Friday, January 24, 2020

బిల్లు సెలెక్ట్‌ కమిటీకి వెళ్లలేదు: మండలి చైర్మన్‌

బిల్లు సెలెక్ట్‌ కమిటీకి వెళ్లలేదు: మండలి చైర్మన్‌
Jan 24, 2020, 15:49 IST
Council Chairman Sharif Gives Clarity On Administrative Decentralisation Bill - Sakshi
సాక్షి, అమరావతి : అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై టీడీపీ చేస్తున్న ప్రచారం తప్పని తేలిపోయింది. ఏపీ శాసన మండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై స్పష్టతనిచ్చారు. బిల్లు సెలెక్ట్‌ కమిటీకి వెళ్లలేదని, సాంకేతిక కారణాలతో అది మండలిలోనే ఆగిపోయిందని అన్నారు. ఆ ప్రక్రియ పూర్తయితేగానీ వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్‌ కమిటీకి వెళ్లదని చెప్పారు. బిల్లు సెలెక్ట్‌ కమిటీకి వెళ్లిందన్న టీడీపీ ప్రచారం అవాస్తవమని వెల్లడించారు. మండలి చైర్మన్‌ ఇచ్చిన స్పష్టతతో అసలు నిజం బయటికొచ్చిందని రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కోరుకుంటున్న ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఈ బిల్లుపై మండలి ఏ విధంగా ముందుకు వెళ్తుందనే సందిగ్దత నెలకొంది.

Tuesday, December 31, 2019

రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదు

రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదు
Dec 31, 2019, 03:26 IST
Central Govt does not interfere on capital says GVL Narasimha Rao - Sakshi
బీజేపీ అధికార ప్రతినిధిగా అధికారికంగా చెబుతున్నా

రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ స్పష్టీకరణ

ఇతరులేం మాట్లాడినా అది వారి వ్యక్తిగతమే

కేంద్రం జోక్యం చేసుకోవాలంటే కూడా నిబంధనలు అంగీకరించవు

అమరావతిలోనే రాజధాని పెట్టండని నాడు కేంద్రం చెప్పలేదు.. నేడు తరలించొద్దనీ చెప్పదు

రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు. నేను ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి.. కేంద్ర ప్రభుత్వ ఆలోచన మేరకే చెబుతున్నా. జాతీయ అధికార ప్రతినిధిగా ఐదేళ్లలో నేను చెప్పిందేదీ మా పార్టీ కాదనలేదు.   – జీవీఎల్‌ నరసింహారావు


సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉండదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు స్పష్టం చేశారు. ఇది పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా అధికారికంగా చెప్పే మాట అని పేర్కొన్నారు. ఇతర ఎంపీలు, నేతల ప్రకటనలు వారి వ్యక్తిగతం అని స్పష్టీకరించారు. దక్షిణాదిలో ఉండే ఐదు రాష్ట్రాలలో తానొక్కడినే పార్టీ అధికార ప్రతినిధినని, తాను చెప్పే విషయాలే అధికారికం అని అన్నారు. విజయవాడలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఇది (రాజధాని తరలింపు అంశం) కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదు. కేంద్రం జోక్యం చేసుకొని ఏదో చేయాలనే ఆలోచన ఉంటే.. అది మన వ్యవస్థకు లోబడి చేయడానికి విరుద్ధమైనది.  దీనికే కట్టుబడి ఉన్నాం. 

నేను  అధికారికంగా ఈ విషయం చెబుతున్నా. మీరు బాండ్‌ రాసివ్వమంటే ఆ అవసరం మాకు లేదు’ అని జీవీఎల్‌ అన్నారు. తమ పార్టీలో పార్లమెంట్‌లో సభ్యులు కాని వారు చాలా మంది ఈ విషయంలో ఏం మాట్లాడినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమేనన్నారు. రాజధాని తరలింపు గురించి రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం దృష్టికి తీసుకొస్తే అప్పుడు ఏదైనా సూచన చేయొచ్చేమో గానీ, కేంద్రం తనంతట తాను జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు. 

రాజధాని అమరావతిలోనే పెట్టండని నాడు కేంద్రం చెప్పిందా?
పార్టీలో నేతలు ఒకే మాటపై లేరన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. టీడీపీలోనూ ఈ అంశంపై ఒక మాట మీద లేరు కదా అని ఆయన ప్రశ్నించారు. గంటా శ్రీనివాసరావు మరో రకంగా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. అన్నదమ్ములు (చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లు) ఒక మాట మీద లేరన్నారు. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఒక స్పష్టమైన ప్రతిపాదనను వెల్లడించలేదని చెప్పారు. ‘వ్యవస్థలో తనకున్న అధికారాలకు లోబడే కేంద్రం పని చేస్తుంది. రాజధాని అమరావతిలోనే పెట్టండని అప్పుడు కేంద్రం చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి మార్చండని, మార్చ వద్దని చెప్పదు.

ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఎక్కడా చెప్పలేదు. రాజధాని తరలింపు జరిగితే రైతులకు న్యాయం జరగాలని ఒక పార్టీ నేతగా, వ్యక్తిగా చెబుతున్నానన్నారు. రైతులకు న్యాయం చేసే అంశం, రాజధాని తరలించకుండా కేంద్రం జోక్యం చేసుకునే అంశం.. రెండూ వేర్వేరు అని చెప్పారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, ఎన్‌పీఆర్‌ ప్రక్రియలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

Monday, December 30, 2019

నేడు కన్నా లక్ష్మీ నారాయణ మౌన దీక్ష..

నేడు కన్నా లక్ష్మీ నారాయణ మౌన దీక్ష...
ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన చోట కన్నా దీక్ష చేపట్టనున్నారు.


నేడు కన్నా లక్ష్మీ నారాయణ మౌన దీక్ష...సీఎం జగన్,కన్నా లక్ష్మీనారాయణ(File Photos)
NEWS18 TELUGU
LAST UPDATED: DECEMBER 27, 2019, 5:26 AM IST
SHARE THIS:



ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ నేడు మౌన దీక్షకు దిగనున్నారు. ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన చోట కన్నా దీక్ష చేపట్టనున్నారు. ఆయనతో పాటు బీజేపీ శ్రేణులు కూడా దీక్షలో పాల్గొనున్నారు. నేటి ఉదయం 8.30గంటలకు దీక్ష ప్రారంభం కానుంది.

కాగా, ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కన్నా డిమాండ్ చేస్తున్నారు. రాజధానిని తరలించడమంటే జగన్‌ అవగాహనా రాహిత్యాన్ని బయటపెట్టుకోవడమేనని కన్నా ఇటీవల విమర్శించారు. జగన్‌కు అనుభవ రాహిత్యంతో పాటు అవగాహన రాహిత్యం ఉందన్నారు. సాక్షాత్తూ ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన రాజధానిని మరో చోటుకు తరలించడం అవివేకం అన్నారు. ఇది కేవలం అమరావతి రైతుల సమస్య కాదని, రాష్ట్ర సమస్య అని స్పష్టం చేశారు. జగన్ తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం రాష్ట్రంలో అభివృద్ది కుంటుపడేలా చేస్తోందని ఆరోపించారు.

అమరావతి అంగుళం కదిలినా ఊరుకోం!- సుజన చౌదరి

అమరావతి  అంగుళం కదిలినా ఊరుకోం!- సుజన చౌదరి
30-12-2019 04:25:03

 కేంద్రంతో మాట్లాడే చెప్తున్నా
 రాజధాని రాష్ట్ర నిర్ణయమే..
 కానీ ఇప్పుడు మార్పు కుదరదు
 అమరావతికి రూ.8వేల కోట్లు చాలు
 బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వెల్లడి
అమరావతి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ‘రాజధాని అమరావతి ఒక్క అంగుళం కదిలినా ప్రజలు, బీజేపీ చూస్తూ ఊరుకోవు. కేంద్రంతో చర్చించే ఈ మాట చెప్తున్నా. కేంద్రం అధికారాలేంటో అవసరమై న సందర్భంలో చెప్తాం’ అని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఉద్ఘాటించారు. అమరావతి తరలింపు విషయంలో కేంద్ర ప్రభుత్వ అంగీకారం ఉందన్న వైసీపీ వర్గాల మాటలకు అర్థం లేదన్నారు. ఇలాంటి మూ డు రాజధానుల పనికి ఎవరైనా మద్దతిస్తారా? అని ప్రశ్నించారు. ఇదేదో రెండు జిల్లాల ప్రజలు, రైతుల సమస్య కాదని, మొత్తం 13 జిల్లాల రైతుల సమస్య అని పేర్కొన్నారు. రాజధాని రైతులకు మద్దతు తెలిపేందుకు ఆదివారం రాజధాని ప్రాంతంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. మొదట మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో పూజలు నిర్వహించారు.

ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM


అ నంతరం తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెంలో ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి ప్రసంగించారు. అమరావతి నిర్మాణానికి ఇప్పటికే వేలకోట్లు ఖర్చుచేశారన్నారు. అమరావతిలో రాజధా ని పెట్టాలని ఆరోజు రైతులు అడగలేదని, నాటి ప్ర భుత్వం, ప్రతిపక్షం, ఎమ్మెల్యేలంతా కలిసి నిర్ణయిం చి పెట్టారన్నారు. ఆనాడు అమరావతికి మద్దతుగా మాట్లాడిన జగన్మోహన్‌రెడ్డే.. రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాలు కావాలన్నారని గుర్తు చేశారు. ‘ఆ రోజు ప్రభుత్వం వద్ద డబ్బులేక భూసేకరణ పద్ధతిలో కాకుండా.. భూసమీకరణ విధానంలో వెళ్లింది. ఇప్పుడు రాజధాని మారుస్తాం అంటే రైతులకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి. దాదాపు 34వేల ఎకరాలకు అది సుమారు రూ.1.5లక్షల కోట్లు అవుతుంది’ అని సుజనా అన్నారు. రేపు విశాఖపట్నం రైతు కూడా సుఖంగా ఉంటారని చెప్పలేమన్నారు.

రాష్ట్ర నిర్ణయమే అయినా..
రాజధాని ఎక్కడుండాలో నిర్ణయించుకునేది రాష్ట్ర ప్రభుత్వమే అయినా కేంద్రానికీ కొన్ని హక్కులుంటాయని సుజనాచౌదరి పేర్కొన్నారు. ‘రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 94(3) ప్రకారం రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం అందిస్తామని కేంద్రం పేర్కొంది. ఎన్డీయే హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటైతే వాటి రాజధానుల నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయలేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక పరిస్థితుల్లో విడిపోవాల్సి రావడంతో రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులిస్తామన్నారు. ఆనాడు అసెంబ్లీలో ఏకగ్రీవంగా జగన్‌, వైసీసీకి చెందిన ఎమ్మెల్యేలతో సహా అంతా అమరావతి రాజధాని అని తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ఒక్క ఎమ్మెల్యే కూడా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. అలా పంపాకే కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చింది. ఇక్కడ రాజధాని ఉందన్న కారణంతోనే విజయవాడ-గుంటూరు ప్రాంతాన్ని స్మార్ట్‌సిటీ పథకం కింద ఎంపిక చేసి వెయ్యికోట్లు ఇచ్చింది.

అదేవిధంగా 130 కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతిలో భూములు కొన్నాయి. రూ.940 కోట్లకు 1293 ఎకరాలను కొనుగోలు చేయగా... అందులో రూ.540కోట్లను ఆయా సంస్థలు ఇప్పటికే చెల్లించాయి. హ్యాపీనెస్ట్‌ పేరుతో ప్రజలకు ఫ్లాట్ల ప్రాజెక్టులో రూ.72 కోట్లు కొనుగోలుదారులు చెల్లించారు. 350 మంది అఖిలభారత సర్వీసు అధికారులు తమకిచ్చిన స్థలాలకు రూ.87.5 కోట్లు చెల్లించారు. అన్నింటికీ మించి రైతులు త్యాగాలు చేశారు. దాదాపుగా పూర్తికావస్తున్న రాజధానిని ఇప్పుడు తరలిస్తామనేందుకు వీలులేదు. అలా తరలిస్తే అది దేశ వృద్ధిరేటుపైనా ప్రభావం చూపిస్తుంది. కేంద్రానికీ కొన్ని హక్కులుంటాయి. అవేంటో అవసరమైన సందర్భంలో చెప్తాం’ అని సుజనా స్పష్టం చేశారు.

అదనపు ఖర్చెందుకు?
‘అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితుల్లో రాష్ట్రం లేదని మంత్రులు చెప్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబు కూడా రాజధాని నిర్మాణానికి రూ.4లక్షల కోట్లు కావాలన్నారు. అంత డబ్బు అవసరం లేదు. రాజధాని నిర్మాణానికి మరో రూ.8వేల కోట్లు సరిపోతాయి. ఇంకా అదనంగా కావాలంటే డబ్బులున్నప్పుడే చిన్నగా నిర్మించుకోవచ్చు. డబ్బుల్లేవని అంటున్న ప్రభుత్వం అసలు తరలింపు పేరుతో అదనపు ఖర్చు పెట్టడమెందుకు? ఇక్కడ సచివాల యం ఉంది. హైకోర్టు నడుస్తోంది. ఒకవేళ హైకోర్టును కర్నూలుకు తీసుకెళ్లినా ఇబ్బంది లేదు. రాజ్‌భవన్‌ కూడా ఏర్పాటుచేశారు. గవర్నర్‌ ఏమైనా ఆ రాజ్‌భవన్‌ సరిపోవడం లేదన్నారా?’ అని సుజనాచౌదరి ప్రశ్నించారు. పొరపాట్లు జరుగుతుంటాయని, ఇప్పటికైనా వాటిని సరిదిద్దుకుని ముందుకెళ్లాలని సూచించారు.

విజయసాయి స్థాయిలేని వ్యక్తి
ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ విషయంలో తనపైనా ఆరోపణలు చేశారని, సీబీసీఐడీ అధికారులు తన గ్రామంలో కూడా తిరిగి విచారించారని సుజనాచౌదరి చెప్పారు. కానీ ఎక్కడా ఒక్క తప్పు కూడా పట్టుకోలేకపోయారన్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరిట అసెంబ్లీలో కూడా పలువురి పేర్లు చదివిన ముఖ్యమంత్రి జగన్‌... తన పేరు చదవలేకపోయారని, ఏమైనా భయమేమో అని సుజన వ్యాఖ్యానించారు. ఇప్పుడు కొత్తగా సీబీఐ విచారణ అంటున్నారని, అంటే రాష్ట్రంలో పనికిరాని సీబీసీఐడీ వ్యవస్థ ఉందని అర్థమా? అని ప్రశ్నించారు. విజయసాయిరె డ్డి మీపై సీబీఐ విచారణ చేయాలని రాష్ట్రపతికి ఫి ర్యాదు చేశారు కదా? అని ప్రశ్నించగా... ‘విజయసాయిరెడ్డి స్థాయి లేని వ్యక్తి. అనుకోని పరిస్థితుల్లో నా యకుడైన మనిషి. సీబీఐ విచారణ చేయాలని గతంలోనే స్వాగతించిన వ్యక్తిని నేను. వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కేసు వేస్తే... అంతా స్టేకు వె ళ్లారు. నేను స్టేకు కూడా వెళ్లకుండా స్వాగతించా. సాక్షి పత్రికలోనే కోటి రూపాయల ప్రకటన ఇచ్చి... ఎవరైనా వచ్చి విచారించుకోవచ్చని చెప్పా’ అని గుర్తు చేశారు.

బుగ్గనపై పరువునష్టం దావా: రావెల
సుజనాచౌదరిపై విమర్శలు చేసే స్థాయి విజయసాయిరెడ్డికి లేదని రావెల కిషోర్‌బాబు పేర్కొన్నా రు. సుజనా కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు అరుణ్‌జైట్లీ తో మాట్లాడి పలు నిధులను రాష్ట్రానికి తెచ్చారని, సాయిరెడ్డి రాష్ర్టానికి తెచ్చింది ఏముందని ప్రశ్నించారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేసినట్లు మంత్రి బుగ్గన తనపై ఆరోపణలు చేశారని, మైత్రి సంస్థ పేరుతో తాను 40.48 ఎకరాలు కొన్నానని ఆరోపించారన్నారు. వీటికి ఆధారాలు బయటపెట్టాలని, లేకుంటే రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేస్తానని రావెల అన్నారు.
తలదన్నేవాడు ఢిల్లీలో ఉన్నాడు!
‘రాజధాని రైతులారా ఇది మీ ఒక్కరి సమస్య కాదు. ఇది రాష్ట్ర సమస్య. ఆధైర్య పడొద్దు. తాడిని తన్నేవాడు ఇక్కడ ఉంటే... తలను తన్నేవాడు ఢిల్లీలో ఉన్నాడు. చూస్తూ ఊరుకోం!’’... ఇవీ రాజధాని రైతులను ఉద్దేశించి సుజనాచౌదరి చెప్పిన ఓదార్పు మాటలు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, ఒక ప్రభుత్వం రైతులకు హామీలు ఇచ్చి మరో ప్రభుత్వం కుదరదంటే కోర్టులు చూస్తూ కూర్చోవన్నారు. సీఆర్‌డీఏతో రైతులు చేసుకున్న ఒప్పందంలో నిబంధనలన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేశామన్నారు. దాని ప్రకారం అభివృద్ధి చేస్తామంటేనే రైతులు భూములు ఇచ్చేందుకు సంతకాలు చేశారన్నారు. ప్రభుత్వం వెనక్కు తగ్గితే రైతులు లక్ష కోట్లు అడిగే హక్కు ఉందన్నారు. పారిశ్రామికవేత్తలు వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకొని నిర్మాణాలను ప్రారంభించారన్నారు. ఇప్పుడు వారు కోర్టుకు వెళితే భారీగా పరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇదే జరిగితే ఏపీ ముగినిపోతుందని సుజన వ్యాఖ్యానించారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు, అక్రమాలకు వైసీపీ వారికి అవకాశం లేదనే విశాఖ మీద పడ్డారని ఆయన ఆరోపించారు.

ఏపీ రాజధానిని మూడు ముక్కలు చేసే అధికారం జగన్‌కులేదు

జగన్‌కు ఆ అధికారం లేదు
31-12-2019 04:14:30

అమరావతిని ముక్కలు చేస్తారా?.. రాజధానిపై మళ్లీ ప్రజాతీర్పు కోరాలి
ఆ భూములను సెజ్‌లకు ఇచ్చే కుట్ర
విశాఖలో ప్రభుత్వ భూములకు బినామీలుగా రాజకీయ నేతలు
సీపీఐ నారాయణ
హైదరాబాద్‌, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ‘ఏపీ రాజధానిని మూడు ముక్కలు చేసే అధికారం సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ఏ మాత్రమూ లేదు. ఏపీ రాజధానిగా అమరావతిని మొదట జగన్‌ కూడా అంగీకరించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైసీపీ మేనిఫెస్టోలో రాజధాని మార్పు గురించి ఎక్కడా పేర్కొనలేదు. రాజధానిని మార్చాలంటే జగన్‌ మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సిందే’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.

ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM


సోమవారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతిలో రైతుల నుంచి సేకరించిన భూములు తిరిగి ఇచ్చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉద్యోగులకు క్వార్టర్స్‌ నిర్మించారని, రోడ్ల నిర్మాణం కూడా జరిగిందని, కాలువలు, చెరువులను పూడ్చేశారని తెలిపారు. ఇప్పుడు రైతులకు భూములు తిరిగి ఇచ్చినా, వ్యవసాయం చేసుకోవడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. రాజధానిని మూడు ముక్కలు చేస్తే.. మిగిలిన భూమి వ్యవసాయానికి పనికి రాకుండా పోతుందన్నారు. వాటిని ఎలాగో రైతులు తీసుకోరని, దీంతో ఆ భూములను సెజ్‌లకు ఇవ్వవచ్చని జగన్‌ యోచిస్తున్నారని నారాయణ ఆరోపించారు.

ఏపీ సీఎం జగన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ మంచి మిత్రులని, అందుకే ఒకరినొకరు మెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి మూడు రాజధానులు అని జగన్‌ ప్రకటన చేయగానే హైదరాబాద్‌లోని భూములకు రేట్లు పెరిగాయని, దీంతో జగన్‌కు కేసీఆర్‌ ధన్యవాదాలు చెబుతున్నారని విమర్శించారు. అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కేపిటల్‌గా మారిందని, అక్కడ ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టనక్కర్లేదని నారాయణ అన్నారు. అమరావతిని కొనసాగించేదాకా కమ్యూనిస్టు పార్టీలు పోరాడుతాయన్నారు. భూ దొంగలను కాపాడే విషయంలో జగన్‌, చంద్రబాబు ఇద్దరూ ఒకటే అని నారాయణ విమర్శించారు. విశాఖలో ప్రభుత్వ భూములకు బినామీలుగా రాజకీయ నాయకులు మారిపోయారని, వారిలో వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్‌ నేతలూ ఉన్నారని ఆరోపించారు. ఆ వివరాలను ఆయన వెల్లడించారు.

అన్యాక్రాంతమైన భూములివే..
మధురవాడలోని సర్వే నం.331/5లోని 10 ఎకరాల భూమిని మాజీ సైనికుల పేరుతో స్థానిక నాయకుల ఆక్రమణ.
కొమ్మాది సర్వే నం.28/2లో స్వాతంత్య్ర సమరయోధుని పేరుతో 10 ఎకరాల భూమి అన్యాక్రాంతం.
కొమ్మాది సర్వే నం.161/1లో 10 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా.
కొమ్మాది సర్వే నం.7లో 10 ఎకరాల భూమిని మాజీ సైనికుల పేరుతో ఆక్రమణ.
కొమ్మాది సర్వే నం.154/3లో 5 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం.
కొమ్మాది సర్వే నం.7లో 50 ఎకరాలు మైటాస్‌ సంస్థకు కేటాయించారు. ఆ సంస్థ మాయమైనా భూమిని తిరిగి స్వాధీనం చేసుకోలేదు.
మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తికి పరదేశిపాలెం సర్వే నం.66లో 35 ఎకరాలు భూదాన భూమి.
పెందగంట్యాడ సర్వే నం.274లో 60 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా.
గాజువాక సర్వే నం.87లో 1000 చదరపు గజాల భూమి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం కుటుంబ సభ్యుల ఆక్రమణ.
పెందుర్తి మండలం ముదపాక భూముల విషయంలో సిట్‌ నిర్ధారణ బయటపెట్టాలి.
పరదేశిపాలెం సర్వే నం.101/1లో నాలుగు ఎకరాల 89 సెంట్ల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి.

ఎన్నార్సీకి టీడీపీ వ్యతిరేకం: చంద్రబాబు

ఎన్నార్సీకి టీడీపీ వ్యతిరేకం: చంద్రబాబు
31-12-2019 04:44:19

అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ప్రజల్లో అభద్రతా భావం కలిగించిన ఎన్‌పీఆర్‌, ఎన్సార్సీలకు టీడీపీ వ్యతిరేకమని చంద్రబాబు ప్రకటించారు. సోమవారం ఎన్టీఆర్‌ భవన్‌లో 13 జిల్లాల మైనారిటీ నేతలతో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ లౌకిక విలువలకు కట్టుబడి ఉన్న పార్టీ అన్నారు. కేంద్రం కొత్తగా తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముస్లింలకు తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ‘లోక్‌సభలో బిల్లుకు మద్దతు ఇవ్వాలని తమ పార్టీకి చెందిన 22 మంది ఎంపీలకు జగన్‌ విప్‌ జారీ చేయించారు. మద్దతుగా ఓటు వేయించారు. రాష్ట్రంలో ఆఘమేఘాల మీద గెజిట్‌తోపాటు జీవో కూడా జారీ చేసి ఇప్పుడు ఎన్నార్సీకి వ్యతిరేకమని ప్రకటనలు చేస్తూ మైనారిటీలను మోసం చేస్తున్నారు’ అన్నారు. మైనారిటీల పట్ల చిత్తశుద్ధి టీడీపీకే ఉందని మైనారిటీ నేత హిదాయత్‌ పేర్కొన్నారు.

14వ రోజు కొనసాగుతున్న రైతుల దీక్షలు


14వ రోజు కొనసాగుతున్న రైతుల దీక్షలు
అమరావతి: రాజధానిగా అమరాతినే కొనసాగించాలనే ప్రధాన డిమాండ్‌తో రైతులు చేపట్టిన నిరసన దీక్షలు మంగళవారానికి 14వ రోజుకు చేరాయి. రాజధాని అమరావతి గ్రామాల్లో రైతులు, మహిళలు, న్యాయవాదులు, విద్యార్థులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు నిరసన దీక్షలకు మద్దతు తెలిపారు. మూడు రాజధానుల ప్రతిపాదనను, జీఎన్‌రావు కమిటీ నివేదికను రద్దు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. రైతుల దీక్షలకు మద్దతు తెలియజేసేందుకు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అమరావతిలో పర్యటించనున్నారు.

మందడంలో మహాధర్నాకు అనుమతి నిరాకరణ
 మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రైతులు మందడంలో మహాధర్నా సిద్ధమయ్యారు. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి సచివాలయానికి వస్తున్న నేపథ్యంలో రైతుల దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

రోడ్డుపై ఎవరూ రాకపోకలు సాగించకుండ బారికేడ్లు ఏర్పాటు చేశారు. సచివాలయానికి వెళ్లె మార్గంలో తనిఖీలు చేసి గుర్తింపు కార్డులు ఉన్నవారినే పోలీసులు అనుమతిస్తున్నారు. సీఎం జగన్ కాన్వాయ్ వచ్చే మార్గంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. వెలగపూడిలో రైతుల రిలే నిరహార దీక్ష మంగళవారం ఉదయం ప్రారంభమైంది. రైతులు జాతీయ జెండాలతో వచ్చి దీక్షలో పాల్గొన్నారు.

జైలు నుంచి విడుదలైన రాజధాని రైతులు
జైలు నుంచి విడుదలైన రాజధాని రైతులు
గుంటూరు: రాజధాని ఆందోళనల్లో భాగంగా మీడియా ప్రతినిధులపై దాడి చేశారనే ఆరోపణలపై అరెస్టయిన ఆరుగురు రైతులు జైలు నుంచి విడుదలయ్యారు. ఆదివారం ఉదయం నాగరాజు, నరేశ్‌, సురేంద్ర, శ్రీనివాసరావు, నరసింహస్వామి, భుక్యా లోక్‌నాయక్‌లను పోలీసులు అరెస్ట్‌ చేసి తెనాలి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. ఈ ఉదయం ఆరుగురు రైతులు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం రూ.10వేల పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేసింది. తెదేపా నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, శ్రావణ్‌కుమార్‌, రామకృష్ణ తదితరులు జైలు నుంచి విడుదలైన రైతులకు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాజధాని కోసం పోరాడుతున్న తమను అన్యాయంగా అరెస్ట్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అండగా నిలిచిన ఐకాస నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. మీడియా ముసుగులో కొందరు తమను కించపరిచారని.. అందుకే ఇలాంటి ఘటన జరిగిందన్నారు. మీడియాకు తాము వ్యతిరేకం కాదన్నారు. అమరావతి కోసం పోరాటం ఆగదని.. ప్రాణాలు అర్పించైనా రాజధానిని సాధిస్తామని స్పష్టం చేశారు.

రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదు
Dec 31, 2019, 03:26 IST
Central Govt does not interfere on capital says GVL Narasimha Rao - Sakshi
బీజేపీ అధికార ప్రతినిధిగా అధికారికంగా చెబుతున్నా

రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ స్పష్టీకరణ

ఇతరులేం మాట్లాడినా అది వారి వ్యక్తిగతమే

కేంద్రం జోక్యం చేసుకోవాలంటే కూడా నిబంధనలు అంగీకరించవు

అమరావతిలోనే రాజధాని పెట్టండని నాడు కేంద్రం చెప్పలేదు.. నేడు తరలించొద్దనీ చెప్పదు

రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు. నేను ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి.. కేంద్ర ప్రభుత్వ ఆలోచన మేరకే చెబుతున్నా. జాతీయ అధికార ప్రతినిధిగా ఐదేళ్లలో నేను చెప్పిందేదీ మా పార్టీ కాదనలేదు.   – జీవీఎల్‌ నరసింహారావు


సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉండదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు స్పష్టం చేశారు. ఇది పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా అధికారికంగా చెప్పే మాట అని పేర్కొన్నారు. ఇతర ఎంపీలు, నేతల ప్రకటనలు వారి వ్యక్తిగతం అని స్పష్టీకరించారు. దక్షిణాదిలో ఉండే ఐదు రాష్ట్రాలలో తానొక్కడినే పార్టీ అధికార ప్రతినిధినని, తాను చెప్పే విషయాలే అధికారికం అని అన్నారు. విజయవాడలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఇది (రాజధాని తరలింపు అంశం) కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదు. కేంద్రం జోక్యం చేసుకొని ఏదో చేయాలనే ఆలోచన ఉంటే.. అది మన వ్యవస్థకు లోబడి చేయడానికి విరుద్ధమైనది.  దీనికే కట్టుబడి ఉన్నాం. 

నేను  అధికారికంగా ఈ విషయం చెబుతున్నా. మీరు బాండ్‌ రాసివ్వమంటే ఆ అవసరం మాకు లేదు’ అని జీవీఎల్‌ అన్నారు. తమ పార్టీలో పార్లమెంట్‌లో సభ్యులు కాని వారు చాలా మంది ఈ విషయంలో ఏం మాట్లాడినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమేనన్నారు. రాజధాని తరలింపు గురించి రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం దృష్టికి తీసుకొస్తే అప్పుడు ఏదైనా సూచన చేయొచ్చేమో గానీ, కేంద్రం తనంతట తాను జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు. 

రాజధాని అమరావతిలోనే పెట్టండని నాడు కేంద్రం చెప్పిందా?
పార్టీలో నేతలు ఒకే మాటపై లేరన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. టీడీపీలోనూ ఈ అంశంపై ఒక మాట మీద లేరు కదా అని ఆయన ప్రశ్నించారు. గంటా శ్రీనివాసరావు మరో రకంగా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. అన్నదమ్ములు (చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లు) ఒక మాట మీద లేరన్నారు. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఒక స్పష్టమైన ప్రతిపాదనను వెల్లడించలేదని చెప్పారు. ‘వ్యవస్థలో తనకున్న అధికారాలకు లోబడే కేంద్రం పని చేస్తుంది. రాజధాని అమరావతిలోనే పెట్టండని అప్పుడు కేంద్రం చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి మార్చండని, మార్చ వద్దని చెప్పదు.

ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఎక్కడా చెప్పలేదు. రాజధాని తరలింపు జరిగితే రైతులకు న్యాయం జరగాలని ఒక పార్టీ నేతగా, వ్యక్తిగా చెబుతున్నానన్నారు. రైతులకు న్యాయం చేసే అంశం, రాజధాని తరలించకుండా కేంద్రం జోక్యం చేసుకునే అంశం.. రెండూ వేర్వేరు అని చెప్పారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, ఎన్‌పీఆర్‌ ప్రక్రియలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.