సీఐ వేణుగోపాల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
Aug 05, 2020, 10:16 IST
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని కాశీబుగ్గ సీఐ వేణుగోపాల్‌ను పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పలాస మండలం టెక్కలి పట్నంకు చెందిన రమేష్, జగన్ అనే యువకుల మధ్య వారి గ్రామంలో గొడవ జరిగింది. ఇద్దరూ పరస్పరం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్‌కు వచ్చిన జగన్ అనే దళితుడుని సీఐ వేణుగోపాల్ బూటుకాలితో తన్నారు. ఈ ఘటన వీడియో క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిని ఏపీ డీజీపీ కార్యాలయం సీరియస్‌గా తీసుకొని విచారణ చేపట్టింది. ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం విశాఖపట్నం డీఐజీ కాళిదాస్ రంగారావు సీఐ వేణుగోపాలన్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
No comments:
Post a Comment