Monday, August 3, 2020

Pawan Kalyan on Amaravati and Three Capitals

Aug 3 2020 @ 03:19AMహోంఆంధ్రప్రదేశ్
 
అమరావతి రైతుల కోసం టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు  రాజీనామా చేయాలి: పవన్

రాజధానిపై చిత్తశుద్ధి ఉంటే ప్రత్యక్ష పోరాటంలోకి రావాలి

తప్పు చేసింది ఆ పార్టీలైతే మమ్మల్ని ఎలా ప్రశ్నిస్తారు :  పవన్‌ కల్యాణ్‌

అమరావతి, (ఆంధ్రజ్యోతి): రాజధాని నిర్మాణం కోసం వేల ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చి నడిరోడ్డుపైకి వచ్చేసిన రైతులకు అండగా నిలబడాలనే దృఢ సంకల్పం ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు.. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. అధికార, ప్రతిపక్షాలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, భూములు ఇచ్చిన రైతులపై బాధ్యత ఉన్నా ప్రత్యక్ష పోరాటం మొదలుపెట్టాలని సూచించారు. ఆదివారం ఉదయం టెలికాన్ఫరెన్స్‌లో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం నిర్వహించారు. పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, ఉభయ గోదావరి జిల్లాల ఇన్‌చార్జి, పీఏసీ సభ్యుడు నాగబాబు, ప్రధాన కార్యదర్శులు తోట చంద్రశేఖర్‌, టి.శివశంకర్‌, సత్య బొలిశెట్టి తదితరులు పాల్గొన్నారు. తొలుత విశాఖ హిందూస్థాన్‌  షిప్‌ యార్డులో జరిగిన ఘోరప్రమాద మృతులకు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. అమరావతిలో రాజధాని కోసం భూసమీకరణ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇప్పుడు రాజధాని పరిరక్షణ వరకూ ప్రతి దశలోనూ రైతులకు అనుకూలంగా గొంతు వినిపించింది జనసేన మాత్రమేనని చెప్పారు. రాజధాని వికేంద్రీకరణ పేరిట మూడు  ప్రాంతాల మధ్య చిచ్చురేపుతున్నారని మండిపడ్డారు. ఇంకా ఏమన్నారంటే..



కరోనా టైంలో ఇలా చేస్తారా?

‘కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలన్నీ అన్ని విఽధాలా కునారిల్లుతున్నాయి. ఇలాంటి విపత్కర సమయంలో కూడా ప్రజలకు సమస్యలు సృష్టిస్తున్నారు. కరోనా నివారణ చర్యలు చేపట్టలేక రాష్ట్రప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రాజధాని వికేంద్రీకరణ పేరుతో ఓ క్రీడకు తెర తీశారు. రైతులకు అన్యాయం చేయడంలో వైసీపీ, టీడీపీ రెండూ ఒకలాంటివే. నిలదీయాలనుకున్న వారు ఆ పార్టీలను నిలదీయాలి. తప్పుచేసింది ఆ పార్టీలైతే జనసేనను ఎలా ప్రశ్నిస్తారు? ఈ రెండు పార్టీలు రాజధానికి అనుకూలంగా ఉన్నాయనుకోవడం వల్లే రైతులు భూములిచ్చారు.’



బీజేపీ నేతలూ అమరావతే అన్నారు..

‘బీజేపీ నాయకులతో నేను మాట్లాడినప్పుడు రాజధానిగా అమరావతే ఉండాలని.. అందుకు సూత్రప్రాయంగా కట్టుబడి ఉన్నామని వారు చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసినప్పుడు కూడా అమరావతి గురించి చర్చించాం. అహ్మదాబాద్‌లో 2014లో మోదీని కలిసినప్పుడు కూడా రాష్ట్రం విడిపోయింది రాజధాని లేదని చెప్పాను. అప్పుడు వారు ఒక మాట అన్నారు. మహారాష్ట్ర నుంచి విడిపోయినప్పుడు మా గుజరాత్‌కూ రాజధాని లేదు. గాంధీనగర్‌ను క్రమక్రమంగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం..  ఎలాంటి హంగులు, ఆర్భాటాలకు పోకుండా క్రమపద్ధతిలో ఏపీ రాజధానిని నిర్మించుకోండని మోదీ సూచించారు. టీడీపీ నాయకత్వం కూడా తొలుత 2500 ఎకరాల నుంచి 3000 ఎకరాలు ఉంటే రాజధాని నిర్మించుకోవచ్చని అన్నది. తర్వాత 30 వేల ఎకరాలు, 40 వేల ఎకరాలు అంటూ పెంచుకుంటూపోయింది. భూములు ఇవ్వనివారిపై బలవంతంగా భూసేకరణ చట్టం ప్రయోగించబోయింది. 2015లో పెనుమాక, బేతపూడి, ఉండవల్లి, నిడమర్రు రైతులు నా దృష్టికి తెచ్చారు. ఆ గ్రామాలకు వెళ్లి అండగా నిలిచాను. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ మధ్య చిచ్చు రేపేలా రాజధాని వికేంద్రీకరణ అంశాన్ని తీసుకొచ్చింది. దీనిపై న్యాయకోవిదులతో, నిపుణులతో కూలంకషంగా చర్చించి ముందుకు వెళ్తాం.’

Advertisement


Aug 2 2020 @ 13:16PMహోంఆంధ్రప్రదేశ్రాజధాని తరలింపు...వ్యక్తిగత నిర్ణయమే: నాదెండ్ల
అమరావతి: రాజధాని తరలింపు అనేది ప్రభుత్వ నిర్ణయం కాదని..ప్రభుత్వ అజెండా ప్రకారం చేసినది కాదని... వ్యక్తిగత అజెండా మేరకు తీసుకున్న నిర్ణయమే ఇది అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆదివారం జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రతినిధులతో అధినేత పవన్‌ కళ్యాణ్ నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.



ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ...“రాజధాని తరలింపు అనేది ప్రభుత్వ నిర్ణయం కాదు. ఇది ప్రభుత్వ అజెండా ప్రకారం చేసినది కాదు. వ్యక్తిగత అజెండా మేరకు తీసుకున్న నిర్ణయమే ఇది. ఒక వ్యక్తి ఆలోచనల మేరకు... ఆ వ్యక్తిగత శతృత్వం, వ్యక్తిగత విభేదాలతో అమరావతి నుంచి రాజధాని తరలింపుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంలో మంత్రులకు కూడా రాజధానికి సంబంధించిన నిర్ణయాలు తెలియవు. రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలకు ఏం జరుగుతుందో కూడా తెలియదు. చంద్రబాబు ఒక తెలివైన సేల్స్ మేన్. మార్కెటింగ్ చేసుకున్నారు. అంతే తప్ప రాజధాని నిర్మాణం విషయంలో బలమైన చట్టం తీసుకోవడంపై శ్రద్ధపెట్ట లేదు. దాని ఫలితమే ఇది. ఆది నుంచి ఆ ప్రభుత్వం రాజధాని విషయంలో తప్పటడుగులు వేసి రాజధాని రైతులను నష్టపరిచారు. ప్రభుత్వం రాజధాని నిర్మిస్తుంది అనే ఉద్దేశంతోనే భూములను రైతులు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మారగానే తరలిస్తున్నారు. అంటే నాడు ప్రభుత్వం రాజధాని తరలించేందుకు ఆస్కారం లేని చట్టం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం చెందింది. రాజధాని గ్రామాల్లో భూ కుంభకోణాలు జరిగాయి అని వైసీపీ ప్రభుత్వం చెప్పింది. ఆ కుంభకోణాలు చేసిన వారిని విచారించి శిక్షించమని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్  చెప్పారు. ఆ పేరుతో రైతులను ఇబ్బందిపెట్టవద్దు... వారి త్యాగాలను గుర్తించమని చెప్పారు. రాజధాని గ్రామాల్లో జనసేన అధ్యక్షులు  పవన్ కల్యాణ్ పర్యటించి అక్కడి నిర్మాణాలు పరిశీలించారు. అలాగే రైతుల ఆందోళనలో పాల్గొన్నారు. మద్దతు తెలిపారు. తొలి నుంచి ఒక రైతులు నష్టపోకూడదు అని చెబుతున్నారు.” అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 



పవన్ కళ్యాణ్ నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో నాదెండ్ల మనోహర్‌తో పాటు కె.నాగబాబు, తోట చంద్ర శేఖర్, పీ.ఏ.సీ. సభ్యులు పాల్గొన్నారు. ముందుగా విశాఖలో హిందుస్తాన్ షిప్ యాడ్ దుర్ఘటనలో మృతులకు నేతలు సానుభూతి తెలిపారు. రాజధాని వికేంద్రీకరణ, అమరావతి నుంచి రాజధాని తరలింపు, భూములు ఇచ్చిన రైతుల ఆందోళనపై టెలికాన్ఫరెన్స్‌లో చర్చించారు. 



రాజధాని వికేంద్రీకరణకు ప్రజామోదం లేదు: చంద్రశేఖర్
అమరావతి: రాజధాని వికేంద్రీకరణకు పూర్తి స్థాయిలో ప్రజామోదం కనిపించడం లేదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఉద్యమించాలన్నా కోవిడ్ పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవన్నారు. ఈ అంశంపై న్యాయపరమైన పోరాటం చేపట్టాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. అమరావతిలో రాజధాని కోసం వేల ఎకరాలను రైతులు ప్రభుత్వానికి ఇచ్చారని... ప్రభుత్వం మారగానే తరలిస్తున్నారని విమర్శించారు. ఇలా చేస్తే ప్రభుత్వం మీద ప్రజలకు భరోసా పోతుందన్నారు. ఇకపై భూ సమీకరణలు, భూసేకరణలు చేపడితే ప్రజలు ఏం నమ్మి భూములు ఇస్తారని చంద్రశేఖర్ ప్రశ్నించారు. 

కె.నాగబాబు మాట్లాడుతూ... “రాజధాని విషయంలో తొలి నుంచి ఒకే విధానం, ఒకే మాట మీద ఉన్నది జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్  మాత్రమే. అన్ని వేల ఎకరాల భూమిని సమీకరిస్తే ఏదైనా సమస్య ఉత్పన్నమైతే రైతులకు ఎవరు భరోసాగా ఉంటారని  2015లోనే బలంగా మాట్లాడారు. ప్రభుత్వంతో ఒప్పందం మేరకు రైతులు భూములు ఇచ్చారు. ఇప్పుడు రాజధాని తీసుకువెళ్లిపోతే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అవుతుంది. ప్రభుత్వమే మోసం చేస్తోంది. ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి ప్రధాన కారకులు చంద్రబాబు నాయుడే. ఆయన నాడు చేసిన తప్పిదాల వల్లనే నేడు  జగన్ తనకు అనుకూలంగా మార్చుకొని రాజధాని తరలించుకొని వెళ్తున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Aug 3 2020 @ 03:10AMహోంఆంధ్రప్రదేశ్ప్రజాతీర్పుకోరే ధైర్యము ఉందా?
సీఎం జగన్‌కు టీడీపీ నేతల సూటిప్రశ్న



Advertisement

Powered By PLAYSTREAM
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): మూడు రాజధానుల నిర్ణయంపై ప్రజాతీర్పుకోరే ధైర్యం ఉందా? అని టీడీపీ నేతలు సీఎం జగన్‌ను సూటిగా ప్రశ్నించారు. దీనిపై రెఫరెండం పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలోనే విశాఖపట్నాన్ని పాలనా రాజధానిని చేస్తామని ఎందుకు చెప్పలేదని నిలదీశారు. సీఎం జగన్‌ నిర్ణయంపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్టు తెలిపారు. ఈ మేరకు టీడీపీ నాయకులు ఆదివారం జగన్‌ నిర్ణయంపై నిప్పులు చెరిగారు. ‘‘రాజధాని మార్పు మీద ఎన్నికలకు వెళ్లి ప్రజల తీర్పు అడిగే ధైర్యం ఉందా’’ అని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ట్విటర్‌లో ప్రశ్నించారు. ‘‘అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు పలికిన జగన్‌ ఇప్పుడు రాజధానిని మార్చడం దివాలాకోరుతనం. రూ.5కు అన్నం పెట్టే అన్నక్యాంటీన్లు నడపలేని జగన్‌ మూడు రాజధానులు ఎలా కడతారో చెప్పాలి’’ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు ప్రశ్నించారు. రాజధాని బిల్లులను గవర్నర్‌ ఆమోదించడం బాధాకరమన్నారు. రాష్ట్ర విభజన తర్వాత విశాఖపట్నాన్నే రాజధానిని చేయాలని ఎందుకు చెప్పలేదని సీఎం జగన్‌ను మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నిలదీశారు. ఎన్నికల వేళ అమరావతే రాజధానని చెప్పి, ఇప్పుడు మూడు రాజధానులని మాటతప్పి, మడమ తిప్పుతారా? అని నిలదీశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు సోము వీర్రాజు కూడా అమరావతికే కట్టుబడి ఉన్నామని ప్రకటించి, ఒక్కరోజులో మాట మార్చారని విమర్శించారు. జగన్‌ కుట్రపూరితంగా విశాఖను రాజధానిగా మారుస్తుంటే ప్రకాశం జిల్లా వైసీపీ నాయకులు సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారో చెప్పాలని కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామిడిమాండ్‌ చేశారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా వేతనాలు ఇవ్వడానికే ఇబ్బందిపడుతున్న ప్రభుత్వం మూడు రాజధానులను ఎలా నిర్మిస్తుందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ప్రశ్నించారు. 



No comments:

Post a Comment