చేతకాని సీఎం, అసమర్థ గవర్నర్: CPI నారాయణ
Aug 5 2020 @ 02:47AMహోంఆంధ్రప్రదేస్
గుంటూరు(సంగడిగుంట), ఆగస్టు 4: చేతకాని సీఎం, అసమర్థ గవర్నర్ ఇద్దరూ ప్రజలకు శాపమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మండిపడ్డారు. 3 రాజధానుల బిల్లులపై గవర్నర్ సంతకాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరులో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ ఉత్సవ విగ్రహంలా మారిన గవర్నర్ తన సంతకానికి విలువలేకుండా చేసుకున్నారన్నారు. ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ను తొలగిస్తూ, జస్టిస్ కనకరాజ్‌ను నియమిస్తూ, మళ్లీ రమేశ్‌ను నియమిస్తూ మూడుసార్లు సంతకాలు పెట్టి పరువు తీసుకున్నారన్నారు. గవర్నర్ తక్షణమే రాజీనామా చేయాలని కోరారు. ఎన్నికలలో నవరత్నాల ప్రచారం తప్ప రాజఽధాని మార్పుపై జగన్ ఎక్కడైనా చెప్పారా అని ప్రశ్నించారు. ఈ అసెంబ్లీకి రాజధానిని మా ర్చే అధికారం లేదన్నారు. అదే ప్రభుత్వ కోరిక అయితే అదే ఎజెండాతో మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్నారు. ఈ విషయంలో బీజేపీ మూడో ముద్దాయన్నారు.
No comments:
Post a Comment