May 27 2020 @ 03:15AMహోంఆంధ్రప్రదేశ్
జడ్జీలను నరికేస్తారా?
ముక్కలు ముక్కలు చేయాలంటారా!
గదిలో బంధించి కరోనా రోగిని వదలాలంటారా?
ఎందుకూ పనికిరాని జడ్జీలంటూ తిట్లు
అసభ్య దూషణలు, అభ్యంతరకర వ్యాఖ్యలు
హైకోర్టుకు తప్పుడు ఉద్దేశాలు ఆపాదించారు
జడ్జీలకు అవినీతి, కులాన్నీ అంటగట్టారు
ఆ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా పోస్టులు
కోర్టు ప్రతిష్ఠకు భంగం, ముమ్మాటికీ ధిక్కరణే
భారీ కుట్ర ఉన్నట్లుంది: హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ఎంపీ నందిగం సురేశ్, ఆమంచి సహా 49 మందికి ‘ధిక్కరణ’ నోటీసులు
మరో 8 మందిని గుర్తించాలని ఆదేశం
హైకోర్టు కన్నెర్ర..
ADVERTISEMENT
POWERED BY PLAYSTREAM
‘‘హైకోర్టులో ఎంతమంది జడ్జీలు ఉంటే అంతమందినీ ముక్కలుగా నరకాలి. అందరినీ నరకాల్సిందే. మొత్తం జడ్జీలను ఒక గదిలో పెట్టి... అదే గదిలో కరోనా రోగిని వదలాలి’’ అని చందూ రెడ్డి అనే వ్యక్తి ట్వీట్ చేశారు.
హైకోర్టు జడ్జీలు ఎందుకూ పనికిరారంటూ బూతులు తిట్టి... కావాలంటే తననూ అరెస్టు చేసి సీబీఐ విచారణకు ఆదేశించవచ్చునని కిశోర్ రెడ్డి అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు.
సుప్రీంకోర్టు, హైకోర్టుకు చెందిన కొందరు జడ్జీలకు, హైకోర్టుకు కులం ఆపాదించారు. అవినీతి ఆరోపణలు చేశారు. మరిన్ని తప్పుడు ఉద్దేశాలను అంటగట్టారు. దూషించారు. విద్వేషం చిమ్మారు. ప్రాణహాని బెదిరింపులు చేశారు. హైకోర్టుతోపాటు హైకోర్టు న్యాయమూర్తులపట్ల ద్వేషాన్ని కనపరిచారు. ఇతరులనూ రెచ్చగొట్టారు. ఇదంతా చూస్తుంటే హైకోర్టు న్యాయమూర్తుల మీద భారీ కుట్రకు తెరలేపినట్లు అర్థమవుతోంది.
తాడేపల్లిలోని వైసీపీ ఆఫీసులో నందిగం సురేశ్ మాటలు ‘సాక్షి’ న్యూస్‌లో ప్రత్యక్షప్రసారమయ్యాయి. ఆయన హైకోర్టుకు తప్పుడు ఉద్దేశాలను అంటగట్టారు. చంద్రబాబు నాయుడు హైకోర్టును మేనేజ్ చేస్తున్నారన్నారు. కోర్టు తీర్పులు చంద్రబాబు నాయుడుకు పది లేదా 30 నిమిషాల ముందే ఎలా తెలుస్తున్నాయని అన్నారు. ఆయనపై విచారణ జరపాలని, కాల్ లిస్ట్ కూడా బయటపెట్టాలని నందిగం సురేశ్ అన్నారు.
వీడియో/క్లిప్పింగ్‌లు/పోస్టింగ్‌లు న్యాయస్థానం గౌరవాన్ని, జడ్జీల ప్రతిష్ఠను దెబ్బతీసేవే. ఇది కోర్టు ధిక్కరణకు పాల్పడటమే!
- హైకోర్టు
అమరావతి, మే 26 (ఆంధ్రజ్యోతి): న్యాయస్థానానికి దురుద్దేశాలను ఆపాదిస్తూ, న్యాయమూర్తులను దూషిస్తూ, వారిని ముక్కలుగా నరకాలి అని హెచ్చరిస్తూ... సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా, విచ్చలవిడిగా చెలరేగిపోయిన వారిపై రాష్ట్ర హైకోర్టు చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికి తాము గుర్తించిన 49 మందికి ‘కోర్టు ధిక్కరణ’ కింద నోటీసులు జారీ చేసింది. వీరిలో... అధికార పార్టీ ఎంపీ నందిగం సురేశ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా ఉన్నారు. గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులు, డాక్టర్ సుధాకర్ కేసుల్లో శుక్రవారం తీర్పు చెప్పిన తర్వాత... అధికార పార్టీ నేతలు నేరుగా కోర్టులను, జడ్జిలను విమర్శించారు. ఇక... వైసీపీ అభిమానులు ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయారు. జడ్జిలను తీవ్ర అసభ్య, అసహ్య పదజాలంతో దూషించారు. ఈ వ్యవహారాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. కేసును సుమోటో (తనంతట తాను)గా విచారణ చేపట్టింది. న్యాయస్థానం, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని ‘కోర్టు ధిక్కరణగా పరిగణిస్తూ’ చర్యలకు ఆదేశించింది. మొత్తం 49 మందికి నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ సంచలన ఆదేశాలు వెలువరించింది.
తప్పుడు ఉద్దేశాలు ఆపాదిస్తారా...
ఈనెల 22వ తేదీ నుంచి 24వ తేదీ మధ్య కోర్టును, జడ్జిలను ఉద్దేశించి సోషల్ మీడియాలో పలువురు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలు హైకోర్టు అధికారిక ఈ-మెయిల్‌కు అందాయని ధర్మాసనం తెలిపింది. ఆంగ్ల మాధ్యమం, గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులు, డాక్టర్ సుధాకర్ కేసు, వలస కార్మికుల తరలింపు, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేతకు సంబంధించిన పిల్, రిట్ పిటిషన్ల సంఖ్యలను ధర్మాసనం ప్రస్తావించింది. ‘‘వాటిపై తీర్పులు చెప్పినందుకు కొందరు హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలకు తప్పుడు ఉద్దేశాలను, కులాన్ని ఆపాదించారు. అవినీతి ఆరోపణలు చేశారు. ప్రాణహాని కలిగిస్తామనేలా బెదిరించారు. అసభ్య పదజాలాన్ని ప్రయోగించారు’’ అని ధర్మాసనం తెలిపింది. నందిగం సురేశ్, ఆమంచి కృష్ణమోహన్, రవిచందార్రెడ్డి తదితర వ్యక్తులు ఇంటర్వ్యూలు, ప్రసంగాలు, పోస్టింగ్‌ల ద్వారా ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పింది. వాస్తవాలను వక్రీకరించడంతోపాటు విద్వేషపూరితంగా, రెచ్చగొటేలా వ్యాఖ్యానించారని తెలిపింది. ‘‘చందు రెడ్డి అనే వ్యక్తి... మొత్తం జడ్జిలను ముక్కలు ముక్కలుగా నరకాలని ట్వీట్ చేశారు’’ అని పేర్కొంది. ‘హైకోర్టు జడ్జిలు ఎందుకూ పనికిరారు’ అంటూ కిశోర్ రెడ్డి అనే వ్యక్తి ఫేస్‌బుక్ పోస్ట్‌లో చేసిన అసభ్య, అసహ్య దూషణలను కూడా ఆదేశాల్లో ప్రస్తావించింది. ఇలాగే అనేకమంది అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారని తెలిపింది. ‘‘ఇదంతా చూస్తుంటే దీని వెనుక పెద్దస్థాయి కుట్ర ఉన్నట్లు అనిపిస్తోంది. వీడియో/క్లిప్పింగ్‌లు/పోస్టింగ్‌లు న్యాయస్థానం గౌరవాన్ని, జడ్జిల ప్రతిష్ఠను దెబ్బతీసేవే. ఇది కోర్టు ధిక్కరణకు పాల్పడటమే’’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇది ఎంతమాత్రం వాంఛనీయం కాదని స్పష్టం చేసింది. న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తిని అవమానిస్తూ, దూషిస్తూ పలురకాల వ్యాఖ్యలు చేసినట్లు గతనెల 6, 17వ తేదీల్లో రిజిస్ట్రార్ జనరల్ నివేదికలు సమర్పించారని తెలిపింది. తాము గుర్తించిన 49 మందికి ఈ-మెయిల్, వాట్సప్ లేదా ఇతర మార్గాల్లో నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేసిన మరో 8 మందిని గుర్తించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని, తదుపరి విచారణ నాటికి వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది.
ఫుల్ కోర్టు భేటీ సమీక్ష...
హైకోర్టులోని వివిధ ధర్మాసనాలు ఇటీవల ఇచ్చిన తీర్పులపై కొంతమంది వివిధ మాధ్యమాల్లో న్యాయమూర్తుల పట్ల, న్యాయవ్యవస్థ పట్ల తీవ్ర అభ్యంతరకరమైన, వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై హైకోర్టు రిజిస్ట్రార్‌కు భారీగా ఫిర్యాదులు అందాయి. వాటిని ప్రధాన న్యాయమూర్తి ముందుంచారు. ఆయన సోమవారం న్యాయమూర్తులందరితో (ఫుల్‌కోర్టు) సమావేశం ఏర్పాటు చేసి... ఈ వ్యవహారంపై కూలంకషంగా చర్చించారు. ఎవరెవరు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, ఏ ఉద్దేశంతో చేశారన్న దానిపై ఆధారాలను పరిశీలించారు. న్యాయమూర్తులంతా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాల్సిందేనని తేల్చడంతో ఫుల్‌కోర్టు వాటిపై ఒక నిర్ణయానికి వచ్చింది. అనంతరం సుమోటోగా స్వీకరించి మంగళవారం విచారణ చేపట్టింది.
చర్యలకు ఏజీ అంగీకారం
సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లోని వీడియోలు, పోస్టులు, వారి వ్యాఖ్యలతో న్యాయవ్యవస్థపై బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరాం పేర్కొన్నారు. న్యాయవ్యవస్థకు మరకలు అంటించేలా ఉన్న ఇలాంటి వ్యాఖ్యలను గర్హిస్తున్నట్లు స్పష్టం చేశారు. వాటిని కోర్టు ధిక్కరణగా పరిగణించేందుకు తాను లిఖితపూర్వక ఆమోదం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. న్యాయమూర్తులపై కొంతమంది చేసిన వ్యాఖ్యలు, వాడిన పదజాలం సరి కాదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎ్‌సజీ) హరినాథ్ కూడా వాదనలు వినిపించారు. వారి వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం వివాదాస్పద వ్యాఖ్యలుచేసిన బాపట్ల ఎంపీ నందిగం సురేశ్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తో పాటు మొత్తం 49 మందికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 16వ తేదీకి వాయిదా వేసింది.

No comments:
Post a Comment