Wednesday, May 6, 2020

మద్యం మాటున మాయలు

మద్యం మాటున మాయలు
విక్రయాల్లో చేతివాటం..

ఖరీదైన బ్రాండ్లు పక్కదారి..

ADVERTISEMENT

Learn More
POWERED BY PLAYSTREAM


కొందరు సివిల్‌, ఎక్సైజ్‌ అధికారుల కొనుగోలు..

రెడ్‌జోన్లలోని వైన్‌షాపుల్లో మద్యం మాయం..

మొదటి రోజు రూ.3 కోట్ల వ్యాపారం..

కొన్ని షాపుల్లో బీర్లతోనే సరిపెట్టిన వైనం..

రెండోరోజూ తగ్గని క్యూ..


అనంతపురం(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లాలో మద్యం అమ్మకాల మాటున మాయలు ఎన్నెన్నో. కొందరు సివిల్‌, ఎక్సైజ్‌ అధికారులు, సిబ్బంది దర్పాన్ని ప్రదర్శించారు. మద్యం విక్రయాల్లో వారి చేతివాటం జోరుగా సాగింది. దీంతో ఖరీదైన బ్రాండ్లు పక్కదారి పట్టాయి. ఎవరికీ అనుమానం రాకుండా లెక్కల్లో మాత్రం వాటిని కొనుగోలు చేసినట్లు చూపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మందుబాబులు మాత్రం ఉన్న వాటితోనే సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో వైన్‌ లేదనీ, బీర్లు మాత్రమే ఉన్నాయంటూ మందుబాబులకు కట్టబెట్టారు. రెడ్‌జోన్లలో మూసేసిన దుకాణాల్లోని మద్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించే ముసుగులో మార్గమధ్యలోనే మాయం చేసి, వాటికి బిల్లులు సృష్టించినట్లు సమాచారం. ఈనెల 4న మద్యం షాపుల ముందు పెద్దఎత్తున మందుబాబులు బారులు తీరారు.



మద్యం విక్రయాలపై విపక్షాలు, మహిళల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో మద్యం దుకాణాలు తెరవాలా.. వద్దా అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. దానిని కొందరు సివిల్‌, ఎక్సైజ్‌ అధికారులు తమకు అనుకూలంగా మలచుకున్నట్లు తెలుస్తోంది. మద్యం దుకాణాలు సాయంత్రం 7 గంటలకు బంద్‌ అవుతాయన్న నేపథ్యంలో అంతకుముందే వైన్‌షాపుల్లో పనిచేసే ఉద్యోగులు, సంబంధిత శాఖాధికారుల కుమ్మక్కుతో వారికి కావాల్సిన సరుకును కొనుగోలు చేసి, ఆన్‌లైన్‌లో లెక్కలు ఎక్కించేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.



సివిల్‌, ఎక్సైజ్‌ హవా

మద్యం అమ్మకాల్లో కొందరు పోలీసు, ఎక్సైజ్‌ అధికారుల హవా కొనసాగిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేద, సామాన్య, మధ్యతరగతి వర్గాలు క్వార్టర్‌ బాటిల్‌ కొనుగోలుకు గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నారు. అయినా మద్యం దొరుకుతుందో.. లేదో తెలియదు. అధికారులు మాత్రం దర్జాగా మద్యం బాటిళ్లను కొనుగోలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నల్లమాడ సర్కిల్‌లో పనిచేసే ఓ ఎస్‌ఐ లాక్‌డౌన్‌ నేపథ్యంలో కదిరి పట్టణంలో విధులు నిర్వర్తిస్తూ.. తొలిరోజు దాదాపు రూ.50 వేల విలువ చేసే మద్యాన్ని కొనుగోలు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాడిపత్రి, గుంతకల్లు, కూడేరులోనూ కొందరు ఎక్సైజ్‌ సిబ్బంది వైన్‌షాపుల్లో పనిచేసే ఉద్యోగులతో కుమ్మక్కై రూ.లక్ష విలువైన మద్యాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. అనంతపురం, హిందూపురం పట్టణాలు రెడ్‌జోన్‌ పరిధిలో ఉండటంతో ఆ దుకాణాల్లోని మద్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించే ముసుగులో మధ్యలోనే కాస్ట్‌లీ బ్రాండ్లను 25 శాతం అధిక ధరలకు కొనుగోలు చేసినట్లు ప్రచారం సాగుతోంది.



రెండో రోజూ అదే క్యూ

మద్యం కోసం మందుబాబులు ఎగబడ్డారు. పోలీసుల లాఠీలకూ బెదరలేదు. మొదటిరోజు దాదాపు రూ.3 కోట్ల వ్యాపారం సాగింది. రెండోరోజు మంగళవారం కూడా మందుబాబులు కిక్కు కోసం ఉదయం 11 గంటల నుంచే వైన్‌షాపుల వద్ద క్యూ కట్టారు. ఎండలోనే పడిగాపులు కాశారు. పెంచిన ధరతో మధ్యాహ్నం 3 గంటల నుంచి వైన్‌షాపులు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో రెడ్‌జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో 4 గంటలకు మద్యం దుకాణాలన్నీ తెరిచారు. కొన్నిప్రాంతాల్లో భౌతికదూరం పాటించేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. కొన్నిచోట్ల మందుబాబులు లేక షాపులు వెలవెలబోయాయి. చిలమత్తూరు మండలంలో 5 గంటలైనా వైన్‌షాపు తెరవలేదు. పెంచిన ధరలు ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయలేదని అమ్మకాలు ఆపేశారు.

పెనుకొండలో 4 గంటల నుంచే విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ కూపన్‌ సిస్టమ్‌ పెట్టడంతో  భౌతికదూరం అమలైంది. గోరంట్లలోని రెండు మద్యం షాపుల్లో స్టాకు లేక ఆ ప్రాంత ప్రజలు పాలసముద్రానికి పరుగులు తీశారు. కళ్యాణదుర్గం, మడకశిరలోనూ ఇదే పరిస్థితి. అనంతపురం రూరల్‌, కూడేరు, గార్లదిన్నెలలో వైన్‌షాపుల్లో స్టాకు తక్కువగా ఉండటం, బీర్లు మాత్రమే లభించటంతో జనం తక్కువగా కనిపించారు. బుక్కరాయసముద్రంలో మాత్రం మొదటిరోజు పరిస్థితే పునరావృతమైంది. ఇక్కడ మహిళలు వైన్‌షాపులు తెరవకూడదని నిరసన వ్యక్తం చేశారు. సివిల్‌, ఎక్సెజ్‌ పోలీసులు మద్యం విచ్చలవిడిగా కొనుగోలు చేశారు. తాడిపత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పెనుకొండలో మహిళలు సైతం మద్యం కొనుగోలు చేశారు.

No comments:

Post a Comment