Wednesday, January 21, 2026

Legal Status for Amaravati

 ఆంధ్రప్రదేశ్‌కి రాజధానిగా అమరావతికి చట్టబద్దతకు రంగం సిద్దం. 


క్యాబినెట్‌ ఆమోదం తర్వాత... పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు కేంద్రం సిద్దమైనట్లు సమాచారం. 


విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాజధానిని  రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. 


రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా.... రాజధానిని ప్రకటించాల్సిన కేంద్రం. 


గత పదేళ్లుగా రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్‌. 


2024 జూన్‌ 2తో ఉమ్మడి రాజధాని గడవు ముగియడంతో... 


తమ రాజధానిగా అమరావతిని ప్రకటించాలని  కేంద్రానికి నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం. 


అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేసిన ప్రక్రియ, అమరావతి ప్రాంతంలో చేపట్టిన రాజధాని నిర్మాణ కార్యక్రమాలు, ఇతర చర్యలపై కేంద్రానికి నోట్‌ ఇచ్చిన రాష్ట్రం 


ఏ తేదీ నుంచి అమరావతిని రాజధానిగా ప్రకటించాలో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన కేంద్ర హోం శాఖ. 


2024 జూన్‌ 2 వరకు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా గడవు ముగుస్తున్నందున... ఆరోజు  నుంచే... అమరావతిని రాజధానిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం. 


నోడల్‌ ఏజన్సీగా అమరావతిని రాజధానిగా  ప్రకటించేందుకు చర్యలు మొదలు పెట్టిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. 


పట్టణాభివృద్ది, న్యాయ, వ్యయ శాఖల అభిప్రాయాలను త్వరగా పంపాలని హోం శాఖ కోరినట్లు సమాచారం. 


పలు మంత్రిత్వ శాఖలతో పాటు.... నీతి ఆయోగ్‌ అభిప్రాయం కూడా కోరిన కేంద్ర హోం శాఖ. 


రెండు దఫాలుగా జరిగే బడ్జెట్‌ సమావేశాల్లోనే అమరావతి రాజధానిగా ప్రకటించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. 


పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టే ముందు.... కేంద్ర క్యాబినెట్‌లో చర్చించి.. ఆమోదం తెలపాలని నిర్ణయించినట్లు  విశ్వసనీయ వర్గాల సమాచారం. 


అందుకు అనుగుణంగా  కేంద్ర హోం శాఖ క్యాబినెట్‌ నోట్‌ తయారు చేయడంలో నిమగ్నమైనట్లు అధికార వర్గాల వెల్లడి.

No comments:

Post a Comment