పాలనా వికేంద్రీకరణ , సిఆర్డిఎ లపై స్టాటస్ కో
Share|
August 5 2020, 5:35 pm
పాలనా వికేంద్రీకరణ చట్టం, రాజధాని సంస్థ రద్దు చట్టం లపై ఎపి హైకోర్టు విచారణ జరిపింది. పలువురు ఈ చట్టాలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ లు వేశారు. అయితే హైకోర్టు వీటిపై స్టే ఇవ్వలేదు కాని, యధాతధ స్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించగా, పది రోజుల వ్యవధి కావాలని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. అందుకు అంగీకరించిన కోర్టు స్టాటస్ కో ఆదేశాలు ఇస్తూ పద్నాలుగో తేదీకి కేసును వాయిదా వేసింది.అయితే ఈలోగా ప్రభుత్వ ఆఫీస్ లు కొత్తగా తరలించరాదని కూడా అనుకోవచ్చు.
తర్వాత ఏమి అవుతుందో కాని, స్టాటస్ కో అంటే ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ యధాతధంగా ఉంటుందని అనుకోవాలి. కాని, కొందరు టిడిపి వారు కోర్టు స్టే ఇచ్చిందని ప్రచారం చేస్తున్నారు.టీవీలలో వస్తున్న సమాచారం ప్రకారం స్టాటస్ కో అంటే యధాతధ స్థితిని కొనసాగించాలని అర్ధం. స్టే కి, స్టాటస్ కో కి న్యాయభాషలో తేడా ఉంటుందని భావిస్తాను.Aug 4 2020 @ 11:23AMహోంఆంధ్రప్రదేశ్అమరావతి: హైకోర్టుకు వెళ్లే మార్గంలో రాజధాని రైతుల మానవహారం
Advertisement
Powered By PLAYSTREAM
అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై గవర్నర్ ఆమోదం తెలపడంతో రాజధాని రైతు పరిరక్షణ సమితి హైకోర్ట్‌ను ఆశ్రయించింది. దీనిపై నేడు కోర్టులో విచారణ ఉండడంతో సీడ్ ఆక్సిస్ రోడ్‌పై రైతులు, రైతు కూలీలు ఇరువైపులా నిలచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు అమరావతిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. వెంకటపాలెం, ఉద్దండరాయని పాలెం, తాళ్లాయపాలెం, మందడం, వెలగపూడి, లింగాయపాలెం, రాయపూడి, తుళ్ళూరుకు చెందిన రైతులు రైతు కూలీలు రోడ్‌కు ఇరువైపులా నిలిచారు. నిన్న శిబిరాల్లో హైకోర్టుకు తుళ్ళూరు మహిళ రైతులు ప్రత్యేక పూజలు చేశారు. హైకోర్టుకు వెళ్లే మార్గం మొత్తం రైతులు మానవహారంగా ఉన్నారు.
No comments:
Post a Comment