Friday, November 11, 2022

అది అధికార పత్రమా.. వైసీపీ కరపత్రమా?

 CM JAGAN: అది అధికార పత్రమా.. వైసీపీ కరపత్రమా?

ABN , First Publish Date - 2022-11-11T02:54:51+05:30 IST


బడులకు రంగులు. ఆఫీసులకు వైసీపీ రంగులు. లోగోలకు రంగులు! ఒకరి విగ్రహాలు మార్చేసి వైఎస్‌ విగ్రహాలు పెట్టే తీరు.


CM JAGAN: అది అధికార పత్రమా.. వైసీపీ కరపత్రమా?

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్

సం|| 93979 79750

పట్టాదారు పాస్‌పుస్తకాలపై ఫొటోల పిచ్చి


‘జగనన్నే’ భూ యజమాని అన్నట్లు కలరింగ్‌


అది అధికార పత్రమా.. వైసీపీ కరపత్రమా?


పుస్తకం కవర్‌ పేజీ, చివరా జగన్‌ ఫొటోలు


లోపల ప్రతి పేజీలో ఆయన ఫొటో


పట్టాదారు రూపురేఖలు మార్చేసిన సర్కారు


తమ భూమిపై ఆయన


‘హక్కు’ ఏమిటని రైతుల ధ్వజం


‘భూమి మనది... హక్కు మనది... కష్టం మనది... పత్రం మనది! నడుమ జగనేందిరో... ఆయన ఫొటో ఏందిరో’... అని రైతన్నలు పాడుకునే రోజు త్వరలోనే రానుంది. భూమి ఎవరిది, దాని యజమాని ఎవరు, ఫొటో ఎవరిది... అనే సందేహం వచ్చేలా.. ప్రతి పేజీలో జగన్‌ కనిపించేలా ‘జగనన్న భూరక్ష పథకం’ పుస్తకాన్ని సిద్ధం చేశారు.


(అమరావతి - ఆంధ్రజ్యోతి): బడులకు రంగులు. ఆఫీసులకు వైసీపీ రంగులు. లోగోలకు రంగులు! ఒకరి విగ్రహాలు మార్చేసి వైఎస్‌ విగ్రహాలు పెట్టే తీరు. చివరికి... ఎవరికో చెందిన భూములపై తన ఫొటో వేసుకునే స్థాయికి చేరుకున్నారు. ఇది ముఖ్యమంత్రి జగన్‌ సొంత భూమికి సంబంధించిన పాసు పుస్తకమా? లేక... ‘జగనన్న భూ రక్ష పథకం’ ప్రచారం కోసం అధికార వైసీపీ రూపొందించిన కరపత్రమా? అని సందేహం కలిగేలా పాస్‌ పుస్తకాలు సిద్ధం చేశారు. సమగ్ర సర్వే అనంతరం భూ యజమానులైన రైతులకు ఈ పుస్తకాలను అందిస్తారు. 12 పేజీలున్న ఈ పాస్‌పుస్తకంలో... మొదటి పేజీలోనే పెద్దగా జగన్‌ ఫొటో, చివరి పేజీలో మళ్లీ జగన్‌ ఫొటో, దాని చుట్టూ ‘నవరత్నాల’ పేర్లు ముద్రించారు! పోనీ... లోపాలి పేజీలనైనా వదిలేశారంటే అదీ లేదు. 2, 11 పేజీ మినహా మిగిలిన అన్ని పేజీల్లో ‘జగన్‌’ కనిపిస్తారు. ప్రతిపేజీపైనా జగన్‌ ఫొటో ఉన్న నవరత్నాల లోగో ముద్రించారు. భూమి శాశ్వతం! ప్రభుత్వం శాశ్వతం! కానీ సీఎంగా జగన్‌ శాశ్వతం కాదుకదా? మరి ఎవరికో చెందిన భూమి హక్కు పత్రాల మీద ఆయన ఫొటో ముద్రించడమేమిటన్నదే రైతు సంఘాల ప్రశ్న. ఏపీ భూ హక్కుల చట్టం, దాని అమలు నిబంధనలు, సంప్రదాయాలు, పద్ధతులన్నీ తుంగలో తొక్కి ఈ పాసుపుస్తకాన్ని డిజైన్‌ చేశారు. ఈనెల 4నే పట్టాదారు పుస్తకాలను సీఎం చేతుల మీదుగా పంపిణీ చేద్దామని భావించారు. కానీ అనుకోని ఆటంకాలేవో ఎదురైనట్లు ఉంది! అందుకే... ప్రస్తుతానికి ఆపేశారు. ప్రభుత్వ ఆఫీసులు, ప్రకటనలు, పథకాలు, కార్యక్రమాలను జగన్‌ ఫొటోలతో నింపేస్తున్న సంగతి తెలిసిందే! ఇప్పుడు ఈ ఫొటోల పిచ్చిని రైతులకు ఇచ్చే సొంత ఆస్తిపత్రాలకూ పట్టించారు. గత 49ఏళ్లలో ఏ సీఎం ఈ పుస్తకాలపై తమ ఫొటోలు వేసుకోలేదు.


రైతుల ఆగ్రహం... అభ్యంతరం


‘‘మా కష్టార్జితం, సొంత ఆస్తి అయిన భూమి రికార్డుల్లో సీఎం ఫొటోలు ఎందుకు? ఆ భూములు ఏమైనా జగన్‌ దానం చేస్తే వచ్చాయా?’’ అంటూ రైతులు మండిపడుతున్నారు. ‘‘హక్కుదారుడిని కాబట్టి భూమి హక్కుపత్రంపై నా ఫొటో ఉండాలి. సీఎం ఫొటోలు ఎందుకు? జగన్‌ పుట్టకముందు నుంచే నాకు భూమిఉంది. ఇప్పుడు కొత్తగా జగనన్న భూమి హక్కుపత్రం అని ఎందుకు పేరుపెట్టారు?’’ అని కృష్ణాజిల్లా రైతు ధ్వజమెత్తారు.


ఇదేమి వేలం వెర్రి?


‘‘జగనన్న భూ యాజమాన్యపు హక్కుపత్రం అని రాయడం ఏమిటి? అధికారులకు సీఎంపై అభిమానం ఉండొచ్చు. కానీ, మరీ ఇంత వేలంవెర్రి ప్రదర్శించడం సరికాదు. పాసుపుస్తకాల డిజైన్‌ మార్చాలి. రైతు భూ యజమాన్యపు హక్కుపత్రంగా దాన్ని మార్చాలి!’’


- దివాకర్‌, ఏపీ రైతు కూలీ సంఘం నేత


అది... ‘వైఎ్‌సఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం’! సమగ్ర సర్వే అనంతరం పంపిణీ చేసే ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌ రికార్డు పుస్తకాలకు ‘జగనన్న భూ హక్కుపత్రం’ అని నామకరణం చేశారు. లోపలి పేజీల్లో ‘జగనన్న భూ యాజమాన్య హక్కుపత్రం’ అని ముద్రించారు. ఆ భూమి యజమాని జగనన్నా? లేక... రైతా? జగన్‌ తన సొంత భూమిపై హక్కులను మరొకరికి కల్పిస్తున్నారా?


No comments:

Post a Comment