Tuesday, March 15, 2022

తృతీయ శక్తి అవుదాం!

 తృతీయ శక్తి అవుదాం!


‘సీఎంగా బీసీ’ ప్రతిపాదనకు నా మద్దతు: బ్రదర్‌ అనిల్‌

విశాఖలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రైస్తవ, 

మైనారిటీ సంఘాలతో సుదీర్ఘ సమావేశం

మరోసారి సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ

ఏపీలో షర్మిల పార్టీని విస్తరించాలని కోరుతున్నారు

గెలిపించిన వారిని జగన్‌ పట్టించుకోవట్లేదు

రెండున్నరేళ్లుగా ఆయన్ని కలవలేదు 

వివేకా కుటుంబానికి న్యాయం జరుగుతుంది: అనిల్‌ 


విశాఖపట్నం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు న్యాయం చేసేందుకు రాజకీయంగా మూడో ప్రత్యామ్నాయ శక్తిగా తయారవుదామని బ్రదర్‌ అనిల్‌కుమార్‌ పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. సోమవారం విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో ఉత్తరాంధ్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాల నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ‘‘ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగడం లేదు. మీరు ముందుకువచ్చి పార్టీ స్థాపిస్తే మేమంతా వెనకుండి నడిపిస్తాం’’ అని సమావేశంలో అన్ని సంఘాల నేతలు బ్రదర్‌ అనిల్‌కుమార్‌ను కోరినట్టు తెలిసింది. ‘‘మీరంతా సంఘటితంగా కలిసి వస్తామంటే.. ముందుండి నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నా’’ అని అనిల్‌ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత లోతుగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు త్వరలోమరోసారి సమావేశమవుదామని చెప్పినట్టు సమాచారం.


బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలకు బదులుగా బలహీన వర్గాల నాయకత్వంలో ప్రత్యామ్నాయం అవసరమని వివరించినట్టు సమాచారం. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకూ ఈ సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన సుమారు 70 మంది ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఒక్కో ప్రతినిధి ఐదు నుంచి పది నిమిషాల పాటు సమస్యలు ఏకరవు పెట్టినట్టు సమాచారం. అనంతరం బ్రదర్‌ అనిల్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్‌ షర్మిల.. ఆంధ్రప్రదేశ్‌కు కూడా పార్టీని విస్తరించాలని పలువురు కోరుతున్నారని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడానికి సహకరించాలని ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు కోరారని వెల్లడించారు. వారి ప్రతిపాదనను కచ్చితంగా సమర్థించి, మద్దతు ఇస్తానని ప్రకటించారు. గత ఎన్నికల్లో తాను ఇచ్చిన పిలుపునకు స్పందించి ఎంతో మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రైస్తవ, ముస్లిం మైనారిటీ సంఘాల నాయకులు వైసీపీ విజయానికి కృషి చేశారని చెప్పారు. సీఎం జగన్‌ కానీ, ప్రభుత్వం కానీ ఈ వర్గాల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. దీంతో వారంతా పిలిచి తమ సమస్యలు, ఇబ్బందులు తనకు వివరించారని చెప్పారు. ‘‘ప్రభుత్వం నుంచి ఆయా వర్గాలు ఏం ఆశించారో, ఏం కోల్పోయారో వివరించారు. వారి బాధలు వినేవారు కానీ, సమాధానం చెప్పేవారు కానీ లేరు. దీంతో బాధ్యత తీసుకోవాలని నిర్ణయించాను’’ అని అన్నారు. 


జగన్‌ బిజీగా ఉన్నట్టున్నారుఇటీవల విజయవాడలో ఇదే తరహాలో నిర్వహించిన సమావేశంలో ఆయా సంఘాలు వెలిబుచ్చిన సమస్యలు, అభిప్రాయాలను సీఎం జగన్‌కు వివరించారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ‘‘ఆయన (జగన్‌) పథకాల అమలు బిజీలో ఉన్నట్టున్నారు. నేను నా పనుల్లో తీరిక లేకుండా ఉన్నాను. నేను ఆయన్ను కలిసి రెండున్నరేళ్లు అయ్యింది’’ అని బ్రదర్‌ అనిల్‌ సమాధానమిచ్చారు. జగన్‌కు ఇప్పుడైనా వివరించేందుకు ప్రయత్నిస్తారా అన్న ప్రశ్నకు.. లేఖ ద్వారా లేదా వ్యక్తిగతంగా కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. హామీలను నెరవేర్చకుండా వైసీపీ సర్కారు కక్షసాధింపుతో పరిపాలన చేసే పరిస్థితి కనిపిస్తోందని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. వైఎస్‌ కుటుంబంలో విభేదాలు ఉన్నాయా? అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేశారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో బాధిత కుటుంబానికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని బ్రదర్‌ అనిల్‌ అన్నారు. కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందని, అది చిన్న వ్యవస్థ కాదని వ్యాఖ్యానించారు. 


అనిల్‌ పిలుపుతో వైసీపీకి ఓట్లు: హనోక్‌గత ఎన్నికల్లో బ్రదర్‌ అనిల్‌కుమార్‌ ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారానికి రాకపోయినా ఫోన్‌లు చేసి, సమావేశాలు ఏర్పాటు చేసి జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారని ఈ సమావేశంలో ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రిస్టియన్‌ చారిటీ (ఏఐసీసీ) జాతీయ అధ్యక్షుడు గారా హనోక్‌ వెల్లడించారు. ఆయన పిలుపు మేరకు తామంతా వైసీపీ విజయానికి కృషి చేశామన్నారు. టీడీపీకి ఓటేద్దామనుకున్నవారు కూడా ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేశారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత అందరికీ అన్యాయం చేస్తున్నారని జగన్‌ను ఉద్దేశించి అన్నారు. 


సర్కారు పట్టించుకోవడం లేదు!: సంఘాలుసమావేశంలో పాల్గొన్న నేతలు తమ సమస్యలు, కష్టాలను బ్రదర్‌ అనిల్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఈ సందర్భంగా పార్టీ ఏర్పాటు చేయాలని కోరినట్టు సమా చారం. క్రైస్తవుల అండదండలతో అధికారం దక్కించుకున్న జగన్‌.. వారి యోగక్షేమాలను పట్టించుకోవడం లేదని క్రైస్తవ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్టియన్‌ మిషనరీల ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిడెడ్‌ పాఠశాలలు, చర్చిలు, హాస్టళ్లను ప్రభుత్వం లాక్కొంటోందని పలువురు బిష్‌పలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీల రాయితీలను కూడా వైసీపీ సర్కారు నిలిపివేసిందని కొందరు విమర్శించారు. సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!

Monday, March 14, 2022

ఒక్కటై ఓడిస్తాం! - పవన్ కళ్ాణ్

 ar 15 2022 @ 02:59AM 

ఒక్కటై ఓడిస్తాం! - పవన్ కళ్ాణ్ 


వైసీపీ వ్యతిరేక శక్తులు ఏకమవ్వాలి..

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను

బీజేపీ రోడ్‌మ్యాప్‌ కోసం వెయిటింగ్‌

2024లో ప్రజా ప్రభుత్వం స్థాపిస్తాం

మేం వస్తే ‘అప్పుల్లేని ఆంధ్రప్రదేశ్‌’

ముమ్మాటికీ అమరావతే రాజధాని

అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం

సీపీఎస్‌ రద్దు.. మళ్లీ పాత పెన్షన్‌

ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం

జనసేనాని కార్యాచరణ ప్రకటన

వైసీపీ సర్కారుది విధ్వంసకర పాలన

కూల్చివేతలు... అశుభంతో ప్రారంభం

పెట్టుబడులు లేవు.. ఉన్నవీ పోతున్నాయి

ఇసుకను కరకరా నమిలేస్తున్నారు

భవన కార్మికుల ఉసురు తీశారు

నిషేధం అంటూనే మద్యం నుంచి సొమ్ములు

‘ఒక్క చాన్స్‌’తో రాష్ట్రం పాతికేళ్లు వెనక్కి

మళ్లీ వస్తే పిల్లల చేతిలో చాక్లెట్లూ లాగేస్తారు!


(అమరావతి-ఆంధ్రజ్యోతి)2024లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా... వైసీపీ వ్యతిరేక ఓటును చీలకుండా చూస్తామని ప్రకటించారు. ‘‘ఎమర్జెన్సీ సమయంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నీ కలిశాయి. ఇప్పుడూ అలాగే వైసీపీ వ్యతిరేక శక్తులు కలవాలి. ఆంధ్రప్రదేశ్‌ బాగు కోసం చెబుతున్నా... వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదు’’ అని పవన్‌ ఉద్ఘాటించారు. పార్టీలు, వ్యక్తిగత లాభాలు వదిలి రాష్ట్ర ప్రయోజనాలకు రావాలని... అప్పుడు పొత్తుల కోసం ఆలోచిస్తామని ప్రకటించారు. రాష్ట్ర బాధ్యతను జనసేన తీసుకుంటుందన్నారు. ఈ దిశగా బీజేపీ  నాయకులు రోడ్‌మ్యాప్‌ ఇస్తామని చెప్పారని, దానికోసం ఎదురు చూస్తానని తెలిపారు. రోడ్‌ మ్యాప్‌ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని, వైసీపీని గద్దె దించుతామని ఆయన స్పష్టం చేశారు. సోమవారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జరిగిన జనసేన 9వ ఆవిర్భావ సభలో పవన్‌ కల్యాణ్‌ ప్రసంగించారు. వైసీపీపై నిప్పులు చెరిగారు. భావి పొత్తులపై సంకేతాలు ఇచ్చారు. ‘‘ఇన్ని సంవత్సరాలు ప్రజలకు అండగాఉండి భుజంకాచాను. ఇప్పుడు నేను సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నా. రాష్ట్ర బాధ్యతను  జనసేన తీసుకుంటుంది’’ అని పవన్‌ తన కార్యాచరణను విస్పష్టంగా ప్రకటించారు. 2019 ఎన్నికల్లో 137 సీట్లలో పోటీచేస్తే 7.24 శాతం ఓట్లు వచ్చాయని చెప్పారు.

ఒక ఎమ్మెల్యే సీటు నెగ్గినప్పటికీ... వైసీపీ లాక్కెళ్లిందని మండిపడ్డారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయాలను వివరించారు. పార్టీ సభ్యత్వం 46 లక్షలకు చేరుకుందని పవన్‌ ప్రకటించారు. ‘‘ఎంత సింధువైనా బిందువుతోనే మొదలవుతుంది. ఏడు శాతం నుంచి 27 శాతానికి, ఆ 27 నుంచి  ప్రభుత్వాన్ని స్థాపించే స్థానానికి ఎదగబోతున్నాం’’ అని తెలిపారు. ‘‘రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్‌ బాగుండాలి. ఈ రాష్ట్రం చీకట్లోకి వెళ్లకుండా చూడటం జనసైనికుల చేతుల్లోనే ఉంది. నేను నడిచి చూపిస్తాను. మీరు నడవండి.  ఇప్పుడు... వైసీపీ చీకటి పాలనను అంతమొందించే అవకాశం లభించింది. ఇలాంటి సామాజిక ప్రగతి నిర్మాణం చేసే అవకాశాలు అరుదుగా వస్తాయి. వాటిని సద్వినియోగంచేసుకోవాలి’’ అని పిలుపునిచ్చారు.   ‘‘2014లో సూటిగా ప్రశ్నించాం. ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నాం. 2019లో బలంగా పోరాటం చేశాం. బరిలో నిలబడి ఉన్నాం. 2024లో గట్టిగా నిలదొక్కుకుంటాం. ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం’’ అని ఉద్ఘాటించారు.

ఈ పాలన విధ్వంసంతో మొదలు... ‘‘కొత్త ఇంట్లోకి వెళ్తే శుభంతో మొదలుపెడుతాం. మీ ప్రభుత్వం అశుభంతో... కూల్చివేతలతో ప్రారంభించింది.  మూడు నెలలకే ఇసుక సమస్య వచ్చింది. 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డుమీద పడ్డారు. 32 మంది ప్రాణాలను మీ నాయకత్వం బలిగొంది.ఆ రోజు నుంచి ఇప్పుడు జనసేన సభకు ఆటంకం కలిగించే వరకు విధ్వంసాలే! ఇంత నెగటివ్‌ మనుషులా!’’ అని పవన్‌ ఈసడించారు. తన ప్రసంగాన్ని జై ఆంధ్రప్రదేశ్‌, జై తెలంగాణ, జై భారత్‌ అంటూ మొదలుపెట్టారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది ప్రముఖులు, అన్ని పార్టీల నేతలకు పేరుపేరునా నమస్కరించారు. అన్ని మతాలను ప్రస్తావిస్తూ వాటి గొప్పతనాన్ని వివరించారు. 

ఒక కులాన్ని వర్గశత్రువుగా రాష్ట్రంలో ఒక కులాన్ని వైసీపీ వర్గశత్రువుగా ఎలా ప్రకటించింది? దీని వల్ల రాష్ట్రం అస్తవ్యస్తమవుతోంది. వైశ్య సామాజికవర్గాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇబ్బందులుపెడుతున్నారు. వారికి జనసేన అండగా ఉంటుంది. యానాది, రెల్లి, ముత్తరాసి, బీసీ. సంచారజాతులు ఎస్సీలు, గిరిజనులకు అండగా ఉంటాం. 

ద్వారంపూడికి భీమ్లానాయక్‌ ‘ట్రీట్‌మెంట్‌’ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి అనే వ్యక్తి నన్ను అకారణంగా పచ్చిబూతులు తిట్టారు. అది వైసీపీకి  అలవాటే. నేను భరించాను. కానీ... నన్ను తిడితే మా జనసైనికులు, వీర మహిళలకు కోపం వస్తుంది. గతంలో ఆయన  (ద్వారంపూడి)  కుటుంబానికి  ఎస్పీ డీటీ నాయక్‌ ట్రీట్‌మెంట్‌ జరిగింది. భవిష్యత్‌లో ఇలాగే చేస్తే... ‘భీమ్లా నాయక్‌ ట్రీట్‌మెంట్‌’ అంటే ఏమిటో చూపిస్తాను. 

అమరావతే రాజధానిఎట్టి పరిస్థితుల్లో అమరావతే రాజధానిగా కొనసాగుతుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారవు. ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా పాలసీలు మారవు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి మద్దతు తెలిపి వారి విజయానికి మనవంతు సహకారం అందించాం. రాజధాని విషయంలో ఇక్కడ పెనుమాక, ఉండవల్లి, మిగతా గ్రామాల రైతులు భూములు ఇవ్వడం ఇష్టం లేదంటే మేం వారి పక్కన నిలబడ్డాం. మేం మద్దతు ఇచ్చిన ప్రభుత్వంపై మేం గొంతెత్తినప్పుడు, వైసీపీ నాయకత్వం ఆ రోజు ఏం చేసింది? ఆనాడు గాడిదలు కాస్తున్నారా? మూడు రాజధానులు అని ఆ రోజు ఎందుకు చెప్పలేదు? 29 గ్రామాలు... 26,896 మంది రైతులు, 34వేల ఎకరాలు దీంట్లో 32 శాతం మంది ఎస్సీలు, మిగతా వారు బీసీలు, ఇతరులున్నారు.  ఆషామాషీగా ఉందా మీకు? మీ ఇష్టానికి రాజధాని మార్చేస్తారా? అమరావతి రైతులకు చెబుతున్నా! ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి. ఎక్కడికి వెళ్లదు. మీ మీదపడ్డ ప్రతీ లాఠీదెబ్బ నామీద పడినట్లే. అమరావతి ఇక్కడి నుంచి కదలదు. అలాగని మిగతా ప్రాంతాలను వదిలేస్తామని కాదు. 

ఇదేనా వైసీపీ ప్రతిజ్ఞ... వైసీపీ అధికారంలోకి రాగానే మూడు తప్పులు చేసిందని పవన్‌ పేర్కొన్నారు. అవి...1) గత ప్రభుత్వం చేసిన పనులను రద్దు చేయడం. 2) 2. పీపీఏ (విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు)లను రద్దుచేసింది. 3)  అమరావతి రాజధాని స్థానంలో మూడు రాజధానులని తప్పు మీద తప్పు చేసింది. విధ్వంసమే వైసీపీ విధానమని... ప్రతిజ్ఞ చేసినట్లుగా దారుణాలకు తెగబడుతున్నారని పవన్‌ అన్నారు. బహుశా... వైసీపీ ప్రతిజ్ఞ ఇదే కావొచ్చు అంటూ ఆ పాఠాన్ని చదివి వినిపించారు. అదెలా సాగిందంటే... ‘‘ఆంధ్రప్రదేశ్‌ మా సొంత భూమి. ఆంధ్రులందరూ మా బానిసలు. న్యాయవ్యవస్థను లెక్కేచేయం.  పోలీసులను ప్రైవేటు ఆర్మీగా వాడేస్తాం.  రాష్ట్ర రహదారులను గుంతల మయంచేస్తాం. ప్రజల వెన్నుపూసలు విరగొట్టేవరకు విశ్రమించం. పెట్టుబడుల్లో 50 శాతం వాటా లాక్కుంటాం.  అన్నంపెట్టే రైతన్నలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తాం. ఇసుకను అప్పడంలా కరకరా నమిలేస్తాం.  పార్కులు, స్కూళ్లు, ప్రభుత్వ భవనాలను తాకట్టుపెట్టేస్తాం. సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూనే ప్రజలతో చిత్తుగా తాగిస్తాం. మా వైసీపీ ఎంపీ అయినా సరే... ఎదురు తిరిగితే చితక్కొడతాం. ఒక్క చాన్స్‌తో ఆంధ్రాను పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్లాం. ఇంకొక్క చాన్స్‌ ఇస్తే చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు కూడా లాక్కుంటాం!’’

న్యాయవ్యవస్థనూ వదిలిపెట్టలేదువైసీపీ న్యాయ వ్యవస్థను కూడా తప్పుపట్టేదాకా వెళ్లింది.  హైకోర్టు ఒక పార్టీ బ్రాంచ్‌ ఆఫీసుగా మారిందని తిడతారా? ఏ స్థాయికి వీరి గుండాయిజం వెళ్లిందంటే ఇళ్లలోకి వచ్చి రైతులను కొట్టడం, న్యాయ వ్యవస్థ జీవితంలోకి వెళ్లడం వీరి గుండాయిజం. 

పోలీసులూ విసిగిపోయారు...వైసీపీ వల్ల పోలీసు వ్యవస్థ కూడా విసిగిపోయింది. పోలీసులకు జీతభత్యాలు, కనీసం కరువు భత్యం సరిగ్గా ఇవ్వడం లేదు. అధికారంలోకి వస్తే వారాంతపు సెలవు ఇస్తానని చెప్పారు. అది లేకపోగా వీరి నిర్వాకంవల్ల పోలీసులకు పని మరింత పెరిగింది. వైసీపీ వారికి భయం లేదు. సీఐ ర్యాంకు అయినా సరే వారి చొక్కా కాలర్‌ పట్టుకుంటారు. చిత్తూరులో ఒక సీఐని కాలర్‌ పట్టుకున్నారు. ఇంకో సీఐని విశాఖ పీఠంలో చొక్కాలు విప్పికొడతామని మంత్రి ఒకరు బెదిరిస్తారు. కృష్ణలంక స్టేషన్‌లో ఎంపీ కానిస్టేబుల్‌ను కొట్టేశారు. ఓ పోలీసు బిడ్డగా చెబుతున్నా... ఓ తప్పుడు ఎమ్మెల్యే, గుండా మా తండ్రిని కొడితే ఏమిటి ఇది అనిపిస్తుంది కదూ!  అధికారంలోకి రాగానే 14,341 పోలీసు ఉద్యోగాలు భర్తీచేస్తామన్నారు. 400 తప్ప మిగతా ఉద్యోగాలు లేవు. ఈ పాలనలో తొలుత పారిశ్రామికవేత్తలు దెబ్బతిన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే సీపీఎస్‌ రద్దుచేస్తామన్నారు.  అధికారంలోకి  వచ్చాక మొండి చేయి చూపించారు.  మా నాయకుడికి ఆ రోజున విషయ పరిజ్ఞానం లేదని, టెక్నికాలిటీస్‌ తెలియదన్నారు.   

పార్టీ రంగుల కోసం 3వేల కోట్ల ఖర్చు వైసీపీ పార్టీ రంగుల కోసం 3వేల కోట్లు ఖర్చుపెట్టారు. ప్రకటనలకు 400 కోట్లు వృఽథా చేశారు. మీ పార్టీ రంగులు వేసుకోవడానికి 3వేల కోట్లు ఉంటాయి కానీ ఉద్యోగస్తులకు ఇవ్వడానికి  డబ్బులు ఉండవా? 


ఇదీ అప్పులవల్ల అనర్థం... తెలంగాణ ఆదాయం 99,900 కోట్లు. ఆంధ్రా ఆదాయం లక్షా 17వేల కోట్లు. ఈ ఆదాయం ఎటుపోతోంది? ఏం చేస్తున్నారు? తాకట్టులో భారత దేశం అన్నట్లు... ‘అప్పులో ఆంధ్ర’గా మారిపోయింది. దాని ప్రభావమే ప్రజలపై పడుతోంది. ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు? టీచర్‌ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? కొత్త నియామకాలు ఎందుకు చేపట్టడం లేదు? ఉద్యోగుల జీతాలు ఎందుకు పెరగడం లేదు? అమ్మఒడి పథకానికి డబ్బులు ఎందుకు ఆగాయి? ఎయిడెడ్‌ స్కూల్స్‌, కాలేజీలను ఎందుకు మూసివేస్తున్నారు. ఆరోగ్యశ్రీని ఎందుకు మంచం ఎక్కించారు? ిపింఛన్లు ఎందుకు తగ్గించారు? దీనింతటికీ కారణం... అప్పులు చేయడమే!

పెట్టుబడులను చంపేశారు వైసీపీ నేతలు పెట్టుబడులను చంపేశారు. ఏపీ అంటే ఎవ్వరూ రావడం లేదు. ఉన్నవాటిని పంపించేస్తున్నారు. అమర్‌రాజా కంపెనీ ఓఉదాహరణ. అనంతపురం జిల్లాలో కియతో రావాల్సిన అనుబంధ పరిశ్రమలు రాలేదు. 

మద్యం ఆదాయంలో రికార్డుటీడీపీ హయాంలో మద్యంపై 59 వేల కోట్లు ఆదాయం రాగా... వైసీపీ రెండున్నరేళ్లలోనే 45వేల కోట్లు సంపాదించింది. ధరలు పెంచితే మద్యం తాగేయడం మానేస్తారని ఓ దరిద్రపు, నీచ, నికృష్ట వాదన వినిపిస్తారు. నాసిరకం లిక్కర్‌ అమ్ముతున్నారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి 12 మంది మరణించారు. ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌ కాదు.. అది ఇడుపులపాయ ఫారిన్‌ లిక్కర్‌! 25వేల కోట్ల మద్యం ఆదాయం వారి జేబుల్లోకి చేరుకుంది. 


మేం అధికారంలోకి వస్తే..సెక్యులరిజం అంటే ఒక మతానికి ఒక న్యాయం, మరో మతానికి మరో న్యాయం కాదు! మసీదులు, చర్చిలను ప్రభుత్వం కంట్రోల్‌లో పెట్టుకోదు. కానీ హిందూ దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ ఎందుకు? దీనిని మేం పరిశీలిస్తాం.  టీటీడీ, ఎండోమెంట్‌ చట్ట సవరణను పరిశీలిస్తాం.  ఏపీని అప్పులు లేని రాష్ట్రంగా చేయాలన్నదే నా లక్ష్యం. ఆర్థికాభివృద్ధి సాధించడమే లక్ష్యం. ఇందుకోసం ఇన్వెస్టర్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వం తీసుకొస్తాం. విశాఖను విశ్వనగరంగా, విజయవాడ, తిరుపతిని బలమైన హైటెక్‌ నగరాలుగా తీర్చిదిద్దుతాం. అమరావతిని అన్ని వర్గాలు, కులాలకు నివాసం కల్పించే అభ్యుదయ రాజధానిగా ముందుకు తీసుకెళ్తాం. కర్నూలు నగరం రుణం తీర్చుకుంటాం. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెడతాం. రాయలసీమ బిడ్డలను గల్ఫ్‌ నుంచి తీసుకొచ్చి ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పేదల ఇళ్ల నిర్మాణాలకు, తెల్లకార్డుదారులకు ఉచిత ఇసుక ఇస్తాం. జనసేన సౌభాగ్యపదం కింద యువతకు ఒక్కొక్కరికి 10 లక్షల ఆర్ధిక సహాయం చేస్తాం. సంవత్సరానికి లక్ష మంది  చొప్పున ఐదేళ్లలో 5 లక్షల మందికి బ్యాంకులో డబ్బు వేస్తాం. బడుగు, బలహీనవర్గాలకు ప్రాధాన్యం ఇస్తాం. వ్యవసాయరంగాన్ని లాభసాటిగా మారుస్తాం. గిట్టుబాటు రాక రైతులు ఏడుస్తున్నారు. రైతు కన్నీరుపెట్టకూడదు. రైతులతో మాట్లాడుతాం. వారి  కష్టాలను అర్ధం చేసుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాం. మద్దతు ధర, పుడ్‌ప్రాసెస్‌, పంటకాలువలు, మినీ రిజర్వాయర్లను ఆధునీకరిస్తాం. 

ప్రతి ఉద్యోగ ఖాళీ భర్తీచేస్తాం... ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్నీ జనసేన అధికారంలోకి రాగానే భర్తీ చేస్తుంది. నిరుద్యోగుల ప్రయోజనాలను కాపాడుతాం. ప్రైవేటు రంగంలో ఏటా 5 లక్షల ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళిక అమలు చేస్తాం. ఉద్యోగులకు పీఆర్‌సీ సవరణ చేయిస్తాం. ఓ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా సీపీఎ్‌సను రద్దుచేయిస్తాం. పాత పెన్షన్‌ విధానం తీసుకొస్తాం. మీకు అండగా ఉంటాం. 




వైఎస్సార్‌సీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వం

Mar 15, 2022, 03:30 IST

Pawan Kalyan Comments In Janasena Party formation day Meeting - Sakshi

గుంటూరు జిల్లా ఇప్పటంలో జరిగిన సభలో మాట్లాడుతున్న పవన్‌కల్యాణ్‌


ఆ పార్టీని గద్దె దింపడానికి అందర్నీ కలుపుకొనిపోతాం 


బీజేపీ రోడ్‌ మ్యాప్‌ కోసం ఎదురుచూస్తున్నా 


రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తులపై సరైన నిర్ణయం తీసుకుంటాం 


రెండు చోట్ల ఓడిపోయినా వెనక్కి తగ్గలేదు 


2024లో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం 


అప్పుల నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగిస్తాం 


కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు 


అమరావతే ఏకైక రాజధాని 


జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్‌ 


సాక్షి, అమరావతి బ్యూరో: వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వబోమని, ఆ పార్టీని గద్దె దింపడానికి అన్ని పార్టీలను కలుపుకొనిపోతామని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. సోమవారం తాడేపల్లి మండలం ఇప్పటంలో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. పార్టీలు, వ్యక్తగత ప్రయోజనాలు వదిలి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై పోరాడటానికి రోడ్‌ మ్యాప్‌ని అందజేస్తామని బీజేపీ చెప్పినా, ఇంతవరకు ఇవ్వలేదన్నారు.


2019 ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయినప్పుడు చాలా బాధపడ్డానని, అధికార పార్టీ నాయకులు తనను ఎన్నో సార్లు మానసిక అత్యాచారం చేశారని చెప్పారు. 2019లో ఒక్క సీటే గెలిచినా, స్థానిక సంస్థల్లో పార్టీ మంచి ఫలితాలను సాధించిందన్నారు. 150 మంది సభ్యులతో మొదలైన పార్టీ నేడు 5 లక్షల మంది సభ్యత్వం తీసుకొనే దిశగా సాగుతోందని చెప్పారు. 2024లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. రెండున్నరేళ్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎన్నో బాధలు పడ్డారని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం కూల్చివేతతో పాలన మొదలుపెట్టిందన్నారు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. రోడ్లు వేయకపోవడం వల్ల ప్రమాదాలు పెరిగాయన్నారు.


అమరావతే ఏకైక రాజధాని

అమరావతిలో టీడీపీ ప్రభుత్వం రాజధాని నిర్మించాలనుకున్నప్పుడు తాను వ్యతిరేకించానని చెప్పారు. గత ప్రభుత్వాలు తప్పులు చేస్తే వాటిని సవరించి, కొనసాగించాలన్నారు. అమరావతే ఏకైక రాజధాని అని స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే పీఆర్‌సీ సవరణ చేస్తామని, సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అప్పుల నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగిస్తామని చెప్పారు. నూతన పారిశ్రామిక విధానం తెస్తామన్నారు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెడతానన్నారు. రేషన్‌ కార్డు ఉన్న అందరికి ఉచితంగా ఇసుక ఇస్తామన్నారు. పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఐదేళ్లలో ఐదు లక్షల మంది యువతకు సంవత్సరానికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర అందేలా చూస్తామన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. 


మంత్రులపై విమర్శలు

తాను వ్యక్తిగత దూషణలకు వ్యతిరేకమని ఒకవైపు చెబుతూనే మరోవైపు మంత్రులను దూషించారు. మంత్రులు  వెలంపల్లి, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే అంబటి రాంబాబుల పేర్లను వెటకారంగా పలికారు. అధికారంలోకి వచ్చాక ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి భీమ్లానాయక్‌ ట్రీట్‌మెంట్‌ రుచి చూపిస్తానన్నారు. 


పార్టీని ఎన్నో రకాలుగా ఇబ్బందిపెట్టారు : నాదెండ్ల

జనసేన పార్టీ, పవన్‌ కల్యాణ్‌లను ఎన్నో రకాలుగా అధికార పార్టీ ఇబ్బంది పెట్టిందని పార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ వ్యాఖ్యానించారు. పార్టీ కార్యక్రమాలు కార్యకర్తలకు తెలియడానికి అస్త్ర యాప్‌ను సిద్ధం చేశామన్నారు. 


రాష్ట్రం అప్పుల పాలవుతోంది : నాగబాబు

అధికారపార్టీ చర్యలతో రాష్ట్రం అప్పులపాలవుతోందని నాగబాబు విమర్శించారు. ప్రతి వ్యక్తిపై రూ.లక్షకు పైగా అప్పు ఉందన్నారు.    

Saturday, February 12, 2022

ఉన్మాది సీఎం చెప్తే.. పోలీసుల విచక్షణ ఏమైంది?: చంద్రబాబు

 ఉన్మాది సీఎం చెప్తే.. పోలీసుల విచక్షణ ఏమైంది?: చంద్రబాబు


అమరావతి: ఎమ్మెల్సీ అశోక్‌బాబును అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. నేడు ఆయన అశోక్‌బాబు నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అశోక్‌బాబు ఎక్కడా దాక్కోలేదు. తప్పు చేస్తే ధైర్యంగా ఆఫీస్‌కు వచ్చి అరెస్ట్ చేయవచ్చు. పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణం. అర్ధరాత్రి కిడ్నాప్ చేసి ఎక్కడెక్కడో తిప్పారు. ఉన్మాది సీఎం చెప్తే.. పోలీసుల విచక్షణ ఏమైంది? ఎప్పటికైనా మిమ్మల్ని జగన్‌రెడ్డి బలిపశువులను చేస్తారు. ప్రజా సమస్యలపై పోరాడడం తప్పా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? ముగ్గురు మాజీ మంత్రులను అరెస్ట్ చేశారు. ఇప్పటివరకూ 40 మంది టీడీపీ నేతలపై కేసులు పెట్టారు. 33 మంది టీడీపీ నేతలను హత్య చేశారు. అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరి పక్షాన టీడీపీ పోరాడుతుంది. ఇకపై ప్రజాస్వామ్య వ్యవస్థలో మీ ఆటలు సాగనివ్వం’’ అని పేర్కొన్నారు.

https://www.andhrajyothy.com/telugunews/chandrababu-comments-mrgs-andhrapradesh-1922021202355431



Thursday, January 27, 2022

రాష్ట్రంలో 26 కొత్త జిల్లాలు.. 62 రెవెన్యూ డివిజన్లు.

 పత్రికా ప్రకటన

విజయవాడ, 

తేది : 27-01-2022.

పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు

రాష్ట్రంలో 26 కొత్త జిల్లాలు.. 62 రెవెన్యూ డివిజన్లు.

గిరిజనుల అభివృద్ది కోసం రెండు గిరిజన జిల్లాలు

అసెంబ్లీ నియోజకవర్గాన్ని విడదీయకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు.

విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లా ఒంగోలు.. చిన్నజిల్లా విశాఖపట్నం.. 

వివరాలను వెల్లడించిన ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌ కుమార్‌ జి. ఎస్ఆర్ కెఆర్

కొత్త జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగానే జరిగిందని.. భౌగోళిక విస్తీర్ణం, జనసాంద్రత, సాంఘిక, సంస్కృతి ప్రకారం జిల్లాలను విభజించామని ఏపీ ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ తెలిపారు.  కొత్త జిల్లాల ఏర్పాటుపై లోతైన అధ్యయనం జరిగిందని,  పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాల సరిహద్దులు ఎలా ఉండాలనే దానిపై అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనల మేరకే గిరిజనాభివృద్దిలో భాగంగా రెండు గిరిజన జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.  కొత్త జిల్లాల ఏర్పాటుపై విజయవాడ ఎం.జీ. రోడ్డులోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ కార్యాలయంలో విజయ్‌ కుమార్‌ గురువారం మీడియా ప్రతినిధులకు వివరాలను తెలిపారు. 

ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాల స్వరూపం ఏ విధంగా ఉండాలనే అంశంపై భారీ కసరత్తు చేశామన్నారు.  పార్లమెంట్‌ నియోజకవర్గాల ప్రకారం 25 జిల్లాలు కాకుండా భౌగోళిక పరిస్థితుల ఆధారంగా 26 జిల్లాలు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించామన్నారు. విభజన ప్రక్రియలో జిల్లా కేంద్రాలు, భౌగోళిక, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలు అన్నీ పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు లేకుండా జిల్లాకు కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఉండేలా, అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం ఒకే జిల్లాలో ఉండేలా చూశామని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాన్ని విడదీయకుండా జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాలు అందరికీ దగ్గరుండేలా చూసుకున్నామన్నారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతం విస్తృత పరిధి ఎక్కువ అని.. విస్తృతంగా ఉన్న గిరిజన ప్రాంతానికి ఒక జిల్లా ఉంటే ఇబ్బందులు ఉంటాయని, గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనల ప్రకారం రెండు జిల్లాలుగా ఏర్పాటు చేశామన్నారు. మన్యం ప్రాంతాల్లో ప్రజల అభివృద్ధి కోసం రెండు జిల్లాలు దోహదం చేస్తాయని అభిప్రాయపడ్డారు. పార్వతీపురం జిల్లాను పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు 4 నియోజకవర్గాలతోను..  అలాగే అరకు జిల్లాను అరకువ్యాలీ, పాడేరు, రంపచోడవరం 3 నియోజకవర్గాలతో కలిపి ఏర్పాటవుతాయని తెలిపారు. అందుకే రంపచోడవరం ప్రాంతం రాజమండ్రికి దగ్గరగా ఉన్నప్పటికీ  అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేర్చామని తెలిపారు. 

శ్రీకాకుళం పేరున్న ఇన్‌స్టిట్యూట్‌లన్నీ ఎచ్చెర్లలో ఉన్నాయని.. అందుకే ఎచ్చెర్లను శ్రీకాకుళంలో కలిపామన్నారు. విజయనగరం విస్తీర్ణం కోసమే రాజాం, శృంగవరపుకోట నియోజకవర్గాలను ఆ జిల్లాలో కలిపామని, విజయనగరం అభివృద్ధి దెబ్బతినకుండా జిల్లా ఏర్పాటు చేశామన్నారు. అలాగే పెందుర్తిని తీసేస్తే అనకాపల్లి వెనకపడే అవకాశం ఉందన్నారు. భీమిలి గత ప్రాముఖ్యత దృష్య్టా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేశామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం ప్రాంతాలను మూడు జిల్లాలుగా ఏర్పాటు చేశామన్నారు. కోనసీమ ప్రాంతాన్ని జిల్లాగా చేయాలని అక్కడి ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారని, అందుకే అమలాపురం కేంద్రంగా దాన్ని ప్రతిపాదించామని తెలిపారు. నరసాపురం జిల్లాలో ఒక్క రెవిన్యూ డివిజన్ వచ్చింది కాబట్టి భీమవరం కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అవుతుందన్నారు.. బాపట్లలోని సంతనూతలపాడు నియోజకవర్గాన్ని ఒంగోలు జిల్లాకి కలుపుతామన్నారు. అలాగే నంద్యాలలోని పాణ్యం నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాకి, హిందూపూర్ లోని రాప్తాడు నియోజకవర్గాన్ని అనంతపూర్ జిల్లాకి కలుపుతామన్నారు. తిరుపతి పార్లమెంట్ లోని సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాకి కలపాలని.. తిరుపతికి చిత్తూరులోని చంద్రగిరి నియోజకవర్గం కలపాలని ప్రతిపాదించామన్నారు. రాజంపేట జిల్లాను 6 నియోజకవర్గాలతో ఏర్పాటు చేస్తూ.. పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాకి కలపాలని ప్రతిపాదించామన్నారు. కొత్త ప్రతిపాదిత జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం సగటున జిల్లాకి 20 లక్షల వరకూ జనాభా ఉంటున్నట్లు తెలిపారు. 

26 జిల్లాలు.. 62 రెవెన్యూ డివిజన్లు..  

రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. జిల్లాల ఏర్పాటు పక్రియలో అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ప్రతిపాదిత జిల్లా సరిహద్దు పరిధిలోకి రావాలని, ప్రతి జిల్లాలో కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఉండేలా నిబంధనలను అనుసరించామని ఆయన తెలిపారు.  పరిపాలన సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న 51 రెవిన్యూ డివిజన్లకు కొత్తగా 15 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని, 4 డివిజన్లను ప్రస్తుత రెవెన్యూ డివిజన్లకు కలపాలని ప్రతిపాదించామని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే రెవెన్యూ డివిజన్లలో విజయనగరం జిల్లాలో బొబ్బిలి  రెవెన్యూ డివిజన్, విశాఖపట్నం జిల్లాలో భీముని పట్నం రెవెన్యూ డివిజన్, నర్సాపురం జిల్లాలో భీమవరం రెవెన్యూ డివిజన్, విజయవాడ లో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాలో నందిగామ, తిరువూరు రెవిన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. అలాగే బాపట్ల జిల్లాలో ఒక్క రెవిన్యూ డివిజన్ కూడా లేదు కాబట్టి బాపట్ల, చీరాల డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామన్నారు.  ఒంగోలు జిల్లాలో కనిగిరి రెవెన్యూ డివిజన్, నంద్యాల జిల్లాలో ఆత్మకూర్, డోన్ రెవెన్యూ డివిజన్లు, అనంతపూర్ జిల్లాలో గుంతకల్ రెవెన్యూ డివిజన్, హిందూపూర్ జిల్లాలో పుట్టపర్తి రెవెన్యూ డివిజన్, కడప జిల్లాలో బద్వేలు రెవెన్యూ డివిజన్, రాజంపేట (రాయచోటి) జిల్లాలో రాయచోటి రెవెన్యూ డివిజన్, చిత్తూరు జిల్లాలో పలమనేరు రెవెన్యూ డివిజన్ మొత్తం కలిపి 15 రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు వివరించారు. ఎటపాక, కుకునూరు, ధర్మవరం, కందుకూరు రెవెన్యూ డివిజన్ లలో షిఫ్ట్ చేశామన్నారు. 

భౌగోళిక విస్తీర్ణం, జనసాంద్రతను అనుసరించే విభజన జరిగిందని విజయకుమార్ స్పష్టం చేశారు.  26 జిల్లాల్లో అతి పెద్ద జిల్లాలుగా ఒంగోలు, అనంతపురం విస్తీర్ణంలో నిలిచాయన్నారు. దీనికి ప్రధాన కారణం ఈ రెండు జిల్లాల్లో నల్లమల ఫారెస్ట్ ఎక్కువ భాగం ఉందని తెలిపారు. చిన్న జిల్లాగా విశాఖపట్నం ఉందన్నారు. విస్తీర్ణం తక్కువయినా భీమవరం, రాజమండ్రి ఎక్కువ జనసాంద్రత ఉన్న జిల్లాలని, ఇక్కడ ఇరవై లక్షల మంది జనాభా ఉన్నారని తెలిపారు. చారిత్రక నేపథ్యాలను చూసి కూడా జిల్లాలను విభజించడం జరిగిందన్నారు. ప్రజల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. అభ్యంతరాలు ఏమైనా ఉంటే ప్రభుత్వానికి తెలియచేయవచ్చని విజయకుమార్ ఈ సందర్భంగా సూచించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ డైరెక్టర్ కె. శివశంకర రావు తదితరులు పాల్గొన్నారు.

(జారీచేసిన వారు : కమిషనర్, సమాచార, పౌర సంబంధాల శాఖ, విజయవాడ)

Monday, January 24, 2022

New Districts In AP: ఉగాది నాటికి ఏపీలో కొత్త జిల్లాలు

 New Districts In AP: ఉగాది నాటికి ఏపీలో కొత్త జిల్లాలు

Jan 25, 2022, 02:24 IST

New districts by Ugadi Festival In Andhra Pradesh - Sakshi

నేడో, రేపో ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశం


తెలుగు సంవత్సరాదిలోపు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తికి కసరత్తు


కొత్తగా మరో 13 జిల్లాల ఏర్పాటు


దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాలు 26కు..


ఇక ప్రతీ లోక్‌సభ నియోజకవర్గం ఓ జిల్లా


ఒక్క అరకు పార్లమెంటు నియోజకవర్గమే 2 జిల్లాలుగా..


అత్యంత శాస్త్రీయంగా కొత్త జిల్లాలపై అధ్యయనం


కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లు, ఎస్పీ ఇతర జిల్లా కార్యాలయాలూ ఎక్కడ ఏర్పాటు చేయాలో గుర్తింపు


సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జిల్లాలను అతిత్వరలో ఏర్పాటుచేయనుంది. దీనికి సంబంధించి నేడో రేపో నోటిఫికేషన్‌ను జారీచేయనుంది. ఉగాదిలోపు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తిచేసి కొత్త జిల్లాలను అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం కసరత్తు పూర్తిచేసినట్లు సమాచారం. పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటుచేస్తామని ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన మేనిఫెస్టోలో పొందుపరిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై సుదీర్ఘ కసరత్తు జరిపారు. ఈలోపు 2021 జనాభా గణన ముందుకురావడంతో పునర్వ్యవస్థీకరణ ఆలస్యమైంది. కానీ, కరోనా నేపథ్యంలో జనాభా గణన ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో అది మొదలయ్యేలోపు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 




కొత్తగా మరో 13 జిల్లాలు 

రాష్ట్రంలో 25 లోక్‌సభ నియోజకవర్గాలుండగా.. ఇప్పుడున్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలు ఏర్పడనున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 26కు పెరగనుంది. పార్లమెంటు స్థానాన్ని ఒక నియోజకవర్గంగా చేయాలనుకున్నా అరకు లోక్‌సభ నియోజకవర్గం భౌగోళికంగా సుదీర్ఘంగా విస్తరించి ఉండడంతో దాన్ని రెండు జిల్లాలుగా చేయాలని గతంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కమిటీ ప్రతిపాదనలు తయారుచేసింది. ఆ మేరకు అరకు నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా చేసే అవకాశాలున్నాయి. అంటే కొత్తగా రెండు గిరిజన జిల్లాలు ఏర్పడనున్నాయి. ఇవికాక.. అక్కడక్కడా భౌగోళిక పరిస్థితుల ఆధారంగా చిన్నచిన్న మార్పులు, చేర్పులు ఉండనున్నాయి. మొత్తంగా ప్రతి లోక్‌సభ నియోజకవర్గం ఒక కొత్త జిల్లాగా అవతరించనుంది. అలాగే, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం ఏదో ఒక జిల్లాలో ఉండేలా ప్రతిపాదనలు సిద్ధంచేశారు. 

 

శాస్త్రీయంగా జిల్లాల పునర్వ్యస్థీకరణ ప్రక్రియ 

జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియపై ప్రభుత్వం అత్యంత శాస్త్రీయంగా అధ్యయనం చేసింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన అధ్యయన కమిటీని నియమించింది. వివిధ అంశాలపై పలు శాఖల అధికారులతో నాలుగు సబ్‌ కమిటీలను, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటుచేసింది. ఈ కమిటీల్లోని అధికారులు పలుమార్లు సమావేశమై జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఎలా ఉండాలి? సరిహద్దుల నిర్ధారణకు ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అంశాలేవి? దీనివల్ల ఎదురయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఏ విధానం పాటించాలి? వంటి అనేక అంశాలపై కూలంకుషంగా చర్చించి మార్గదర్శకాలు రూపొందించారు. వీటిపై విస్తృత అధ్యయనం తర్వాత 26 జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధంచేశారు. రవాణా, ఆర్‌ అండ్‌ బీ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ కొత్త జిల్లాల్లో అవసరమైన మౌలిక వసతులు, కలెక్టరేట్లు, ఎస్పీ ఇతర జిల్లా కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటుచేయాలో గుర్తించింది. ఇక కొత్త జిల్లాల ఏర్పాటువల్ల అయ్యే వ్యయాన్ని ఇతర అంశాలపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ నివేదిక ఇచ్చింది. 


తొలుత ప్రాథమిక నోటిఫికేషన్‌ 

ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల పునర్య్వస్థీకరణ చట్టం ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటు కోసం రెవెన్యూ శాఖ ముందుగా  ప్రాథమిక నోటిఫికేషన్‌ను జారీచేస్తుంది. దీనిపై సూచనలు, సలహాల కోసం 30 రోజుల గడువు ఇస్తారు. వచ్చిన సూచనలన్నింటినీ పరిశీలించి అవసరమైతే కొన్ని మార్పులు, చేర్పులు చేస్తారు. ఆ తర్వాత తుది నోటిఫికేషన్‌ ఇస్తారు. తుది నోటిఫికేషన్‌లోనే కొత్త జిల్లాలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో తెలుపుతూ అపాయింటెడ్‌ తేదీని పేర్కొంటారు. ఆ తేదీ నుంచి కొత్త జిల్లాలు ఏర్పడినట్లే. ఈలోపే కొత్తగా ఏర్పడిన జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా స్థాయి అధికారులను నియమిస్తారు. ఈ ప్రక్రియనంతటినీ ఉగాదిలోపు పూర్తిచేసి కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సమాయమత్తమవుతోంది.  

‘జీతాల భారం’పై సర్కారువన్నీ సాకులే...

 ‘జీతాల భారం’పై సర్కారువన్నీ సాకులే...

కేంద్రం నుంచి ఇతోధికంగా లోటు నిధులు

హైదరాబాద్‌ వదులుకున్నందుకు ఏపీకి

రూ. 17,000 కోట్లమేర లోటు గ్రాంట్‌

కేంద్ర పన్నుల్లో 3వేల కోట్లు రాష్ట్రానికి

ఇతరేత్రా కూడా ఢిల్లీ నుంచి సొమ్ములు

ఇవన్నీ కలిపి ఆదాయం 1,40,000 కోట్లు

గత ఏడాది కంటే 23 వేల కోట్లు ఎక్కువ

తెలంగాణ కంటే 2 వేల కోట్లే తక్కువ

అయినా, ఆదాయంపై అడ్డగోలు వాదనలు

2020-21లో రాష్ట్ర ఆదాయం రూ.1,17,000 కోట్లు

2021-22లో ఆదాయ అంచనా రూ. 1,40,000 కోట్లు

(ముగిసిన 8 నెలల కాలానికి ఇప్పటికే 88 వేలకోట్లు ఖజానాకు) 

ఈ ఆదాయంలో అత్యధికం కేంద్ర నుంచి వచ్చిన నిధులే

అనూహ్యంగా ఆదాయంలో 23 వేలకోట్ల పెరుగుదల

హైదరాబాద్‌ వదులుకున్నందుకు లోటుగ్రాంట్‌ 17 వేలకోట్లు

కేంద్రం పన్నుల్లో రాష్ట్రం వాటా కింద మరో రూ.3 వేల కోట్లు


PlayUnmute

Fullscreen

VDO.AI


(అమరావతి - ఆంధ్రజ్యోతి): సొంతంగా సంపద సృష్టించుకుని, ఆదాయం పెంచుకునే చర్యలేవీ లేవు! కానీ... రాష్ట్రానికి రూపాయి రాకలో ఏమాత్రం లోటు లేదు. కేంద్రం నుంచి రకరకాల రూపాల్లో సొమ్ములు ముడుతూనే ఉన్నాయి. కరోనా కారణంగా అదనపు సహాయమూ అందింది. అయినా సరే... కొవిడ్‌తో ఆదాయం పడిపోయిందని, జీతాలు పెంచలేమని సర్కారు చెబుతోంది.  కనీసం తెలంగాణకు తగ్గకుండా వేతన సవరణ చేయాలంటే.. ఆదాయం బాగా ఎక్కువ ఉన్న ఆ రాష్ట్రంతో పోలిక సరికాదంటోంది. ఈ వాదనలో ఏమాత్రం నిజం లేదని అధికారులే చెబుతున్నారు. రెవెన్యూ లోటు పూడ్చడానికి కేంద్రం అందిస్తున్న చేయూతతో అనూహ్యంగా రూ. 23వేల కోట్ల మేర ఏపీ ఆదాయం పెరగనుంది. కేవలం 2వేల కోట్లు మాత్రమే ఆర్జనలో తెలంగాణ కంటే ఏపీ వెనుకబడింది. ఈ మాట సమ్మెకు వెళుతున్న ఉద్యోగులో, ప్రతిపక్షాలో అంటున్నది కాదు. ఒక ఏడాది రాష్ట్ర ఆదాయ గ్రాఫ్‌ పరిశీలించినా అర్థమయ్యేది ఇదే! నిన్న ‘కాగ్‌’ కూడా ఇదే చెప్పగా...జీతాల సమస్య తలెత్తకముందు ప్రభుత్వం కూడా ఔను..ఔను అంటూ ప్రచారం చేసుకోవడం గమనార్హం.  

ఇవిగో గణాంకాలు..ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం అనూహ్యంగా పెరిగింది. ఎవరు కాదన్నా ఇది నూటికి నూరుపాళ్లు నిజం. కరోనా కారణంగా ఆదాయం తగ్గిందని సీఎం జగన్‌, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  రావత్‌ పదే పదే చెప్తున్నప్పటికీ అందులో పస లేనేలేదని వాస్తవిక గణాంకాలు నిరూపిస్తున్నాయి. కాగ్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు ఈ 8 నెలల గణాంకాలు పరిశీలిస్తే నెలకు సగటున రూ.11,500 కోట్లు చొప్పున ఖజానాకు ఆదాయం వచ్చింది. ఈ కాలంలో వచ్చిన ఆదాయం రూ.88,600 కోట్లు. డిసెంబరు నుంచి ఏప్రిల్‌ వరకు  నాలుగు నెలల పాటు కూడా ఇదే స్థాయిలో ఆదాయం లెక్కిస్తే రాష్ట్రం మొత్తం ఆదాయం రూ.1,38,000 కోట్లకు చేరుతుంది. మార్చిలో ప్రభుత్వానికి కేంద్రం నుంచి పన్నుల్లో వాటా కింద అదనంగా దాదాపు రూ.2000 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. దీంతో మొత్తం ఆదాయం రూ.1,40,000 నుంచి రూ.1,41,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా. గత ఆర్థిక సంవత్సరం 2020-21లో వచ్చిన ఆదాయం కంటే ఇది రూ.23,000 కోట్లు ఎక్కువ. 

అంతా కేంద్రం దయే..రాష్ట్రానికి పెరిగిన ఆదాయ అంచనాలో సింహభాగం అంటే రూ.17,257 కోట్లను కేంద్రం రెవెన్యూ లోటు గ్రాంటు కింద ఇస్తోంది. విభజన తర్వాత హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల జరిగే నష్టాన్ని కేంద్రం ఈ గ్రాంటుతో భర్తీ చేస్తోంది. ఇందులో మొదటి 8 నెలల్లో రూ.11,500 కోట్లు ఇచ్చేసింది. మిగిలిన రూ.5757 కోట్లను డిసెంబరు నుంచి మార్చిలో నెలల్లో ఇస్తుంది. హైదరాబాద్‌ ను కోల్పోయినందుకు ఇంత భారీగా గ్రాంటు వస్తున్నప్పటికీ విభజన నష్టాల కారణంగా ముఖ్యంగా హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల రాష్ట్రం ఆదాయం తగ్గుతోందంటూ సీఎస్‌, ఆర్థిక శాఖ అధికారులు పదే పదే అవాస్తవాలు చెప్తున్నారు. ఈ 8 నెలల్లో ఏపీకి వచ్చిన రూ.88,600 కోట్ల ఆదాయంలో కేంద్రం నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో వచ్చినవి రూ.23,500 కోట్లు. ఇందులో  రూ.11,500 కోట్లు రెవెన్యూ లోటు గ్రాంటు నిధులు, రూ.969 కోట్లు స్థానిక సంస్థలకు వచ్చిన గ్రాంట్లు, మిగిలిన రూ.11,031 కోట్లు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం కేంద్రం ఇచ్చిన గ్రాంట్లు ఉన్నాయి. 

తిరిగి మూడేళ్లనాటి స్థితికి..పన్ను ఆదాయానికి వచ్చేసరికి చంద్రబాబు హయంలో తెలంగాణతో పోల్చితే ముందంజలో ఏపీ ఉంది. జగన్‌ వచ్చిన తొలి రెండేళ్లలో బాగా వెనుకబడి ఈ ఏడాది కొంత పురోగతి సాధించింది. చంద్రబాబు దిగిపోయే సంవత్సరం 2018-19లో ఏపీ పన్ను ఆదాయం రూ.62,395 కోట్లు కాగా, ఆ ఏడాది తెలంగాణకు వచ్చిన పన్ను ఆదాయం రూ.59,612 కోట్లు. అలాంటిది ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 8 నెలల్లో ఈ వ్యత్యాసం కొంత మేర తగ్గింది. పన్ను ఆదాయం రూ.62,962 కోట్లు రాగా, తెలంగాణకు రూ.64,857 కోట్లు వచ్చింది. అంటే... ఏపీ కంటే తెలంగాణ పన్ను ఆదాయం కేవలం రూ.1895 కోట్లు మాత్రమే ఎక్కువ. 

కొసమెరుపు  ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయడం వల్ల ప్రభుత్వంపై రూ.10,700 కోట్లమేర అదనపు భారం పడుతుందని సీఎం చెబుతున్నారు. అయితే, ఉద్యోగులు మాత్రం పెరిగే జీతాలు తమకొద్దని, పాతజీతాలే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ సమ్మెకు దిగుతున్నారు. వారు కోరినట్టుగా... పాతజీతాలు అంటే ప్రభుత్వం దృష్టిలో తక్కువ జీతాలు ఇచ్చి ఖజానాకు రూ.10,700 కోట్లు మిగిల్చినట్టే! మరి ప్రభుత్వం ఈ పని ఎందుకు చేయడం లేదనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

Thursday, January 20, 2022

PRC issue

 

శక్తికి మించి చేశాం..

Perni Nani Comments about Government employees  - Sakshi

సమాచార శాఖ మంత్రి పేర్ని నాని  

జీతాలు తగ్గితే ప్రభుత్వంపై జీతాల భారం ఎందుకు పెరిగింది? 

వాస్తవ పరిస్థితులను ఉద్యోగులు గమనించాలి.. ఉద్యోగుల పట్ల సీఎం జగన్‌కు ఎంతో ప్రేమ

అందుకే సీఎం అయిన వారం లోపే 27 శాతం ఐఆర్‌  

కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, హోంగార్డులు, ఎంఎన్‌ఓల జీతాల పెంపు

కోవిడ్‌ వల్ల ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారాయి 

అయినప్పటికీ ప్రభుత్వం ఎన్నో సానుకూల నిర్ణయాలు తీసుకుంది 

ఇవన్నీ గమనించకుండా భ్రమలు కల్పిస్తూ వక్రీకరణలు తగవు 

నేతల పనులతో ఉద్యోగుల భవిష్యత్‌కు ఇబ్బంది కలిగే పరిస్థితి  

ఉద్యోగులు ఎప్పుడైనా చర్చలకు ముందుకు రావొచ్చు  

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేయాలన్న తపనతో ముందుకు వెళుతున్న ప్రభుత్వమిదని, భావోద్వేగ పరిస్థితుల్లో కాకుండా వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని ఉద్యోగులను కోరుతున్నామని సమాచార, పౌర సంబ«ంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ప్రేమ, సానుభూతి ఉంది కాబట్టే అధికారంలోకి వచ్చిన వారంలోనే 27% మధ్యంతర భృతి (ఐఆర్‌) ప్రకటించారని చెప్పారు. ఆనాడు నిజానికి ఉద్యోగులు కూడా అడగలేదన్న విషయం వాస్తవమా కాదా అన్నది నిండు మనసుతో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు శక్తికి మంచి చేశామని, పరిస్థితి అర్థం చేసుకోవాలని కోరారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. కోవిడ్‌ వల్ల ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారాయని తెలిపారు. ఆదాయాలు పూర్తిగా పడిపోయాయని, వ్యయం పెరిగిందని చెప్పారు. అందువల్ల కొంత మంది వక్రీకరణలను గమనించి, సానుభూతితో ఆలోచించాలని కోరుతున్నామన్నారు. ఉద్యోగులు ఎప్పుడైనా చర్చలకు ముందుకు రావొచ్చని, అందుకు ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. నాడు ఉద్యోగులను వేధించిన వారు ఇవాళ నీతులు చెబుతూ మేకతోలు, ఆవుతోలు కప్పుకున్న తోడేళ్లలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వారి ట్రాప్‌లో ఉద్యోగులు పడకూడదని, ఇది ముమ్మాటికీ మీ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రి ఇంకా ఏం చెప్పారంటే..

ఉద్యోగులు మనసు పెట్టి ఆలోచించాలి 
► సీఎంగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉద్యోగులను ప్రభుత్వం కన్నబిడ్డల్లా చూసుకుంటోంది. ఉద్యోగులు ఆశించిన మేరకు వేతన సవరణ చేయలేక పోవడానికి గత్యంతరం లేని ఆర్థిక పరిస్థితులే కారణం. ఉద్యోగుల భావోద్వేగాలను గోతి కాడ నక్కల్లా సొమ్ము చేసుకోవాలని కొందరు చూస్తున్నారు. 
► కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ ఇవ్వడం, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు మేలు చేసే విధంగా ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనుమానాలు నివృత్తి చేస్తాం.

ఆదాయం దారుణంగా తగ్గింది 
► వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యే నాటికి, అంటే 2018 –19లో ప్రభుత్వ సొంత ఆదాయం రూ.62,473 కోట్లు. ఏడాది తర్వాత 2019–20లో ప్రభుత్వ ఆదాయం రూ.60,933 కోట్లు. నిజానికి అప్పుడు రూ.71,844 కోట్లు ఆదాయం రావాల్సి ఉండింది. దాదాపు రూ.2 వేల కోట్ల ఆదాయం తగ్గింది.
► 2020–21లో ప్రభుత్వ ఆదాయం రూ.82,620 కోట్లుగా అంచనా వేస్తే, రూ.60,688 కోట్లు మాత్రమే వచ్చింది. కోవిడ్‌ వల్ల దాదాపు రూ.21 వేల కోట్ల ఆదాయం కోల్పోయాం. కోవిడ్‌ వల్ల ప్రజలను కాపాడుకోవడం కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో వ్యాపారాలు సాగలేదు. దీంతో ఒకవైపు ఆదాయం తగ్గగా, మరో వైపు ఖర్చులు పెరిగాయి. మరో వైపు కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు సక్రమంగా రాలేదు. జీఎస్టీ, ఆదాయం పన్ను పూర్తిగా రాలేదు. 
► 2018–19లో కేంద్రం నుంచి మనకు రూ.32,722 కోట్లు రాగా, 2019–20లో రూ.28,221 కోట్లకు, ఆ తర్వాత ఏడాది 2020–21లో రూ.24,441 కోట్లకు అది తగ్గిపోయింది. ఉద్యోగుల జీతభత్యాల కింద ఇప్పుడు రూ.60,177 కోట్లు చెల్లిస్తుండగా, కొత్త పీఆర్సీ అమలు చేస్తే రూ.70,424 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అయినా ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడడం లేదు.
► పరిస్థితులు ఈ విధంగా ఉన్నప్పుడు ఉద్యోగులు అర్థం చేసుకోవాలి. ఉద్యోగుల కోర్కెలన్నీ తీర్చలేనందుకు సీఎం జగన్‌ కూడా బాధ పడుతున్నారు. సీపీఎస్‌ రద్దు కోసం గతంలో ఉద్యోగులు ఆందోళన చేస్తే, చంద్రబాబు వారిపై కేసులు పెట్టి అరెస్టు చేయించారు.
► ఉద్యోగులపై కేసులను సీఎం జగన్‌ 2020 జూలై 30న జీఓ నెం.731 ద్వారా ఎత్తివేయడం వాస్తవం కాదా? నాడు కేసులు పెట్టిన వారు ఇవాళ ఉద్యోగుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారు. యూపీ, గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వమే ఉంది. అక్కడ హెచ్‌ఆర్‌ఏ ఎలా ఇస్తున్నారు? బీజేపీ నేతలు తెలుసుకొని మాట్లాడాలి.   

ఐఆర్‌పై వక్రీకరణలు తగునా?
► ఐఆర్‌ అంటే మధ్యంతర భృతి. ఒక ఉద్యోగికి ప్రభుత్వం మధ్యంతరంగా ఇచ్చే డబ్బు అని అర్థం. పీఆర్సీ ఇవ్వాలి కాబట్టి, ఆలోగా ఈ డబ్బును తీసుకోండి అని ప్రభుత్వం ఇస్తుంది. తర్వాత ఈ డబ్బు పీఆర్సీ సర్దుబాటుకు లోబడే ఉంటుంది. గతంలో ఎప్పుడు ఐఆర్‌ ఇచ్చినా, తర్వాత ప్రకటించిన పీఆర్సీని పరిగణలోకి తీసుకుని సర్దుబాటు చేసి, జీతాలను ఖరారు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో నైనా ఇదే విధానాన్ని మొదట నుంచి అనుసరిస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా అంతే. 
► ఈ విషయం ఉద్యోగ సంఘాల నాయకులకు తెలిసీ కూడా ఐఆర్‌ను జీతంలో భాగంగా పరిగణిస్తూ వక్రీకరణ చేస్తున్నారు. ఉద్యోగులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఏర్పాటైన వారం రోజుల్లోనే ఎవరూ అడక్కపోయినా 27 శాతం ఐఆర్‌ ప్రకటించారు. 
► 7,55,075 మంది ఉద్యోగులకు ఐఆర్‌ కింద రూ.17,918 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించిన మాట వాస్తవం కాదా? హెచ్‌ఆర్‌ఏ అన్నది జీతభత్యాల్లో ఒక అంశం కాదా? హెచ్‌ఆర్‌ఏ అన్నది మనకు అందుతున్న గ్రాస్‌ శాలరీలో ఒక సబ్‌ కాంపొనెంట్‌. ఇదే హెచ్‌ఆర్‌ఏను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైన రైల్వే, కేంద్రీయ విద్యాలయాల టీచర్లు, ఆల్‌ఇండియా ఆఫీసర్స్, పోస్టల్‌ ఉద్యోగులకూ ఇస్తున్నది వాస్తవం కాదా?

వీరికి జీతాలు పెంచిన మాట వాస్తవం కాదా?
► అంగన్‌వాడీ కార్యకర్తల జీతం 2018కు ముందు ఉన్న రూ.7 వేల నుంచి రూ.11,500కు పెంచలేదా?
► మినీ అంగన్‌వాడీల జీతం రూ.4,500 నుంచి రూ.7 వేలు చేయ లేదా?
► వీఓఏ, సంఘమిత్రలు, యానిమేటర్స్‌ జీతాలు రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచలేదా?
► శానిటరీ వర్కర్ల జీతాలు రూ.8 వేల నుంచి 18 వేలకు పెంచలేదా?
► శానిటరీ సూపర్‌ వైజర్ల జీతాలను రూ.12 వేల నుంచి రూ.18 వేలకు పెంచలేదా?
► ఆశా వర్కర్ల జీతాలు 2018కు ముందు రూ.3వేల –6వేలు ఉంటే, వాటిని రూ.10 వేలకు పెంచ లేదా?
► ఎంఎన్‌ఓ జీతాలను రూ.6,700 నుంచి రూ.17,746కు పెంచలేదా?
► కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల జీతాలను రూ.400 నుంచి రూ.4 వేలకు పెంచ లేదా?
► హోంగార్డుల డైలీ డ్యూటీ అలవెన్స్‌లను రూ.600 నుంచి రూ.710కి పెంచ లేదా?
► కుక్‌ కం హెల్పర్ల జీతాలను రూ.1,000 నుంచి రూ.3 వేలకు పెంచలేదా?
► కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు గతంలో ఏటా జీతాల రూపంలో రూ.1100 కోట్ల చెల్లింపులు ఉంటే, ఇప్పుడు ఏడాదికి చెల్లిస్తున్నది సుమారు రూ.3 వేల కోట్లు.  ఇది మేలు కాదా?
► ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయ లేదా? ఇవన్నీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయాలు కాదా?

ఇవన్నీ నిజాలు కావా?
► ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంపు. దీనివల్ల రెండేళ్ల సర్వీసు పెరగడంతోపాటు 24 నెలల జీతం అదనంగా లభిస్తుంది. ఇది ఉద్యోగులకు లాభం కాదా? 
► నెలకు రూ.1 లక్ష జీతం అందుకునే ఉద్యోగికి రెండేళ్ల కాలంలో రూ.24 లక్షలు జీతం రూపేణా వస్తాయి. దీనివల్ల ఆయా ఉద్యోగుల కుటుంబాలకు మేలు చేసినట్టు కదా?
► రెండేళ్ల అదనపు సర్వీసుతో పాటు ఆ సమయంలో 4 డీఏలు, 2 ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి. ఇది వారికి మేలు చేసినట్టు కాదా? 
► సర్వీసు పెరగడం వల్ల పెన్షన్‌ రూపేణా ప్రభుత్వం నుంచి వాటా పెరుగుతుంది. దీనివల్ల రిటైర్మెంట్‌ తర్వాత వారికి పెన్షన్‌ పెరగదా? 
► దేశంలో ఎన్నిచోట్ల 62 సంవత్సరాల పదవీ విరమణ వయస్సు ఉంది?
► సర్వీసు కాలానికి గ్రాట్యుటీ కింద ఇదివరకు ప్రభుత్వం ఇచ్చేది రూ.12 లక్షలు. ఇప్పుడు దాన్ని ఈ ప్రభుత్వం రూ.16 లక్షలకు పెంచడం మేలు చేసే నిర్ణయం కాదా? 
► ఏ ఉద్యోగి అడగకపోయినా ఇళ్లు లేని ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తున్నది మేలు చేయడం కాదా? ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్స్‌లో 10% స్థలాలను ప్రభుత్వ ఉద్యోగులకు రిజర్వ్‌ చేసిన మాట వాస్తవం కాదా? ఈ స్థలాలను 20 శాతం రిబేటుతో ఇవ్వాలన్నది మేలు చేసేది కాదా? దీనివల్ల నేరుగా రూ.10 లక్షల వరకు లబ్ధి కలగడం లభించదా?
► కోవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి జూన్‌ 30లోగా నియామకాలు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేయడం వాస్తవం కాదా?
► ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవల్లో భాగంగా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1.28 లక్షల మందిని శాశ్వత ఉద్యోగులుగా నియమించింది. ఈ ఉద్యోగులకు మేలు చేసేలా రెండున్నరేళ్లకే రెగ్యులరైజ్‌ చేస్తోంది. 2022 జూన్‌ 30తో వీరి ప్రొబేషన్‌ ముగుస్తోంది. జూలై 1 నుంచి రెగ్యులర్‌ స్కేలు అమల్లోకి వస్తోంది. దీనివల్ల వారికి గణనీయంగా జీతాలు పెరుగుతున్న మాట నిజం కాదా?
► కాంట్రాక్టు ఉద్యోగులకూ మినిమం టైం స్కేలు వర్తింపు చేసిన ఏకైక ప్రభుత్వం ఇది కాదా? ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను దళారీల బారి నుంచి బయట పడేయలేదా? వారికి కత్తిరింపులు లేకుండా, లంచాలకు తావివ్వకుండా పూర్తి జీతాలు అందించడం లేదా? వీరందరికీ ఈపీఎఫ్, ఈఎస్‌ఐ లాంటి సౌకర్యాలను కల్పించడం వాస్తవం కాదా? వీరికి కూడా 23 శాతం ఫిట్‌మెంట్‌ వర్తింప చేయడం మేలు చేసే నిర్ణయం కాదా? ఇలాంటి పనులు గత ప్రభుత్వాలు ఎప్పుడైనా చేశాయా?
► కేంద్ర ప్రభుత్వ కమిటీ చేసిన సిఫార్సు 14.29 శాతమే. కాని ఈ ప్రభుత్వం ఇంతటి పరిస్థితుల్లో కూడా 23 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిన మాట నిజం కాదా? ఐఆర్‌ రూపంలో రూ.17,918 కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? పీఆర్సీ వల్ల ఏడాదికి రూ.10,247 కోట్ల అదనపు భారం ప్రభుత్వ ఖజానాపై పడుతున్న విషయం వాస్తవం కాదా?
► 2018–19లో రాష్ట్ర సొంత ఆదాయం రూ.62,503 కోట్లు అయితే, ఉద్యోగులకు చెల్లించిన జీతాలు రూ.52,513 కోట్లు. అంటే 84 శాతం జీతాల రూపంలో చెల్లించారనే విషయాన్ని గమనించాలి.  
► 2020–21లో రాష్ట్ర సొంత ఆదాయం రూ.60,688 కోట్లు అయితే, ఉద్యోగులకు చెల్లించిన జీతాలు రూ.67,340 కోట్లు. 111% జీతాల రూపంలో చెల్లించడం నిజం కాదా?

జీతాలు ఎలా తగ్గుతాయి?
► మొత్తంగా గ్రాస్‌ శాలరీ పెరిగిందా? లేదా? అన్నది చూసుకోవాలి.  
► ఉద్యోగులకు ఇప్పటి వరకు జీతాల రూపంలో ఏటా చెల్లింపులు రూ.60,177 కోట్లు అయితే, కొత్త పీఆర్సీ ద్వారా ఇకపై రూ.70,424 కోట్లు  చెల్లింపులు ఉంటాయి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఏటా భారం రూ.10,247 కోట్లు పడుతుంది. ఈ పరిస్థితిలో జీతాలు తగ్గుతాయన్న వాదనకు ఆస్కారం ఎక్కడిది?
► ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాల నాయకులు వాస్తవాలు చెప్పి ఉద్యోగులను మంచి దిశగా జాగృతం చేయాల్సింది పోయి వక్రీకరణలు చేయడం సబబేనా? ఉద్యోగులను పెడదోవ పట్టించడం న్యాయమేనా?
► ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు లాంటి వారి చేతిలో నాయకులు కీలు బొమ్మలు కావడం తగునా? వారికి అమ్ముడుపోయి వక్రీకరణలు చేయడం సరైనదేనా? ప్రభుత్వం ఇంత మేలు చేస్తున్నా, మేలు జరగనట్టుగా భ్రమలు కల్పించి వక్రీకరణలతో ఉద్యోగులను రెచ్చగొట్టడం కరెక్టేనా?
► ఇవాళ ఉద్యోగ సంఘాల నాయకులు చేస్తున్న పనులు ఉద్యోగుల భవిష్యత్తుకు భంగకరంగా మారదా? భవిష్యత్తులో ఏ ప్రభుత్వమైనా ఐఆర్‌ ఇవ్వడానికి ముందుకు వస్తుందా? ఉద్యోగులకు సానుకూలంగా ఉండే నిర్ణయాలు తీసుకునేలా ఉండాల్సిన పరిస్థితులను ధ్వంసం చేస్తే, దెబ్బతినేది ఉద్యోగులు కాదా? ఈ విషయాలను అందరూ గమనించాలి.