Thursday, January 6, 2022

పీఆర్సీపై సీఎం వద్దా వాయిదా దరువే

 అన్నీ అబద్ధాలే!

Jan 7 2022 


ఆదాయం, జీతాలపై వాస్తవ విరుద్ధ అంకెలతో అడ్డగోలు వాదన


పీఆర్సీపై సీఎం వద్దా వాయిదా దరువే సంపన్న రాష్ట్రాన్ని దెబ్బతీసి.. బీద అరుపులా?

జగన్‌ తీరుపై నిపుణులు, ఉద్యోగుల ఆగ్రహంఇసుక నుంచి మద్యం దాకా అన్నీ అస్తవ్యస్తమే రాజధానీ లేకుండా చేసి ఆర్థికానికి చేటుపన్నుల్లో నాడు తెలంగాణ కంటే 3 వేల కోట్ల మిగులు.. నేడు 5 వేల కోట్ల వెనకబాటుతెలంగాణతో పోల్చవద్దంటూనే ఆదాయ వ్యత్యాసాల ప్రస్తావనపది వేల కోట్ల తేడా ఉన్నప్పుడే 43ు ఫిట్‌మెంట్‌ ఇచ్చిన చంద్రబాబుఇప్పుడు ఆ వ్యత్యాసం తగ్గినా గగ్గోలుసర్కారు తీరుపై ఉద్యోగుల మండిపాటు

రాష్ట్ర ఆదాయం రెండేళ్లుగా తగ్గుతోందని.. వేతన సవరణపై ప్రాక్టికల్‌గా ఆలోచించాలని సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగులు మండిపడుతున్నారు. మిగులు రాష్ట్రాన్ని చేజేతులా దెబ్బతీసి.. బీద అరుపులు అరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సమాంతర వ్యవస్థలను తెచ్చి కార్యకర్తలకు వేల కోట్లు చెల్లించడం భారం కాదా అని నిలదీస్తున్నారు. పెరిగిన ఆదాయాలను దాచి.. పెరగనివాటిని ప్రస్తావించడాన్ని ఆక్షేపిస్తున్నారు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి) చంద్రబాబు అధికారంలో నుంచి దిగిపోయేముందు 2018-19లో పన్ను ఆదాయంలో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశే సంపన్న రాష్ట్రం. ఆ ఏడాది తెలంగాణ కంటే  మన రాష్ట్ర పన్ను ఆదాయం రూ.3,000 కోట్లు ఎక్కువ. పన్ను ఆదాయమనేది రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన సూచిక. ఆ రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక, పారిశ్రామిక కార్యకలాపాలకు ప్రతిబింబం. అలా రూ.3,000 కోట్ల మిగులుతో చంద్రబాబు అప్పజెప్పిన రాష్ట్రాన్ని సీఎం జగన్మోహన్‌రెడ్డి తన తలాతోకా లేని విధానాలతో కుళ్లబొడిచి.. రూ.5,000 కోట్లు వెనుకబడేలా చేశారని ఆర్థిక నిపుణులు మండిపడుతున్నారు. ఈ నష్టాలకు కారణం ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు ఇవ్వడం కాదని స్పష్టం చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చీ రాగానే ఇసుక విధానాన్ని అల్లకల్లోలం చేసింది. దీంతో నిర్మాణ రంగం కుదేలైంది. పనులు ఆగిపోయాయి. కూలీలకు ఉపాధి లేకుండా పోయింది. సిమెంటు, ఐరన్‌ ఇతర వస్తువుల అ మ్మకాలు తగ్గి రాష్ట్రానికి పన్ను ఆదాయం తగ్గింది. ఆ తర్వాత మద్యం పాలసీ. 2020-21లో కేవలం ఏపీ లిక్కర్‌ విధానం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒక్కసారిగా మద్యంపై ఆదాయం రూ.4 వేల కోట్లు పెరిగింది. ఇవన్నీ ఆంధ్ర ఖజానాకు నష్టం కలిగించినవే. అన్నిటినీ మించి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. మూడు రాజధానుల ప్రకటనతో అప్పటి వరకు రాజధాని అమరావతి చుట్టూ అల్లుకున్న ఆర్థిక కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. దీనివల్ల పన్ను ఆదాయం తగ్గింది. రెండు రాష్ట్రాల నడుమ 2015-16లో సొంత ఆదాయంలో దాదాపు పది వేల కోట్ల వ్యత్యాసం ఉంది. అయినప్పటికీ అప్పుడు చంద్రబాబు ఉద్యోగులకు భారీగా 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. దీనివల్ల రాష్ట్ర వృద్ధి ఎక్కడా ఆగలేదు. 2018-19లో తెలంగాణ కంటే పన్ను ఆదాయంలో ఆంధ్ర మెరుగైన వృద్ధి సాధించింది. తెలంగాణ ఉద్యోగులకు ఆ ప్రభుత్వం జీతాలు ఎంత ఇస్తుందో కాగ్‌ నివేదికలో చూసిన వాళ్లు ఈ రెండేళ్లలో మన రాష్ట్ర పన్ను ఆదాయం ఏ రకంగా పడిపోయిందో చూడలేదా? కేవలం రాష్ట్రాల సొంత ఆదాయాల లెక్కలే చెప్పిన సీఎం.. ఏపీ, తెలంగాణల మొత్తం ఆదాయాల జోలికి ఎందుకు పోలేదు? ఎందుకంటే మొత్తం ఆదాయం చూసుకుంటే తెలంగాణ కంటే ఏపీ ఆదాయమే రూ.18 వేల కోట్లు ఎక్కువ కాబట్టి! అలాగే తెలంగాణకు ఈ రెండున్నరేళ్లలో ఆదాయం పెరగడానికి కారణం జగన్‌ అస్తవ్యస్త విధానాలేనని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. కంపెనీలన్నిటినీ తరిమేయడంతో అవి హైదరాబాద్‌ వెళ్లిపోయాయని.. వాటి వల్ల తెలంగాణకు ఆదాయం పెరిగిందని చెబుతున్నారు. గురువారం జగన్‌తో  భేటీ అనంతరం ఉద్యోగులంతా ఆయన మాట్లాడిన మాటలపై అంతర్గతంగా చర్చించారు. ఆయన చెప్పిన ఆదాయం లెక్కలపై పెదవివిరిచారు. ఆదాయంలో వ్యత్యాసం భారీగా ఉన్నా.. చంద్రబాబు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.


రూ.700 కోట్లలో 200 కోట్లయినా రాలేదు


రాష్ట్రంలో ఇసుక అమ్మే పనిని జగన్‌ ప్రభుత్వం ఓ ప్రైవేటు కంపెనీకి అప్పజెప్పింది. ఆ కంపెనీ ఖజానాకు రూ.700 కోట్లు చెల్లించాలి. కానీ ఇప్పటి వరకు కనీసం రూ.200 కోట్లు కూడా జమ చేయలేదు. మరి ఈ విధానం వల్ల రాష్ట్రానికి,  ప్రజలకు ఏం ఒరిగింది? అదే చంద్రబాబు చేసిన తరహాలో ఇసుకను ఉచితం చేస్తే నిర్మాణ రంగం ఊపందుకునేంది.రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగి పన్నుల రూపంలో ఖజానాకు డబ్బులు వచ్చేవి. అలా వచ్చే డబ్బులు కచ్చితంగా రూ.700 కోట్ల కంటే ఎక్కువగానే ఉంటాయనేది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. కాగ్‌ నివేదికల్లో జీతాలకు ఎంతెంత ఖర్చవుతుందో చూడడం కంటే.. పన్ను ఆదాయంలో ఏయే రంగాల్లో తెలంగాణకు ఎక్కువ ఆదాయం వస్తుందో చూసి వాటిపై కసరత్తు చేస్తే ఖజానా నిండుతుందని వారు జగన్‌ సర్కారుకు సలహా ఇస్తున్నారు. చంద్రబాబు హయాంలో పన్ను ఆదాయం తెలంగాణ కంటే ఎక్కువ పెరగడానికి గల కారణాల్లో ఇసుకను ఉచితంగా ఇవ్వడమూ ఒకటని చెబుతున్నారు. అదే సమయంలో రాజధాని అమరావతి పేరుతో ఊపందుకున్న కార్యకలాపాలు, ఉపాధి అవకాశాల వల్లా పన్ను ఆదాయం పెరిగిందని అంటున్నారు. 

7 నెలల్లోనే 4 వేల కోట్లు ఎక్కువరెండు తెలుగు రాష్ట్రాల సొంత ఆదాయాలను పరిశీలిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 7 నెలల్లోనే ఆంధ్ర కంటే తెలంగాణ ఆదాయం రూ.4,000 కోట్లు ఎక్కువగా ఉంది. ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు మన రాష్ట్రానికి రూ.45,064 కోట్ల సొంత ఆదాయం రాగా.. తెలంగాణ సొంత ఆదాయం రూ.49,991 కోట్లుగా ఉంది. రాష్ట్ర ఆదాయం పెంచే నిర్ణయాలు తీసుకోకుండా ఖజానాపై భారం వేసే నిర్ణయాలు అమలు చేస్తుండడంవల్లే మన ఆదాయం తగ్గిందని ఉద్యోగులు  విమర్శిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చడానికి, తన రాజకీయ స్వప్రయోజనాల కోసం వలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థను జగన్‌ తీసుకొచ్చారని.. ఇప్పుడున్న వ్యవస్థలకు సమాంతరంగా తెచ్చి ప్రభుత్వ ఆదాయాన్ని వారికి వేతనాల రూపంలో మళ్లిస్తున్నారని.. ఏటా ఖజానాపై రూ.2,040 కోట్ల భారం మోపారని దుయ్యబడుతున్నారు. 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే ఏడాదికి ప్రభుత్వంపై రూ.7,136 కోట్ల భారం పడుతుందని సీఎం చెప్పారని.. మరి రాజకీయ అవసరాల కోసం ఏర్పాటుచేసిన పై వ్యవస్థలపై పెడుతున్న రూ.2,040 కోట్ల ఖర్చు భారం కాదా అని వారు ప్రశ్నిస్తున్నారు.


అసలు విషయం దాచి..2014-15 నుంచి 2021-22 అక్టోబరు వరకు తెలంగాణతో పోల్చితే ఏపీ ఆదాయమే చాలా ఎక్కువగా ఉంటోంది. సీఎం చెప్పిన కాగ్‌ నివేదికల్లోనే ఈ అంశాలన్నీ ఉన్నాయి. కానీ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల విషయానికొచ్చేసరికి మొత్తం ఆదాయాల మాట పక్కనపెట్టి.. రాష్ట్ర సొంత ఆదాయాన్నే జగన్‌ ప్రస్తావించారు. తెలంగాణకు సొంత ఆదాయం కొంచెం ఎక్కువే అయినా.. ఆంధ్రకు కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు ఆ రాష్ట్రం కంటే మూడు రెట్లు ఎక్కువ. కేంద్ర పన్నుల్లో వాటా కూడా ఏపీకే ఎక్కువగా వస్తోంది.



మంచి పీఆర్సీ ఇస్తారని ఆశిస్తున్నాం 

Jan 07, 2022, 04:13 IST

Bandi Srinivas Rao Says We Hope CM Jagan Good PRC Employees - Sakshi

ఏపీ జేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు 


సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఉద్యోగులకు సీఎం జగన్‌ మంచి పీఆర్సీ ఇస్తారని ఆశిస్తున్నామని.. రెండు, మూడు రోజుల్లో ఈ విషయమై ప్రకటన వస్తుందని ఏపీ జేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్‌ వద్ద గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులకు ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేస్తానని ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలకు భరోసా ఇచ్చారన్నారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా ఆయన నోట్‌ చేసుకున్నారని తెలిపారు. అందరూ ప్రాక్టికల్‌గా ఆలోచించాలని, మోయలేని భారాన్ని మోపకుండా కాస్త సానుకూల దృక్పథంతో ఉండాలని పదే పదే తెలిపారన్నారు.




పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఆర్థిక శాఖ అధికారులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరించారని తెలిపారు. రాష్ట్ర విభజన, కోవిడ్‌ కష్టాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేవని సీఎం చెప్పారని, తెలంగాణకు హైదారాబాద్‌ నుంచి ఆదాయం ఉన్నందున ఆ రాష్ట్రంతో పోల్చుకోవద్దని సూచించారని తెలిపారు. మొత్తంగా సీఎం జగన్‌తో సమావేశం సానుకూలంగా, ప్రశాంతంగా మంచి వాతావరణంలో సాగిందని చెప్పారు. సీఎం జగన్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా పని చేస్తామని తెలియజేశామన్నారు.  


సీఎం మంచి పీఆర్సీ ప్రకటిస్తారు.. 

ఉద్యోగ సంఘాల నేతలను పిలిచి సీఎం జగన్‌ మంచి పీఆర్సీ ప్రకటిస్తారన్న నమ్మకం ఉంది. కోవిడ్‌ వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిన విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం వివరించారు. రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ నిర్ణయం వస్తుంది. కొన్ని సంఘాలు 27 శాతం ఫిట్‌మెంట్‌కు తగ్గకుండా చూడాలని, కొన్ని సంఘాలు 34 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని సీఎంను కోరాయి. హైదరాబాద్‌ నుంచి రాజధానికి వచ్చిన ఉద్యోగులకు సీసీఎ, హెచ్‌ఆర్‌ఏ కొనసాగించాలని కోరారు.  

– ఎన్‌.చంద్రశేఖరరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) 


సీఎం మంచి చేస్తారనే నమ్మకం 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది. 34 శాతం ఫిట్‌మెంట్‌ అడిగాం. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకూ ఫిట్‌మెంట్‌ అడిగాం. సీఎం జగన్‌ మంచి చేస్తారనే నమ్మకం ఉంది. రెండు, మూడు రోజుల్లో పీఆర్సీపై ప్రకటన ఉంటుంది. నా చేతికి ఎముక ఉండదని అందరూ అంటూ ఉంటారని సమావేశంలో సీఎం జగన్‌ స్వయంగా చెప్పారు. అంత మాట చెప్పిన సీఎం.. ఉద్యోగులకు ఎందుకు మంచి చేయకుండా ఉంటారు? ఉదారంగా ఉండే విషయంలో, మానవతా దృక్పథం చూపే విషయంలో తనకన్నా ఎక్కువగా స్పందించేవాళ్లు తక్కువగా ఉంటారని కూడా సీఎం తెలిపారు. ఇదే సమయంలో కొన్ని వాస్తవాలను బేరీజు వేసుకోవాలనీ సీఎం చెప్పారు. మొత్తానికి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం.  

– కాకర్ల వెంకట్రామిరెడ్డి, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు 


రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారం 

పీఆర్సీ సమస్య రెండు, మూడు రోజుల్లో పరిష్కారం కానుంది. ఈ నెల 9వ తేదీ లోపు సమస్య పరిష్కారం కాకపోతే ఆ రోజున ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. ఉద్యోగులకు ఇస్తోన్న ఐఆర్‌కు తగ్గకుండా ఫిట్‌మెంట్‌ ఉంటుంది. అశుతోష్‌ కమిటీ నివేదికను యథాతథంగా ఆమోదించాలని సీఎం జగన్‌ను కోరాం. అధికారుల కమిటీ నివేదిక కరెక్టు కాదని సీఎంకు తెలియజేశాం. ఫిట్‌మెంట్, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, పెన్షనర్లకు సంబంధించిన అంశాల్లో తేడాలు ఉన్నాయని వివరించాం. నాలుగు అంశాలపై ఉద్యోగులు, పెన్షనర్లు అసంతృప్తితో ఉన్నారని తెలిపాం. పది పీఆర్సీల్లో ఎక్కడా ఐఆర్‌ కంటే ఫిట్‌మెంట్‌ తగ్గిన దాఖలాలు లేవని వివరించాం. హెచ్‌ఆర్‌ఏపై చేసిన సిఫార్సులు అసంబద్ధంగా ఉన్నాయని తెలిపాం. సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏల గురించి వివరించాం. ఏడెనిమిది ఏళ్లుగా హెల్త్‌ కార్డులు నిర్వీర్యమయ్యాయని, ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పాం. ఉద్యోగుల డిమాండ్లకు సీఎం జగన్‌ సానుకూలంగా స్పందించారు. 

– బొప్పరాజు వెంకటేశ్వర్లు, చైర్మన్, ఏపీ జేఏసీ అమరావతి  


మరో భేటీ ఉండకపోవచ్చు   

పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో అంతిమ నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్‌ చెప్పారు. త్వరలోనే ప్రభుత్వం ప్రకటన జారీ చేస్తుందని ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలను, పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆలోచించాలని సీఎం కోరారు. ఉద్యోగ సంఘాలు కూడా తగ్గాలని, ఆర్థిక శాఖ అధికారులు కూడా కొంతమేర గణాంకాలను పెంచాలని సీఎం సూచించారు. పీఆర్సీపై మరో సమావేశం ఉంటుందని మేము భావించడం లేదు. ఇంత సేపు ఉద్యోగ సంఘాలతో సీఎం మాట్లాడిన పరిస్థితి గతంలో లేదు. సంఘాలుగా సైద్ధాంతిక విభేదాలు ఉన్నా.. అందరం వారి వారి సమస్యల్ని సీఎం జగన్‌కు తెలియజేశాం. 

– కేఆర్‌ సూర్యనారాయణ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత   



Jan 7 2022 @ 03:24AMహోంఆంధ్రప్రదేశ్కె

అంకెల్లో అన్నీ అసత్యాలే!


కేంద్ర సర్కారు ఇచ్చిన ఫిట్‌మెంట్‌ 32 శాతం

సీఎస్‌ కమిటీ చెప్తున్నట్లు 14.29 శాతం కాదు

పదకొండో పీఆర్సీ నివేదిక అమలు చేయండి

కుదరకపోతే తెలంగాణస్థాయిలో ప్రయోజనాలు 

పీఆర్సీపై సీఎంకు ఉద్యోగ సంఘాల స్పష్టీకరణ

కల్లా ప్రకటన రాకపోతే ఆందోళనే: నేతలు 

కేంద్రసర్కారు ఇచ్చిన ఫిట్‌మెంట్‌ 32 శాతం

సీఎస్‌ కమిటీ చెప్తున్నట్లు 14.29 శాతం కాదుపదకొండో పీఆర్సీ నివేదిక అమలు చేయండిపీఆర్సీపై సీఎంకు ఉద్యోగ సంఘాల స్పష్టీకరణ

అమరావతి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): సీఎస్‌ కమిటీ చెప్పినట్టు కేంద్రం తన ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్‌మెంట్‌ అమలు చేసిందనేది పూర్తి అవాస్తవమని ఉద్యోగ సంఘాల నేతలు గురువారం సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం తన ఉద్యోగులకు 32 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిందని పూర్తిస్థాయి లెక్కలతో సీఎంకు సమర్పించారు. అలాగే, హెచ్‌ఆర్‌ఏపై సీఎస్‌ కమిటీ చేసిన సిఫారసుల వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని, ఉద్యోగులందరూ వేతనాలు కోల్పోతారని సీఎంతో జరిగిన సమావేశంలో వారు వివరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులకు సీసీఏ ఎత్తేయడం దారుణమని, ప్రస్తుతం ఉద్యోగులకు సీసీఏ ఎంత ఆవశ్యకమో వివరిస్తూ సిద్ధం చేసిన నోట్‌ను సీఎంకి సమర్పించారు. అలాగే, రిటైర్డ్‌ ఉద్యోగులకు సంబంధించి అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ ప్రయోజనం పొందే వయసును 70 ఏళ్ల నుంచి 80 ఏళ్లకు పెంచుతూ సీఎస్‌ కమిటీ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు తమ వ్యతిరేకతను సీఎం వద్ద తెలిపారు. 

సీఎంకు సమర్పించిన నోట్‌లోని అంశాలు: 11వ పీఆర్సీ కమిషన్‌ 27 శాతం ఫిట్‌మెంట్‌ సిఫారసు చేసిందని సీఎస్‌ కమిటీ తన నివేదికలో చెప్పింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో పీఆర్సీ అమలులో 14.29 శాతమే ఫిట్‌మెంట్‌ ఇచ్చారని కూడా అదే నివేదికలో రాశారు. కాబట్టి రాష్ట్రంలో కూడా 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఉండాలని చెప్పి సీఎస్‌ కమిటీ సిఫారసు చేసింది. అయితే, కేంద్రం 14.29 శాతమే ఫిట్‌మెంట్‌ ఇచ్చిందనడం తప్పు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అప్పటికే తీసుకుంటున్న వేతనాలపై 157 శాతం (డీఏ + ఫిట్‌మెంట్‌) పెంపును అమలు చేసి వచ్చిన మొత్తాన్ని కొత్త బేసిక్‌ పే గా ఫిక్స్‌ చేశారు. ఈ 157 శాతంలో 125 శాతం డీఏ, 14.29 శాతం ఫిట్‌మెంట్‌ అయితే మిగిలిన 17.71 శాతం సంగతేంటి? దీన్ని బట్టి చూస్తే కేంద్రంలోని ఉద్యోగుల వేతనాలు ఏడో పీఆర్సీ అమల్లో 125 శాతం డీఏ, 32 శాతం ఫిట్‌మెంట్‌గా నిర్ధారించినట్టు అర్థమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలోని సమాన కేడర్‌ ఉద్యోగుల వేతనాలను పరిశీలిస్తే కేంద్ర ఉద్యోగుల కంటే రాష్ట్ర ఉద్యోగుల వేతనాలు ఇప్పటికీ చాలాతక్కువగానే ఉన్నాయి. 11వ పీఆర్సీలో తెలంగాణ ప్రభుత్వం నిర్ధారించిన వేతన స్కేళ్లను పరిశీలించినప్పుడు అక్కడ పీఆర్సీ కమిషన్‌ ఫిట్‌మెంట్‌ 7.5 శాతం అని చెప్పినప్పటికీ డీఏ + 15.75 శాతంతో వేతన స్కేళ్లను సవరించినట్టు అర్థమవుతోంది.  11వ పీఆర్సీ అమలు తేదీ 1.7.2018. ఆనాటికి సర్వీసులో ఉన్న ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం 30 శాతం ఫిట్‌మెంట్‌గా ప్రకటించి ఆ ప్రకారం, వేతనస్కేళ్లను సవరించింది. ఈ నేపథ్యంలో 11 పీఆర్సీ కమిషన్‌ నివేదికను అమలు చేయాలనేది ఉద్యోగుల డిమాండ్‌. కుదరని పక్షంలో కనీసం తెలంగాణ స్థాయిలోనైనా ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నారు.

హెచ్‌ఆర్‌ఏ శ్లాబు కుదించారు.. పీఆర్సీ కమిషన్‌ హైదరాబాద్‌ నుంచి షిఫ్ట్‌ అయిన ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ 30 శాతం సిఫారసు చేసింది. గరిష్ఠ పరిమితిని రూ.26,000గా నిర్ణయించింది. 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో 22ు హెచ్‌ఆర్‌ఏను బేసిక్‌ పే మీద సిఫారసు చేసింది. ఈ శ్లాబులో గరిష్ఠ పరిమితి 22,500 గా నిర్ణయించింది.  2నుంచి 10 లక్షల్లోపు జనాభా ఉన్న నగరాల్లో 20ు హెచ్‌ఆర్‌ఏ సిఫారసు చేసింది. 20,000ను గరిష్ఠ పరిమితిగా నిర్ణయించింది. 50,000 నుంచి రెండు లక్షల్లోపు జనాభా ఉన్న నగరాల్లో హెచ్‌ఆర్‌ఏ 14.5 శాతం,  ఈ శ్లాబులో రూ.20,000ను గరిష్ఠ పరిమితిగా నిర్ణయించింది. మిగిలిన ఉద్యోగులకు 12 శాతం హెచ్‌ఆర్‌ఏ సిఫారసు చేస్తూ, గరిష్ఠ పరిమితిని రూ.17,000గా నిర్ణయించింది. అయితే, ఈ సిఫారసులను సీఎస్‌ కమిటీ పూర్తిగా విస్మరించి, కేవలం 3 శ్లాబులను సూచించింది. 5 లక్షల్లోపు జనాభా ఉండే ప్రాంతాల్లో హెచ్‌ఆర్‌ఏను 8 శాతంగా, 5 నుంచి 50 లక్షల వరకు జనాభా ఉండే ప్రాంతాల్లో 16 శాతం, 50 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో ఉద్యోగులకు 24 శాతంగా సూచించింది. 

సీసీఏ ఎక్కడ...ఎంత..?ఏపీలో 11వ పీఆర్సీ సూచించిన ప్రకారం విజయవాడ, విశాఖపట్టణంలో సీసీఏ నెలకు గరిష్ఠంగా రూ.1,000, మిగిలిన ప్రాంతాల్లో గరిష్ఠంగా రూ.750 ఇవ్వాల్సి ఉంది. కానీ, సీఎస్‌ కమిటీ సీసీఏ ప్రయోజనాలను ఏపీలోని ప్రభుత్వోద్యోగులకు పూర్తిగా ఎత్తేసింది. తెలంగాణ ప్రభుత్వం రూ.24,280 వరకు పే ఉన్న ఉద్యోగులకు హైదరాబాద్‌లో నెలకు 600, మిగిలిన ప్రాంతాల్లో రూ.300, రూ.24,280 నుంచి రూ.42,300 వరకు పే ఉన్న ఉద్యోగులకు హైదరాబాద్‌లో నెలకు రూ.850, మిగిలిన ప్రాంతాల్లో రూ.450, రూ.42,300 నుంచి రూ.54,220 వరకు పే ఉన్న ఉద్యోగులకు హైదరాబాద్‌లో రూ.950, మిగిలిన ప్రాంతాల్లో రూ.550, రూ.54,220 కంటే ఎక్కువ పే పొందుతున్న ఉద్యోగులకు హైదరాబాద్‌లో రూ1250 మిగిలిన ప్రాంతాల్లో రూ.700 సీసీఏ ఇస్తోంది. కేంద్రం తన ఉద్యోగులకు సీసీఏ బదులుగా రవాణా అలవెన్సు ఇస్తోంది. నెలకు కనిష్ఠంగా రూ.900 + డీఏ, గరిష్ఠంగా 7,200 + డీఏ వరకు ఇస్తోంది. ఈ నేపథ్యంలో పీఆర్సీ కమిషన్‌ ప్రకారం సీసీఏ కొనసాగించాలి. లేదంటే కేంద్రం ఇస్తున్నట్టు రవాణా అలవెన్సు అయినా ఇవ్వాలి.

అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ ప్రస్తుతం రాష్ట్రంలో అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ను 70 సంవత్సరాల వయసు దాటిన వారికి ఇస్తున్నారు. వయసు పెరిగే కొద్ది అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ఆస్పత్రి ఖర్చులు పెరుగుతాయన్న ఉద్దేశంతోనే ఇది   ఇస్తున్నారు. కేంద్రంలో 80 ఏళ్లు దాటిన ఉద్యోగులకు అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ ఇస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో కూడా 80 ఏళ్లు దాటిన ఉద్యోగులకే ఈ ప్రయోజనం అందజేద్దామంటూ సీఎస్‌ కమిటీ తన నివేదికలో పేర్కొంది. దీని వల్ల 70 నుంచి 75 సంవత్సరాల వయసు ఉన్న వాళ్లు 15 శాతం, 75 నుంచి 80 సంవత్సరాల వయసు ఉన్న వాళ్లు 20 శాతం పెన్షన్‌ నష్టపోతారు. ప్రస్తుతం ఆ ప్రయోజనాలు పొందుతూ సీఎస్‌ కమిటీ సిఫారసు వల్ల నష్టపోయే పెన్షనర్లకు పర్సనల్‌ పెన్షన్‌ రూపంలో ప్రయోజనాలు కల్పించి నష్టం భర్తీ చేస్తామని అదే  కమిటీ తన నివేదికలో పేర్కొంది. తెలంగాణలో 70 నుంచి 75 ఏళ్లు ఉన్న వాళ్లకి 15 శాతం, 75 నుంచి 80 ఏళ్ల వయసు వారికి 20 శాతం అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ ఇస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో హెల్త్‌కార్డులు పనిచేయడం లేదు. కొవిడ్‌ సమయంలో ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు వైద్య ఖర్చుల రూపంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగులకు అయ్యే వైద్య ఖర్చులకు, ప్రభుత్వం విడుదల చేసే డబ్బులకు చాలా వ్యత్యాసం ఉంటోంది. కాబట్టి అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ ప్రయోజనాలను సీఎస్‌ కమిటీ చెప్పినట్టుగా కాకుండా యథాతథంగా కొనసాగించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు.



Jan 7 2022 @ 02:59AMహోంఆంధ్రప్రదేశ్ఉద్యోగులూ మీరు కాస్త తగ్గాలిఅన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్సం|| 93979 79750

ప్రాక్టికల్‌గా ఆలోచించాలి

తెలంగాణతో పోల్చుకోవద్దు

భేటీలో ముఖ్యమంత్రి జగన్‌ సూచన

2-3 రోజుల్లో పీఆర్సీ అని వెల్లడి

రెండేళ్లుగా ఆదాయం తగ్గింది

2018-19లో జీతాలు, పెన్షన్లకు

రూ.52,513 కోట్ల ఖర్చు

2020-21కి 67,340 కోట్లకు చేరింది

ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడే ఎక్కువ

ఆదాయం ఎలా ఉన్నా..

మేం రాగానే 27 శాతం ఐఆర్‌ ఇచ్చాం

మంచి చేయాలనే మా తపన: సీఎం

నేను మీ అందరి కుటుంబ సభ్యుడిని. మీ అంచనాలు కాస్త తగ్గాలి.. 

అధికారులు కూడా కాస్త పెరగాల్సిన అవసరం ఉంది. 


PlayUnmute

Fullscreen

VDO.AI


ఆర్గ్యుమెంట్‌కు బలం చేకూరుతుందని.. తెలంగాణతో పోలిక చేస్తే బాగుంటుందని అనిపించవచ్చు. నిజంగా ఆ రాష్ట్రంలో వస్తున్న ఆదాయాలు మనకు వస్తున్నాయా? వారి తలసరి ఆదాయం ఎంత? వీటన్నింటినీ ఒకసారి పరిశీలన చేయాలని కోరుతున్నా. 

సీఎం జగన్‌


అమరావతి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): వేతన సవరణ (పీఆర్‌సీ)పై ఉద్యోగులు తమ అంచనాలను కాస్త తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సూచించారు. తెలంగాణతో పోల్చుకోవద్దని.. ప్రాక్టికల్‌గా ఆలోచించాలని హితవు పలికారు. రెండు, మూడ్రోజుల్లో పీఆర్‌సీపై ప్రకటన చేస్తామన్నారు. గురువారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లోని ఉద్యోగ సంఘాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే ఏటా ప్రభుత్వంపై రూ.7,136 కోట్ల భారం పడుతుందని ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ఆయనకు నివేదిక ఇచ్చింది. జీతాలు, పెన్షన్ల వ్యయం తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్‌, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, హరియాణ రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే అధికమని పేర్కొంది. సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ‘అధికారులు చెప్పినదానికి, మీరు చెప్పినదానికి వ్యత్యాసం ఉంది. అందుకే మీతో మాట్లాడుతున్నాను. నేను మీ అందరి కుటుంబ సభ్యుడిని. మీ అంచనాలు కాస్త తగ్గాలి.. అధికారులు కూడా కాస్త పెరగాల్సిన అవసరం ఉంది.

వాళ్లకు కూడా చె బుతున్నాను. పరిష్కరిద్దాం. మీకు మనసా వాచా మంచి చేయాలనే తపనతో ఉన్నాను’ అని ఉద్యోగ సంఘాల నేతలతో అన్నారు. ప్రతి ఏటా ఆదాయాలు పెరుగుతుంటాయని.. రాష్ట్రానికి కనీసం 15 శాతం పెరిగేదని.. కానీ గత రెండేళ్లుగా ఆదాయం పెరిగిందా అని ఆలోచన చేయాలని కోరారు. పెరగకపోగా.. తగ్గాయని చెప్పారు. రాష్ట్ర సొంత ఆదాయం (స్టేట్‌ ఓన్‌ రెవెన్యూ్‌స-ఎ్‌సవోఆర్‌) 2018-19లో రూ. 62,503 కోట్లు ఉండేదని.. 2020-21లో రూ.60,688 కోట్లకి తగ్గిందని.. ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నామని తెలిపారు. 2018-19లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల రూపేణా చేసిన వ్యయం రూ.52,513 కోట్లు కాగా.. 2020-2021 నాటికి రూ.67,340 కోట్లకు చేరుకుందన్నారు. తాము అధికారంలోకి రాగానే ఆదాయం ఎలా ఉన్నా ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ఇచ్చామని.. రూ.18 వేల కోట్ల వరకు చెల్లించామని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులకూ మినిమం టైం స్కేల్‌ సహా ఇతర ప్రయోజనాలు అందించామన్నారు. 


తెలంగాణలో జీతాల ఖర్చు 17 వేల కోట్లు..‘తెలంగాణతో పలుమార్లు పోలిక వస్తోంది. అక్కడ వస్తున్న ఆదాయాలు మనకు వస్తున్నాయా? తెలంగాణలో సగటు తలసరి ఆదాయం రూ. 2,37,632 కాగా, ఏపీలో అది రూ.1,70,215 మాత్రమే. అక్కడ జీతాల మీద వాళ్లు ఖర్చు చేసింది రూ.17 వేల కోట్లు, పెన్షన్ల కోసం రూ.5,603 కోట్లు. మొత్తం కలిపి (కాగ్‌ రిపోర్టు ప్రకారం) రూ.22,608 కోట్లు. ఇది ఏప్రిల్‌ నుంచి అక్టోబరు తొలి ఏడు నెలల కాలానికి అయిన ఖర్చు. అదే మన రాష్ట్రంలో అదే కాలానికి జీతాలకు రూ.24,681.47 కోట్లు, పెన్షన్లకు రూ.11,324 కోట్లు.. మొత్తం దాదాపు రూ.36 వేల కోట్లు చెల్లించాం’ అని సీఎం తెలిపారు. ఈ కాలంలో గుజరాత్‌లో వేతనాలు, పెన్షన్ల కోసం ఇచ్చింది కేవలం రూ.16,053 కోట్లని.. బిహార్‌లో రూ.25,567.5 కోట్లు చెల్లించారని.. ఇలాంటి వాస్తవ పరిస్థితిలో ఉన్నామని చెప్పారు. ‘తెలంగాణలో హైదరాబాద్‌ను కోల్పోయాం. మనకు ఆదాయాలు తగ్గుతున్నాయి. తెలంగాణలో పెరుగుతున్నాయి. ఇవన్నీ వాస్తవాలు’ అని పేర్కొన్నారు.

ఎంత మంచి చేయగలిగితే అంత..ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరుతున్నట్లు సీఎం చెప్పారు. మనం ఉన్న పరిస్థితులపై ఆలోచన చేయాలని.. అదే సమయంలో వారు చెప్పినవన్నీ పరిగణనలోకి తీసుకుంటానని తెలిపారు. ‘ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేస్తాను. ఇది నా హామీ. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాం. 2, 3 రోజుల్లో దీనిపై ప్రకటన చేస్తాం. మీతో సమావేశానికి ముందు పలు దఫాలుగా అధికారులతో మాట్లాడాను. కమిటీ చెప్పినట్లుగా 14.29 శాతం ఫిట్‌మెంట్‌ వల్ల ఏడాదికి ప్రభుత్వంపై పడే భారం రూ.7,137 కోట్లు. ఇది వాస్తవం. ఇచ్చిన డీఏలు కూడా ఉద్యోగులకు అందాలి. ఫిట్‌మెంట్‌ ఇచ్చే సమయానికి డీఏలు కూడా క్లియర్‌ కావాలి. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా నోట్‌ చేసుకున్నాను. అన్నింటినీ స్ట్రీమ్‌లైన్‌ చేయడానికి అడుగులు ముందుకేస్తాం. మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తాం’ అని స్పష్టం చేశారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు.









No comments:

Post a Comment