మళ్లీ వచ్చిన ‘సీఆర్డీయే’!
Aug 6 2020 @ 02:47AMహోంఆంధ్రప్రదేశ్మ
ఏఎంఆర్డీయే వెబ్‌సైట్‌లో మార్పు
హైకోర్టు ఉత్తర్వులతో ‘పూర్వస్థితి’
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
మాయమైపోయిన ‘ఏపీసీఆర్డీయే’ మళ్లీ ప్రత్యక్షమైంది! ఇలా వచ్చిన ‘ఏఎంఆర్డీయే’ అలా మాయమైపోయింది. ఏమిటిదంతా అనుకుంటున్నారా! ఇది... పురపాలక శాఖ నిర్వహించే వెబ్‌సైట్ వ్యవహారం! ఏపీసీఆర్డీయే రద్దు బిల్లును గవర్నర్ ఆమోదించగానే... దాని ఆనవాళ్లు సమూలంగా తొలగించేందుకు ఉన్నతాధికారులు హుటాహుటిన చర్యలు తీసుకున్నారు. ఆదివారం సెలవు దినమైనప్పటికీ విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంపై ఉన్న బోర్డులను తొలగించారు. ప్రభుత్వ వాహనాలపై ఉన్న సీఆర్డీయే స్టిక్కర్లను తీసేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన అమరావతి మెట్రోపాలిటన్ రీజన్ డెవల్‌పమెంట్ అథారిటీ (ఏఎంఆర్డీయే) స్టిక్కర్లు పెట్టేశారు.
ఏపీసీఆర్డీయే వెబ్‌సైట్‌ను కూడా ఏఎంఆర్డీయేగా మార్చేశారు. అయితే... మూడు రాజధానులు, ఏపీసీఆర్డీయే చట్టం రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు స్పందిస్తూ... ఈనెల 14 వరకు ‘యథాతథస్థితి’ కొనసాగించాలని ఆదేశించింది. దీంతో.. అధికారులు మళ్లీ వెబ్‌సైట్‌ను ఏపీసీఆర్డీయేగా మార్చేశారు. నిజానికి... హైకోర్టు కార్యాలయాల తరలింపుపై ‘స్టేట్‌సకో’
విధించింది. ఎక్కడి కార్యాలయాలు అక్కడే ఉండాలన్నది కోర్టు ఆదేశం. కానీ... అధికారులు వెబ్‌సైట్ పేరును కూడా ‘పూర్వ స్థితి’కి తీసుకురావడం గమనార్హం.
No comments:
Post a Comment