కార్పొరేట్ల కోసమే వ్యవసాయ చట్టాలు
Jan 23 2021 @ 03:49AMహోంఆంధ్రప్రదే
26న కలెక్టరేట్ల వద్ద ట్రాక్టర్ ర్యాలీలు: సీపీఐ
అందరూ కలసి శక్తిగా మారాలి: ఉండవల్లి
రాజమహేంద్రవరంలో రైతు సంఘీభావ సదస్సు
రాజమహేంద్రవరం, జనవరి 22(ఆంధ్రజ్యోతి): ‘‘కార్పొరేట్ సంస్థల కోసమే కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. వాటివల్ల వచ్చే ప్రమాదాన్ని పసిగట్టిన రైతులు పోరాడుతున్నారు. రైతు సంఘాలు, ప్రజా సంఘాలు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే విధంగా ఉద్యమం చేస్తున్నాయి. ఈ ఉద్యమం రాజకీయ పార్టీలను కూడా ప్రభావితం చేస్తోంది. ఇక. కేంద్రం దిగిరావాలి. వ్యవసాయ సాగు చట్టాలను పూర్తిగా రద్దు చేయాలి. రైతు ఉద్యమానికి సీపీఐ అండగా ఉంటుంది. ఈ నెల 26న జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద ట్రాక్టర్ల ర్యాలీలు నిర్వహించనున్నాం. మనిషన్న ప్రతీవాడు రైతు ఉద్యమానికి సంఘీభావమే కాదు. మద్దతిచ్చి ఉద్యమంలోకి రావాలి’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలోని ఆనంరోటరీ హాల్‌లో సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షతన జరిగిన రైతు సంఘీభావ సదస్సులో మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణకుమార్, జీవీ హర్షకుమార్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సీపీఐ నేతలు పాల్గొన్నారు. సెక్యులర్ పార్టీలైన టీడీపీ, వైసీపీ మతతత్వ పార్టీ అయిన బీజేపీకి ఎందుకు మద్దతిస్తున్నాయని రామకృష్ణ ప్రశ్నించారు. కార్పొరేట్ల చేతిలోకి వివిధ రంగాలు వెళితే, దేశం విచ్చిన్నమవుతుందని ఉండవల్లి అరుణ్‌కుమార్ హెచ్చరించారు. కార్పొరేట్లకు ఉపయోగపడే సాగు చట్టాలను కేంద్రం తీసుకుని రావడం వల్ల పెద్ద దళారీ వ్యవస్థ రాబోతుందని హర్షకుమార్ అన్నారు.
No comments:
Post a Comment