దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్యండి.. జగన్‌కు చంద్రబాబు 48 గంటల డెడ్‌లైన్
Advertisement
Powered By PLAYSTREAM
రాజధానులపై ప్రజా తీర్పు కోరండి
మీకు మద్దతు లభిస్తే మేమిక మాట్లాడం
ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టారు
అమరావతికే మా మద్దతన్నది మీరు కాదా?
ఇప్పుడు తరలింపు వంచన.. నమ్మక ద్రోహం
అందుకే ప్రజల తీర్పును కోరమంటున్నాం
రాజధాని కోసం న్యాయపోరాటం ఓ భాగం
మోసగాళ్లను ప్రజాకోర్టులో నిలబెడతా: బాబు
48 గంటల గడువు ముగిసిన తర్వాత నేను మళ్లీ ప్రజల ముందుకు వస్తాను. ప్రతి అంశంపైనా చర్చిస్తా. వాస్తవాలు, గణాంకాలు అన్నీ ప్రజల ముందు పెడతాను. నమ్మక ద్రోహులను, నయ వంచకులను నడి వీధిలో నిలబెడతాను.
చంద్రబాబు
అమరావతి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ‘‘ఎన్నికల ముందు అమరావతే రాష్ట్ర రాజధాని అన్నారు. ఎన్నికలు కాగానే నయ వంచనకు పూనుకున్నారు. ఎన్నికల ముందు చెప్పకుండా ఇప్పుడు రాజధానిని మార్చే హక్కు మీకు లేదు. మీకు 48 గంటల సమయం ఇస్తున్నాను. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ప్రజా తీర్పు కోరండి. ప్రజలు రాజధాని విషయంలో మీ వాదనకు మద్దతు ఇస్తే మేం ఇక మాట్లాడం. మీకు ఆ దమ్ము ఉందో లేదో తేల్చుకోండి’’ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు....ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సవాల్ విసిరారు. సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు రాజధాని మార్పు గురించి వైసీపీ నేతలు ఎక్కడా చెప్పలేదని... పైగా దానికే తమ పూర్తి మద్దతని పలుమార్లు చెప్పి ప్రజలను మభ్యపెట్టారని చంద్రబాబు ఆరోపించారు.
‘‘2014 సెప్టెంబరు నాలుగో తేదీన రాష్ట్ర శాసనసభలో జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ... విజయవాడలో రాజధాని ఏర్పాటును మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని ప్రకటించారు. పైగా 30 వేల ఎకరాలు ఎక్కడ లభ్యమైతే అక్కడ పెట్టమని కూడా సూచించారు. ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎన్నికల ముందు మాట్లాడుతూ... రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ చేసేవారికే రాజధాని మార్పు కావాలని, రాజధానిగా అమరావతే ఉంటుందని బొత్స సత్యనారాయణ చెప్పారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కోలగట్ల వీరభద్రస్వామి కూడా ఇదే చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అయితే...రాజధాని మారితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతోపాటు రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలగుతానని ప్రకటించారు. ఈ మాటలన్నీ ఏమయ్యాయి?’’ అని ప్రశ్నించారు.
మేనిఫెస్టోలో రాజధానులేవి?: మేనిఫెస్టో తమకు బైబిల్... ఖురాన్... భగవద్గీత అని చెబుతారు. ఆ బైబిల్‌లో రాజధాని మార్పు గురించి ఎందుకు పెట్టలేదు? చెప్పకుండా ఎలా చేస్తారు? ఇదేమన్నా మీ సొంత విషయమా? ఐదు కోట్లమంది ప్రజలకు సంబంధించింది. తెలుగువారు ఇప్పటికే అనేకసార్లు దగాకు గురయ్యారు. ఇప్పుడు మీరు మరోసారి వెన్నుపోటు పొడిచారు. మీపై మీకు నమ్మకం ఉంటే అసెంబ్లీ రద్దు చేయండి. ప్రజలకు చెప్పకుండా... వారి తీర్పు కోరకుండా మార్చే హక్కు మీకు లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. తమ 23 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని కొందరు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని... కొందరేం ఖర్మ మొత్తం అందరూ కలిసి రాజీనామా చేస్తే ప్రజలు తమ తీర్పు ఇస్తారని వ్యాఖ్యానించారు. ‘‘రాజధాని అనేది అమరావతి రైతులదో, జేఏసీదో, రాజకీయ పార్టీలకు సంబంధించిందో కాదు. మొత్తం రాష్ట్ర ప్రజలందరిదీ. అందరూ ఆలోచించాలి. ప్రతిస్పందించాలి. న్యాయ పోరాటం ఒక భాగం. కానీ ప్రజా కోర్టులో ఈ మోసగాళ్లను నిలబెట్టాలి’’ అని చెప్పారు.
ఉన్న బలమంతా చట్టమే..
బలమైన చట్టాన్ని టీడీపీ ప్రభుత్వం చేసి ఉండాల్సిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా, విభజన చట్టానికి మించిన బలమైన చట్టం ఏముంటుందని చంద్రబాబు ప్రశ్నించారు. ‘‘విభజన చట్టంలో ఒక రాజధాని ఏర్పాటు అన్నారుగాని మూడు రాజధానులని చెప్పలేదు. ఆ చట్టం ఆధారంగానే అమరావతిలో రాజధాని ఏర్పాటుచేసుకొన్నాం. హైకోర్టు ఎక్కడ పెట్టాలో సుప్రీంకోర్టు సలహాతో రాష్ట్రపతి నిర్ణయిస్తారని చట్టంలో రాశారు. ఆ ప్రకారం రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేశారు. హైకోర్టు ప్రారంభోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా వచ్చారు. ప్రభుత్వం తరఫున రైతులతో సీఆర్డీయే ఒప్పందం చేసుకుంది. దానిని ఏకపక్షంగా ఎలా మార్చేస్తారు? పిచ్చి తుగ్లక్ మాత్రమే ఇలాంటివి చేయగలరు. తప్పుడు నిర్ణయాలతో 60-70 సార్లు ఇప్పటికి కోర్టులతో మొట్టికాయలు వేయించుకొన్నారు. అయినా మార్పు రావడం లేదు’’ అని చెప్పారు. మూడు ప్రాంతాల అభివృద్ధి అని కబుర్లు చెబుతున్నారని, అభివృద్ధి అంటే ఏమిటో కూడా చర్చ జరగాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
తనకు శక్తి ఉన్నంతవరకూ తెలుగువారి అభివృద్ధికి శ్రమించి పని చేశానని, ఇప్పుడు కూడా లాభనష్టాలేమిటో, మంచి చెడులేమిటో విపులంగా ప్రజలకు చెబుతానని, లేదంటే చరిత్ర హీనుడుగా మిగలాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ‘‘48 గంటల గడువు ముగిసిన తర్వాత మళ్లీ ప్రజల ముందుకు వస్తాను. ప్రతి అంశంపై చర్చిస్తాను. వాస్తవాలు...గణాంకాలు అన్నీ ప్రజల ముందు పెడతాను. ఒక రోజు కాదు. అనేక రోజులపాటు చర్చ జరుపుతాను. ప్రజల్లోకి తీసుకువెళ్తాను. నమ్మక ద్రోహులను, నయ వంచకులను నడి వీధిలో నిలబెడతాను’’ అని హెచ్చరించారు. రాష్ట్రంలో 75 శాతం ప్రజలు ఈ నిర్ణయాలను ఆమోదించడం లేదని సర్వే నివేదికలు వస్తున్నాయని చెప్పారు. కరోనా విజృంభించి అతలాకుతలం చేస్తున్న సమయంలో దానిని వదిలిపెట్టి పైశాచిక రాజకీయ ఆనందం కోసం నిర్ణయాలు తీసుకొంటున్నారని, ఏ సమయంలో ఏం చేస్తున్నారో కూడా అర్ధం కాని మూర్ఖత్వం ఆవరించిందని వ్యాఖ్యానించారు.
3 ముక్కల అంశాన్ని కావాలనే ఎన్నికల ముందు దాచిపెట్టారు: చంద్రబాబు
గుంటూరు: 175 నియోజకవర్గాల టీడీపీ నేతలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆన్ లైన్ ద్వారా చర్చించారు. ఆన్ లైన్ భేటీలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్ ఛార్జ్ లు పాల్గొన్నారు. అసెంబ్లీ రద్దుపై చంద్రబాబు విసిరిన సవాల్ పై చర్చించారు. చంద్రబాబు ఛాలెంజ్ చేయడంపై ప్రజల్లో మంచి స్పందన ఉందని టీడీపీ నేతలు తెలిపారు. 48 గంటల్లో స్పందించాలని ఛాలెంజ్ చేసినా సీఎం జగన్ లో కదలిక లేదని టీడీపీ నేతలు అన్నారు. 13 జిల్లాల్లో వైసీపీ బాధిత ప్రజానీకం పెరిగిపోయిందని, ఓటమి భయంతోనే సవాల్ కు స్పందించడం లేదని టీడీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
Advertisement
Powered By PLAYSTREAM
రాజధాని 3 ముక్కల అంశం ఎన్నికల ముందే వైసీపీ ఎందుకు చెప్పలేదు..?, వైసీపీ మేనిఫెస్టోలో 3 ముక్కలాట గురించి ఎందుకు పెట్టలేదు..? అని ప్రశ్నించారు. అమరావతిని ఆహ్వానిస్తున్నట్లు అసెంబ్లీలో జగన్ చెప్పారా, లేదా..?, అమరావతి తరలిస్తామనేది దుష్ప్రచారమే అని, రాజధానిని కదిలించే ప్రసక్తే లేదని మేనిఫెస్టోలో పెడతామని కమిటీ ఛైర్మన్ గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారా లేదా..? అని ప్రశ్నించారు. రాజధాని తరలిస్తే రాజీనామా చేస్తామని మైలవరం వైసీపీ అభ్యర్ధి సవాల్ చేశారా లేదా..?, రాజధాని 3 ముక్కల అంశాన్ని కావాలనే ఎన్నికల ముందు దాచిపెట్టారని విమర్శించారు. ఎన్నికల్లో నమ్మించి ఓట్లు వేయించుకుని ప్రజలను మోసం చేశారని చంద్రబాబు అన్నారు.
5 కోట్ల ప్రజలకు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు, ఎన్నికల ముందు చెప్పిందొకటి, గెలిచాక చేస్తోంది మరొకటి అని చంద్రబాబు విమర్శించారు. రాజధాని 3 ముక్కల అంశంపై మళ్లీ ప్రజాతీర్పు కోరాలని, అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్న చంద్రబాబు సవాల్ కు టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు. అసెంబ్లీ రద్దు సవాల్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. ఈ సవాల్ పై ప్రతి నియోజకవర్గంలో ప్రెస్ మీట్ లు పెట్టాలని, వైసీపీ అరాచకాలను ప్రజల్లో ఎండగట్టాలని, దళితులపై దాడులు-దౌర్జన్యాలు, హత్యలు-అత్యాచారాలపై ధ్వజమెత్తాలని నేతలకు చంద్రబాబు సూచించారు.
గిరిజన ఆడబిడ్డలపై గ్యాంగ్ రేప్ లపై ధ్వజమెత్తాలని, కల్తీ మద్యం, శానిటైజర్ తాగి అనేకమంది చనిపోవడంపై నిరసన తెలపాలన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులపై ఎండగట్టాలని, రాజధాని 3 ముక్కల అంశం అజెండాగా అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేయాలని టీడీపీ సీనియర్ నేతలతో ఆన్ లైన్ భేటీలో చంద్రబాబు స్పష్టం చేశారు.
Aug 4 2020 @ 17:20PMహోంఆంధ్రప్రదేశ్వైసీపీ నేతలు భయపడుతున్నారు: యనమల
అమరావతి: తమ అధినేత చంద్రబాబు నాయుడి ఛాలెంజ్ ని స్వీకరించడానికి వైసీపీ నాయకులు, జగన్ ఎందుకు ముందుకు రావడం లేదు? అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఎన్నికలు ఎదుర్కోవడానికి వైసీపీ వాళ్లు భయపడుతున్నారని అన్నారు. జగన్ అభివృద్ధి విధానాన్ని కాకుండా విధ్వంసక విధానాన్ని అమలు పరుస్తున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. మొత్తం రాష్ట్ర సమగ్రాభివృద్ధిని నాశనం చేసి అమరావతిని అభివృద్ధి చేస్తాం అనే వైసీపీ వాదన అర్థం లేనిదన్నారు. రాజధాని అంశం ఒక కులానికో, మతానికో, ప్రాంతానికో చెందిన అంశం కాదన్నారు. ఇది మొత్తం రాష్ట్రానికి, ప్రజలకు సంబంధించిందని అన్నారు. మూడు రాజధానుల అంశం చిన్నదిగా చేసి చూస్తే మొత్తం రాష్ట్రానికి పెద్ద నష్టం జరుగుతోందన్నారు. జగన్ ఒక ఏడాది పాలనలో రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చాడని సీఎం జగన్ తీరును తూర్పారబట్టారు. దీనికి తోడు కరోనా మహమ్మారి అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యిందన్నారు. గడచిన రోజుల కంటే రాబోయే రోజుల్లో రాష్ట్రం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందని యనమల పేర్కొన్నారు. ఇది ఆర్థిక శాస్త్రవేత్తలు విశ్లేషించి చెబుతున్న అంచనా అని అన్నారు.
Advertisement
Powered By PLAYSTREAM
మన చేతుల్లో లేని న్యాయ రాజధానిని కర్నూలుకు తీసుకొస్తానని చెబుతూ రాయలసీమ వాసులను జగన్ మోసం చేస్తున్నాడని ఆరోపించారు. ఒకసారి రాజధానిని మార్చిన తర్వాత అమరావతిని అభివృద్ది చేస్తానని చెబుతున్న జగన్ మాట ఏవిధంగా సాధ్యపడుతుంది? అని యనమల ప్రశ్నించారు. మునుపే అభివృద్ది చెందిన విశాఖను కూడా అభివృద్ది చేస్తామని చెబుతున్నారని, పెట్టుబడులు విశాఖ నుండి తరలిపోయిన తర్వాత ఇది ఏ విధంగా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. మూడు ముక్కల రాజధాని విధానం మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేయడమేనని వ్యాఖ్యానించారు. రాజధాని అంశం మొత్తం రాష్ట్రానికి సంబంధించినదని అన్నారు. జగన్ విధ్వంసక విధానం నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని యనమల పిలుపునిచ్చారు. తుగ్లక్ తన రాజధానిని ఢిల్లీ నుండి దౌలతాబాద్, దౌలతాబాడ్ నుండి ఢిల్లీకి మార్చినప్పుడు ఖజానా మొత్తం ఖాళీ అయ్యి పెద్ద ఆర్థిక విపత్తును ఎదుర్కొని చివరకు సామ్రాజ్యమే పతనమైపోయిందని చరిత్రను గుర్తుచేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించి రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే రాష్ట్రానికి తుగ్లక్ సామ్రాజ్యానికి పట్టిన గతే పడుతుందని, రాష్ట్రం అంధకారమవుతుందని వ్యాఖ్యానించారు.
Aug 3 2020 @ 03:10AMహోంఆంధ్రప్రదేశ్ప్రజాతీర్పుకోరే ధైర్యము ఉందా?
సీఎం జగన్‌కు టీడీపీ నేతల సూటిప్రశ్న
Advertisement
Powered By PLAYSTREAM
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): మూడు రాజధానుల నిర్ణయంపై ప్రజాతీర్పుకోరే ధైర్యం ఉందా? అని టీడీపీ నేతలు సీఎం జగన్‌ను సూటిగా ప్రశ్నించారు. దీనిపై రెఫరెండం పెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలోనే విశాఖపట్నాన్ని పాలనా రాజధానిని చేస్తామని ఎందుకు చెప్పలేదని నిలదీశారు. సీఎం జగన్ నిర్ణయంపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్టు తెలిపారు. ఈ మేరకు టీడీపీ నాయకులు ఆదివారం జగన్ నిర్ణయంపై నిప్పులు చెరిగారు. ‘‘రాజధాని మార్పు మీద ఎన్నికలకు వెళ్లి ప్రజల తీర్పు అడిగే ధైర్యం ఉందా’’ అని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ట్విటర్‌లో ప్రశ్నించారు. ‘‘అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు పలికిన జగన్ ఇప్పుడు రాజధానిని మార్చడం దివాలాకోరుతనం. రూ.5కు అన్నం పెట్టే అన్నక్యాంటీన్లు నడపలేని జగన్ మూడు రాజధానులు ఎలా కడతారో చెప్పాలి’’ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు ప్రశ్నించారు. రాజధాని బిల్లులను గవర్నర్ ఆమోదించడం బాధాకరమన్నారు. రాష్ట్ర విభజన తర్వాత విశాఖపట్నాన్నే రాజధానిని చేయాలని ఎందుకు చెప్పలేదని సీఎం జగన్‌ను మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నిలదీశారు. ఎన్నికల వేళ అమరావతే రాజధానని చెప్పి, ఇప్పుడు మూడు రాజధానులని మాటతప్పి, మడమ తిప్పుతారా? అని నిలదీశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు సోము వీర్రాజు కూడా అమరావతికే కట్టుబడి ఉన్నామని ప్రకటించి, ఒక్కరోజులో మాట మార్చారని విమర్శించారు. జగన్ కుట్రపూరితంగా విశాఖను రాజధానిగా మారుస్తుంటే ప్రకాశం జిల్లా వైసీపీ నాయకులు సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారో చెప్పాలని కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామిడిమాండ్ చేశారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా వేతనాలు ఇవ్వడానికే ఇబ్బందిపడుతున్న ప్రభుత్వం మూడు రాజధానులను ఎలా నిర్మిస్తుందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ప్రశ్నించారు.
No comments:
Post a Comment