Friday, March 20, 2020

మీడియాకు ఎలా లీకైంది?

మీడియాకు ఎలా లీకైంది?
Mar 21, 2020, 04:15 IST
Police Investigation On State Election Commissioner letter leak - Sakshi
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ లేఖ లీక్‌పై పోలీసుల ఆరా

టీడీపీ అనుకూల మీడియాకు అందచేసింది ఎవరు? 

కొందరు నేతల వాట్సాప్‌ నుంచి మీడియాకు లీకైనట్లు నిర్ధారణ

పథకం ప్రకారమే ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే యత్నాలు

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) పేరుతో లేఖను లీక్‌ చేసిన వారిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారం అంతా రాజకీయ కుట్రలో భాగంగానే జరిగిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గురువారం డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై డీజీపీ దృష్టి సారించారు. ఎస్‌ఈసీ లేఖ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలన్నీ పథకం ప్రకారమేననే అనుమానాలు బలపడుతున్నాయి. లేఖ లీక్‌ వెనుక కుట్రను ఛేదించేందుకు పోలీసులు ప్రధానంగా మీడియా వైపు నుంచి ఆరా తీస్తున్నట్లు తెలిసింది.


- మీడియాకు ఆ లేఖ ఎలా చేరింది? ఎవరు చేరవేశారు?  అలా చేయడం వెనుక వారి ఉద్దేశం ఏమిటి? అందువల్ల కలిగే రాజకీయ ప్రయోజనం ఏమిటి? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
- రాష్ట్రంలో ప్రధానంగా ఐదు మీడియా సంస్థలకు ఈ లేఖ లీకైనట్టు పోలీసులు గుర్తించారు. ఆయా మీడియా ప్రతినిధులకు వాట్సాప్‌ ద్వారా రాజకీయ నాయకుల నుంచి ఈ లేఖ వెళ్లినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. టీడీపీ అనుకూలమైన మీడియా సంస్థలు ఎవరి ప్రయోజనం కోసం ఇదంతా చేశాయనే కోణంలో ఆరా తీస్తున్నారు.
- ఎస్‌ఈసీ లేఖ మీడియాలో ప్రసారం అయ్యేలా ఓ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు చక్రం తిప్పినట్లు తెలిసింది. టీడీపీ అనుకూల మీడియా ప్రతినిధులకు మొదట ఆయన ఫోన్‌ చేసి లేఖ విషయంలో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. దాదాపు 30 నిముషాల వ్యవధిలో ఐదుగురు మీడియా ప్రతినిధులతో ఆయన ఫోన్‌ ద్వారా మాట్లాడి ఈ విషయాన్ని బ్లాస్ట్‌ చేయాలని సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాతే వారి వాట్సాప్‌లకు లేఖ లీక్‌ చేయడం, ఓ వర్గం మీడియాలో పెద్ద ఎత్తున ప్రసారం కావడం జరిగిపోయాయి.
- ఎస్‌ఈసీ ఇదే లేఖను కేంద్ర హోంశాఖకు మెయిల్‌ ద్వారా పంపి ఉంటే ఎలా లీకైందనే అంశంపైనా దృష్టి పెట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ మెయిల్‌ ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు గోప్యంగానే జరుపుతారు. అలాంటప్పుడు లేఖను లీక్‌ చేయడం పెద్ద నేరమే అవుతుంది. ఇందులో ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయనే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
- ఈ లేఖను అడ్డుపెట్టుకుని టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా సంస్థలు కలసికట్టుగా పథకం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీసే యత్నం చేశాయి. ఇందులో ప్రధానంగా ఓ మాజీ మంత్రి, టీడీపీ మాజీ నేత ఒకరు చక్రం తిప్పినట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడంతో లేఖ లీకుపై పోలీసుల దర్యాప్తు వేగం పుంజుకుంది. 

Wednesday, March 18, 2020

కేంద్రమే కాపాడాలి! - కేంద్ర హోం శాఖకు ఎస్‌ఈసీ రమేశ్‌ లేఖ

కేంద్రమే కాపాడాలి!
నాపై దూషణలు, బెదిరింపులు, హెచ్చరికలు
నా కుటుంబ సభ్యుల భద్రతకూ ముప్పు
స్వయంగా సీఎం తీవ్ర విమర్శలు చేశారు
అదే దారిలో స్పీకర్‌, మంత్రులు, నేతలు
భౌతిక దాడులకూ దిగే ప్రమాదముంది
ఫ్యాక్షన్‌ నేపథ్యం, కక్ష సాధింపు ధోరణి..
వారికి అందుబాటులో అన్ని వనరులు
ప్రభుత్వ పెద్దల్లోనే నాపై అసహనం
నా భద్రతకు తీవ్రస్థాయిలో ప్రమాదం
హైదరాబాద్‌లోనే ఉండాలనుకుంటున్నా!
ఎన్నికల తొలి దశలోనే భారీగా హింస
క్రూరమైన ఆర్డినెన్స్‌తో విపక్షాలకు కట్టడి
వారే మద్యంపెట్టి, పోలీసులతో కేసులు
వాస్తవాలను వక్రీకరించిన ఎస్పీలు, కలెక్టర్లు
అసాధారణ స్థాయిలో ఏకగ్రీవాలు
పంచాయతీలో మరింత హింసకు చాన్స్‌!
అంతలోనే... కరోనాపై కేంద్రం అప్రమత్తం
అందువల్లే, స్థానిక ఎన్నికలు వాయిదా
నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు సిద్ధం
కేంద్ర హోం శాఖకు ఎస్‌ఈసీ రమేశ్‌ లేఖ
తక్షణం స్పందించిన కేంద్రం
చర్యలకు డీజీపీకి ఆదేశాలు



స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా తర్వాత ముఖ్యమంత్రి నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేల వరకు నన్ను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తున్నారు. నాతోపాటు, నా కుటుంబ సభ్యుల  భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొంది. దయచేసి, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించండి

ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM


-కేంద్ర హోం కార్యదర్శికి రమేశ్‌ కుమార్‌ లేఖ



అమరావతి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల వాయిదాపై ప్రకటన చేసినప్పటి నుంచి తనకు నిరంతరాయంగా బెదిరింపులు, హెచ్చరికలు వస్తున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఈ పరిణామాలను తన కుటుంబం తట్టుకోలేక పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఐదు పేజీల లేఖ రాశారు. ‘‘స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం ప్రకటించిన తర్వాత... స్వయంగా ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో నాకు అనేక దురుద్దేశాలను ఆపాదిస్తూ తీవ్రమైన పదజాలంతో, అన్యాయమైన విమర్శలు చేశారు. స్పీకర్‌తోపాటు కేబినెట్‌ మంత్రులు కూడా సీఎం దారిలోనే పరుషమైన పదజాలంతో నన్ను దూషిస్తున్నారు. ఎమ్మెల్యేలు, కింది స్థాయి పార్టీ నాయకులు కూడా దారుణంగా మాట్లాడుతున్నారు. వారి సొంత ఆకాంక్షలకు అనుగుణంగా తిరిగి ఎన్నికలు జరిపించేలా, నా స్థైర్యం దెబ్బతీసేలా ప్రయత్నాలు చేస్తున్నారు’’ అని నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఈ లేఖలో పేర్కొన్నారు. ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను హైదరాబాద్‌లో నివసించడమే క్షేమమనిపిస్తోంది. నేనంటే గిట్టని వారికి ఉన్న విస్తృత పలుకుబడి దృష్ట్యా హైదరాబాద్‌లో కూడా పూర్తి సురక్షితంగా ఉంటానని చెప్పలేను’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.



ఎన్నికల ప్రక్రియ సాగుతున్నంత కాలం రాష్ట్ర పోలీసు భద్రతతో తన కార్యాలయంలోనే ఉన్నానని... పూర్తి భద్రత లేకుండా బయటకు వెళ్లేందుకు సాహసించలేకపోయానని చెప్పారు. ‘‘ఎన్నికలు వాయిదా పడటంతో నాకు, నా కుటుంబానికి భద్రత కరువైంది. నాకు ఉన్న ముప్పు దృష్ట్యా... రాష్ట్ర ప్రభుత్వ బలగాలు కల్పించే భద్రత సరిపోదని  పాలన, భద్రతా వ్యవహారాల్లో అనుభవం ఉన్న తోటి అధికారులు, శ్రేయోభిలాషులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పెద్దల అసహనాన్ని చూస్తే... నాపైనా, నా కుటుంబ సభ్యులపైనా భౌతిక దాడులు జరిగే అవకాశాలున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఫ్యాక్షన్‌తో కూడిన నేపథ్యం, కక్ష సాధింపు ధోరణలను దృష్టిలో ఉంచుకుని... హైదరాబాద్‌లో నివసించడమే క్షేమమనే బాధాకరమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది’’ అని రమేశ్‌ కుమార్‌ తన లేఖలో వివరించారు. తనపట్ల అసహనంతో ఉన్న వారికి ఉన్న అధికారం,  వనరులు, నేర ముఠాలు, గతంలో వారి కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకుని... తనకు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రిత్వశాఖ కేంద్ర పోలీసు బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మిగిలిన ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు వీలుగా తాను కోరిన మేరకు తక్షణమే భద్రత కల్పించాలని కోరారు. అప్పుడే తాను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విధులను పూర్తి చట్టబద్దంగా నిర్వర్తించగలనని లేఖలో పేర్కొన్నారు.



ఆదిలోనే ‘హింస’పాదు...

రాష్ట్రానికి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు రాబట్టుకునేందుకు ఈ నెలాఖరు లోపు ఎన్నికలు నిర్వహించాలని భావించి ఈ నెల 7న ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించామని రమేశ్‌ కుమార్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో పలుదఫాలుగా చర్చించిన తర్వాతే షెడ్యూలు ఖరారు చేశామన్నారు. ‘‘ఎన్నికల్లో ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా తగిన స్థాయిలో భద్రతా సిబ్బందిని మోహరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఈసీకి స్పష్టమైన హామీ ఇచ్చింది. కానీ... ఎన్నికల ప్రక్రియ తొలి అంకంలోనే అనూహ్యమైన స్థాయిలో హింసాత్మక ఘటనలు, పోలీసు సిబ్బంది ప్రత్యక్ష సహకారంతో అధికార పార్టీ బెదిరింపులు విపరీతంగా కొనసాగాయి. ఈ విషయంలో విపక్ష పార్టీలన్నీ మూకుమ్మడిగా ఆరోపణలు చేశాయి. దాదాపు 35 చోట్ల నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. 23 చోట్ల బలవంతంగా నామినేషన్లను ఉపసంహరింపచేశారు. తెలుగుదేశం, బీజేపీ-జనసేన, ఇతర విపక్షాల అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని 55 హింసాత్మక దాడులు జరిగాయి.



శాంతియుతంగా-పద్ధతిగా ఎన్నికలు నిర్వహించాలన్న సూత్రాన్ని పూర్తిగా ఉల్లంఘించారు. అంతేకాకుండా... అనూహ్యమైన స్థాయిలో ఏకగ్రీవ ఎన్నికలు జరిగాయి’’ అని రమేశ్‌ కుమార్‌ వివరించారు. ఎంపీటీసీ సభ్యులకు సంబంధించి 2014లో కేవలం 2 శాతం ఏకగ్రీవాలు కాగా... ఈసారి ఏకంగా 24 శాతం ఏకగ్రీవమయ్యాయని చెప్పారు. అలాగే... 2014లో 1096 జడ్పీటీసీ స్థానాల్లో ఒకే ఒక్క జడ్పీటీసీ ఏకగ్రీవం కాగా... ఈసారి 652 స్థానాలకుగాను 126 స్థానాలు ఏకగ్రీవమయ్యాయని చెప్పారు. ఇక... ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో ఎంపీటీసీలు 439 (79 శాతం), జడ్పీటీసీలు 38 (76 శాతం) ఏకగ్రీవమయ్యాయని వివరించారు. ‘‘ఒక్క ఓటు పడకుండానే కడప జిల్లా పరిషత్‌ను వైసీపీ కైవసం చేసుకుంది. శాంతియుత ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఇచ్చిన హామీ అపహాస్యం పాలైంది. స్థానిక ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించకపోతే మంత్రులు పదవులు కోల్పోవాల్సి వస్తుందని, ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్లివ్వబోమని స్వయానా ముఖ్యమంత్రి హెచ్చరించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేల ఒత్తిడితో పార్టీ కేడర్‌ భారీ హింసకు పాల్పడినట్లు పత్రికలు, ఎలకా్ట్రనిక్‌ మీడియాలో కథనాలు వచ్చాయి’’ అని రమేశ్‌ కుమార్‌ చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిపై కమిషన్‌కు ఫిర్యాదులు వెల్లువలా వచ్చాయన్నారు. ‘‘పరిస్థితిని చక్కదిద్దేందుకు అందుబాటులో ఉన్న కొద్దిమంది సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను పరిశీలకులుగా నియమించాం. వారి ద్వారా వచ్చిన సమాచారాన్ని పరిశీలించాం. ఇక... పరిస్థితిని చక్కదిద్దాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు పదేపదే చేసిన సూచనలు బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలను పూర్తిగా వక్రీకరించి, మసిపూసి మారేడు కాయ చేసేలా రోజువారీ నివేదికలు పంపించారు’’ అని రమేశ్‌ కుమార్‌ తీవ్రస్థాయిలో స్పందించారు.



వాయిదా నిర్ణయం ఎందుకంటే...

ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ప్రచారానికి వెళ్లాలంటేనే భయపడుతున్నాయని... అనూహ్య, అసాధారణ స్థాయిలో జరిగిన హింసాత్మక ఘటనలతో  ప్రజలూ భయం గుప్పిట చిక్కుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో పోలింగ్‌ శాతం అత్యల్పంగా నమోదయ్యే అవకాశముందని చెప్పారు. దీంతోపాటు... కరోనా వైరస్‌ నేపథ్యంలో ఎగువ, విద్యావంత వర్గానికి చెందిన వారు పోలింగ్‌ బూత్‌కు వచ్చే ఆలోచనలో కూడా లేరని చెప్పారు. ‘‘గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పరిస్థితులు ఇంకా తీవ్రంగా ఉండే అవకాశముంది. పార్టీ రహితంగా జరిగే ఈ ఎన్నికలను 70 శాతం ఏకగ్రీవం చేయాలనే వ్యూహంతో అధికార పార్టీ ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కమిషన్‌ ప్రయత్నించింది. అదే సమయంలో... కేంద్ర ప్రభుత్వం కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించింది. జనాల సమూహాలతో జరిగే ఎన్నికల వల్ల కరోనా మరింత వ్యాప్తి చెందే ప్రమాదముందని భావించాం.



పొరుగు రాష్ట్రాలైన  కర్ణాటక, తెలంగాణలో ఇప్పటికే  ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఆ రాష్ట్రాల్లో ఉన్న ఏపీ ప్రజలు... పోలింగ్‌ రోజున ఇక్కడికి వస్తారు. బ్యాలెట్‌తో ఓట్లు వేస్తున్నందున కరోనా వ్యాప్తి చెందే  ప్రమాదం ఉంది. కేంద్ర వైద్యశాఖ అధికారులతో సంప్రదించిన తర్వాతే... ఆరు వారాల పాటు ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని రమేశ్‌ కుమార్‌ వివరించారు. ఆ మరుసటిరోజునే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, ఒడిసా రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారన్నారు. తమ నిర్ణయాన్ని దేశమంతా హర్షించినా... అధికార పార్టీ మాత్రం విమర్శలు చేయడం ప్రారంభించిందన్నారు. చివరికి, సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారన్నారు. ‘‘కమిషన్‌ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. కోడ్‌ అమలును మాత్రం వాయిదా వేసి ప్రభుత్వానికి ఊరట కలిగించింది’’ అని తెలిపారు. హింసకు తావివ్వకుండా  ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషనదేనని... మొదటి అంకంలో జరిగిన హింసాత్మక సంఘటనలు పునరావృతమైతే ఎన్నికలు ప్రశాంతంగా ఉండవని పేర్కొన్నారు.



చర్యలకు ఆదేశించినా...

వివిధ వర్గాల నుంచి అందిన ఫిర్యాదులు, తమ స్వీయ పరిశీలనతో తెలుసుకున్న సమాచారం ఆధారంగా... గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, గుంటూరు రూరల్‌ ఎస్పీ, తిరుపతి అర్బన్‌ ఎస్పీలను, శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలను, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను బదిలీ చేయాలని... మాచర్ల సీఐను సస్పెండ్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించామని రమేశ్‌ కుమార్‌ తెలిపారు. కానీ... సుప్రీంకోర్టుకు వెళ్లామన్న సాకుతో తమ ఆదేశాలను ఇప్పటికీ అమలు చేయలేదని తెలిపారు. ‘‘తదుపరి దశల్లోనైనా అధికారులు సక్రమంగా వ్యవహరిస్తారనే ఉద్దేశంతోనే... తప్పు చేసిన వారిపై చర్యలకు ఆదేశించాం. కానీ... వాటిని అమలు చేయలేదు. ఈ దశలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా మొత్తం ఎన్నికల ప్రక్రియ బలహీనపడుతుంది. విపక్షాల నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. బెదిరించి, ఒత్తిడి తెచ్చి, బలవంతంగానైనా నన్ను తన దారిలోకి తెచ్చుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది. అలా తలొగ్గేందుకు నేను సిద్ధంగా లేను’’ అని రమేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు.  ‘‘జిల్లా కలెక్టర్‌గాను, తి చిన్న వయసులోనే టీటీడీ ఈవోగా, ట్యాక్స్‌ కమిషనర్‌గా, హౌసింగ్‌, సహకార, అగ్రికల్చరల్‌, ఆర్థికశాఖల ముఖ్యకార్యదర్శిగా సమర్థంగా పని చేసిన ట్రాక్‌ రికార్డు నాకు ఉంది. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి గవర్నర్‌ ఈఎ్‌సఎల్‌ నరసింహన్‌కు ముఖ్యకార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఏడేళ్ల పాటు పనిచేశాను. రిటైర్‌ అయిన  తర్వాత అప్పటి గవర్నర్‌ సిఫారసులతో రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమితుడినయ్యాను’’ అని వివరించారు. అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో తన, తన కుటుంబ సభ్యుల భద్రతపై తీవ్ర ఆందోళన కలుగుతోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సత్వరం స్పందించి తగిన భద్రత కల్పించాలని కోరారు.



క్రూర చట్టాన్ని అస్త్రంగా...

ఎన్నికల్లో మద్యం, డబ్బును పంచినట్లు రుజువైతే... గెలిచిన తర్వాత కూడా అనర్హత వేటు వేస్తామని... జరినామాతోపాటు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒక క్రూరమైన ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిందని రమేశ్‌ కుమార్‌ కేంద్ర హోంశాఖ దృష్టికి తెచ్చారు. ‘‘కేవలం తమను లక్ష్యంగా చేసుకుని ఈ ఆర్డినెన్స్‌ ప్రయోగిస్తారని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ ఆర్డినెన్స్‌ను దుర్వినియోగం చేయకూడదని ఎస్‌ఈసీ స్పష్టంగా ఆదేశించింది. అయినప్పటికీ... అధికార పార్టీకి చెందిన ప్రతిపక్ష నేతలు, అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని మద్యం తెచ్చిపెట్టడం... పోలీసులు ఆ నేతలను అరెస్టు చేయడం వంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి’’ అని తెలిపారు.



కేంద్ర హోంశాఖ సత్వర స్పందన

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పంపిన లేఖపై కేంద్ర హోంశాఖ సత్వరం స్పందించినట్లు తెలిసింది. దీనిపై తక్షణం స్పందించాలని, అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌కు కల్పించిన భద్రతను రెట్టింపు చేయాలని డీజీపీని కేంద్రం ఆదేశించినట్లు ఢిల్లీలోని బీజేపీ వర్గాలు తెలిపాయి.







స్థానిక సంస్థల ఎన్నికలు 6 వారాలపాటు వాయిదా

స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాలపాటు వాయిదా
16 Mar 2020, Sunday  @ 04:56AM

ఈనాడు, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాలపాటు వాయిదా వేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. తక్షణమే నిలిపివేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

Mar 16 2020 @ 04:56AM

కలెక్టర్‌ హరికిరణ్‌

కడప (కలెక్టరేట్‌), మార్చి 15: కరోనా వైరస్‌ ప్రభావం వల్ల ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్‌ హరికిరణ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికలు తక్షణమే నిలిపివేయాలని జడ్పీ, మున్సిపల్‌, గ్రామ పంచాయతీ ఎ న్నికల అధికారులు, రిటర్నింగ్‌ అధికారులు, ఇతర అధికా రులకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.

ఎస్‌ఈసీ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియ రద్దు కాదని, ఏకగ్రీవంగా ఎన్నికైనవారు కొనసాగుతారని, ఆరు వారాల తరువాత సమీక్ష అనంతరం వాయిదా పడిన ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని ఈసీ తెలిపారన్నారు. అన్ని మున్సిపాల్టీలు, కడప కార్పొరేషన్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు దాఖలైన నామినేషన్లను, బ్యాలెట్‌ పేపర్లు, ట్రెజరీలో జమ చేస్తామని తెలిపారు. అంతేకాక సోమవారం జరగాల్సిన ఎన్నికల శిక్షణ కార్యక్రమాలను వాయిదా వేశామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున స్పందన కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు.

ఏపీలో రక్షణ లేదని ఎస్ఈసీ రమేశ్ కుమార్ లేఖ..?

ఏపీలో రక్షణ లేదని ఎస్ఈసీ రమేశ్ కుమార్ లేఖ..?

అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. తనకు రక్షణ కల్పించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లుగా ఒక లేఖ వెలువడింది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రక్షణ కల్పించాలని ఆయన కోరినట్లు అందులో ఉంది. కటుంబ సభ్యులతో పాటు తనపైనా దాడి జరిగే అవకాశం ఉందని రమేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆ లేఖలో ఉంది. తనకు, తన కుటుంబానికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తాను హైదరాబాద్‌లో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరినట్లు, ఆయన సంతకంతో విడుదలైన లేఖలో ఉంది. ఎన్నికల్లో గెలిచినప్పటికీ మద్యం, డబ్బు, దొరికితే మూడేళ్ల జైలు, అనర్హత వేటు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం క్రూరమైన ఆర్డినెన్స్ తెచ్చిందని రమేశ్ కుమార్ పేర్కొన్నట్లు లేఖ సారాంశం. కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లు విధులు నిర్వహించలేకపోయారని, తన భద్రతతో పాటు ఎన్నికల నిర్వహణకు కూడా కేంద్ర బలగాలు అవసరమని ఆయన కోరినట్లు ఐదు పేజీల ఈ లేఖలో ఉంది.


ఏపీలో ఎన్నికల కోడ్ ఎత్తివేత
అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ను నిలిపివేస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పుతో కోడ్‌ను ఎత్తివేశారు. కరోనా ప్రభావంతో రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాల పాటు నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ప్రకటించారు. అప్పటివరకూ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.



అయితే ఎన్నికల కమిషనర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పుబట్టింది. ఎన్నికలు నిలిపివేస్తే 14వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోతాయని ఆందోళ వ్యక్తం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. ఏపీ ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. అయితే ఎన్నికల కోడ్‌ను ఎత్తివేయాలని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఎన్నికల కోడ్‌ను ఎత్తివేసింది. 

ఏపీలో రక్షణ లేదని ఎస్ఈసీ రమేశ్ కుమార్ లేఖ..?

ఏపీలో రక్షణ లేదని ఎస్ఈసీ రమేశ్ కుమార్ లేఖ..?

అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. తనకు రక్షణ కల్పించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లుగా ఒక లేఖ వెలువడింది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రక్షణ కల్పించాలని ఆయన కోరినట్లు అందులో ఉంది. కటుంబ సభ్యులతో పాటు తనపైనా దాడి జరిగే అవకాశం ఉందని రమేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆ లేఖలో ఉంది. తనకు, తన కుటుంబానికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తాను హైదరాబాద్‌లో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరినట్లు, ఆయన సంతకంతో విడుదలైన లేఖలో ఉంది. ఎన్నికల్లో గెలిచినప్పటికీ మద్యం, డబ్బు, దొరికితే మూడేళ్ల జైలు, అనర్హత వేటు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం క్రూరమైన ఆర్డినెన్స్ తెచ్చిందని రమేశ్ కుమార్ పేర్కొన్నట్లు లేఖ సారాంశం. కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లు విధులు నిర్వహించలేకపోయారని, తన భద్రతతో పాటు ఎన్నికల నిర్వహణకు కూడా కేంద్ర బలగాలు అవసరమని ఆయన కోరినట్లు ఐదు పేజీల ఈ లేఖలో ఉంది. 

ఏపీలో ఎన్నికల వాయిదా: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఏపీలో ఎన్నికల వాయిదా: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Mar 18, 2020, 15:45 IST
Supreme Court Orders TO SEC Over Postponement Of Andhra Pradesh Local Body Polls - Sakshi
ఎన్నికల కోడ్‌ను వెంటనే ఎత్తివేయండి

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగనివ్వండి

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. తదుపరి స్థానిక ఎన్నికల తేదీలు ఖరారు చేసేటప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్నికలను వాయిదా వేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసినందున.. ఎన్నికల నిర్వహణపై ఇప్పుడు జోక్యం చేసుకోలేమని.. అయితే ఎన్నికల ప్రవర‍్తనా నియమావళిని తక్షణమే ఎత్తివేయాలని ఆదేశించింది. అదే విధంగా ఇదివరకే ప్రారంభించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎన్నికల సంఘం అడ్డుకోరాదని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో సీజేఐ జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ సూర్యకాంత్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్‌ నిర్ణయంలో రాజకీయ కోణాలు ఉన్నాయంటూ ప్రభుత్వ తరఫున అడిషనల్‌ సొలిటర్‌ జనరల్‌ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.(‘సుప్రీంకోర్టు ఆదేశాలు టీడీపీకి చెంపపెట్టు’)


 అదే విధంగా.. ఒకవైపున ఎన్నికల ప్రక్రియను నిరంతరాయంగా వాయిదా వేస్తూ.. మరోవైపు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కొనసాగిస్తారంటూ తన వాదనలు వినిపించారు. ‘‘ఒకే సమయంలో ఈ రెండూ ఎలా చేయగలుగుతారు?.. ప్రభుత్వం, పాలన స్తంభించపోవాలా?... ఇందులో రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను, తీసుకుంటున్న చర్యలను ఎన్నికల కమిషనర్‌ తెలుసుకోలేదు.. రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించి కొనసాగిస్తోంది.. వీటిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాజకీయ దురుద్దేశంతో అడ్డుకుంటున్నారు.. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేస్తే.. అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కెవియట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు... ఎన్నికల కమిషనర్‌ ఒక పొలిటికల్‌ లైన్‌ ప్రకారం వెళ్లారని అర్థమవుతోంది.. ఎన్నికలను వాయిదా వేయడానికి అనుసరించాల్సిన పద్ధతిలో వెళ్లలేదు.. ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమైన సమయంలో ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల కమిషనర్‌ నిర్ణయం తీసుకోవడం సరికాదు’’ అని పేర్కొన్నారు. (ఉనికి కోల్పోతామనే చంద్రబాబు కుట్రలు..)

ఈ క్రమంలో ... తమ నిర్ణయంలో ఎలాంటి రాజకీయం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇందుకు స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే.. తప్పకుండా రాజకీయాలు ఉండకూడదు.. కానీ పరిస్థితి ఇంతవరకు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో.. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక.. కోడ్‌ ఉంటుందని, ప్రవర్తనా నియమావళి ప్రకారం నడుచుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది మరోసారి వాదనలు వినిపించారు. దీంతో... ‘‘ఒకవైపు ఎన్నికలను వాయిదా వేస్తామంటున్నారు.. ఇంకోవైపున ఎన్నికల ప్రవర్తనా నియమావళి కొనసాగిస్తామంటున్నారు. రెండు విధాలుగా ఎలా చేస్తారు’’ అంటూ జస్టిస్‌ గవాయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్తంభించిపోవాలని కోరుకుంటున్నారా’’ అని ప్రశ్నించారు. (ఏ నివేదికల ఆధారంగా ఎన్నికలు నిలిపివేశారు! )


ఏ నివేదికల ఆధారంగా ఎన్నికలు నిలిపివేశారు!
Mar 17, 2020, 05:46 IST
Center Govt on State Election Commissioner decision over Local Body Elections - Sakshi
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిర్ణయంపై కేంద్రం ఆరా

సాక్షి, అమరావతి:  స్థానిక సంస్థల ఎన్నికలను అర్ధాంతరంగా నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం కావడంతో కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో ‘అసలు ఏమి జరిగింది’ అని ఆరా తీయడం మొదలు పెట్టింది. సోమవారం పలువర్గాల నుంచి వివరాల సేకరణ మొదలుపెట్టింది. ఏ నివేదికల ఆధారంగా ఎన్నికల కమిషనర్‌ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలుసుకోవడంపై కేంద్ర ఇంటలిజెన్స్‌ అధికారులు దృష్టిపెట్టారని తెలిసింది. ఎన్నికల నిలిపివేత వంటి కీలక నిర్ణయానికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌పై ఎన్నికల కమిషనర్‌ విలేకరుల సమావేశంలో సంతకం చేశారని తెలిసి ఆశ్చర్యపోయారని సమాచారం.


ఎన్నికలను నిలిపివేస్తున్నట్టు నిర్ణయం తీసుకొని, గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశాక విలేకరుల సమావేశంలో వివరాలను ప్రకటించారా.. లేక ముందు విలేకరుల సమావేశంలో ప్రకటించి, ఆ తర్వాత గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారా అన్న సమాచారం తెలుసుకున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిర్ణయంపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్‌తో భేటీ కావడం, ఆ తర్వాత పరిణామాలపై కేంద్ర ఇంటలిజెన్స్‌ అధికారులు ఆరా తీశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సోమవారం ఉదయమే గవర్నర్‌తో భేటీ అంశాలనూ పరిశీలనకు తీసుకున్నట్టు తెలిసింది.

రాజకీయ కోణం బట్టబయలైంది: అంబటి
Mar 18, 2020, 18:24 IST
Ambati Rambabu Slams On Chandrababu Over State Election Commission - Sakshi
సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయడంలో ఎలక్షన్‌ కమిషన్‌ తన పరిధిని దాటి వ్యవహరించిందని సుప్రీంకోర్టు  చాలా స్పష్టంగా  తీర్పు చెప్పిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ..  కరోనా సాకుతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారని, దీంతో ఈసీ నిర్ణయంపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందన్నారు. ఎన్నికల వాయిదా రాజకీయ కోణంలో జరిగినట్లు బట్టబయలయిందన్నారు. ఎన్నికలు వాయిదా వేస్తూ ఎన్నికల కోడ్ ఎలా కొనసాగిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇది అతిక్రమణ, తప్పు అని ఈసీకి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ ఎత్తి వేయాలని, సంక్షేమ పథకాల కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం మంచి పరిణామమని అంబటి రాంబాబు అన్నారు. (అందుకే టీడీపీని వీడాను: శమంతకమణి)


ఎన్నికలు నిర్వహించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని, సుప్రీంకోర్టు స్పష్టంగా తన తీర్పులో చెప్పిందని అంబటి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతోనే  చారిత్రాత్మక తీర్పు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కుట్ర పూరితంగా ఎన్నికల కమిషన్ వ్యవహరించిందని అంబటి మండిపడ్డారు. ప్రభుత్వాన్ని కొన్ని రోజుల పాటు స్తంభింప చేయాలనే కుట్ర చేశారని ఆయన ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు ప్రశ్నలపై ఈసీ సమాధానం చెప్పాలని అంబటి డిమాండ్‌ చేశారు. సాధ్యమైనంత తొందరగా ఎన్నికల నిర్వహణకు ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు. ఎలక్షన్ కమిషన్‌ ఇప్పటికైనా ఆలోచన చేయాలని ఆయన సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వెనక చంద్రబాబు ఉన్నారని అంబటి మండిపడ్డారు.(‘సుప్రీంకోర్టు ఆదేశాలు టీడీపీకి చెంపపెట్టు’)

కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ముగ్గురు సభ్యులు ఉంటారని, అదేవిధంగా ఎస్‌ఈసీలో కూడా ముగ్గురు సభ్యులు ఉండేలా సంస్కరణలు తేవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు మొదటి నుంచి పెట్టాలని అడుగుతున్న చంద్రబాబు, అసెంబ్లీ ఎన్నికలు కూడా పెట్టమని అడుగుతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గొంతెమ్మ కోరికలు ఎన్నైనా కోరుతారని, బాబు అడిగేవన్ని జరగవని అంబటి అన్నారు. చట్టం, నిబంధనల ప్రకారం ఎన్నికలు జరుగుతాయని అంబటి రాంబాబు తెలిపారు.

Sunday, March 15, 2020

ఏపీలో జగన్, పిఎస్, సిఇవో, గవర్నర్ నాలుగు స్థంభాలాట

ఏపీలో జగన్, పిఎస్, సిఇవో, గవర్నర్ నాలుగు స్థంభాలాట
ఈరోజు సాయంత్రం 7 గంటలకు
Danny Telugu TV

రాష్ట్ర ఎన్నికల సంఘానికి సీఎస్ లేఖ
అమరావతి: ఎన్నికల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈసీకి ఆమె లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి లేదని లేఖలో పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు వైద్యారోగ్యశాఖ చర్యలు చేపట్టిందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అడ్డంకి కాకుండా కరోనా నియంత్రణ చేపట్టవచ్చని సూచించారు. పోలింగ్ రోజున జనం గుమిగూడకుండా నియంత్రించవచ్చు అని సీఎస్ పేర్కొన్నారు. మరో 3, 4 వారాలు కరోనా అదుపులోనే ఉంటుందని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలు యథాతథంగా నిర్వహించాలని ఎస్ఈసీకి విజ్ఞప్తి చేశారు.


జగన్మోహన్‌రెడ్డీ.. సిగ్గుపడు!
నువ్వు చేయాల్సిన పని ఈసీ చేసింది
ఎన్నికల కమిషనర్‌కు కులం రంగా!
క్విడ్‌ ప్రో కో చేస్తేనే నీకు మిత్రులా?
సీఎం వ్యాఖ్యలపై మండిపడ్డ టీడీపీ నేతలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ఎన్నికలు వాయిదా వేసిన ఈసీపై సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఆక్షేపించారు. కరోనాపై కనీసం దృష్టి పెట్టకుండా మొండిగా ముందుకెళ్తూ ప్రజల ఆరోగ్యంతో జగన్‌ చెలగాటమాడుతున్నారని టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమ విమర్శించారు. కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వమే ఎన్నికలను వాయిదా వేయాల్సిందని, కానీ ఆ పని ఎన్నికల కమిషనర్‌ చేసినందుకు ముఖ్యమంత్రి సిగ్గుపడాలని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా చట్టబద్ధంగా వ్యవహరించి, ఎన్నికలు వాయిదా వేసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ జగన్‌కు శత్రువు అయితే, అదే సామాజిక వర్గానికి చెందిన నిమ్మగడ్డ ప్రసాద్‌ ఎలా మిత్రుడయ్యారో జగన్‌ చెప్పాలని మాజీ మంత్రి జవహర్‌ డిమాండ్‌ చేశారు. క్విడ్‌ ప్రోకోకి పాల్పడితే మిత్రులు, రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తే శత్రువులా? అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్‌కు జగన్‌ కులం రంగు పులమడంపై టీడీపీ శాసనసభాపక్ష ఉప నేత అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్‌కు కులాన్ని ఆపాదించినందుకు కమ్మ సామాజికవర్గ మంత్రులు, ఎమ్మెల్యేలు వైసీపీకి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డిమాండ్‌ చేశారు. స్థానిక ఎన్నికలకు రీనోటిఫికేషన్‌ ఇవ్వాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు, సీనియర్‌ నాయకులు యడ్లపాటి వెంకట్రావు, యనమల, ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, దీపక్‌రెడ్డి, ఎమ్మెల్యే అనగాని, తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత ఈసీని కోరారు.

Jagan Complains to AP Governor against SEC Decision to Put off Local Body Polls over Coronavirus Fears
File photo of Andhra Pradesh CM and YSR Congress Party president Jagan Mohan Reddy.
File photo of Andhra Pradesh CM and YSR Congress Party president Jagan Mohan Reddy.

Andhra Pradesh CM YS Jagan Mohan Reddy said if required they would complain against the SEC "further up" and seek necessary action "if there is no change in him."
PTI
LAST UPDATED: MARCH 15, 2020, 6:27 PM IST
SHARE THIS:
Amaravati: Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy on Sunday called on Governor Biswabhusan Harichandan at the Raj Bhavan in Vijayawada and complained against the State Election Commissioner's "arbitrary" postponement of the polls to rural and urban local bodies.

The chief minister took strong exception to the decision of State Election Commissioner N Ramesh Kumar to put off the upcoming elections for six weeks in view of the spread of coronavirus.


The chief minister rushed to the Raj Bhavan for an unscheduled meeting with the Governor a couple of hours after the SEC announced its decision to put off the local bodies elections.

Later, Reddy told reporters that if required they would complain against the State Election Commissioner "further up" and seek necessary action "if there is no change in him."

The chief minister also found fault with the SEC decision to order transfer of collectors of Chittoor and Guntur districts and SPs of Tirupati Urban and Guntur Rural.

"What authority does the SEC have to order these transfers? Why should we have an elected government and the chief minister? Let the SEC run the government," Reddy said.

The YSR Congress chief spit fire on Ramesh Kumar saying he belonged to the "same caste" as that of Telugu Desam Party president and former CM N Chandrababu Naidu.

"We did not appoint Ramesh Kumar as SEC, it was Chandrababu Naidu who appointed his own caste man. But how can he act in such discriminate fashion?" Reddy said.



గవర్నర్‌ను కలిసిన ఏపీ ఎస్ఈసీ రమేశ్.. సర్వత్రా ఆసక్తి
అమరావతి : ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ హరిచందన్‌ను ఎస్‌ఈసీ రమేష్‌కుమార్ కలిశారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు కారణాలపై వివరించారు. సుమారు అరగంటకుపైగా ఈ భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు వాయిదా వేస్తూ సీఈసీ తీసుకున్న నిర్ణయంపై ఆదివారం నాడు గవర్నర్‌కు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఎస్‌ఈసీ రమేష్‌కుమార్ తీరుపై వ్యక్తిగత జగన్ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్‌ను ఎన్నికల కమిషనర్ కలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల వ్యవహారంపై గవర్నర్-రమేశ్ కుమార్ ఏం నిర్ణయిస్తారనే విషయం తెలియరాలేదు.

ఇదిలా ఉంటే.. ఎన్నికల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. ఎన్నికల సంఘానికి ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈసీకి ఆమె లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి లేదని లేఖలో పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు వైద్యారోగ్యశాఖ చర్యలు చేపట్టిందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అడ్డంకి కాకుండా కరోనా నియంత్రణ చేపట్టవచ్చని సూచించారు. పోలింగ్ రోజున జనం గుమిగూడకుండా నియంత్రించవచ్చని సీఎస్ పేర్కొన్నారు. మరో 3, 4 వారాలు కరోనా అదుపులోనే ఉంటుందని స్పష్టం చేశారు.