేసిన హెచ్చరికలతో రెండు రాష్ట్రాల సరిహద్దులో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. బెళగావిలో కేఎస్‌ ఆర్టీసీ బస్సులకు మసిపూయడం, కన్నడ పతాకాన్ని ప్రదర్శించిన యవకుడిపై దాడి చేయడం వంటి ఘటనలు ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. కాగా.. వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణకు రానున్న ఈ కేసుపై బసవరాజ్‌ బొమ్మై ప్రత్యేకంగా దృష్టిసారించారు. స్వయంగా ఢిల్లీకి వెళ్లి ఈ కేసును వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రొహతగి బృందంతో సుదీర్ఘ సమాలోచనలు జరిపారు. గతంలో రెండు కమిషన్ల నివేదికల సిఫారసులను సుప్రీంకోర్టులో బలంగా వినిపించాలని కోరారు. సుప్రీం కోర్టు నిర్ణయం రాష్ట్రానికి అనుకూలంగా ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Thursday, November 24, 2022

ఇప్పటం గ్రామస్తులకు హైకోర్టు భారీ జరిమానా

 ఇళ్లు కూల్చివేతపై ముందస్తు నోటీసు ఇవ్వలేదని తప్పుడు సమాచారం ఇచ్చిన ఇప్పటం గ్రామ రైతులకు లక్ష రూపాయల  ఒప్పున హైకోర్టు జరిమానా .


AP Highcourt: ఇప్పటం గ్రామస్తులకు హైకోర్టు భారీ జరిమానా

ABN , First Publish Date - 2022-11-24T12:55:59+05:30 IST


గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామ రైతులకు హైకోర్టు జరిమానా విధించింది.


AP Highcourt: ఇప్పటం గ్రామస్తులకు హైకోర్టు భారీ జరిమానా

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్

సం|| 93979 79750

అమరావతి: గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామ రైతులకు హైకోర్టు (AP Highcourt) జరిమానా విధించింది. కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు చొప్పున జరిమానా విధిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటంలో ఇళ్లు కూల్చివేతపై గతంలో హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలో విచారణ సందర్భంగా తమకు నోటీసులు ఇవ్వలేదని రైతుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తాము నోటీసులు ఇచ్చిన తరువాతనే కూల్చేశామని ఇటీవల విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. దీంతో కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు 14 మంది రైతులను ఈ రోజు హైకోర్టుకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఇప్పటం గ్రామస్తులు ఈరోజుకు కోర్టుకు హాజరయ్యారు. అయితే తమకు అవగాహన లేదని గ్రామస్థులు చెబుతున్నారు. అయినప్పటికీ వారి వాదనను తిరస్కరించిన హైకోర్ట్... ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పును వెల్లడించింది.

Friday, November 11, 2022

అది అధికార పత్రమా.. వైసీపీ కరపత్రమా?

 CM JAGAN: అది అధికార పత్రమా.. వైసీపీ కరపత్రమా?

ABN , First Publish Date - 2022-11-11T02:54:51+05:30 IST


బడులకు రంగులు. ఆఫీసులకు వైసీపీ రంగులు. లోగోలకు రంగులు! ఒకరి విగ్రహాలు మార్చేసి వైఎస్‌ విగ్రహాలు పెట్టే తీరు.


CM JAGAN: అది అధికార పత్రమా.. వైసీపీ కరపత్రమా?

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్

సం|| 93979 79750

పట్టాదారు పాస్‌పుస్తకాలపై ఫొటోల పిచ్చి


‘జగనన్నే’ భూ యజమాని అన్నట్లు కలరింగ్‌


అది అధికార పత్రమా.. వైసీపీ కరపత్రమా?


పుస్తకం కవర్‌ పేజీ, చివరా జగన్‌ ఫొటోలు


లోపల ప్రతి పేజీలో ఆయన ఫొటో


పట్టాదారు రూపురేఖలు మార్చేసిన సర్కారు


తమ భూమిపై ఆయన


‘హక్కు’ ఏమిటని రైతుల ధ్వజం


‘భూమి మనది... హక్కు మనది... కష్టం మనది... పత్రం మనది! నడుమ జగనేందిరో... ఆయన ఫొటో ఏందిరో’... అని రైతన్నలు పాడుకునే రోజు త్వరలోనే రానుంది. భూమి ఎవరిది, దాని యజమాని ఎవరు, ఫొటో ఎవరిది... అనే సందేహం వచ్చేలా.. ప్రతి పేజీలో జగన్‌ కనిపించేలా ‘జగనన్న భూరక్ష పథకం’ పుస్తకాన్ని సిద్ధం చేశారు.


(అమరావతి - ఆంధ్రజ్యోతి): బడులకు రంగులు. ఆఫీసులకు వైసీపీ రంగులు. లోగోలకు రంగులు! ఒకరి విగ్రహాలు మార్చేసి వైఎస్‌ విగ్రహాలు పెట్టే తీరు. చివరికి... ఎవరికో చెందిన భూములపై తన ఫొటో వేసుకునే స్థాయికి చేరుకున్నారు. ఇది ముఖ్యమంత్రి జగన్‌ సొంత భూమికి సంబంధించిన పాసు పుస్తకమా? లేక... ‘జగనన్న భూ రక్ష పథకం’ ప్రచారం కోసం అధికార వైసీపీ రూపొందించిన కరపత్రమా? అని సందేహం కలిగేలా పాస్‌ పుస్తకాలు సిద్ధం చేశారు. సమగ్ర సర్వే అనంతరం భూ యజమానులైన రైతులకు ఈ పుస్తకాలను అందిస్తారు. 12 పేజీలున్న ఈ పాస్‌పుస్తకంలో... మొదటి పేజీలోనే పెద్దగా జగన్‌ ఫొటో, చివరి పేజీలో మళ్లీ జగన్‌ ఫొటో, దాని చుట్టూ ‘నవరత్నాల’ పేర్లు ముద్రించారు! పోనీ... లోపాలి పేజీలనైనా వదిలేశారంటే అదీ లేదు. 2, 11 పేజీ మినహా మిగిలిన అన్ని పేజీల్లో ‘జగన్‌’ కనిపిస్తారు. ప్రతిపేజీపైనా జగన్‌ ఫొటో ఉన్న నవరత్నాల లోగో ముద్రించారు. భూమి శాశ్వతం! ప్రభుత్వం శాశ్వతం! కానీ సీఎంగా జగన్‌ శాశ్వతం కాదుకదా? మరి ఎవరికో చెందిన భూమి హక్కు పత్రాల మీద ఆయన ఫొటో ముద్రించడమేమిటన్నదే రైతు సంఘాల ప్రశ్న. ఏపీ భూ హక్కుల చట్టం, దాని అమలు నిబంధనలు, సంప్రదాయాలు, పద్ధతులన్నీ తుంగలో తొక్కి ఈ పాసుపుస్తకాన్ని డిజైన్‌ చేశారు. ఈనెల 4నే పట్టాదారు పుస్తకాలను సీఎం చేతుల మీదుగా పంపిణీ చేద్దామని భావించారు. కానీ అనుకోని ఆటంకాలేవో ఎదురైనట్లు ఉంది! అందుకే... ప్రస్తుతానికి ఆపేశారు. ప్రభుత్వ ఆఫీసులు, ప్రకటనలు, పథకాలు, కార్యక్రమాలను జగన్‌ ఫొటోలతో నింపేస్తున్న సంగతి తెలిసిందే! ఇప్పుడు ఈ ఫొటోల పిచ్చిని రైతులకు ఇచ్చే సొంత ఆస్తిపత్రాలకూ పట్టించారు. గత 49ఏళ్లలో ఏ సీఎం ఈ పుస్తకాలపై తమ ఫొటోలు వేసుకోలేదు.


రైతుల ఆగ్రహం... అభ్యంతరం


‘‘మా కష్టార్జితం, సొంత ఆస్తి అయిన భూమి రికార్డుల్లో సీఎం ఫొటోలు ఎందుకు? ఆ భూములు ఏమైనా జగన్‌ దానం చేస్తే వచ్చాయా?’’ అంటూ రైతులు మండిపడుతున్నారు. ‘‘హక్కుదారుడిని కాబట్టి భూమి హక్కుపత్రంపై నా ఫొటో ఉండాలి. సీఎం ఫొటోలు ఎందుకు? జగన్‌ పుట్టకముందు నుంచే నాకు భూమిఉంది. ఇప్పుడు కొత్తగా జగనన్న భూమి హక్కుపత్రం అని ఎందుకు పేరుపెట్టారు?’’ అని కృష్ణాజిల్లా రైతు ధ్వజమెత్తారు.


ఇదేమి వేలం వెర్రి?


‘‘జగనన్న భూ యాజమాన్యపు హక్కుపత్రం అని రాయడం ఏమిటి? అధికారులకు సీఎంపై అభిమానం ఉండొచ్చు. కానీ, మరీ ఇంత వేలంవెర్రి ప్రదర్శించడం సరికాదు. పాసుపుస్తకాల డిజైన్‌ మార్చాలి. రైతు భూ యజమాన్యపు హక్కుపత్రంగా దాన్ని మార్చాలి!’’


- దివాకర్‌, ఏపీ రైతు కూలీ సంఘం నేత


అది... ‘వైఎ్‌సఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం’! సమగ్ర సర్వే అనంతరం పంపిణీ చేసే ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌ రికార్డు పుస్తకాలకు ‘జగనన్న భూ హక్కుపత్రం’ అని నామకరణం చేశారు. లోపలి పేజీల్లో ‘జగనన్న భూ యాజమాన్య హక్కుపత్రం’ అని ముద్రించారు. ఆ భూమి యజమాని జగనన్నా? లేక... రైతా? జగన్‌ తన సొంత భూమిపై హక్కులను మరొకరికి కల్పిస్తున్నారా?


Sunday, August 7, 2022

కార్యశూరుడూ – కామమ్మ మొగుడు

 కార్యశూరుడూ – కామమ్మ మొగుడు

Aug 07, 2022, 00:31 IST

Vardhelli Murali Article On AP Politics TDP Chandrababu Naidu - Sakshi

జనతంత్రం


ఎదిగే పిల్లల మధ్య పోలికలు తేవద్దంటారు మానసిక నిపుణులు. ఇది పెంపకానికి సంబంధించిన సూత్రం. ఎంపిక చేసుకోవడానికి సంబంధించిన సూత్రం మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. అది కూరగాయల ఎంపికైనా సరే... ఇంకే కొనుగోలు వ్యవహారమైనా సరే! ఎందుకంటే ‘డబ్బులు ఊరికే రావు కదా’! నిగనిగలాడే బోడిగుండుతో ఒకాయన ప్రతిరోజూ టీవీల్లో కనపడి ఈ విషయంపై హెచ్చరిస్తూనే ఉంటాడు. ఈ ఒక్క క్యాంపెయిన్‌తో ఆయన యాంకర్‌ సుమతో సమానమైన పాపులారిటీ తెచ్చుకోగలిగారు. తన వ్యాపారాన్ని పెంచుకో గలిగారు. అట్లుంటది మరి పబ్లిసిటీతోటి!


బ్రాండింగ్, పబ్లిసిటీ, మార్కెటింగ్‌ల సహకారంతో పుచ్చు కూరలూ, పచ్చళ్లు కూడా అమ్ముకోవచ్చు. అలాగే సొంత మీడియా చేతిలో ఉంటే నాయకుల్ని తయారుచేయవచ్చు, వీలైతే గద్దెపై కూడా కూర్చోబెట్టొచ్చునన్న ఆలోచన నేటి యెల్లో మీడియా ఆద్యులకు ఆనాడే వచ్చింది. ‘ఓన్లీ విమల్‌’ అనే ఒకే ఒక్క యాడ్‌ క్యాంపెయిన్‌ టెక్స్‌టయిల్‌ సింహాసనంపై నుంచి ‘రేమండ్స్‌’ను దించేసి, ‘రిలయన్స్‌’ను కూర్చోబెట్టింది. ఈ దృష్టాంతం వారికి స్ఫూర్తినిచ్చి ఉండవచ్చు. ‘ఓన్లీ ఎన్టీఆర్‌’ తరహా ప్రచారంతో కాంగ్రెస్‌ కోటను కూల్చగలిగారు. తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తేగలిగారు. ఆయన నిజంగానే ‘ఓన్లీ ఎన్టీఆర్‌’. ఒన్‌ అండ్‌ ఓన్లీ పీస్‌! పబ్లిసిటీ తోడవగానే కార్యసాధకుడు కాగలిగాడు.


ఎన్టీఆర్‌తో తమ సొంత ప్రయోజనాలకు పెద్దగా ఉపయోగం లేదనుకున్న యెల్లో ముఠా ఆయన్ను వదిలించుకొని బాబును గద్దెపై కూర్చోబెట్టడం మనకు తెలిసిన గతం. ప్రత్యామ్నాయ మీడియా లేకపోవడం వల్ల ఏకపక్ష రాతలతో ఈ పరిణామం సాధ్యమైంది. ఈ బాబు స్వతహాగా ఓన్లీ బాబు కాదు, శతకోటి బాబుల్లో చంద్రబాబొకరు! జస్ట్‌ యావరేజ్‌. కాకపోతే పాలిటిక్స్‌లో ఇతనిది మాకివెలియన్‌ స్కూల్‌. అడ్డదారిలోనైనా లక్ష్యాన్ని చేరాలనే తత్వం. చేతికందిన అధికారాన్ని సొంత ప్రయోజనాల కోసం, ముఠా ప్రయోజనాల కోసం యథేచ్ఛగా వాడుకోగల దూకుడు స్వభావం. ఈ స్వభావం ఫలితంగా బాబుకూ, యెల్లో మీడియా పెద్దలకూ మధ్య ఒక రసాయనిక బంధం ఏర్పడింది. యెల్లో ముఠా పోస్టర్‌ బాయ్‌గా బాబు అవతరించాడు.


చంద్రబాబును ఓన్లీ బాబుగా, ఒన్‌ అండ్‌ ఓన్లీ పీస్‌గా భ్రమింపచేయడానికి యెల్లో ముఠా చేయని ప్రయత్నం లేదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో కూడా లాబీయింగ్‌ చేసి మీడియా మేనేజ్‌మెంట్‌కు కూడా దిగజారారు. ఆయన్నొక విజనరీగా చిత్రించడానికి ఆపసోపాలు పడ్డారు. ఈ విజనరీ హయాంలో వ్యవసాయ భూములు బీళ్లుగా మారాయి. పంట పొలాల్లో రైతుల చితిమంటలు వెలిగాయి. లక్షలాదిమంది పేదబిడ్డలు చదువుకొనలేక డ్రాపవుట్లుగా మిగిలిపోయారు. పంతుళ్లకూ, పాఠాలకూ దూరమైన ప్రభుత్వ స్కూళ్లు పాడుబడి పోయాయి. ఆరోగ్యం అంగడి సరుకైంది. రోగం రాకడ... ప్రాణం పోకడగా పేదల పరిస్థితి దిగజారింది. ఇటువంటి వల్లకాటి అధ్వాన్న శకాన్ని బాబు బ్రాండ్‌ వైభవోజ్జ్వల మహా యుగంగా యెల్లో మీడియా చిత్రించింది.


ఈ తరహా చిత్రీకరణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. నిజం చెప్పాలంటే ఆయనొక విఫల ప్రయోగం. ఆ విఫల ప్రయోగాన్ని విజయగాథగా చరిత్రలోకి జొప్పించే కుట్రలు జరుగుతున్నాయి. విధ్వంసకర విధానాల కృతికర్తకు అభివృద్ధి భుజకీర్తులు తగి లించి, ఇంకా స్తోత్రాలు పఠిస్తూనే ఉన్నారు. పళ్లూడి దవడలు జారిన వృద్ధ రంగస్థల నటికి ఊర్వశి వేషం కట్టి లొట్టలేసుకుంటూ చూడాలని ఇంకా ఆర్డర్లు వేస్తూనే ఉన్నారు. నిలువెత్తు స్వార్థ ప్రతిమపై జలతారు మేలిముసుగులు కప్పుతున్నారు. వికృత అవినీతి రూపానికి కాస్మెటిక్‌ సర్జరీ చేసి సింబల్‌ ఆఫ్‌ ఇంటిగ్రిటీగా నమ్మాలని ఆదేశిస్తున్నారు.


‘కామమ్మ మొగుడంటే కామోసు అనుకున్నా’డనే సామెతొ కటి ఉన్నది. పూర్వం ఒక దొంగసాధువు ఒక ఊరి కొచ్చాడట. ఓ గ్రామస్థుడతనికి ఎదురయ్యాడు. చాలాకాలం క్రితం పారి పోయిన కామమ్మ మొగుడి పోలికలు ఆ సాధువులో గ్రామ స్థుడికి కనిపించాయి. ఇంకేముంది ఇదిగో పులి అదిగో తోక! ఆనోటా ఈనోటా అదే మాట. తాను నిజంగానే కామమ్మ మొగుడినని దొంగస్వామి డిసైడై కాపురం చేద్దామని బయల్దే రాడట. సదరు కామమ్మ గట్టిగా నిలదీసేసరికి ‘నాకేం తెలుసు, అందరూ కామమ్మ మొగుడంటుంటే కామోసు అనుకున్నాన’ని వాపోయాడట!


చంద్రబాబును ఒక సూపర్‌ బ్రాండ్‌గా నిలబెట్టడం కోసం గత పాతికేళ్లుగా యెల్లో మీడియా రాసిన కవిత్వమంతా ఆయన మెదళ్లోకి బాగా ఎక్కిపోయింది. అదంతా నిజమేనని నమ్మడం మొదలుపెట్టారు. ఆ భ్రమలోంచే ఆయన అనేక ఆణిముత్యా లను నోటి వెంట తుపుక్కు తుపుక్కుమని పలుమార్లు వెదజల్లారు. ఈ దేశానికి సెల్‌ఫోన్‌ను పరిచయం చేసింది తానేనని చెప్పారు. సత్యా నాదెళ్లను ఐటీలో ప్రోత్సహించింది తానేనని చెప్పారు. పీవీ సింధుకు మోటివేషన్‌ గురువు తానేనని చెప్పారు. అబ్దుల్‌ కలామ్‌ను రాష్ట్రపతిని చేసింది తానేనని అనేకసార్లు అన్నారు. బస్సులో కూర్చొని తాను తుపాన్లను కంట్రోల్‌ చేశానన్నారు. ‘నేను ముఖ్యమంత్రిగా ఉంటే కరోనా వచ్చేదా తమ్ముళ్లూ’ అని ప్రశ్నించి కరోనా కూడా తనను చూసి పారిపోతుందని పరోక్షంగా చెప్పారు. గతంలో తాను రెయిన్‌గన్‌ చేతబూని, కరువు రక్కసిని తరిమి తరిమి కొట్టానని ప్రకటించుకున్నారు.


వేరేవాళ్లెవరైనా ఇటువంటి మాటలు మాట్లాడితే వినేవాళ్లు ఏమనుకుంటారు? పూర్వకాలంలో పండుగలకూ పబ్బాలకూ గ్రామాల్లో అడుక్కోవడానికి పలురకాల వేషాలతో పలువురు యాచకులు వచ్చేవారు. వారిలో పిట్టల దొర పాత్ర ఒకటి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పాత్రను ‘లత్కోర్‌ సాబ్‌’ అని కూడా పిలుస్తారు. ‘మన్నించండి మారాజా ఆలస్యమైంది. ఏం జేస్తాం మారాజా... పొద్దున లేవంగనే పీఎమ్‌ ఫోన్, సీఎం ఫోన్, ప్రెసిడెంట్‌ ఫోన్, గవర్నర్‌ ఫోన్‌... వాళ్లందరికీ సర్దిచెప్పి, సలహా చెప్పి, ధైర్యం చెప్పేసరికి పొద్దుపోయింది. బయటకొచ్చి చూస్తే విమానం తోలే డ్రైవర్‌ రాలే, హెలికాప్టర్‌ టైర్ల గాలి లేదు. అందుకని నడుచుకుంట వచ్చేసరికి లేటైంది మారాజా...’ ఇట్లా ప్రారంభమౌతాయి పిట్టల దొర డైలాగులు. విదూషకుని మాటలు కనుక జనం కూడా నవ్వుకునేవారు. విదూషకుని మాటల్లానే విజనరీ నేతల మాటలు కూడా ఉంటే ఏం చేయాలి? నవ్వాలా... ఏడవాలా? జనానికి ఇదో సందిగ్ధావస్థ.


యెల్లో మీడియాకు, దాని అనుంగు కూటమికి ఇప్పుడు చాలా పెద్ద కష్టమొచ్చిపడింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల్లో ఎలాగైనా చంద్రబాబును గెలిపించాలి. గెలిపిం చకపోతే దెబ్బకు ఠా దొంగల ముఠా! ఇక యెల్లో ముఠా ఆగడాలకు ముకుతాడు పడినట్లే! అందు కని చావోరేవో తేల్చుకునే పోరుకు తెగించారు. గెలవాలంటే ఏకకాలంలో రెండు పనులు జరగాలి. జావగారిపోతున్న చంద్రబాబు పర్సనాలిటీకి బిగదీసి ప్యాడింగ్‌ చేయాలి. సకలజన సాధికారత పథకాలతో పెరిగిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇమేజిని డ్యామేజీ చేయాలి. యెల్లోమీడియా, దాని మిత్ర బృందాలు ఈ కర్తవ్య సాధన కోసం కంకణాలు కట్టుకున్నాయి. మూడు షిప్టులూ పనిచేస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిత్యం అసత్యాలను పోగేసి కాకమ్మ కథలను అచ్చేస్తున్నాయి.


యెల్లో మీడియా గ్రూప్‌ లీడరైన ‘ఈనాడు’ రాస్తున్న బేతాళ కథనాలను సాక్ష్యాధారాలతో చీల్చిచెండాడుతూ ‘సాక్షి’ పత్రిక నిజానిజాలను నిగ్గుతేల్చుతున్నది. అయినా సరే, ‘నవ్విపోదురు గాక నాకేటి వెరపు’ అన్నట్లున్నది ‘ఈనాడు’ ధోరణి. సందర్భం ఏదైనా సరే, స్పందనలు ఎలా ఉన్నా సరే.. చంద్రబాబు రైట్‌. ముఖ్యమంత్రి రాంగ్‌. ఇదీ యెల్లో మీడియా రూల్‌ బుక్‌లో మొదటి పాఠం. మొన్నటి గోదావరి వరదల సందర్భాన్నే తీసుకుందాము. ప్రకృతి విపత్తులను ఎదు ర్కోవడం, సహాయ – పునరావాస చర్యల కోసం ‘డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ (డీఆర్‌ఆర్‌) పేరుతో ఐక్యరాజ్య సమితి నిర్దిష్టమైన విధివిధానాలను రూపొందించింది.


ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తమ అవసరాలకు తగ్గట్టుగా ఈ విధానాలను పాటిస్తాయి. అంతర్జాతీయ స్థాయి నిపుణులు రూపొందించిన విధానాలు ఇవి. వరదలు రాగానే ముఖ్యమంత్రి కలెక్టర్ల నేతృత్వంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని రంగంలోకి దించారు. సహాయ – పునరావాసాలకు అవసరమైన అన్ని వనరులనూ వారికి అందుబాటులో ఉంచారు. ఇతర జిల్లాల నుంచి కూడా అవసరమైనంత మేరకు సిబ్బందిని తరలించారు. ముఖ్యమంత్రి రాజధాని కేంద్రంలో నిరంతరం అందుబాటులో ఉండి కార్యక్రమాలను పర్యవేక్షించారు.


మొదటిరోజో, రెండోరోజో ముఖ్యనేత ఆ ప్రాంతాలను సందర్శిస్తే ముఖ్యనేత పర్యటన ఏర్పాట్లలో యంత్రాంగం మునిగిపోతుందని, ఇది వాంఛనీయం కాదని నిపుణులు చెబుతారు. పలు దేశాలు ఈ పద్ధతిని పాటిస్తాయి. వైఎస్‌ జగన్‌ ఈ పద్ధతిని అనుసరిస్తూనే దీన్ని మరింత సృజనాత్మకం చేశారు. వారం రోజుల తర్వాత తాను వరద ప్రాంతాలను సందర్శి స్తానని, తమకు ప్రభుత్వ సాయం అందలేదనే గొంతు అప్పుడు వినపడకూడదనే షరతును ముఖ్యమంత్రి అధికారులకు విధించారు. దీంతో అధికార యంత్రాంగం అహోరాత్రులు శ్రమించి చరిత్రలో ఎన్నడూ లేనంత సమర్థంగా సహాయ చర్యల్ని చేపట్టింది.


వైపరీత్యాల తర్వాత వారం రోజులకు ప్రభుత్వాధినేతలు పర్యటనకు వెళ్లడం మన దేశంలో ఒక సాహసం. సహాయక చర్యలు అందని ప్రజలు తీవ్ర ఆగ్రహా వేశాలతో ఉంటారు. వారిని సముదాయించడం శక్తికి మించిన పనవుతుంది. మొదటి రెండు మూడు రోజుల్లో వెళ్లొస్తే ఈ పరిస్థితులు ఎదురుకావు. కానీ విచిత్రంగా వారం రోజుల తర్వాత పర్యటనకు వెళ్లినా జగన్‌ను బాధితులు ఆత్మబంధువు లాగానే స్వాగతించారు. ఒక్కరంటే ఒక్కరు కూడా తమకు సాయం అందలేదని చెప్పలేదు. ఇందుకు కారణం ముఖ్య మంత్రి అనుసరించిన శాస్త్రీయ కార్యాచరణ.


ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రతిష్ఠను దెబ్బతీసే రాతలు రాయడం, చంద్రబాబు ఇమేజిని పెంచే ప్రచారం చేయడం అనే యెల్లోమీడియా ఎత్తుగడ ఆత్మహత్యాసదృశం కాబోతున్నది. గతించిన కాలం మాదిరిగా యెల్లో మీడియా ఆడింది ఆట పాడింది పాట అనే పరిస్థితులు ఇప్పుడు లేవు. ప్రత్యామ్నాయ మీడియా ఉన్నది. సోషల్‌ మీడియా ఉన్నది. రకరకాల మార్గాల్లో ప్రజలకు నిజానిజాలు తెలుస్తున్నవి. వైఎస్‌ జగన్, చంద్ర బాబుల వ్యక్తిత్వాల పట్ల ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉన్నది. వ్యక్తిత్వంలోగానీ, విజన్‌లో గానీ, పాలనా సామ ర్థ్యంలోగానీ, పారదర్శకతలో గానీ, సామాజిక దృక్పథంలోగానీ జగన్‌ ముందు చంద్రబాబు సరితూగలేడు.

ప్రజలకిచ్చిన ఒకే ఒక్క మాట కోసం ఆనాడు సర్వ శక్తిమంతురాలైన భారత సామ్రాజ్ఞి హుకుంనామాను ధిక్క రించిన ధీశాలి జగన్‌. ఆ మార్గంలో వెళితే కష్టాల పాలవుతాననీ, కడగండ్లెదురవుతాయనీ తెలిసినా వెనుకడుగేయని మనో నిబ్బరం జగన్‌ సొంతం.


నమ్మి చేరదీసిన మామను గొంతుకోసి గద్దెనెక్కిన కుటిల స్వభావం చంద్రబాబుది. నిరంతరం కుట్రలూ, కూహకాలలో మునిగితేలుతూ అధికారాన్ని కాపాడుకునే దుర్నీతి బాబుది. అధికారం కోసం అలవిమాలిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మ్యానిఫెస్టోను మాయం చేసి హామీలను అటకెక్కించే మోసపూరిత నడవడి చంద్రబాబుది. ఆనాడు ‘రైతు రుణమాఫీ హామీ’ ఇవ్వకపోతే ఓడిపోతావని పలువురు హెచ్చరించినా ఓటమికైనా సిద్ధపడ తాను కానీ, నిలబెట్టుకోలేని మాటను ఇవ్వలేనని కుండబద్దలు కొట్టిన స్థిరచిత్తం జగన్‌ది.


అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే చేపట్టిన పరిపాలనా సంస్కరణలకు ఈరోజున దేశమంతా జైకొడు తున్నది. కరోనా మహమ్మారిని ఎదుర్కొన్న తీరు జగన్‌ పరిపాలనా సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రపం చంలో ఎన్నిచోట్ల నుండి ఎన్ని ప్రశంసలు వచ్చినా వాటిని ప్రచారంలో పెట్టుకోకపోవడం జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిత్వపు మరో ప్రత్యేకత. మూడేళ్లలో లక్షా అరవై ఐదు వేల కోట్ల రూపా యలను ప్రజలకు డీబీటీ పద్ధతిలో బదిలీ చేయడం, పైసా దుర్వినియోగం కాకపోవడం దేశంలో ఒక రికార్డు.


దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, మహిళల సాధికారత కోసం అమలుచేస్తున్న ఆర్థిక, రాజకీయ ఉద్దీపన కార్యక్రమాలు ఈ దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఎన్నడూ కనీవినీ ఉండలేదు. బీసీలకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్లుండాలని పార్లమెంట్‌లో బిల్లు పెట్టిన రాజకీయ పార్టీ ఈ దేశంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటే. కాగా, బీసీలు జడ్జీలుగా పనికిరారని కేంద్రానికి లేఖలు రాసిన చరిత్ర చంద్రబాబుది. ఎస్‌సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని ఈసడించుకునే దురహంకారం చంద్రబాబు సొంతం.


దళితుల్ని ఉపముఖ్యమంత్రులు, కీలక శాఖల సారథులుగా ఎంపిక చేసుకున్న సౌభ్రాతృత్వం జగన్‌ నైజం. స్థానిక సంస్థల్లోనూ, నామినేటెడ్‌ పనుల్లోనూ, పదవుల్లోనూ సగభాగం మహిళలకు కేటాయించి మంత్రివర్గంలో హోమ్‌ శాఖతో సహా కీలక శాఖలను కట్టబెట్టిన ఘనత జగన్‌ ప్రభు త్వానిది. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా’ అని మాట్లాడే పురుషాహంభావం చంద్రబాబుది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఇప్పుడు విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాటి గురించి మాట మాత్రపు ప్రస్తావనైనా లేకుండా అక్కడక్కడ దొర్లే చిన్నచిన్న పొరపాట్లపై భూతద్దాలు వేసే వికృత పాత్రికేయానికి యెల్లో మీడియా పాల్పడుతున్నది. ఎగసిపడుతున్న విప్లవ కెరటాలు దాచేస్తే దాగేవి కావు. ఎల్లో మీడియా కళ్లు మూసుకుంటే లోకం చీకటి కాబోదు!


వర్ధెల్లి మురళి 

vardhelli1959@gmail.com

Wednesday, July 20, 2022

పోలవరం ఎత్తుకు భద్రాచలం ముంపునకు సంబంధం లేదు

 పోలవరం ఎత్తుకు భద్రాచలం ముంపునకు సంబంధం లేదు

Jul 20, 2022, 05:11 IST

Ambati Rambabu On Polavaram Project Hight Badrachalam Flood - Sakshi

ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టీకరణ


గోదావరి ఉధృతితోనే నదీ పరీవాహక ప్రాంతాల ముంపు


1986 వరదల సమయంలో కూడా భద్రాచలం మునిగింది


తెలంగాణ మంత్రి పువ్వాడ వ్యాఖ్యలు సరికాదు


పోలవరం 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మించేందుకు కేంద్రం క్లియరెన్స్‌


సాక్షి, హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టుకు భద్రాచలం ముంపునకు ఎలాంటి సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గోదావరి నదికి భారీగా వచ్చిన వరదల వల్లనే తెలంగాణ, ఆంధ్రలోని నదీ పరీవాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఏపీలోనూ గోదావరికి వచ్చిన వరదల వల్ల తెలంగాణ, ఆంధ్రల్లోని అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని, 1986లో గోదావరి వరదల వల్ల భద్రాచలం ముంపునకు గురయిందని అంబటి గుర్తు చేశారు. పోలవరం ఎత్తు పెంచడం వల్ల తెలంగాణలోని ప్రాంతాలు మునిగి పోతున్నాయని, భద్రాచలం మునగడానికి కూడా ఇదే కారణమని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వి.ప్రకాశ్‌ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు.  



పూర్తిగా నిండినా నష్టం ఉండదన్న సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌

పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతు లు ఇచ్చిందని అంబటి గుర్తు చేశారు. ఈ ఎత్తులో రిజర్వాయర్‌ పూర్తిస్థాయిలో నిండినా (ఎఫ్‌ఆర్‌ఎల్‌) నష్టం ఉండదని సెంట్రల్‌ వాటర్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) పరిశోధించి తేల్చిందని చెప్పారు. అందుకే పోలవరం నిర్మాణం వల్ల ముం పునకు గురయ్యే ఏడు మండలాలను విభజన సమ యంలో ఏపీకి కేటాయించారన్నారు. జాతీయ ప్రాజెక్టు పోలవరం వల్ల ముంపునకు గురయ్యే ఏడు మండలాల వారికి పునరావాసం కల్పించే బాధ్యత ఏపీ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. 



కొత్త వివాదాలు సృష్టించవద్దు

‘రెండు రాష్ట్రాల్లో బాధ్యతాయుత పదవుల్లో ఉన్న వాళ్లం. వివాదాలన్నీ సెటిల్‌ అయ్యాయి. ఇప్పుడు మనకేం వివాదాలు లేవు. కొత్త వివాదాలను సృష్టించుకోవద్దు’అని అంబటి సూచించారు. జల వివాదాలకు సంబంధించి సెంట్ర ల్‌ వాటర్‌ కమిటీ , కృష్ణా, గోదావరి రివర్‌ బోర్డులతో పాటు కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పారు.  విడిపోయి కలిసుందాం అన్న మాటలకు కట్టుబడి రెండు రాష్ట్రాల ప్రతినిధులు సోదరభావంతో ఉండాలని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టు దశలవారీగా పూర్తవుతుందని,. వివరాలతో శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామన్నారు.  


భద్రాచలం ఇవ్వమంటే ఇచ్చేస్తారా?

భద్రాచలం సమీపంలో ఉన్న ఏపీ పరిధిలోని ఐదు గ్రామాలను తెలంగాణకు ఇచ్చేయాలంటూ మంత్రి పువ్వాడ అడిగిన విషయాన్ని ఓ విలేకరి ప్రస్తావించగా.. ‘ఇచ్చేయమనగానే ఇస్తారా? అలా అంటే భద్రాచలం మాదే కదా.. ఏపీకి ఇచ్చేయమంటే ఇచ్చేస్తారా?’అని అంబటి ప్రశ్నించారు.  


వరదలపై ఈనాడు వక్రబుద్ధి

గోదావరి వరదల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలోను ఈనాడు తన కుటిలబుద్ధిని వద లడం లేదని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అనూహ్యంగా జూలై నెలలో గోదావరికి వచ్చిన వరదలను ఆరు జిల్లాల ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సమర్థంగా ఎదుర్కొని సహాయ కార్య క్రమాలు చేపడితే.. ఈనాడు పత్రిక.. ‘పిల్లలకు పా లు లేవు.. పెద్దలకు తిండిలేదు..’ అని దుర్మార్గంగా తప్పుడు వార్త రాసిందని చెప్పారు. దీనిపై  తాను మాట్లాడిన మాటలను కూడా వక్రీకరించింద న్నారు.


అనూహ్యంగా జూలై నెలలో ఈ వరదలు వచ్చాయని చెబితే.. ప్రకృతి వైపరీత్యాలు– మన మేం చేయలేం అని వారి తప్పుడు వార్తను తాను ఒప్పుకొన్నట్లు రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామోజీరావుకు వయసొచ్చిందిగానీ బుద్ధి రాలేద న్నారు. చంద్రబాబును అర్జెంటుగా సీఎంను చేయాలని, భుజాన పెట్టుకుని వెళ్లాలనుకుంటున్న రామోజీరావు తన వక్రమార్గాన్ని వీడాలని హితవు పలికారు. ‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అమరావతిలో ఉష్ణోగ్రతలను కంట్రోల్‌ చేయమని అధికారులను ఆదేశించాడు. తిత్లీ తుపాన్‌ను అధికారులు కంట్రోల్‌ చేస్తున్నారని చెప్పాడు. అలాంటి మాటలను రాయని రామోజీరావు నేను అనని మాటలను అన్నట్లు రాస్తున్నాడు..’ అని అన్నారు.










అనుమతుల ప్రకారమే పోలవరం 

Jul 20, 2022, 05:16 IST

Botsa Satyanarayana On Polavaram Project Puvvada Ajay - Sakshi

భద్రాచలానికి ముంపు కొత్త కాదు.. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఉంది


విలీన గ్రామాలను తెలంగాణలో కలిపేయమనడం సరికాదు


హైదరాబాద్‌ను ఏపీలో కలిపేస్తామంటే ఒప్పుకుంటారా?


తెలంగాణ మంత్రి పువ్వాడపై మంత్రి బొత్స ఆగ్రహం


విలీన మండలాల పూర్తి బాధ్యత ఏపీదేనని స్పష్టీకరణ  


సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అనుమతుల ప్రకారమే జరుగుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కొత్తగా ఎత్తు పెంపు అంశం ఎక్కడిదని ప్రశ్నించారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విలీన గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ ఆ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌ చేసిన వ్యాఖ్యలపై బొత్స మండిపడ్డారు. ‘అసలు పోలవరం ఎత్తు ఎప్పుడు పెంచారు? సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ఏదీ జరగదు కదా? విభజన చట్టంలో పేర్కొన్న అంశాల ప్రకారమే పోలవరం పనులు చేస్తున్నాం.



భద్రాచలం ముంపు అనేది ఉమ్మడి రాష్ట్రం నుంచే ఉందన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే చాలాకాలం తర్వాత భారీ వరదలు వచ్చాయి. సాంకేతికంగా ఇబ్బందులొస్తే దానిని ఎలా అధిగమించాలి.. ఏ రకంగా శ్రద్ధ తీసుకుంటే బాగుంటుందో తెలుసుకోవాలి. అక్కడా.. ఇక్కడా ఉన్నది ప్రజలే. సమస్య ఎక్కడైనా ఒక్కటే. దాని పరిష్కారానికి మాట్లాడే వ్యక్తులు బాధ్యతగా నడుచుకోవాలి. ముంపు వచ్చింది.. ఇవే కారణాలంటే ఎలా కుదురుతుంది? సమస్యపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదు’ అని పువ్వాడ అజయ్‌కు హితవు పలికారు.


హైదరాబాద్‌ను కలిపేస్తారా?

విలీన గ్రామాలను తిరిగి కలిపేస్తామంటున్న తెలంగాణ నాయకులు ఏపీలో హైదరాబాద్‌ను కూడా కలిపేస్తామంటే ఒప్పుకుంటారా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. ‘రాష్ట్ర విభజన వల్ల ఏపీకి హైదరాబాద్‌ ద్వారా రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది. ఇప్పుడు హైదరాబాద్‌ను ఆంధ్రాలో కలిపేసి ఉమ్మడిగా ఉంచాలని అడిగితే బాగుంటుందా? అలా అయితే చేసేయమనండి తప్పు లేదు. రెండు తెలుగు రాష్ట్రాలను ఒకటిగా ఉంచమనండి. అభ్యంతరం లేదు’ అని బొత్స వ్యాఖ్యానించారు. ఏపీలో విలీనమైన మండలాలు, అందులోని ప్రజలు తమ ప్రభుత్వ కుటుంబసభ్యులేనన్నారు. వారి పూర్తి బాధ్యత తమదేనని చెప్పారు.


పువ్వాడ పక్క రాష్ట్రాల గురించి మాట్లాడటం తగదన్నారు. బాధ్యత గల ప్రభుత్వంగా.. వరదలను సమర్థంగా ఎదుర్కొన్నామని.. బాధితులకు అండగా నిలిచామన్నారు. పార్లమెంట్‌లో విలీన మండలాల అంశాన్ని తెలంగాణ తీసుకొస్తే.. తాము కూడా తెలుగు రాష్ట్రాలను కలిపేయాలని డిమాండ్‌ చేస్తామంటూ విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బొత్స బదులిచ్చారు.


అక్షరాస్యతలో ప్రథమ స్థానమే లక్ష్యం

విజయవాడ సత్యనారాయణపురంలోని ఏకేటీపీ మునిసిపల్‌ హైస్కూల్‌లో నిర్మించిన తరగతి గదులను మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ప్రారంభించారు. అలాగే విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో రూ.33.49 కోట్ల నిధులతో 28 ప్రభుత్వ పాఠశాలల్లో 168 అదనపు తరగతి గదుల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తున్నామన్నారు. అక్షరాస్యతలో ప్రథమ స్థానమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ చైర్మన్‌ పి.గౌతమ్‌రెడ్డి, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. 






Published: Wed, 20 Jul 2022 03:38:44 ISTహోంతెలంగాణపోలవరం గరంగరంtwitter-iconwatsapp-iconfb-iconపోలవరం గరంగరం

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్సం|| 93979 79750

ఆ ప్రాజెక్టుతోనే భద్రాచలం మునక

సమయానికి ఏపీ వరదను వదల్లేదు

ఐదు ఊళ్లు ఇస్తే కరకట్ట నిర్మించుకుంటాం

రాముడి కోసం పోలవరం ఎత్తు తగ్గించండి

విలేకరుల సమావేశంలో పువ్వాడ వ్యాఖ్యలు

భగ్గుమన్న ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు 

భద్రాచలానికి వరద ముంపు కొత్త కాదు

డిజైన్‌కు అనుగుణంగానే పోలవరం నిర్మాణం

విభజనతో మేమూ ఆర్థికంగా నష్టపోయాం

రాష్ట్రాలను కలిపేద్దామని బొత్స ప్రతిపాదన

భద్రాచలం ఇస్తారా? అని అడిగిన రాంబాబు



(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ఒకపక్క గోదావరి వరద ప్రాంతాలు ఇంకా కోలుకోలేదు. పంటలు పోయాయి. తిండీ నీళ్లు లేవు. సహాయక చర్యల తీరు పట్ల బాధితుల్లో ఆక్రోశం... అసలు సమస్యను వదిలేసి రెండు తెలుగు రాష్ట్రాల నేతలు పరస్పర ఆరోపణలకు దిగారు. బాధితులకు తక్షణ సాయం ఏం చేయాలి? ఇలాంటి వరదలు వస్తే ఎదుర్కోవడానికి భవిష్యత్తులో ఏం చేయాలి? లాంటి అంశాలను పక్కనబెట్టి పోలవరం ఎత్తు, ఏపీకి బదలాయించిన గ్రామాలను వెనక్కివ్వడం, ఉమ్మడి రాజధాని వంటి రాష్ట్ర విభజన సమస్యలను తెర మీదకు తెచ్చి సవాళ్లు  విసురుకుంటున్నారు. పోలవరం ఎత్తు తగ్గించాలని డిమాండ్‌ చేయడం ద్వారా సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం పిల్లి మెడలో గంట కట్టారు. దాంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో వెనుక బడతామేమోనన్న భయమో ఏమో మంత్రి పువ్వాడ అజయ్‌ నేతృత్వంలో జిల్లా టీఆర్‌ఎస్‌ ముఖ్యులంతా హైదరాబాద్‌కు తరలి వచ్చారు. విలేకరుల సమావేశం పెట్టారు. పోలవరం నుంచి నీళ్లు వదలడంలో ఏపీ నిర్లక్ష్యం చేసినందువల్లే భద్రాచలం ప్రాంతం వరద నీటిలో మునిగిపోయిందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ ఆరోపించారు. ఇరు రాష్ట్రాల ప్రజల ఆరాధ్య దైవమైన భద్రాచలం రామచంద్రస్వామికి వరద ముప్పు లేకుండా చూడటానికి పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించాలని, గోదావరిపై కరకట్ట నిర్మాణానికి వీలుగా భద్రాచలం పట్టణాన్ని ఆనుకుని ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణకు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని కేంద్రాన్ని కోరతామన్నారు. విభజన చట్టం ఆధారంగా కడుతున్న ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి అభ్యంతరం వ్యక్తం చేయడం సరికాదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ బదులిచ్చారు. విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు హైదరాబాద్‌ను ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా నష్టపోయిందని, ఇప్పుడు హైదరాబాద్‌ను ఏపీకి ఇవ్వమని అడగగలమా? అని ప్రశ్నించారు. ఏపీ ముంపు గ్రామాల్లో సహాయక చర్యల గురించి బాధ్యత కలిగిన వ్యక్తిగా తెలంగాణ మంత్రి మాట్లాడకుండా ఉంటే మంచిదని వ్యాఖ్యానించారు. ముంపు సమస్యను తెలంగాణ లోక్‌సభలో లేవనెత్తితే తాము ఇరు రాష్ట్రాలను కలపాలన్న డిమాండ్‌ను తెర మీదకు తెస్తామని అన్నారు. భద్రాచలం ప్రస్తుత వరదకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధమే లేదని, అది ఇప్పట్లో పూర్తయ్యే ప్రాజెక్టు కూడా కాదని ఏపీ నీటి పారుదల మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

చిచ్చుపెట్టేలా అజయ్‌ వ్యాఖ్యలు: బీజేపీవిపత్కర పరిస్థితిలో కూడా టీఆర్‌ఎస్‌ బురద రాజకీయాలు చేస్తోందని ఽబీజేపీ నేత సుభాష్‌ ధ్వజమెత్తారు. అజయ్‌ వ్యాఖ్యలు ఏపీ, తెలంగాణ మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని ఆరోపించారు. వరదనష్టంపై బండి సంజయ్‌ విజ్ఞప్తి మేరకు కేంద్ర హోంమంత్రి కమిటీని ఏర్పాటు చేశారని, ఈ కమిటీ కోరిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే జాతీయ విపత్తుల నిధి కింద  సాయం అందుతుందని చెప్పారు.

తప్పుడు ప్రచారం వద్దుఢిల్లీలోనూ ఇరు రాష్ట్రాల అధికార పార్టీల ఎంపీలు మాటల యుద్ధానికి దిగారు. గోదావరి వరదలకు చాలా అంశాలు కారణమని వైసీపీ ఎంపీలు వంగా గీత, అయోధ్య రామిరెడ్డి అన్నారు. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల వల్లే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిండిపోయిందన్నారు. కేంద్రం నిధులతో నిర్మించే ప్రాజెక్టు గురించి తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు. ఎత్తు ఎంత పెంచారు, నీళ్ల సామర్థ్యం ఎంత, నీళ్ల వివాదం ఏంటి? అనేవి తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని టీఆర్‌ఎస్‌ ఎంపీలు రంజిత్‌రెడ్డి, వెంకటేష్‌ నేత అన్నారు. గోదావరి నీటిని తాత్కాలికంగానైనా చెరిసగం చొప్పున పంచాలని కోరారు.

నా మాటల్లో తప్పేంటి?ఏపీ నేతల స్పందన తర్వాత సాయంత్రం పువ్వాడ మరోసారి మీడియాతో మాట్లాడారు. ఏపీ మంత్రుల వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. ఇరు రాష్ట్రాల ప్రజల కోసం మాట్లాడిన వ్యాఖ్యలను వక్రీకరించి, విమర్శించడం సరికాదన్నారు. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. ఐదు విలీన గ్రామాలను కేటాయించాలని కోరితే.. హైదరాబాద్‌ ఇస్తారా అనటం.. అసందర్భం.. అర్థరహితమని అజయ్‌ పేర్కొన్నారు. జగన్‌తో చర్చించి భద్రాచలం రాముడి కోసం 5 గ్రామాలను ఇప్పించాలని కోరారు. వరద బాధితుల కోసం కేసీఆర్‌ వెయ్యి కోట్ల సాయం ప్రకటించడం పట్ల పువ్వాడ కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్‌కు వరద సాయం చేసిన కేంద్రం తెలంగాణకు ఇప్పటి వరకు సాయం ప్రకటించలేదన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన రాష్ట్ర గవర్నర్‌ కేంద్రం సాయం అందించేందుకు ప్రతిపాదనలను పంపాలని కోరారు.

పోలవరంపైనే అనుమానం?పోలవరం నిర్మాణం మొదలయ్యాక గోదావరి నడక మారిందని స్థానికులు, ఇంజనీర్లు అంటున్నారు. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహ ఒరవడి గతంకంటే కొంత నెమ్మదిగా ఉండడం, వరద తగ్గడానికి కూడా ఎక్కువ సమయం పట్టడంతో.... ఇదంతా పోలవరం ప్రభావమేనని స్థానికుల్లో అనుమానాలు పెరిగాయి. వారి గొంతునే అధికార పార్టీ నేతలు హైదరాబాద్‌లో వినిపించారు. విలేకరుల సమావేశం అనంతరం నేతలు ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. 

కేంద్రం చొరవ చూపాలి - పువ్వాడ అజయ్‌కుమార్‌రాష్ట్ర మంత్రి పువ్వాడ మంగళవారం హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష కార్యాలయం లో ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి విలేకరుల సమావేశం లో మాట్లాడారు. ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతమధు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, ఎం.నాగేశ్వర్‌రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పోలవరం ప్రా జెక్టు ఎత్తు తగ్గించాలని మొదటి నుంచి తాము డి మాండ్‌ చేస్తున్నామని, ఏపీ సర్కారు పట్టించుకోవడం లేదని పువ్వాడ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాథమిక డిజైన్‌ మార్చి మూడు మీటర్ల ఎత్తు పెంచుకున్నారని, దాన్ని తగ్గించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు. గోదావరి కరకట్టల పటిష్టం పై ఏపీ సర్కారు దృష్టి సారించడం లేదని, దాంతో భ ద్రాచలం ఎగువన ఏపీ నిర్వహణలో ఉన్న ప్రాంతంలో కరకట్ట లీకేజీ ద్వారా పట్టణంలోకి వరద ప్రవేశించిందని చెప్పారు. ఆ ప్రాంతంలో ఏపీకి చెందిన ఐదు గ్రామాలు ఉన్నాయని, వాటిని తెలంగాణకు ఇవ్వాలని కోరారు. దానికి కేంద్రం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.  ఏడు మండలాలను ఆంధ్రాలో కలపాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తాము ఆదిలోనే నిరసన తెలిపామన్నారు. 

ముంపు కొత్త కాదు: బొత్సఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిలో విలేకరులతో మాట్లాడారు. పోలవరం ఎత్తు పెంచడం వల్ల భద్రాచలం మునిగిందంటే ఎలా అని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనులు ఒరిజనల్‌ డిజైన్‌ప్రకారమే చేస్తున్నారని చెప్పారు. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ఏమీ చేయలేమని గుర్తు చేశారు. భద్రాచలానికి ముంపు కొత్త కాదని, వందేళ్ల తర్వాత మొదటిసారి గోదావరికి ఇంత వరద వచ్చిందని చెప్పారు. సాంకేతికంగా ఏదైనా ఇబ్బంది వస్తే అడగాలే తప్ప అవివేకపు మాటలు మాట్లాడొద్దని అన్నారు. సమస్య లేకుండా ఎలా అనేది చూసుకోవాలే తప్ప రెచ్చగొట్టే మాటలు సరి సరికాదన్నారు. పక్కనున్నది పాకిస్తాన్‌ ప్రభుత్వమేమీ కాదు కదా.. ఆంధ్రాతో సెటిల్‌ చేసుకుంటామని కేసీఆర్‌ వ్యాఖ్యానించిన విషయాన్ని మీడియా ప్రస్తావించగా.. పూర్తిగా స్వాగతిస్తామన్నారు. పోలవరం ముంపు గ్రామాలను ఏపీ ప్రభుత్వం పట్టించుకో లేదని పువ్వాడ అన్నట్లుగా కొందరు విలేకరులు ప్రస్తావించగా, ‘‘రాష్ట్రంలో విలీనమైన మండలాల బాధ్యత మాది. ఖమ్మం జిల్లాలో ముంపు సంగతి అయన్ని చూసుకోమనండి. పక్క రాష్ట్రాల గురించి మాట్లాడటం బాధ్యతగల వ్యక్తులకు తగదు’’ అన్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో విలీనానికి సంబంధించి డిమాండ్‌ తీసుకొస్తామన్న టీఆర్‌ఎస్‌ నేతల వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ.. ‘‘మంచిది. తీసుకురమ్మనండి. విభజిత రాష్ట్రాన్ని మళ్లీ కలిపేయాలన్న డిమాండ్‌ను మేం కూడా తీసుకొస్తాం’’ అని బదులిచ్చారు.

ఎవరు చెప్పింది నమ్మాలి? రేవంత్‌పోలవరం విషయంలో కేసీఆర్‌ చెప్పింది నమ్మాలా? మంత్రి పువ్వాడ చెప్పింది నమ్మాలా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. అసలు సమస్యను పక్కదోవ పట్టించేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వరదలకు రాష్ట్రంలో 11 లక్షల హెక్టార్లలో పంట నీటి పాలైతే మొదట విదేశీ కుట్ర అన్న కేసీఆర్‌ ఇప్పుడు పక్క రాష్ట్రాల కుట్ర అంటున్నారని ఎద్దేవా చేశారు. వరద మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. నష్టంపై కేంద్రానికి సంపూర్ణ నివేదిక పంపాలని, ఢిల్లీకి వచ్చి ఒత్తిడి తెచ్చి రూ.2000 కోట్ల సాయం రాబట్టాలని కోరారు. రాష్ట్రంలో జరిగిన అవినీతిపై చర్చ జరగకుండా కేసీఆర్‌ విదేశీ కుట్రను తెర మీదకు తెచ్చారని ఆరోపించారు. వరద సాయం చేయని బీజేపీ 21 నుంచి ఊళ్లకు వస్తోందని ఎక్కడికక్కడ అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్రభుత్వం నిద్ర పోతోందా?: భట్టిపోలవరం ఎత్తు పెంచుతుంటే తెలంగాణ ప్రభుత్వం నిద్రపోతోందా అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. పోలవరం కాఫర్‌ డ్యామ్‌ ఎత్తును మూడు మీటర్లు పెంచి కట్టడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుందని తెలిసి కూడా ప్రభు త్వం ఎందుకు బాధ్యతా రహితంగా ఉందని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం పోలవరం ఎత్తు పెంచుతుంటే గూగుల్‌లో కేసీఆర్‌కు కనపడలేదా అన్నారు. పోలవరం ముంపులోని ఏడు మండలాలను ఏపీలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపారా? ఏం సమాధానం వచ్చింది? ఈ అంశంపైప్రధానిని ఎన్ని సార్లు కలిశారు? ఆర్డినెన్స్‌ రద్దు చేయాలంటూ కేంద్రంపై ఒత్తిడి తేవడం కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎందుకు తీసుకెళ్లలేదు?’’ అంటూ ప్రశ్నించారు. ఏడు మండలాలు ఏపీలో కలపకుంటే ఇప్పుడు కరకట్ట సమస్య వచ్చేదే కాదన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులపై సాంకేతిక కమిటీ వేసి.. సమగ్ర నివేదికను రూపొందించాలన్నారు.

భద్రాచలం ఇచ్చేస్తారా?- అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని ఏపీ జల వనరుల మంత్రి అంబటి రాంబాబు అన్నారు.  దశలవారీగా పూర్తి చేస్తామని మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులకు తెలిపారు. పోలవరం ఎత్తు మరో మూడు మీటర్లు పెంచుతున్నామన్నది వాస్తవం కాదన్నారు. భద్రాచలం మునకకు పోలవరం కారణం కాదని చెప్పారు. పోలవరం ఎగువన 45.72 మీటర్ల కాంటూరులో నీళ్లు నిలిపేందుకు కేంద్రం నుంచి అనుమతి ఉందని, తెలంగాణలోని ఏడు మండలాలు అందులో ఉండటంతో ఏపీకి కలిపారని తెలిపారు. భద్రాచలం చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాలు కావాలంటే కేంద్రాన్ని అడగాలని, భద్రాచలాన్ని తమకు ఇచ్చినా అభ్యంతరం లేదని చెప్పారు. 

Tuesday, July 19, 2022

No Special Category Status for AP

 హోదా రాదుtwitter-iconwatsapp-iconfb-icon

హోదా రాదు

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్సం|| 93979 79750మరోసారి తేల్చి చెప్పిన కేంద్రం


అయినా... సీఎం జగన్‌ మౌనంఎన్నికల ముందు పులిలా గాండ్రింపుఅధికారంలోకి రాగానే ‘హ్యాండ్సప్‌’25 మంది ఎంపీలను గెలిపించాలని..హోదా తీసుకొస్తానని పదేపదే ప్రకటనతననే నమ్మాలని ప్రజలకు పిలుపుసీఎం కాగానే అంతే సంగతులుతనతో అవసరమున్నప్పుడూ గుర్తుకురాని ప్రత్యేక హోదా డిమాండ్‌అడగక ముందే బీజేపీకి అన్నింటా మద్దతు

ప్రత్యేక హోదాపై కేంద్రం పాతపాటే పాడింది!  హోదా ఇవ్వలేమని తేల్చిచెప్పింది.  ఈ అంశంపై పార్లమెంటులో టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానందరాయ్‌  సమాధానమిచ్చారు.  నిజానికి...  ఈ అంశాన్ని  జగన్‌  ఎప్పుడో ‘వదిలేశారు’! ఇప్పుడు కేంద్రం ‘నో’ అన్నా  ఆయనది మౌనమే. 

ఎన్నికల ముందు... కాంగ్రె్‌సను నమ్మొద్దు. బీజేపీని నమ్మొద్దు. చంద్రబాబును, ఆయన పార్టనర్‌ను నమ్మొద్దు. 25కి 25 ఎంపీ స్థానాలు మనమే గెలుచుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తామంటారో, ఎవరైతే సంతకం చేస్తారో వాళ్లకే మద్దతిస్తాం! మన ఎంపీలను మన దగ్గరే పెట్టుకుందాం! ఆ తర్వాత నువ్వు సంతకం పెట్టు... పెట్టిన తర్వాతనే నీకు మద్దతిస్తాం అని చెబుతానని మీకు హామీ ఇస్తున్నా.- 2018 నవంబరు 28న పాలకొండలో జరిగిన సభలో జగన్‌!

 అధికారంలోకి వచ్చాక!వాళ్లకు (బీజేపీకి)  250 సీట్లు దాటకూడదని దేవుడిని చాలా ప్రార్థించాను. ఏం చేద్దాం! మన ఖర్మ అనుకోవాలో ఏమో! మన అవసరం లేకుండానే వాళ్లు బలంగా ఉన్నారు. వాళ్లకు మనతో అవసరం లేదు కాబట్టి అడుగుతూ పోవడమే! ఈ ఐదేళ్లలో ప్రధానిని కలిసిన ప్రతిసారీ... ఆయన ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకూ అడుగుతూనే ఉంటా. ఎప్పుడో ఓసారి వస్తుంది!- 2019 మే 27న ఢిల్లీలో మోదీని కలిసిన తర్వాత జగన్‌

‘అవసరానికి’ ఓ మాట..‘కేంద్రానికి ఏదో  ఒకరోజు మన అవసరం వస్తుంది. అప్పుడు... ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నీ అమలు చేస్తేనే మద్దతిస్తామని డిమాండ్‌ చేస్తాం. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని పదేపదే అడుగుతూనే ఉంటాం!’’- రెండేళ్ల కిందట జరిగిన ఒక సదస్సులో సీఎం

(అమరావతి - ఆంధ్రజ్యోతి)విపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాపై పులిలా గాండ్రింపులు! మెడలు వంచి మరీ సాధిస్తామంటూ సింహ గర్జనలు! అధికారంలోకి వచ్చిన తక్షణం... గాండ్రింపులు, గర్జనలు మాయమైపోయాయి! తాను అధికారంలోకి వచ్చేందుకు, అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబును ‘ఇరికించేందుకు’ ఉపయోగించుకున్న ప్రత్యేక హోదా... వైసీపీ అజెండా నుంచి ‘మాయమైపోయింది’! ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదు’ అని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరోమారు స్పష్టంగా తేల్చి చెప్పింది. అయినా సరే... జగన్‌ మారు మాట్లాడరు. అన్ని విషయాలలో అడగకుండానే బీజేపీకి మద్దతు ఇవ్వడం మాత్రం కొనసాగిస్తూనే ఉంటారు. ప్రతిపక్షంలో ఉండగా ‘హోదా’పై పులివెందుల పులిలా రాష్ట్రవ్యాప్తంగా గాండ్రించిన జగన్‌.. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో భారీ విజయం సాధించి ‘తాడేపల్లి’కి చేరిన తర్వాత పిల్లిలా మారిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కేంద్రానిది అదే మాట....రాష్ట్ర విభజన సమయంలో నవ్యాంధ్రకు ఐదు కాదు, పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీ పట్టుబట్టింది. కానీ... అధికారంలోకి రాగానే ఆ మాట పక్కనపెట్టింది. ఆర్థిక సంఘం సిఫారసుల పేరు చెప్పి హోదాకు సమానమైన ప్రయోజనాలతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. రాష్ట్ర విభజన కష్టాలు, విభజన హామీలు నెరవేర్చుకోవాల్సిన అవసరం, కేంద్ర సహకార ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటి టీడీపీ సర్కారు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో సామరస్య ధోరణి ప్రదర్శించింది. కేంద్ర సంస్థల ఏర్పాటు, పోలవరం, అమరావతి రాజధాని, లోటు నిధుల వంటివి సాధించుకుంటూ వచ్చిం ది. అప్పుడు కూడా బీజేపీకి ఇతర పార్టీలతో అవసరం లేదు. సొంతంగానే మ్యాజిక్‌ మార్కును సాధించింది. అయితే అప్పుడు విపక్షంలో ఉన్న జగన్‌ ఊరూరా తిరుగుతూ ‘హోదా’ వాదన చేశారు. కేంద్రంతో ఎందుకు గొడవ పడటంలేదంటూ చంద్రబాబును నిలదీశారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే... కేంద్రం మెడలు వంచి మరీ హోదా సాధిస్తామని పదేపదే ప్రకటించారు. చివరికి... చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో ఘర్షణకు దిగారు. టీడీపీ ఎంపీల చేత కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయించారు. ‘చంద్రబాబు వైసీపీ ట్రాప్‌లో పడ్డారు’ అని అప్పట్లో పార్లమెంటు వేదికగా మోదీ వ్యాఖ్యానించారు. ఒకవైపు చంద్రబాబు కేంద్రంతో పోరాడటం లేదంటూనే... జగన్‌ తాను మాత్రం బీజేపీకి అన్ని అంశాల్లో సహకరిస్తూ వచ్చారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల సమయంలో బీజేపీకి అవసరం ఎంతగానో ఉంది. అయినా సరే... హోదా గురించి అడగలేదు. పైగా... ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించకముందే, తానే ముందుగా మద్దతు ప్రకటించేశారు.

నాటి గర్జనలు ఎక్కడ?హోదాపై చంద్రబాబు, నరేంద్రమోదీ, పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రాన్ని మోసం చేశారంటూ ప్రతిపక్ష నేతగా 2019 ఎన్నికల ముందు శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్‌ తీవ్రస్థాయిలో విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో నాలుగేళ్లుగా చంద్రబాబు సంసారం చేసినా హోదాను తీసుకురాలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదాపై చంద్రబాబు కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేదన్నారు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన హామీలతో సహా .. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇస్తామంటూ బీజేపీ, టీడీపీ, జనసేన హామీ ఇచ్చాయని గుర్తు చేశారు. ‘‘ఒకరు చేతులు పట్టుకుంటే.. మరొకరు  చేతికి కత్తి ఇచ్చారు. చివరకు ఇంకొకరు కత్తితో గట్టిగా పొడిచేశారు’’ అని బాధపడ్డారు. హోదాను ఎన్నికల అస్త్రంగా మార్చేసి... మొత్తం 25 లోక్‌సభ స్థానాలనూ వైసీపీ గెలుచుకుంటే.. ప్రత్యేక హోదా ఇచ్చిన వారికే కేంద్రంలో మద్దతు ప్రకటిస్తామన్నారు. ఇదే కాదు! పాదయాత్రలో ప్రతిచోటా ‘హోదా’ పేరుతో యువతను రెచ్చగొట్టారు. ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్‌ అవుతుందన్నారు. ‘నన్ను నమ్మండి. ప్రత్యేక హోదా తీసుకొస్తా’ అన్నారు. చివరికి... ఎన్నికల్లో గెలిచి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే హోదాపై చేతులెత్తేశారు. బీజేపీకి 250కిపైగా స్థానాలు గెలుచుకోవడం మన ఖర్మ, మన ప్రార్థనలను దేవుడు ఆలకించలేదు... ఇలా వేదాంత ధోరణి ప్రదర్శించారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి హోదాతో సహా విభజన హామీలను గుర్తు చేస్తూ నెరవేర్చాలంటూ అభ్యర్థించడం మినహా మరో గత్యంతరం లేదంటూ తేల్చేశారు.

సాగిల పడాల్సిందేనా?‘బీజేపీకి మన అవసరంలేదు కాబట్టి... మనమేం చేయలేం. వాళ్ల దయ, మన ప్రాప్తం’ అంటూ జగన్‌ చేసిన కొత్త సిద్ధాంతంపై అప్పట్లోనే రాజకీయ వర్గాలు విస్తుపోయాయి. రాష్ట్ర హక్కులను సాధించడం కోసం ఎందుకు పోరాటం చేయకూడదనే ప్రశ్నకు జగన్‌ జవాబు చెప్పలేకపోయారు. పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలతోనూ కేంద్రానికి అవసరం లేదు. ఈ రెండు రాష్ట్రాలూ అవసరమైనప్పుడు కేంద్రంతో ఘర్షణ వైఖరినే అవలంబిస్తున్నాయి. ఘాటుగానే సమాధానం చెబుతున్నాయి. కేంద్రానికి  ఎదురు తిరుగుతున్నాయి. కేవలం సీబీఐ కేసులకు భయపడే జగన్‌ కేంద్రం చెప్పుచేతల్లోకి వెళ్లిపోయారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు .. ఇతర  ప్రయోజనాల విషయంలో సహకారం అందించకపోయినా.. జీ హుజూర్‌ అంటున్నారని మండిపడుతున్నారు. బహుశా... ఎన్నికల ముందు మరోసారి జగన్‌ ‘హోదా’ పాట పాడతారేమో! మరోసారి అధికారం అప్పగించి, పాతిక మంది ఎంపీలను గెలిపిస్తే... ‘ప్రత్యేక  హోదా ఇచ్చిన వారికే కేంద్రంలో మద్దతు ప్రకటిస్తాం’ అని మరోసారి బురిడీ కొట్టిస్తారేమో!

Friday, May 20, 2022

Jagan Navaratnalu : Good intention with bad planning.

 Jagan Navaratnalu : Good intention with bad planning. 

'అమ్మవొడి' మంచి ఉద్దేశం; చెడ్డ ప్రణాళిక 

‘అమ్మఒడి’కి భారీ కోతtwitter-iconwatsapp-iconfb-iconఅమ్మఒడికి భారీ కోత

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్సం|| 93979 79750ఇక మినహాయంపు రూ.2 వేలు

గత ఏడాది మరుగుదొడ్ల నిర్వహణకు రూ.వెయ్యి 

ఈ ఏడాది ఏకంగా 2 వేలు.. అమ్మలకు దక్కేది 13 వేలేపథకం సొమ్ము తగ్గింపు.. లబ్ధిదారుల సంఖ్యా కుదింపుఎన్నికలప్పుడు 15 వేల హామీ.. ఇద్దరు చిన్నారులు ఉన్నా ఓకేగద్దెనెక్కాక ఒక్కరికే అమలు.. దీనికోసం మద్యం ధరల పెంపు పలు కీలక పథకాల నిలిపివేత

అనేక విద్యా పథకాలను రద్దుపద్దులోకి చేర్చి అమలుచేస్తున్న ‘అమ్మ ఒడి’కి సర్కారు మరోసారి కోత పెట్టింది. మరుగుదొడ్ల నిర్వహణ పేరిట గతంలో వెయ్యి తగ్గించిన సర్కారు... ఈసారి ఆ కోతను రెండు వేలకు పెంచింది.

 (అమరావతి-ఆంధ్రజ్యోతి) కుటుంబంలో బడికి వెళ్లే చిన్నారులు ఉన్న ప్రతి తల్లికీ ఏటా రూ.15 వేలు చొప్పున ఇస్తామని 2019 ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం జగన్‌ గొప్పగా ప్రకటించారు. దీంతో తల్లులందరూ వైసీపీకి ఓట్లు వేశారని రాజకీయ విశ్లేషకులు అప్పట్లో చెప్పారు. అయితే.. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంవత్సరం నుంచి కుటుంబంలో ఒక్కరికే ఈ పథకాన్ని పరిమితం చేశారు. అంతేకాదు.. ఇచ్చే మొత్తంలోనూ రెండో ఏడాది నుంచి స్కూళ్లలో మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ.1,000 కోత పెట్టి 14 వేలు చేతిలో పెట్టారు. ఇక, ఇప్పుడు రూ.2000 తగ్గించి పథకాన్ని రూ.13 వేలకు కుదించారు. ఈ 2 వేలను పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణకు వినియోగించాలని సర్కారు నిర్ణయించింది. వాస్తవానికి పాఠశాలల్లోని మరుగుదొడ్ల నిర్వహణకు సర్కారే నిధులు కేటాయిస్తుంది. అయితే, వైసీపీ హయాంలో నిధులు ఇవ్వడం ఆపేసి ‘అమ్మఒడి’ నుంచి మరుగుదొడ్ల నిర్వహణకు నిధులు మినహాయిస్తున్నారు. దీంతో అమ్మఒడి పథకంపై ఆశలు పెట్టుకున్న లబ్ధిదారులైన అమ్మలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

అమ్మఒడితో ఆటలు!అమ్మఒడి పథకంతో సర్కారు ఆటలాడుతోందనే విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ పథకాన్ని ఐదేళ్లపాటు అమలు చేయాల్సి ఉంది. అయితే.. నెలలు మార్చి.. ప్రభుత్వం దీనిని నాలుగేళ్లకే పరిమితం చేసింది. అధికారంలోకి వచ్చిన కొత్తలో తొలి రెండేళ్లపాటు జనవరి నెలలో అమ్మఒడిని ఇచ్చిన ప్రభుత్వం.. ఈ ఏడాది ఆరు నెలలు ముందుకు జరిపి.. జూన్‌కు వాయిదా వేసింది. ఎందుకంటే 2022 జూన్‌లో ఇస్తే.. మళ్లీ 2023 జూన్‌లో ఇవ్వాలి. ఇక, 2024 మే నెలలోనే ఎన్నికలు వస్తాయి కాబట్టి ఆ ఏడాది ఈ పథకాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉండదని సర్కారు ప్లాన్‌ వేసుకుంది. అలాకాకుండా జనవరిలోనే అమ్మఒడి ఇచ్చి ఉంటే.. 2023, 2024లోను జనవరిలోనే ఇవ్వాల్సి వస్తుంది. దీనివల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని భావించి, ఎన్నికలకు ముందు అప్పులు చేస్తే బద్నాం అవుతామనే వ్యూహంతో ఏకంగా ఒక సంవత్సరం పథకాన్ని పక్కన పెట్టేసే ప్లాన్‌ చేసింది.

ఆది నుంచీ మాటమార్చుడే2019 ఎన్నికలకు ముందు అమ్మఒడి విషయంలో తొలుత ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికీ అమ్మఒడి ఇస్తామని వైసీపీ నేతలు ప్రకటించారు. ఆ ప్రచారం మహిళల్లోకి బాగా వెళ్లాక.. ‘ఇంటికి ఒక్కరికే’ అని సవరణ చేశారు. అది ఎంతమందికి చేరిందో తెలీదు కానీ.. ఇంట్లో ఇద్దరు పిల్లలున్నా అమ్మఒడి ఇస్తారని భావించిన తల్లులందరూ వైసీపీకి ఓట్లేశారనే విశ్లేషణలు ఉన్నాయి. ఇక, అధికారంలోకి వచ్చాక అమ్మఒడి పథకం ఇచ్చేందుకు మద్యం ధరలు భారీగా పెంచారు. తద్వారా వచ్చే ఆదాయంతో ఈ పథకాన్ని అమలు చేశారు. దీంతో అమ్మఒడి కోసం నాన్న బుడ్డి పెంచేశారనే విమర్శలు పెద్దఎత్తున వచ్చాయి. ఆ తర్వాత గత ప్రభుత్వాల కాలం నుంచి ఇస్తున్న పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఆపేశారు.

గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘విదేశీ విద్యోన్నతి’ పథకాన్ని పక్కన పెట్టారు. మొత్తంగా అమ్మఒడి పేరు చెప్పి.. పలు కీలక పథకాలకు కోత పెట్టారు. మరోవైపు అమ్మఒడి కోసం మద్యం ధరలు పెంచి కాసులు పిండారు. అమ్మఒడి కోసం అదనపు ఆదాయం ప్రజల నుంచే వసూలు చేసి.. మరోవైపు అనేక పథకాలు ఎత్తేసి కూడా.. అమ్మఒడికి ఇచ్చే మొత్తంలో కోత పెట్టడంపై విపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. 

ఒక్కరే ఉన్నా ఇవ్వట్లేదు!ఇంట్లో ఇద్దరు పిల్లలున్నా అమ్మఒడి ఇస్తామన్న జగన్‌.. తర్వాత దీనిని ఒక్కరికే పరిమితం చేశారు. అయితే.. ఇప్పుడు ఒక్క చిన్నారి ఉన్న తల్లికి కూడా చాలా మందికి ఈ పథకాన్ని వర్తింపజేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గత రెండేళ్లుగా దరఖాస్తులు చేసుకుంటున్న వారిలో వివిధ కారణాలు చెబుతూ వేల సంఖ్యలో దరఖాస్తులను పక్కన పెడుతున్నారు. మరోపక్క ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరిగాయని.. దాదాపు ఐదారు లక్షల మంది విద్యార్థులు కొత్తగా చేరారంటున్న ప్రభుత్వం అ మేరకు అమ్మఒడి లబ్ధిదారులను పెంచడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. 


Tuesday, March 15, 2022

తృతీయ శక్తి అవుదాం!

 తృతీయ శక్తి అవుదాం!


‘సీఎంగా బీసీ’ ప్రతిపాదనకు నా మద్దతు: బ్రదర్‌ అనిల్‌

విశాఖలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రైస్తవ, 

మైనారిటీ సంఘాలతో సుదీర్ఘ సమావేశం

మరోసారి సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ

ఏపీలో షర్మిల పార్టీని విస్తరించాలని కోరుతున్నారు

గెలిపించిన వారిని జగన్‌ పట్టించుకోవట్లేదు

రెండున్నరేళ్లుగా ఆయన్ని కలవలేదు 

వివేకా కుటుంబానికి న్యాయం జరుగుతుంది: అనిల్‌ 


విశాఖపట్నం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు న్యాయం చేసేందుకు రాజకీయంగా మూడో ప్రత్యామ్నాయ శక్తిగా తయారవుదామని బ్రదర్‌ అనిల్‌కుమార్‌ పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. సోమవారం విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో ఉత్తరాంధ్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాల నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ‘‘ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగడం లేదు. మీరు ముందుకువచ్చి పార్టీ స్థాపిస్తే మేమంతా వెనకుండి నడిపిస్తాం’’ అని సమావేశంలో అన్ని సంఘాల నేతలు బ్రదర్‌ అనిల్‌కుమార్‌ను కోరినట్టు తెలిసింది. ‘‘మీరంతా సంఘటితంగా కలిసి వస్తామంటే.. ముందుండి నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నా’’ అని అనిల్‌ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత లోతుగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు త్వరలోమరోసారి సమావేశమవుదామని చెప్పినట్టు సమాచారం.


బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలకు బదులుగా బలహీన వర్గాల నాయకత్వంలో ప్రత్యామ్నాయం అవసరమని వివరించినట్టు సమాచారం. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకూ ఈ సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన సుమారు 70 మంది ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఒక్కో ప్రతినిధి ఐదు నుంచి పది నిమిషాల పాటు సమస్యలు ఏకరవు పెట్టినట్టు సమాచారం. అనంతరం బ్రదర్‌ అనిల్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్‌ షర్మిల.. ఆంధ్రప్రదేశ్‌కు కూడా పార్టీని విస్తరించాలని పలువురు కోరుతున్నారని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడానికి సహకరించాలని ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు కోరారని వెల్లడించారు. వారి ప్రతిపాదనను కచ్చితంగా సమర్థించి, మద్దతు ఇస్తానని ప్రకటించారు. గత ఎన్నికల్లో తాను ఇచ్చిన పిలుపునకు స్పందించి ఎంతో మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రైస్తవ, ముస్లిం మైనారిటీ సంఘాల నాయకులు వైసీపీ విజయానికి కృషి చేశారని చెప్పారు. సీఎం జగన్‌ కానీ, ప్రభుత్వం కానీ ఈ వర్గాల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. దీంతో వారంతా పిలిచి తమ సమస్యలు, ఇబ్బందులు తనకు వివరించారని చెప్పారు. ‘‘ప్రభుత్వం నుంచి ఆయా వర్గాలు ఏం ఆశించారో, ఏం కోల్పోయారో వివరించారు. వారి బాధలు వినేవారు కానీ, సమాధానం చెప్పేవారు కానీ లేరు. దీంతో బాధ్యత తీసుకోవాలని నిర్ణయించాను’’ అని అన్నారు. 


జగన్‌ బిజీగా ఉన్నట్టున్నారుఇటీవల విజయవాడలో ఇదే తరహాలో నిర్వహించిన సమావేశంలో ఆయా సంఘాలు వెలిబుచ్చిన సమస్యలు, అభిప్రాయాలను సీఎం జగన్‌కు వివరించారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ‘‘ఆయన (జగన్‌) పథకాల అమలు బిజీలో ఉన్నట్టున్నారు. నేను నా పనుల్లో తీరిక లేకుండా ఉన్నాను. నేను ఆయన్ను కలిసి రెండున్నరేళ్లు అయ్యింది’’ అని బ్రదర్‌ అనిల్‌ సమాధానమిచ్చారు. జగన్‌కు ఇప్పుడైనా వివరించేందుకు ప్రయత్నిస్తారా అన్న ప్రశ్నకు.. లేఖ ద్వారా లేదా వ్యక్తిగతంగా కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. హామీలను నెరవేర్చకుండా వైసీపీ సర్కారు కక్షసాధింపుతో పరిపాలన చేసే పరిస్థితి కనిపిస్తోందని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. వైఎస్‌ కుటుంబంలో విభేదాలు ఉన్నాయా? అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేశారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో బాధిత కుటుంబానికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని బ్రదర్‌ అనిల్‌ అన్నారు. కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందని, అది చిన్న వ్యవస్థ కాదని వ్యాఖ్యానించారు. 


అనిల్‌ పిలుపుతో వైసీపీకి ఓట్లు: హనోక్‌గత ఎన్నికల్లో బ్రదర్‌ అనిల్‌కుమార్‌ ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారానికి రాకపోయినా ఫోన్‌లు చేసి, సమావేశాలు ఏర్పాటు చేసి జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారని ఈ సమావేశంలో ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రిస్టియన్‌ చారిటీ (ఏఐసీసీ) జాతీయ అధ్యక్షుడు గారా హనోక్‌ వెల్లడించారు. ఆయన పిలుపు మేరకు తామంతా వైసీపీ విజయానికి కృషి చేశామన్నారు. టీడీపీకి ఓటేద్దామనుకున్నవారు కూడా ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేశారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత అందరికీ అన్యాయం చేస్తున్నారని జగన్‌ను ఉద్దేశించి అన్నారు. 


సర్కారు పట్టించుకోవడం లేదు!: సంఘాలుసమావేశంలో పాల్గొన్న నేతలు తమ సమస్యలు, కష్టాలను బ్రదర్‌ అనిల్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఈ సందర్భంగా పార్టీ ఏర్పాటు చేయాలని కోరినట్టు సమా చారం. క్రైస్తవుల అండదండలతో అధికారం దక్కించుకున్న జగన్‌.. వారి యోగక్షేమాలను పట్టించుకోవడం లేదని క్రైస్తవ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్టియన్‌ మిషనరీల ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిడెడ్‌ పాఠశాలలు, చర్చిలు, హాస్టళ్లను ప్రభుత్వం లాక్కొంటోందని పలువురు బిష్‌పలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీల రాయితీలను కూడా వైసీపీ సర్కారు నిలిపివేసిందని కొందరు విమర్శించారు. సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!

Monday, March 14, 2022

ఒక్కటై ఓడిస్తాం! - పవన్ కళ్ాణ్

 ar 15 2022 @ 02:59AM 

ఒక్కటై ఓడిస్తాం! - పవన్ కళ్ాణ్ 


వైసీపీ వ్యతిరేక శక్తులు ఏకమవ్వాలి..

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను

బీజేపీ రోడ్‌మ్యాప్‌ కోసం వెయిటింగ్‌

2024లో ప్రజా ప్రభుత్వం స్థాపిస్తాం

మేం వస్తే ‘అప్పుల్లేని ఆంధ్రప్రదేశ్‌’

ముమ్మాటికీ అమరావతే రాజధాని

అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం

సీపీఎస్‌ రద్దు.. మళ్లీ పాత పెన్షన్‌

ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం

జనసేనాని కార్యాచరణ ప్రకటన

వైసీపీ సర్కారుది విధ్వంసకర పాలన

కూల్చివేతలు... అశుభంతో ప్రారంభం

పెట్టుబడులు లేవు.. ఉన్నవీ పోతున్నాయి

ఇసుకను కరకరా నమిలేస్తున్నారు

భవన కార్మికుల ఉసురు తీశారు

నిషేధం అంటూనే మద్యం నుంచి సొమ్ములు

‘ఒక్క చాన్స్‌’తో రాష్ట్రం పాతికేళ్లు వెనక్కి

మళ్లీ వస్తే పిల్లల చేతిలో చాక్లెట్లూ లాగేస్తారు!


(అమరావతి-ఆంధ్రజ్యోతి)2024లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా... వైసీపీ వ్యతిరేక ఓటును చీలకుండా చూస్తామని ప్రకటించారు. ‘‘ఎమర్జెన్సీ సమయంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నీ కలిశాయి. ఇప్పుడూ అలాగే వైసీపీ వ్యతిరేక శక్తులు కలవాలి. ఆంధ్రప్రదేశ్‌ బాగు కోసం చెబుతున్నా... వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదు’’ అని పవన్‌ ఉద్ఘాటించారు. పార్టీలు, వ్యక్తిగత లాభాలు వదిలి రాష్ట్ర ప్రయోజనాలకు రావాలని... అప్పుడు పొత్తుల కోసం ఆలోచిస్తామని ప్రకటించారు. రాష్ట్ర బాధ్యతను జనసేన తీసుకుంటుందన్నారు. ఈ దిశగా బీజేపీ  నాయకులు రోడ్‌మ్యాప్‌ ఇస్తామని చెప్పారని, దానికోసం ఎదురు చూస్తానని తెలిపారు. రోడ్‌ మ్యాప్‌ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని, వైసీపీని గద్దె దించుతామని ఆయన స్పష్టం చేశారు. సోమవారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జరిగిన జనసేన 9వ ఆవిర్భావ సభలో పవన్‌ కల్యాణ్‌ ప్రసంగించారు. వైసీపీపై నిప్పులు చెరిగారు. భావి పొత్తులపై సంకేతాలు ఇచ్చారు. ‘‘ఇన్ని సంవత్సరాలు ప్రజలకు అండగాఉండి భుజంకాచాను. ఇప్పుడు నేను సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నా. రాష్ట్ర బాధ్యతను  జనసేన తీసుకుంటుంది’’ అని పవన్‌ తన కార్యాచరణను విస్పష్టంగా ప్రకటించారు. 2019 ఎన్నికల్లో 137 సీట్లలో పోటీచేస్తే 7.24 శాతం ఓట్లు వచ్చాయని చెప్పారు.

ఒక ఎమ్మెల్యే సీటు నెగ్గినప్పటికీ... వైసీపీ లాక్కెళ్లిందని మండిపడ్డారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయాలను వివరించారు. పార్టీ సభ్యత్వం 46 లక్షలకు చేరుకుందని పవన్‌ ప్రకటించారు. ‘‘ఎంత సింధువైనా బిందువుతోనే మొదలవుతుంది. ఏడు శాతం నుంచి 27 శాతానికి, ఆ 27 నుంచి  ప్రభుత్వాన్ని స్థాపించే స్థానానికి ఎదగబోతున్నాం’’ అని తెలిపారు. ‘‘రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్‌ బాగుండాలి. ఈ రాష్ట్రం చీకట్లోకి వెళ్లకుండా చూడటం జనసైనికుల చేతుల్లోనే ఉంది. నేను నడిచి చూపిస్తాను. మీరు నడవండి.  ఇప్పుడు... వైసీపీ చీకటి పాలనను అంతమొందించే అవకాశం లభించింది. ఇలాంటి సామాజిక ప్రగతి నిర్మాణం చేసే అవకాశాలు అరుదుగా వస్తాయి. వాటిని సద్వినియోగంచేసుకోవాలి’’ అని పిలుపునిచ్చారు.   ‘‘2014లో సూటిగా ప్రశ్నించాం. ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నాం. 2019లో బలంగా పోరాటం చేశాం. బరిలో నిలబడి ఉన్నాం. 2024లో గట్టిగా నిలదొక్కుకుంటాం. ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం’’ అని ఉద్ఘాటించారు.

ఈ పాలన విధ్వంసంతో మొదలు... ‘‘కొత్త ఇంట్లోకి వెళ్తే శుభంతో మొదలుపెడుతాం. మీ ప్రభుత్వం అశుభంతో... కూల్చివేతలతో ప్రారంభించింది.  మూడు నెలలకే ఇసుక సమస్య వచ్చింది. 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డుమీద పడ్డారు. 32 మంది ప్రాణాలను మీ నాయకత్వం బలిగొంది.ఆ రోజు నుంచి ఇప్పుడు జనసేన సభకు ఆటంకం కలిగించే వరకు విధ్వంసాలే! ఇంత నెగటివ్‌ మనుషులా!’’ అని పవన్‌ ఈసడించారు. తన ప్రసంగాన్ని జై ఆంధ్రప్రదేశ్‌, జై తెలంగాణ, జై భారత్‌ అంటూ మొదలుపెట్టారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది ప్రముఖులు, అన్ని పార్టీల నేతలకు పేరుపేరునా నమస్కరించారు. అన్ని మతాలను ప్రస్తావిస్తూ వాటి గొప్పతనాన్ని వివరించారు. 

ఒక కులాన్ని వర్గశత్రువుగా రాష్ట్రంలో ఒక కులాన్ని వైసీపీ వర్గశత్రువుగా ఎలా ప్రకటించింది? దీని వల్ల రాష్ట్రం అస్తవ్యస్తమవుతోంది. వైశ్య సామాజికవర్గాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇబ్బందులుపెడుతున్నారు. వారికి జనసేన అండగా ఉంటుంది. యానాది, రెల్లి, ముత్తరాసి, బీసీ. సంచారజాతులు ఎస్సీలు, గిరిజనులకు అండగా ఉంటాం. 

ద్వారంపూడికి భీమ్లానాయక్‌ ‘ట్రీట్‌మెంట్‌’ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి అనే వ్యక్తి నన్ను అకారణంగా పచ్చిబూతులు తిట్టారు. అది వైసీపీకి  అలవాటే. నేను భరించాను. కానీ... నన్ను తిడితే మా జనసైనికులు, వీర మహిళలకు కోపం వస్తుంది. గతంలో ఆయన  (ద్వారంపూడి)  కుటుంబానికి  ఎస్పీ డీటీ నాయక్‌ ట్రీట్‌మెంట్‌ జరిగింది. భవిష్యత్‌లో ఇలాగే చేస్తే... ‘భీమ్లా నాయక్‌ ట్రీట్‌మెంట్‌’ అంటే ఏమిటో చూపిస్తాను. 

అమరావతే రాజధానిఎట్టి పరిస్థితుల్లో అమరావతే రాజధానిగా కొనసాగుతుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారవు. ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా పాలసీలు మారవు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి మద్దతు తెలిపి వారి విజయానికి మనవంతు సహకారం అందించాం. రాజధాని విషయంలో ఇక్కడ పెనుమాక, ఉండవల్లి, మిగతా గ్రామాల రైతులు భూములు ఇవ్వడం ఇష్టం లేదంటే మేం వారి పక్కన నిలబడ్డాం. మేం మద్దతు ఇచ్చిన ప్రభుత్వంపై మేం గొంతెత్తినప్పుడు, వైసీపీ నాయకత్వం ఆ రోజు ఏం చేసింది? ఆనాడు గాడిదలు కాస్తున్నారా? మూడు రాజధానులు అని ఆ రోజు ఎందుకు చెప్పలేదు? 29 గ్రామాలు... 26,896 మంది రైతులు, 34వేల ఎకరాలు దీంట్లో 32 శాతం మంది ఎస్సీలు, మిగతా వారు బీసీలు, ఇతరులున్నారు.  ఆషామాషీగా ఉందా మీకు? మీ ఇష్టానికి రాజధాని మార్చేస్తారా? అమరావతి రైతులకు చెబుతున్నా! ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి. ఎక్కడికి వెళ్లదు. మీ మీదపడ్డ ప్రతీ లాఠీదెబ్బ నామీద పడినట్లే. అమరావతి ఇక్కడి నుంచి కదలదు. అలాగని మిగతా ప్రాంతాలను వదిలేస్తామని కాదు. 

ఇదేనా వైసీపీ ప్రతిజ్ఞ... వైసీపీ అధికారంలోకి రాగానే మూడు తప్పులు చేసిందని పవన్‌ పేర్కొన్నారు. అవి...1) గత ప్రభుత్వం చేసిన పనులను రద్దు చేయడం. 2) 2. పీపీఏ (విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు)లను రద్దుచేసింది. 3)  అమరావతి రాజధాని స్థానంలో మూడు రాజధానులని తప్పు మీద తప్పు చేసింది. విధ్వంసమే వైసీపీ విధానమని... ప్రతిజ్ఞ చేసినట్లుగా దారుణాలకు తెగబడుతున్నారని పవన్‌ అన్నారు. బహుశా... వైసీపీ ప్రతిజ్ఞ ఇదే కావొచ్చు అంటూ ఆ పాఠాన్ని చదివి వినిపించారు. అదెలా సాగిందంటే... ‘‘ఆంధ్రప్రదేశ్‌ మా సొంత భూమి. ఆంధ్రులందరూ మా బానిసలు. న్యాయవ్యవస్థను లెక్కేచేయం.  పోలీసులను ప్రైవేటు ఆర్మీగా వాడేస్తాం.  రాష్ట్ర రహదారులను గుంతల మయంచేస్తాం. ప్రజల వెన్నుపూసలు విరగొట్టేవరకు విశ్రమించం. పెట్టుబడుల్లో 50 శాతం వాటా లాక్కుంటాం.  అన్నంపెట్టే రైతన్నలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తాం. ఇసుకను అప్పడంలా కరకరా నమిలేస్తాం.  పార్కులు, స్కూళ్లు, ప్రభుత్వ భవనాలను తాకట్టుపెట్టేస్తాం. సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూనే ప్రజలతో చిత్తుగా తాగిస్తాం. మా వైసీపీ ఎంపీ అయినా సరే... ఎదురు తిరిగితే చితక్కొడతాం. ఒక్క చాన్స్‌తో ఆంధ్రాను పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్లాం. ఇంకొక్క చాన్స్‌ ఇస్తే చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు కూడా లాక్కుంటాం!’’

న్యాయవ్యవస్థనూ వదిలిపెట్టలేదువైసీపీ న్యాయ వ్యవస్థను కూడా తప్పుపట్టేదాకా వెళ్లింది.  హైకోర్టు ఒక పార్టీ బ్రాంచ్‌ ఆఫీసుగా మారిందని తిడతారా? ఏ స్థాయికి వీరి గుండాయిజం వెళ్లిందంటే ఇళ్లలోకి వచ్చి రైతులను కొట్టడం, న్యాయ వ్యవస్థ జీవితంలోకి వెళ్లడం వీరి గుండాయిజం. 

పోలీసులూ విసిగిపోయారు...వైసీపీ వల్ల పోలీసు వ్యవస్థ కూడా విసిగిపోయింది. పోలీసులకు జీతభత్యాలు, కనీసం కరువు భత్యం సరిగ్గా ఇవ్వడం లేదు. అధికారంలోకి వస్తే వారాంతపు సెలవు ఇస్తానని చెప్పారు. అది లేకపోగా వీరి నిర్వాకంవల్ల పోలీసులకు పని మరింత పెరిగింది. వైసీపీ వారికి భయం లేదు. సీఐ ర్యాంకు అయినా సరే వారి చొక్కా కాలర్‌ పట్టుకుంటారు. చిత్తూరులో ఒక సీఐని కాలర్‌ పట్టుకున్నారు. ఇంకో సీఐని విశాఖ పీఠంలో చొక్కాలు విప్పికొడతామని మంత్రి ఒకరు బెదిరిస్తారు. కృష్ణలంక స్టేషన్‌లో ఎంపీ కానిస్టేబుల్‌ను కొట్టేశారు. ఓ పోలీసు బిడ్డగా చెబుతున్నా... ఓ తప్పుడు ఎమ్మెల్యే, గుండా మా తండ్రిని కొడితే ఏమిటి ఇది అనిపిస్తుంది కదూ!  అధికారంలోకి రాగానే 14,341 పోలీసు ఉద్యోగాలు భర్తీచేస్తామన్నారు. 400 తప్ప మిగతా ఉద్యోగాలు లేవు. ఈ పాలనలో తొలుత పారిశ్రామికవేత్తలు దెబ్బతిన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే సీపీఎస్‌ రద్దుచేస్తామన్నారు.  అధికారంలోకి  వచ్చాక మొండి చేయి చూపించారు.  మా నాయకుడికి ఆ రోజున విషయ పరిజ్ఞానం లేదని, టెక్నికాలిటీస్‌ తెలియదన్నారు.   

పార్టీ రంగుల కోసం 3వేల కోట్ల ఖర్చు వైసీపీ పార్టీ రంగుల కోసం 3వేల కోట్లు ఖర్చుపెట్టారు. ప్రకటనలకు 400 కోట్లు వృఽథా చేశారు. మీ పార్టీ రంగులు వేసుకోవడానికి 3వేల కోట్లు ఉంటాయి కానీ ఉద్యోగస్తులకు ఇవ్వడానికి  డబ్బులు ఉండవా? 


ఇదీ అప్పులవల్ల అనర్థం... తెలంగాణ ఆదాయం 99,900 కోట్లు. ఆంధ్రా ఆదాయం లక్షా 17వేల కోట్లు. ఈ ఆదాయం ఎటుపోతోంది? ఏం చేస్తున్నారు? తాకట్టులో భారత దేశం అన్నట్లు... ‘అప్పులో ఆంధ్ర’గా మారిపోయింది. దాని ప్రభావమే ప్రజలపై పడుతోంది. ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు? టీచర్‌ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? కొత్త నియామకాలు ఎందుకు చేపట్టడం లేదు? ఉద్యోగుల జీతాలు ఎందుకు పెరగడం లేదు? అమ్మఒడి పథకానికి డబ్బులు ఎందుకు ఆగాయి? ఎయిడెడ్‌ స్కూల్స్‌, కాలేజీలను ఎందుకు మూసివేస్తున్నారు. ఆరోగ్యశ్రీని ఎందుకు మంచం ఎక్కించారు? ిపింఛన్లు ఎందుకు తగ్గించారు? దీనింతటికీ కారణం... అప్పులు చేయడమే!

పెట్టుబడులను చంపేశారు వైసీపీ నేతలు పెట్టుబడులను చంపేశారు. ఏపీ అంటే ఎవ్వరూ రావడం లేదు. ఉన్నవాటిని పంపించేస్తున్నారు. అమర్‌రాజా కంపెనీ ఓఉదాహరణ. అనంతపురం జిల్లాలో కియతో రావాల్సిన అనుబంధ పరిశ్రమలు రాలేదు. 

మద్యం ఆదాయంలో రికార్డుటీడీపీ హయాంలో మద్యంపై 59 వేల కోట్లు ఆదాయం రాగా... వైసీపీ రెండున్నరేళ్లలోనే 45వేల కోట్లు సంపాదించింది. ధరలు పెంచితే మద్యం తాగేయడం మానేస్తారని ఓ దరిద్రపు, నీచ, నికృష్ట వాదన వినిపిస్తారు. నాసిరకం లిక్కర్‌ అమ్ముతున్నారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి 12 మంది మరణించారు. ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌ కాదు.. అది ఇడుపులపాయ ఫారిన్‌ లిక్కర్‌! 25వేల కోట్ల మద్యం ఆదాయం వారి జేబుల్లోకి చేరుకుంది. 


మేం అధికారంలోకి వస్తే..సెక్యులరిజం అంటే ఒక మతానికి ఒక న్యాయం, మరో మతానికి మరో న్యాయం కాదు! మసీదులు, చర్చిలను ప్రభుత్వం కంట్రోల్‌లో పెట్టుకోదు. కానీ హిందూ దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ ఎందుకు? దీనిని మేం పరిశీలిస్తాం.  టీటీడీ, ఎండోమెంట్‌ చట్ట సవరణను పరిశీలిస్తాం.  ఏపీని అప్పులు లేని రాష్ట్రంగా చేయాలన్నదే నా లక్ష్యం. ఆర్థికాభివృద్ధి సాధించడమే లక్ష్యం. ఇందుకోసం ఇన్వెస్టర్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వం తీసుకొస్తాం. విశాఖను విశ్వనగరంగా, విజయవాడ, తిరుపతిని బలమైన హైటెక్‌ నగరాలుగా తీర్చిదిద్దుతాం. అమరావతిని అన్ని వర్గాలు, కులాలకు నివాసం కల్పించే అభ్యుదయ రాజధానిగా ముందుకు తీసుకెళ్తాం. కర్నూలు నగరం రుణం తీర్చుకుంటాం. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెడతాం. రాయలసీమ బిడ్డలను గల్ఫ్‌ నుంచి తీసుకొచ్చి ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పేదల ఇళ్ల నిర్మాణాలకు, తెల్లకార్డుదారులకు ఉచిత ఇసుక ఇస్తాం. జనసేన సౌభాగ్యపదం కింద యువతకు ఒక్కొక్కరికి 10 లక్షల ఆర్ధిక సహాయం చేస్తాం. సంవత్సరానికి లక్ష మంది  చొప్పున ఐదేళ్లలో 5 లక్షల మందికి బ్యాంకులో డబ్బు వేస్తాం. బడుగు, బలహీనవర్గాలకు ప్రాధాన్యం ఇస్తాం. వ్యవసాయరంగాన్ని లాభసాటిగా మారుస్తాం. గిట్టుబాటు రాక రైతులు ఏడుస్తున్నారు. రైతు కన్నీరుపెట్టకూడదు. రైతులతో మాట్లాడుతాం. వారి  కష్టాలను అర్ధం చేసుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాం. మద్దతు ధర, పుడ్‌ప్రాసెస్‌, పంటకాలువలు, మినీ రిజర్వాయర్లను ఆధునీకరిస్తాం. 

ప్రతి ఉద్యోగ ఖాళీ భర్తీచేస్తాం... ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్నీ జనసేన అధికారంలోకి రాగానే భర్తీ చేస్తుంది. నిరుద్యోగుల ప్రయోజనాలను కాపాడుతాం. ప్రైవేటు రంగంలో ఏటా 5 లక్షల ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళిక అమలు చేస్తాం. ఉద్యోగులకు పీఆర్‌సీ సవరణ చేయిస్తాం. ఓ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా సీపీఎ్‌సను రద్దుచేయిస్తాం. పాత పెన్షన్‌ విధానం తీసుకొస్తాం. మీకు అండగా ఉంటాం. 




వైఎస్సార్‌సీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వం

Mar 15, 2022, 03:30 IST

Pawan Kalyan Comments In Janasena Party formation day Meeting - Sakshi

గుంటూరు జిల్లా ఇప్పటంలో జరిగిన సభలో మాట్లాడుతున్న పవన్‌కల్యాణ్‌


ఆ పార్టీని గద్దె దింపడానికి అందర్నీ కలుపుకొనిపోతాం 


బీజేపీ రోడ్‌ మ్యాప్‌ కోసం ఎదురుచూస్తున్నా 


రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తులపై సరైన నిర్ణయం తీసుకుంటాం 


రెండు చోట్ల ఓడిపోయినా వెనక్కి తగ్గలేదు 


2024లో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం 


అప్పుల నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగిస్తాం 


కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు 


అమరావతే ఏకైక రాజధాని 


జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్‌ 


సాక్షి, అమరావతి బ్యూరో: వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వబోమని, ఆ పార్టీని గద్దె దింపడానికి అన్ని పార్టీలను కలుపుకొనిపోతామని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. సోమవారం తాడేపల్లి మండలం ఇప్పటంలో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. పార్టీలు, వ్యక్తగత ప్రయోజనాలు వదిలి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై పోరాడటానికి రోడ్‌ మ్యాప్‌ని అందజేస్తామని బీజేపీ చెప్పినా, ఇంతవరకు ఇవ్వలేదన్నారు.


2019 ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయినప్పుడు చాలా బాధపడ్డానని, అధికార పార్టీ నాయకులు తనను ఎన్నో సార్లు మానసిక అత్యాచారం చేశారని చెప్పారు. 2019లో ఒక్క సీటే గెలిచినా, స్థానిక సంస్థల్లో పార్టీ మంచి ఫలితాలను సాధించిందన్నారు. 150 మంది సభ్యులతో మొదలైన పార్టీ నేడు 5 లక్షల మంది సభ్యత్వం తీసుకొనే దిశగా సాగుతోందని చెప్పారు. 2024లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. రెండున్నరేళ్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎన్నో బాధలు పడ్డారని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం కూల్చివేతతో పాలన మొదలుపెట్టిందన్నారు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. రోడ్లు వేయకపోవడం వల్ల ప్రమాదాలు పెరిగాయన్నారు.


అమరావతే ఏకైక రాజధాని

అమరావతిలో టీడీపీ ప్రభుత్వం రాజధాని నిర్మించాలనుకున్నప్పుడు తాను వ్యతిరేకించానని చెప్పారు. గత ప్రభుత్వాలు తప్పులు చేస్తే వాటిని సవరించి, కొనసాగించాలన్నారు. అమరావతే ఏకైక రాజధాని అని స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే పీఆర్‌సీ సవరణ చేస్తామని, సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అప్పుల నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగిస్తామని చెప్పారు. నూతన పారిశ్రామిక విధానం తెస్తామన్నారు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెడతానన్నారు. రేషన్‌ కార్డు ఉన్న అందరికి ఉచితంగా ఇసుక ఇస్తామన్నారు. పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఐదేళ్లలో ఐదు లక్షల మంది యువతకు సంవత్సరానికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర అందేలా చూస్తామన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. 


మంత్రులపై విమర్శలు

తాను వ్యక్తిగత దూషణలకు వ్యతిరేకమని ఒకవైపు చెబుతూనే మరోవైపు మంత్రులను దూషించారు. మంత్రులు  వెలంపల్లి, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే అంబటి రాంబాబుల పేర్లను వెటకారంగా పలికారు. అధికారంలోకి వచ్చాక ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి భీమ్లానాయక్‌ ట్రీట్‌మెంట్‌ రుచి చూపిస్తానన్నారు. 


పార్టీని ఎన్నో రకాలుగా ఇబ్బందిపెట్టారు : నాదెండ్ల

జనసేన పార్టీ, పవన్‌ కల్యాణ్‌లను ఎన్నో రకాలుగా అధికార పార్టీ ఇబ్బంది పెట్టిందని పార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ వ్యాఖ్యానించారు. పార్టీ కార్యక్రమాలు కార్యకర్తలకు తెలియడానికి అస్త్ర యాప్‌ను సిద్ధం చేశామన్నారు. 


రాష్ట్రం అప్పుల పాలవుతోంది : నాగబాబు

అధికారపార్టీ చర్యలతో రాష్ట్రం అప్పులపాలవుతోందని నాగబాబు విమర్శించారు. ప్రతి వ్యక్తిపై రూ.లక్షకు పైగా అప్పు ఉందన్నారు.    

Saturday, February 12, 2022

ఉన్మాది సీఎం చెప్తే.. పోలీసుల విచక్షణ ఏమైంది?: చంద్రబాబు

 ఉన్మాది సీఎం చెప్తే.. పోలీసుల విచక్షణ ఏమైంది?: చంద్రబాబు


అమరావతి: ఎమ్మెల్సీ అశోక్‌బాబును అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. నేడు ఆయన అశోక్‌బాబు నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అశోక్‌బాబు ఎక్కడా దాక్కోలేదు. తప్పు చేస్తే ధైర్యంగా ఆఫీస్‌కు వచ్చి అరెస్ట్ చేయవచ్చు. పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణం. అర్ధరాత్రి కిడ్నాప్ చేసి ఎక్కడెక్కడో తిప్పారు. ఉన్మాది సీఎం చెప్తే.. పోలీసుల విచక్షణ ఏమైంది? ఎప్పటికైనా మిమ్మల్ని జగన్‌రెడ్డి బలిపశువులను చేస్తారు. ప్రజా సమస్యలపై పోరాడడం తప్పా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? ముగ్గురు మాజీ మంత్రులను అరెస్ట్ చేశారు. ఇప్పటివరకూ 40 మంది టీడీపీ నేతలపై కేసులు పెట్టారు. 33 మంది టీడీపీ నేతలను హత్య చేశారు. అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరి పక్షాన టీడీపీ పోరాడుతుంది. ఇకపై ప్రజాస్వామ్య వ్యవస్థలో మీ ఆటలు సాగనివ్వం’’ అని పేర్కొన్నారు.

https://www.andhrajyothy.com/telugunews/chandrababu-comments-mrgs-andhrapradesh-1922021202355431



Thursday, January 27, 2022

రాష్ట్రంలో 26 కొత్త జిల్లాలు.. 62 రెవెన్యూ డివిజన్లు.

 పత్రికా ప్రకటన

విజయవాడ, 

తేది : 27-01-2022.

పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు

రాష్ట్రంలో 26 కొత్త జిల్లాలు.. 62 రెవెన్యూ డివిజన్లు.

గిరిజనుల అభివృద్ది కోసం రెండు గిరిజన జిల్లాలు

అసెంబ్లీ నియోజకవర్గాన్ని విడదీయకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు.

విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లా ఒంగోలు.. చిన్నజిల్లా విశాఖపట్నం.. 

వివరాలను వెల్లడించిన ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌ కుమార్‌ జి. ఎస్ఆర్ కెఆర్

కొత్త జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగానే జరిగిందని.. భౌగోళిక విస్తీర్ణం, జనసాంద్రత, సాంఘిక, సంస్కృతి ప్రకారం జిల్లాలను విభజించామని ఏపీ ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ తెలిపారు.  కొత్త జిల్లాల ఏర్పాటుపై లోతైన అధ్యయనం జరిగిందని,  పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాల సరిహద్దులు ఎలా ఉండాలనే దానిపై అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనల మేరకే గిరిజనాభివృద్దిలో భాగంగా రెండు గిరిజన జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.  కొత్త జిల్లాల ఏర్పాటుపై విజయవాడ ఎం.జీ. రోడ్డులోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ కార్యాలయంలో విజయ్‌ కుమార్‌ గురువారం మీడియా ప్రతినిధులకు వివరాలను తెలిపారు. 

ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాల స్వరూపం ఏ విధంగా ఉండాలనే అంశంపై భారీ కసరత్తు చేశామన్నారు.  పార్లమెంట్‌ నియోజకవర్గాల ప్రకారం 25 జిల్లాలు కాకుండా భౌగోళిక పరిస్థితుల ఆధారంగా 26 జిల్లాలు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించామన్నారు. విభజన ప్రక్రియలో జిల్లా కేంద్రాలు, భౌగోళిక, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలు అన్నీ పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు లేకుండా జిల్లాకు కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఉండేలా, అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం ఒకే జిల్లాలో ఉండేలా చూశామని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాన్ని విడదీయకుండా జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాలు అందరికీ దగ్గరుండేలా చూసుకున్నామన్నారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతం విస్తృత పరిధి ఎక్కువ అని.. విస్తృతంగా ఉన్న గిరిజన ప్రాంతానికి ఒక జిల్లా ఉంటే ఇబ్బందులు ఉంటాయని, గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనల ప్రకారం రెండు జిల్లాలుగా ఏర్పాటు చేశామన్నారు. మన్యం ప్రాంతాల్లో ప్రజల అభివృద్ధి కోసం రెండు జిల్లాలు దోహదం చేస్తాయని అభిప్రాయపడ్డారు. పార్వతీపురం జిల్లాను పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు 4 నియోజకవర్గాలతోను..  అలాగే అరకు జిల్లాను అరకువ్యాలీ, పాడేరు, రంపచోడవరం 3 నియోజకవర్గాలతో కలిపి ఏర్పాటవుతాయని తెలిపారు. అందుకే రంపచోడవరం ప్రాంతం రాజమండ్రికి దగ్గరగా ఉన్నప్పటికీ  అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేర్చామని తెలిపారు. 

శ్రీకాకుళం పేరున్న ఇన్‌స్టిట్యూట్‌లన్నీ ఎచ్చెర్లలో ఉన్నాయని.. అందుకే ఎచ్చెర్లను శ్రీకాకుళంలో కలిపామన్నారు. విజయనగరం విస్తీర్ణం కోసమే రాజాం, శృంగవరపుకోట నియోజకవర్గాలను ఆ జిల్లాలో కలిపామని, విజయనగరం అభివృద్ధి దెబ్బతినకుండా జిల్లా ఏర్పాటు చేశామన్నారు. అలాగే పెందుర్తిని తీసేస్తే అనకాపల్లి వెనకపడే అవకాశం ఉందన్నారు. భీమిలి గత ప్రాముఖ్యత దృష్య్టా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేశామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం ప్రాంతాలను మూడు జిల్లాలుగా ఏర్పాటు చేశామన్నారు. కోనసీమ ప్రాంతాన్ని జిల్లాగా చేయాలని అక్కడి ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారని, అందుకే అమలాపురం కేంద్రంగా దాన్ని ప్రతిపాదించామని తెలిపారు. నరసాపురం జిల్లాలో ఒక్క రెవిన్యూ డివిజన్ వచ్చింది కాబట్టి భీమవరం కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అవుతుందన్నారు.. బాపట్లలోని సంతనూతలపాడు నియోజకవర్గాన్ని ఒంగోలు జిల్లాకి కలుపుతామన్నారు. అలాగే నంద్యాలలోని పాణ్యం నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాకి, హిందూపూర్ లోని రాప్తాడు నియోజకవర్గాన్ని అనంతపూర్ జిల్లాకి కలుపుతామన్నారు. తిరుపతి పార్లమెంట్ లోని సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాకి కలపాలని.. తిరుపతికి చిత్తూరులోని చంద్రగిరి నియోజకవర్గం కలపాలని ప్రతిపాదించామన్నారు. రాజంపేట జిల్లాను 6 నియోజకవర్గాలతో ఏర్పాటు చేస్తూ.. పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాకి కలపాలని ప్రతిపాదించామన్నారు. కొత్త ప్రతిపాదిత జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం సగటున జిల్లాకి 20 లక్షల వరకూ జనాభా ఉంటున్నట్లు తెలిపారు. 

26 జిల్లాలు.. 62 రెవెన్యూ డివిజన్లు..  

రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. జిల్లాల ఏర్పాటు పక్రియలో అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ప్రతిపాదిత జిల్లా సరిహద్దు పరిధిలోకి రావాలని, ప్రతి జిల్లాలో కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఉండేలా నిబంధనలను అనుసరించామని ఆయన తెలిపారు.  పరిపాలన సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న 51 రెవిన్యూ డివిజన్లకు కొత్తగా 15 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని, 4 డివిజన్లను ప్రస్తుత రెవెన్యూ డివిజన్లకు కలపాలని ప్రతిపాదించామని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే రెవెన్యూ డివిజన్లలో విజయనగరం జిల్లాలో బొబ్బిలి  రెవెన్యూ డివిజన్, విశాఖపట్నం జిల్లాలో భీముని పట్నం రెవెన్యూ డివిజన్, నర్సాపురం జిల్లాలో భీమవరం రెవెన్యూ డివిజన్, విజయవాడ లో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాలో నందిగామ, తిరువూరు రెవిన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. అలాగే బాపట్ల జిల్లాలో ఒక్క రెవిన్యూ డివిజన్ కూడా లేదు కాబట్టి బాపట్ల, చీరాల డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామన్నారు.  ఒంగోలు జిల్లాలో కనిగిరి రెవెన్యూ డివిజన్, నంద్యాల జిల్లాలో ఆత్మకూర్, డోన్ రెవెన్యూ డివిజన్లు, అనంతపూర్ జిల్లాలో గుంతకల్ రెవెన్యూ డివిజన్, హిందూపూర్ జిల్లాలో పుట్టపర్తి రెవెన్యూ డివిజన్, కడప జిల్లాలో బద్వేలు రెవెన్యూ డివిజన్, రాజంపేట (రాయచోటి) జిల్లాలో రాయచోటి రెవెన్యూ డివిజన్, చిత్తూరు జిల్లాలో పలమనేరు రెవెన్యూ డివిజన్ మొత్తం కలిపి 15 రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు వివరించారు. ఎటపాక, కుకునూరు, ధర్మవరం, కందుకూరు రెవెన్యూ డివిజన్ లలో షిఫ్ట్ చేశామన్నారు. 

భౌగోళిక విస్తీర్ణం, జనసాంద్రతను అనుసరించే విభజన జరిగిందని విజయకుమార్ స్పష్టం చేశారు.  26 జిల్లాల్లో అతి పెద్ద జిల్లాలుగా ఒంగోలు, అనంతపురం విస్తీర్ణంలో నిలిచాయన్నారు. దీనికి ప్రధాన కారణం ఈ రెండు జిల్లాల్లో నల్లమల ఫారెస్ట్ ఎక్కువ భాగం ఉందని తెలిపారు. చిన్న జిల్లాగా విశాఖపట్నం ఉందన్నారు. విస్తీర్ణం తక్కువయినా భీమవరం, రాజమండ్రి ఎక్కువ జనసాంద్రత ఉన్న జిల్లాలని, ఇక్కడ ఇరవై లక్షల మంది జనాభా ఉన్నారని తెలిపారు. చారిత్రక నేపథ్యాలను చూసి కూడా జిల్లాలను విభజించడం జరిగిందన్నారు. ప్రజల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. అభ్యంతరాలు ఏమైనా ఉంటే ప్రభుత్వానికి తెలియచేయవచ్చని విజయకుమార్ ఈ సందర్భంగా సూచించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ డైరెక్టర్ కె. శివశంకర రావు తదితరులు పాల్గొన్నారు.

(జారీచేసిన వారు : కమిషనర్, సమాచార, పౌర సంబంధాల శాఖ, విజయవాడ)

Monday, January 24, 2022

New Districts In AP: ఉగాది నాటికి ఏపీలో కొత్త జిల్లాలు

 New Districts In AP: ఉగాది నాటికి ఏపీలో కొత్త జిల్లాలు

Jan 25, 2022, 02:24 IST

New districts by Ugadi Festival In Andhra Pradesh - Sakshi

నేడో, రేపో ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశం


తెలుగు సంవత్సరాదిలోపు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తికి కసరత్తు


కొత్తగా మరో 13 జిల్లాల ఏర్పాటు


దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాలు 26కు..


ఇక ప్రతీ లోక్‌సభ నియోజకవర్గం ఓ జిల్లా


ఒక్క అరకు పార్లమెంటు నియోజకవర్గమే 2 జిల్లాలుగా..


అత్యంత శాస్త్రీయంగా కొత్త జిల్లాలపై అధ్యయనం


కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లు, ఎస్పీ ఇతర జిల్లా కార్యాలయాలూ ఎక్కడ ఏర్పాటు చేయాలో గుర్తింపు


సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జిల్లాలను అతిత్వరలో ఏర్పాటుచేయనుంది. దీనికి సంబంధించి నేడో రేపో నోటిఫికేషన్‌ను జారీచేయనుంది. ఉగాదిలోపు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తిచేసి కొత్త జిల్లాలను అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం కసరత్తు పూర్తిచేసినట్లు సమాచారం. పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటుచేస్తామని ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన మేనిఫెస్టోలో పొందుపరిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై సుదీర్ఘ కసరత్తు జరిపారు. ఈలోపు 2021 జనాభా గణన ముందుకురావడంతో పునర్వ్యవస్థీకరణ ఆలస్యమైంది. కానీ, కరోనా నేపథ్యంలో జనాభా గణన ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో అది మొదలయ్యేలోపు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 




కొత్తగా మరో 13 జిల్లాలు 

రాష్ట్రంలో 25 లోక్‌సభ నియోజకవర్గాలుండగా.. ఇప్పుడున్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలు ఏర్పడనున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 26కు పెరగనుంది. పార్లమెంటు స్థానాన్ని ఒక నియోజకవర్గంగా చేయాలనుకున్నా అరకు లోక్‌సభ నియోజకవర్గం భౌగోళికంగా సుదీర్ఘంగా విస్తరించి ఉండడంతో దాన్ని రెండు జిల్లాలుగా చేయాలని గతంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కమిటీ ప్రతిపాదనలు తయారుచేసింది. ఆ మేరకు అరకు నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా చేసే అవకాశాలున్నాయి. అంటే కొత్తగా రెండు గిరిజన జిల్లాలు ఏర్పడనున్నాయి. ఇవికాక.. అక్కడక్కడా భౌగోళిక పరిస్థితుల ఆధారంగా చిన్నచిన్న మార్పులు, చేర్పులు ఉండనున్నాయి. మొత్తంగా ప్రతి లోక్‌సభ నియోజకవర్గం ఒక కొత్త జిల్లాగా అవతరించనుంది. అలాగే, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం ఏదో ఒక జిల్లాలో ఉండేలా ప్రతిపాదనలు సిద్ధంచేశారు. 

 

శాస్త్రీయంగా జిల్లాల పునర్వ్యస్థీకరణ ప్రక్రియ 

జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియపై ప్రభుత్వం అత్యంత శాస్త్రీయంగా అధ్యయనం చేసింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన అధ్యయన కమిటీని నియమించింది. వివిధ అంశాలపై పలు శాఖల అధికారులతో నాలుగు సబ్‌ కమిటీలను, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటుచేసింది. ఈ కమిటీల్లోని అధికారులు పలుమార్లు సమావేశమై జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఎలా ఉండాలి? సరిహద్దుల నిర్ధారణకు ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అంశాలేవి? దీనివల్ల ఎదురయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఏ విధానం పాటించాలి? వంటి అనేక అంశాలపై కూలంకుషంగా చర్చించి మార్గదర్శకాలు రూపొందించారు. వీటిపై విస్తృత అధ్యయనం తర్వాత 26 జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధంచేశారు. రవాణా, ఆర్‌ అండ్‌ బీ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ కొత్త జిల్లాల్లో అవసరమైన మౌలిక వసతులు, కలెక్టరేట్లు, ఎస్పీ ఇతర జిల్లా కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటుచేయాలో గుర్తించింది. ఇక కొత్త జిల్లాల ఏర్పాటువల్ల అయ్యే వ్యయాన్ని ఇతర అంశాలపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ నివేదిక ఇచ్చింది. 


తొలుత ప్రాథమిక నోటిఫికేషన్‌ 

ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల పునర్య్వస్థీకరణ చట్టం ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటు కోసం రెవెన్యూ శాఖ ముందుగా  ప్రాథమిక నోటిఫికేషన్‌ను జారీచేస్తుంది. దీనిపై సూచనలు, సలహాల కోసం 30 రోజుల గడువు ఇస్తారు. వచ్చిన సూచనలన్నింటినీ పరిశీలించి అవసరమైతే కొన్ని మార్పులు, చేర్పులు చేస్తారు. ఆ తర్వాత తుది నోటిఫికేషన్‌ ఇస్తారు. తుది నోటిఫికేషన్‌లోనే కొత్త జిల్లాలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో తెలుపుతూ అపాయింటెడ్‌ తేదీని పేర్కొంటారు. ఆ తేదీ నుంచి కొత్త జిల్లాలు ఏర్పడినట్లే. ఈలోపే కొత్తగా ఏర్పడిన జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా స్థాయి అధికారులను నియమిస్తారు. ఈ ప్రక్రియనంతటినీ ఉగాదిలోపు పూర్తిచేసి కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సమాయమత్తమవుతోంది.  

‘జీతాల భారం’పై సర్కారువన్నీ సాకులే...

 ‘జీతాల భారం’పై సర్కారువన్నీ సాకులే...

కేంద్రం నుంచి ఇతోధికంగా లోటు నిధులు

హైదరాబాద్‌ వదులుకున్నందుకు ఏపీకి

రూ. 17,000 కోట్లమేర లోటు గ్రాంట్‌

కేంద్ర పన్నుల్లో 3వేల కోట్లు రాష్ట్రానికి

ఇతరేత్రా కూడా ఢిల్లీ నుంచి సొమ్ములు

ఇవన్నీ కలిపి ఆదాయం 1,40,000 కోట్లు

గత ఏడాది కంటే 23 వేల కోట్లు ఎక్కువ

తెలంగాణ కంటే 2 వేల కోట్లే తక్కువ

అయినా, ఆదాయంపై అడ్డగోలు వాదనలు

2020-21లో రాష్ట్ర ఆదాయం రూ.1,17,000 కోట్లు

2021-22లో ఆదాయ అంచనా రూ. 1,40,000 కోట్లు

(ముగిసిన 8 నెలల కాలానికి ఇప్పటికే 88 వేలకోట్లు ఖజానాకు) 

ఈ ఆదాయంలో అత్యధికం కేంద్ర నుంచి వచ్చిన నిధులే

అనూహ్యంగా ఆదాయంలో 23 వేలకోట్ల పెరుగుదల

హైదరాబాద్‌ వదులుకున్నందుకు లోటుగ్రాంట్‌ 17 వేలకోట్లు

కేంద్రం పన్నుల్లో రాష్ట్రం వాటా కింద మరో రూ.3 వేల కోట్లు


PlayUnmute

Fullscreen

VDO.AI


(అమరావతి - ఆంధ్రజ్యోతి): సొంతంగా సంపద సృష్టించుకుని, ఆదాయం పెంచుకునే చర్యలేవీ లేవు! కానీ... రాష్ట్రానికి రూపాయి రాకలో ఏమాత్రం లోటు లేదు. కేంద్రం నుంచి రకరకాల రూపాల్లో సొమ్ములు ముడుతూనే ఉన్నాయి. కరోనా కారణంగా అదనపు సహాయమూ అందింది. అయినా సరే... కొవిడ్‌తో ఆదాయం పడిపోయిందని, జీతాలు పెంచలేమని సర్కారు చెబుతోంది.  కనీసం తెలంగాణకు తగ్గకుండా వేతన సవరణ చేయాలంటే.. ఆదాయం బాగా ఎక్కువ ఉన్న ఆ రాష్ట్రంతో పోలిక సరికాదంటోంది. ఈ వాదనలో ఏమాత్రం నిజం లేదని అధికారులే చెబుతున్నారు. రెవెన్యూ లోటు పూడ్చడానికి కేంద్రం అందిస్తున్న చేయూతతో అనూహ్యంగా రూ. 23వేల కోట్ల మేర ఏపీ ఆదాయం పెరగనుంది. కేవలం 2వేల కోట్లు మాత్రమే ఆర్జనలో తెలంగాణ కంటే ఏపీ వెనుకబడింది. ఈ మాట సమ్మెకు వెళుతున్న ఉద్యోగులో, ప్రతిపక్షాలో అంటున్నది కాదు. ఒక ఏడాది రాష్ట్ర ఆదాయ గ్రాఫ్‌ పరిశీలించినా అర్థమయ్యేది ఇదే! నిన్న ‘కాగ్‌’ కూడా ఇదే చెప్పగా...జీతాల సమస్య తలెత్తకముందు ప్రభుత్వం కూడా ఔను..ఔను అంటూ ప్రచారం చేసుకోవడం గమనార్హం.  

ఇవిగో గణాంకాలు..ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం అనూహ్యంగా పెరిగింది. ఎవరు కాదన్నా ఇది నూటికి నూరుపాళ్లు నిజం. కరోనా కారణంగా ఆదాయం తగ్గిందని సీఎం జగన్‌, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  రావత్‌ పదే పదే చెప్తున్నప్పటికీ అందులో పస లేనేలేదని వాస్తవిక గణాంకాలు నిరూపిస్తున్నాయి. కాగ్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు ఈ 8 నెలల గణాంకాలు పరిశీలిస్తే నెలకు సగటున రూ.11,500 కోట్లు చొప్పున ఖజానాకు ఆదాయం వచ్చింది. ఈ కాలంలో వచ్చిన ఆదాయం రూ.88,600 కోట్లు. డిసెంబరు నుంచి ఏప్రిల్‌ వరకు  నాలుగు నెలల పాటు కూడా ఇదే స్థాయిలో ఆదాయం లెక్కిస్తే రాష్ట్రం మొత్తం ఆదాయం రూ.1,38,000 కోట్లకు చేరుతుంది. మార్చిలో ప్రభుత్వానికి కేంద్రం నుంచి పన్నుల్లో వాటా కింద అదనంగా దాదాపు రూ.2000 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. దీంతో మొత్తం ఆదాయం రూ.1,40,000 నుంచి రూ.1,41,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా. గత ఆర్థిక సంవత్సరం 2020-21లో వచ్చిన ఆదాయం కంటే ఇది రూ.23,000 కోట్లు ఎక్కువ. 

అంతా కేంద్రం దయే..రాష్ట్రానికి పెరిగిన ఆదాయ అంచనాలో సింహభాగం అంటే రూ.17,257 కోట్లను కేంద్రం రెవెన్యూ లోటు గ్రాంటు కింద ఇస్తోంది. విభజన తర్వాత హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల జరిగే నష్టాన్ని కేంద్రం ఈ గ్రాంటుతో భర్తీ చేస్తోంది. ఇందులో మొదటి 8 నెలల్లో రూ.11,500 కోట్లు ఇచ్చేసింది. మిగిలిన రూ.5757 కోట్లను డిసెంబరు నుంచి మార్చిలో నెలల్లో ఇస్తుంది. హైదరాబాద్‌ ను కోల్పోయినందుకు ఇంత భారీగా గ్రాంటు వస్తున్నప్పటికీ విభజన నష్టాల కారణంగా ముఖ్యంగా హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల రాష్ట్రం ఆదాయం తగ్గుతోందంటూ సీఎస్‌, ఆర్థిక శాఖ అధికారులు పదే పదే అవాస్తవాలు చెప్తున్నారు. ఈ 8 నెలల్లో ఏపీకి వచ్చిన రూ.88,600 కోట్ల ఆదాయంలో కేంద్రం నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో వచ్చినవి రూ.23,500 కోట్లు. ఇందులో  రూ.11,500 కోట్లు రెవెన్యూ లోటు గ్రాంటు నిధులు, రూ.969 కోట్లు స్థానిక సంస్థలకు వచ్చిన గ్రాంట్లు, మిగిలిన రూ.11,031 కోట్లు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం కేంద్రం ఇచ్చిన గ్రాంట్లు ఉన్నాయి. 

తిరిగి మూడేళ్లనాటి స్థితికి..పన్ను ఆదాయానికి వచ్చేసరికి చంద్రబాబు హయంలో తెలంగాణతో పోల్చితే ముందంజలో ఏపీ ఉంది. జగన్‌ వచ్చిన తొలి రెండేళ్లలో బాగా వెనుకబడి ఈ ఏడాది కొంత పురోగతి సాధించింది. చంద్రబాబు దిగిపోయే సంవత్సరం 2018-19లో ఏపీ పన్ను ఆదాయం రూ.62,395 కోట్లు కాగా, ఆ ఏడాది తెలంగాణకు వచ్చిన పన్ను ఆదాయం రూ.59,612 కోట్లు. అలాంటిది ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 8 నెలల్లో ఈ వ్యత్యాసం కొంత మేర తగ్గింది. పన్ను ఆదాయం రూ.62,962 కోట్లు రాగా, తెలంగాణకు రూ.64,857 కోట్లు వచ్చింది. అంటే... ఏపీ కంటే తెలంగాణ పన్ను ఆదాయం కేవలం రూ.1895 కోట్లు మాత్రమే ఎక్కువ. 

కొసమెరుపు  ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయడం వల్ల ప్రభుత్వంపై రూ.10,700 కోట్లమేర అదనపు భారం పడుతుందని సీఎం చెబుతున్నారు. అయితే, ఉద్యోగులు మాత్రం పెరిగే జీతాలు తమకొద్దని, పాతజీతాలే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ సమ్మెకు దిగుతున్నారు. వారు కోరినట్టుగా... పాతజీతాలు అంటే ప్రభుత్వం దృష్టిలో తక్కువ జీతాలు ఇచ్చి ఖజానాకు రూ.10,700 కోట్లు మిగిల్చినట్టే! మరి ప్రభుత్వం ఈ పని ఎందుకు చేయడం లేదనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

Thursday, January 20, 2022

PRC issue

 

శక్తికి మించి చేశాం..

Perni Nani Comments about Government employees  - Sakshi

సమాచార శాఖ మంత్రి పేర్ని నాని  

జీతాలు తగ్గితే ప్రభుత్వంపై జీతాల భారం ఎందుకు పెరిగింది? 

వాస్తవ పరిస్థితులను ఉద్యోగులు గమనించాలి.. ఉద్యోగుల పట్ల సీఎం జగన్‌కు ఎంతో ప్రేమ

అందుకే సీఎం అయిన వారం లోపే 27 శాతం ఐఆర్‌  

కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, హోంగార్డులు, ఎంఎన్‌ఓల జీతాల పెంపు

కోవిడ్‌ వల్ల ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారాయి 

అయినప్పటికీ ప్రభుత్వం ఎన్నో సానుకూల నిర్ణయాలు తీసుకుంది 

ఇవన్నీ గమనించకుండా భ్రమలు కల్పిస్తూ వక్రీకరణలు తగవు 

నేతల పనులతో ఉద్యోగుల భవిష్యత్‌కు ఇబ్బంది కలిగే పరిస్థితి  

ఉద్యోగులు ఎప్పుడైనా చర్చలకు ముందుకు రావొచ్చు  

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేయాలన్న తపనతో ముందుకు వెళుతున్న ప్రభుత్వమిదని, భావోద్వేగ పరిస్థితుల్లో కాకుండా వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని ఉద్యోగులను కోరుతున్నామని సమాచార, పౌర సంబ«ంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ప్రేమ, సానుభూతి ఉంది కాబట్టే అధికారంలోకి వచ్చిన వారంలోనే 27% మధ్యంతర భృతి (ఐఆర్‌) ప్రకటించారని చెప్పారు. ఆనాడు నిజానికి ఉద్యోగులు కూడా అడగలేదన్న విషయం వాస్తవమా కాదా అన్నది నిండు మనసుతో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు శక్తికి మంచి చేశామని, పరిస్థితి అర్థం చేసుకోవాలని కోరారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. కోవిడ్‌ వల్ల ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారాయని తెలిపారు. ఆదాయాలు పూర్తిగా పడిపోయాయని, వ్యయం పెరిగిందని చెప్పారు. అందువల్ల కొంత మంది వక్రీకరణలను గమనించి, సానుభూతితో ఆలోచించాలని కోరుతున్నామన్నారు. ఉద్యోగులు ఎప్పుడైనా చర్చలకు ముందుకు రావొచ్చని, అందుకు ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. నాడు ఉద్యోగులను వేధించిన వారు ఇవాళ నీతులు చెబుతూ మేకతోలు, ఆవుతోలు కప్పుకున్న తోడేళ్లలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వారి ట్రాప్‌లో ఉద్యోగులు పడకూడదని, ఇది ముమ్మాటికీ మీ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రి ఇంకా ఏం చెప్పారంటే..

ఉద్యోగులు మనసు పెట్టి ఆలోచించాలి 
► సీఎంగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉద్యోగులను ప్రభుత్వం కన్నబిడ్డల్లా చూసుకుంటోంది. ఉద్యోగులు ఆశించిన మేరకు వేతన సవరణ చేయలేక పోవడానికి గత్యంతరం లేని ఆర్థిక పరిస్థితులే కారణం. ఉద్యోగుల భావోద్వేగాలను గోతి కాడ నక్కల్లా సొమ్ము చేసుకోవాలని కొందరు చూస్తున్నారు. 
► కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ ఇవ్వడం, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు మేలు చేసే విధంగా ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనుమానాలు నివృత్తి చేస్తాం.

ఆదాయం దారుణంగా తగ్గింది 
► వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యే నాటికి, అంటే 2018 –19లో ప్రభుత్వ సొంత ఆదాయం రూ.62,473 కోట్లు. ఏడాది తర్వాత 2019–20లో ప్రభుత్వ ఆదాయం రూ.60,933 కోట్లు. నిజానికి అప్పుడు రూ.71,844 కోట్లు ఆదాయం రావాల్సి ఉండింది. దాదాపు రూ.2 వేల కోట్ల ఆదాయం తగ్గింది.
► 2020–21లో ప్రభుత్వ ఆదాయం రూ.82,620 కోట్లుగా అంచనా వేస్తే, రూ.60,688 కోట్లు మాత్రమే వచ్చింది. కోవిడ్‌ వల్ల దాదాపు రూ.21 వేల కోట్ల ఆదాయం కోల్పోయాం. కోవిడ్‌ వల్ల ప్రజలను కాపాడుకోవడం కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో వ్యాపారాలు సాగలేదు. దీంతో ఒకవైపు ఆదాయం తగ్గగా, మరో వైపు ఖర్చులు పెరిగాయి. మరో వైపు కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు సక్రమంగా రాలేదు. జీఎస్టీ, ఆదాయం పన్ను పూర్తిగా రాలేదు. 
► 2018–19లో కేంద్రం నుంచి మనకు రూ.32,722 కోట్లు రాగా, 2019–20లో రూ.28,221 కోట్లకు, ఆ తర్వాత ఏడాది 2020–21లో రూ.24,441 కోట్లకు అది తగ్గిపోయింది. ఉద్యోగుల జీతభత్యాల కింద ఇప్పుడు రూ.60,177 కోట్లు చెల్లిస్తుండగా, కొత్త పీఆర్సీ అమలు చేస్తే రూ.70,424 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అయినా ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడడం లేదు.
► పరిస్థితులు ఈ విధంగా ఉన్నప్పుడు ఉద్యోగులు అర్థం చేసుకోవాలి. ఉద్యోగుల కోర్కెలన్నీ తీర్చలేనందుకు సీఎం జగన్‌ కూడా బాధ పడుతున్నారు. సీపీఎస్‌ రద్దు కోసం గతంలో ఉద్యోగులు ఆందోళన చేస్తే, చంద్రబాబు వారిపై కేసులు పెట్టి అరెస్టు చేయించారు.
► ఉద్యోగులపై కేసులను సీఎం జగన్‌ 2020 జూలై 30న జీఓ నెం.731 ద్వారా ఎత్తివేయడం వాస్తవం కాదా? నాడు కేసులు పెట్టిన వారు ఇవాళ ఉద్యోగుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారు. యూపీ, గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వమే ఉంది. అక్కడ హెచ్‌ఆర్‌ఏ ఎలా ఇస్తున్నారు? బీజేపీ నేతలు తెలుసుకొని మాట్లాడాలి.   

ఐఆర్‌పై వక్రీకరణలు తగునా?
► ఐఆర్‌ అంటే మధ్యంతర భృతి. ఒక ఉద్యోగికి ప్రభుత్వం మధ్యంతరంగా ఇచ్చే డబ్బు అని అర్థం. పీఆర్సీ ఇవ్వాలి కాబట్టి, ఆలోగా ఈ డబ్బును తీసుకోండి అని ప్రభుత్వం ఇస్తుంది. తర్వాత ఈ డబ్బు పీఆర్సీ సర్దుబాటుకు లోబడే ఉంటుంది. గతంలో ఎప్పుడు ఐఆర్‌ ఇచ్చినా, తర్వాత ప్రకటించిన పీఆర్సీని పరిగణలోకి తీసుకుని సర్దుబాటు చేసి, జీతాలను ఖరారు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో నైనా ఇదే విధానాన్ని మొదట నుంచి అనుసరిస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా అంతే. 
► ఈ విషయం ఉద్యోగ సంఘాల నాయకులకు తెలిసీ కూడా ఐఆర్‌ను జీతంలో భాగంగా పరిగణిస్తూ వక్రీకరణ చేస్తున్నారు. ఉద్యోగులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఏర్పాటైన వారం రోజుల్లోనే ఎవరూ అడక్కపోయినా 27 శాతం ఐఆర్‌ ప్రకటించారు. 
► 7,55,075 మంది ఉద్యోగులకు ఐఆర్‌ కింద రూ.17,918 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించిన మాట వాస్తవం కాదా? హెచ్‌ఆర్‌ఏ అన్నది జీతభత్యాల్లో ఒక అంశం కాదా? హెచ్‌ఆర్‌ఏ అన్నది మనకు అందుతున్న గ్రాస్‌ శాలరీలో ఒక సబ్‌ కాంపొనెంట్‌. ఇదే హెచ్‌ఆర్‌ఏను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైన రైల్వే, కేంద్రీయ విద్యాలయాల టీచర్లు, ఆల్‌ఇండియా ఆఫీసర్స్, పోస్టల్‌ ఉద్యోగులకూ ఇస్తున్నది వాస్తవం కాదా?

వీరికి జీతాలు పెంచిన మాట వాస్తవం కాదా?
► అంగన్‌వాడీ కార్యకర్తల జీతం 2018కు ముందు ఉన్న రూ.7 వేల నుంచి రూ.11,500కు పెంచలేదా?
► మినీ అంగన్‌వాడీల జీతం రూ.4,500 నుంచి రూ.7 వేలు చేయ లేదా?
► వీఓఏ, సంఘమిత్రలు, యానిమేటర్స్‌ జీతాలు రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచలేదా?
► శానిటరీ వర్కర్ల జీతాలు రూ.8 వేల నుంచి 18 వేలకు పెంచలేదా?
► శానిటరీ సూపర్‌ వైజర్ల జీతాలను రూ.12 వేల నుంచి రూ.18 వేలకు పెంచలేదా?
► ఆశా వర్కర్ల జీతాలు 2018కు ముందు రూ.3వేల –6వేలు ఉంటే, వాటిని రూ.10 వేలకు పెంచ లేదా?
► ఎంఎన్‌ఓ జీతాలను రూ.6,700 నుంచి రూ.17,746కు పెంచలేదా?
► కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల జీతాలను రూ.400 నుంచి రూ.4 వేలకు పెంచ లేదా?
► హోంగార్డుల డైలీ డ్యూటీ అలవెన్స్‌లను రూ.600 నుంచి రూ.710కి పెంచ లేదా?
► కుక్‌ కం హెల్పర్ల జీతాలను రూ.1,000 నుంచి రూ.3 వేలకు పెంచలేదా?
► కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు గతంలో ఏటా జీతాల రూపంలో రూ.1100 కోట్ల చెల్లింపులు ఉంటే, ఇప్పుడు ఏడాదికి చెల్లిస్తున్నది సుమారు రూ.3 వేల కోట్లు.  ఇది మేలు కాదా?
► ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయ లేదా? ఇవన్నీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయాలు కాదా?

ఇవన్నీ నిజాలు కావా?
► ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంపు. దీనివల్ల రెండేళ్ల సర్వీసు పెరగడంతోపాటు 24 నెలల జీతం అదనంగా లభిస్తుంది. ఇది ఉద్యోగులకు లాభం కాదా? 
► నెలకు రూ.1 లక్ష జీతం అందుకునే ఉద్యోగికి రెండేళ్ల కాలంలో రూ.24 లక్షలు జీతం రూపేణా వస్తాయి. దీనివల్ల ఆయా ఉద్యోగుల కుటుంబాలకు మేలు చేసినట్టు కదా?
► రెండేళ్ల అదనపు సర్వీసుతో పాటు ఆ సమయంలో 4 డీఏలు, 2 ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి. ఇది వారికి మేలు చేసినట్టు కాదా? 
► సర్వీసు పెరగడం వల్ల పెన్షన్‌ రూపేణా ప్రభుత్వం నుంచి వాటా పెరుగుతుంది. దీనివల్ల రిటైర్మెంట్‌ తర్వాత వారికి పెన్షన్‌ పెరగదా? 
► దేశంలో ఎన్నిచోట్ల 62 సంవత్సరాల పదవీ విరమణ వయస్సు ఉంది?
► సర్వీసు కాలానికి గ్రాట్యుటీ కింద ఇదివరకు ప్రభుత్వం ఇచ్చేది రూ.12 లక్షలు. ఇప్పుడు దాన్ని ఈ ప్రభుత్వం రూ.16 లక్షలకు పెంచడం మేలు చేసే నిర్ణయం కాదా? 
► ఏ ఉద్యోగి అడగకపోయినా ఇళ్లు లేని ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తున్నది మేలు చేయడం కాదా? ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్స్‌లో 10% స్థలాలను ప్రభుత్వ ఉద్యోగులకు రిజర్వ్‌ చేసిన మాట వాస్తవం కాదా? ఈ స్థలాలను 20 శాతం రిబేటుతో ఇవ్వాలన్నది మేలు చేసేది కాదా? దీనివల్ల నేరుగా రూ.10 లక్షల వరకు లబ్ధి కలగడం లభించదా?
► కోవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి జూన్‌ 30లోగా నియామకాలు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేయడం వాస్తవం కాదా?
► ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవల్లో భాగంగా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1.28 లక్షల మందిని శాశ్వత ఉద్యోగులుగా నియమించింది. ఈ ఉద్యోగులకు మేలు చేసేలా రెండున్నరేళ్లకే రెగ్యులరైజ్‌ చేస్తోంది. 2022 జూన్‌ 30తో వీరి ప్రొబేషన్‌ ముగుస్తోంది. జూలై 1 నుంచి రెగ్యులర్‌ స్కేలు అమల్లోకి వస్తోంది. దీనివల్ల వారికి గణనీయంగా జీతాలు పెరుగుతున్న మాట నిజం కాదా?
► కాంట్రాక్టు ఉద్యోగులకూ మినిమం టైం స్కేలు వర్తింపు చేసిన ఏకైక ప్రభుత్వం ఇది కాదా? ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను దళారీల బారి నుంచి బయట పడేయలేదా? వారికి కత్తిరింపులు లేకుండా, లంచాలకు తావివ్వకుండా పూర్తి జీతాలు అందించడం లేదా? వీరందరికీ ఈపీఎఫ్, ఈఎస్‌ఐ లాంటి సౌకర్యాలను కల్పించడం వాస్తవం కాదా? వీరికి కూడా 23 శాతం ఫిట్‌మెంట్‌ వర్తింప చేయడం మేలు చేసే నిర్ణయం కాదా? ఇలాంటి పనులు గత ప్రభుత్వాలు ఎప్పుడైనా చేశాయా?
► కేంద్ర ప్రభుత్వ కమిటీ చేసిన సిఫార్సు 14.29 శాతమే. కాని ఈ ప్రభుత్వం ఇంతటి పరిస్థితుల్లో కూడా 23 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిన మాట నిజం కాదా? ఐఆర్‌ రూపంలో రూ.17,918 కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? పీఆర్సీ వల్ల ఏడాదికి రూ.10,247 కోట్ల అదనపు భారం ప్రభుత్వ ఖజానాపై పడుతున్న విషయం వాస్తవం కాదా?
► 2018–19లో రాష్ట్ర సొంత ఆదాయం రూ.62,503 కోట్లు అయితే, ఉద్యోగులకు చెల్లించిన జీతాలు రూ.52,513 కోట్లు. అంటే 84 శాతం జీతాల రూపంలో చెల్లించారనే విషయాన్ని గమనించాలి.  
► 2020–21లో రాష్ట్ర సొంత ఆదాయం రూ.60,688 కోట్లు అయితే, ఉద్యోగులకు చెల్లించిన జీతాలు రూ.67,340 కోట్లు. 111% జీతాల రూపంలో చెల్లించడం నిజం కాదా?

జీతాలు ఎలా తగ్గుతాయి?
► మొత్తంగా గ్రాస్‌ శాలరీ పెరిగిందా? లేదా? అన్నది చూసుకోవాలి.  
► ఉద్యోగులకు ఇప్పటి వరకు జీతాల రూపంలో ఏటా చెల్లింపులు రూ.60,177 కోట్లు అయితే, కొత్త పీఆర్సీ ద్వారా ఇకపై రూ.70,424 కోట్లు  చెల్లింపులు ఉంటాయి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఏటా భారం రూ.10,247 కోట్లు పడుతుంది. ఈ పరిస్థితిలో జీతాలు తగ్గుతాయన్న వాదనకు ఆస్కారం ఎక్కడిది?
► ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాల నాయకులు వాస్తవాలు చెప్పి ఉద్యోగులను మంచి దిశగా జాగృతం చేయాల్సింది పోయి వక్రీకరణలు చేయడం సబబేనా? ఉద్యోగులను పెడదోవ పట్టించడం న్యాయమేనా?
► ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు లాంటి వారి చేతిలో నాయకులు కీలు బొమ్మలు కావడం తగునా? వారికి అమ్ముడుపోయి వక్రీకరణలు చేయడం సరైనదేనా? ప్రభుత్వం ఇంత మేలు చేస్తున్నా, మేలు జరగనట్టుగా భ్రమలు కల్పించి వక్రీకరణలతో ఉద్యోగులను రెచ్చగొట్టడం కరెక్టేనా?
► ఇవాళ ఉద్యోగ సంఘాల నాయకులు చేస్తున్న పనులు ఉద్యోగుల భవిష్యత్తుకు భంగకరంగా మారదా? భవిష్యత్తులో ఏ ప్రభుత్వమైనా ఐఆర్‌ ఇవ్వడానికి ముందుకు వస్తుందా? ఉద్యోగులకు సానుకూలంగా ఉండే నిర్ణయాలు తీసుకునేలా ఉండాల్సిన పరిస్థితులను ధ్వంసం చేస్తే, దెబ్బతినేది ఉద్యోగులు కాదా? ఈ విషయాలను అందరూ గమనించాలి.